ఎనిమిదేళ్ల తరువాత వారిద్దరు 'ఢీ'
మెల్ బోర్న్: ఆస్ట్రేలియ ఓపెన్ మహిళల ఫైనల్స్ రసవత్తరంగా మారింది. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ రష్యన్ భామ మరియా షరపోవా, అమెరికా నల్లకలువ సెరీనా విలియమ్స్ పోటీ పడనున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కోసం వీరిద్దరు ఫైనల్స్లో తలపడనున్నారు. కాగా షరపోవా సెమీ ఫైనల్‌లో మకరోవాపై 6-3, 6-2 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
మరోవైపు సెరీనా విలియమ్స్ కూడా మ్యాడిసన్ కీస్పై గెలుపొంది ఫైనల్స్కు దూసుకెళ్లింది. 7-6, 6-2 తేడాతో విజయం సాధించింది. దాంతో చాలా ఏళ్లకు షరపోవా, సెరీనాలు టైటిల్ కోసం పోరాడనున్నారు.