ముంబై: రాబోవు కాలంలో టీమిండియా ఆడబోయే నాలుగు వేర్వేరు సిరీస్‌లకు సంబంధించి జట్లను మంగళవారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు, ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్, ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్‌లకు సంబంధించి భారత జట్లను చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
అఫ్గానిస్తాన్‌తో జరిగే చారిత్రక టెస్టు మ్యాచ్‌కు పెద్దగా మార్పులు లేకుండానే జట్టును ప్రకటించారు. భారత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి కౌంటీల్లో ఆడటానికి ఇంగ్లండ్‌కు పయనం కానున్న నేపథ్యంలో అఫ్గానిస్తాన్‌తో టెస్టుకు అజింక్యా రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అయితే అఫ్గానిస్తాన్‌తో టెస్టు మ్యాచ్‌కు శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించినా అతనికి నిరాశే ఎదురైంది. కాగా, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అయ్యర్‌తో పాటు అంబటి రాయుడులకు చోటు కల్పించారు.
మరొకవైపు ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే, టీ 20 సిరీస్‌ల్లో సిద్ధార్థ్ కౌల్ చోటు దక్కించుకున్నాడు. గతంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కౌల్‌కు చోటు దక్కినా.. ఆడే అవకాశం రాలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న కౌల్ విశేషంగా రాణిస్తుండటంతో అతనికి మళ్లీ పిలుపు అందింది. భారత్ తలపడే పరిమిత ఓవర్ల సిరీస్‌కు విరాట్ కోహ్లినే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలుత ఈ టీ 20 సిరీస్‌లకు రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని భావించారు. కాగా, రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి అందుబాటులో ఉండటంతో కెప్టెన్సీ విషయంలో ఎటువంటి మార్పులు జరగలేదు. జూన్ 14 వ తేదీన బెంగళూరు చిన్నస‍్వామి స్టేడియంలో భారత్-అఫ్గానిస్తాన్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఆపై జూన్ 27 వ తేదీ నుంచి ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో భారత్ పాల్గొనుంది. జూలై 3 వ తేదీ నుంచి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ జరుగనుండగా, జూలై 12 వ తేదీ నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది.
అఫ్గానిస్తాన్ ఏకైక టెస్టు మ్యాచ్‌కు..
అజింక్యా రహానే(కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చటేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్, సాహా, అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, షమీ, హార్దిక్, ఇషాంత్ శర్మ, శార్దూల్ ఠాకూర్
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు..విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీష్ పాండే, ఎంఎస్ ధోని, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, హార్దిక్ పాండ్యా, సిద్ధార్ధ్ కౌల్, ఉమేశ్ యాదవ్
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు..
విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీష్ పాండే, ఎంఎస్ ధోని, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, హార్దిక్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, సిద్ధార్థ్ కౌల్, ఉమేశ్ యాదవ్
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు..
విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, హార్దిక్ పాండ్యా, సిద్ధార్థ్ కౌల్, ఉమేశ్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment