జోహన్నెస్‌బర్గ్: భారత్ మహిళా క్రికెట్ జట్టుతో జరుగుతున్న ఐదు ట్వంటీ 20ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా బోణి కొట్టింది. తొలి రెండు ట్వంటీ 20ల్లో పరాజయం పాలై సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడిన దక్షిణాఫ్రికా మహిళలు సమష్టిగా విజృంభించారు. ఫలితంగా మూడో టీ 20 మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకున్నారు. భారత్ నిర్దేశించిన 134 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ లిజిల్లె లీ(5) నిరాశపరిచినా, డాన్ వాన్ నీకెర్క్(26), సున్ లుస్(41), డు ప్రీజ్(20), ట్రయాన్(34) రాణించడంతో సఫారీ మహిళలు విజయం సాధించారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 17.5 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. హర్మన్ ప్రీత్ కౌర్(48), స్మృతీ మంధన(37), వేదా కృష్ణమూర్తి(23)లు మాత్రమే రెండంకెల స్కోరును సాధించడంతో భారత జట్టు సాధారణ స్కోరుకు పరిమితమైంది. నాల్గో ట్వంటీ 20 బుధవారం సెంచూరియన్‌లో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment