కేప్‌టౌన్:భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది. దక్షిణాఫ్రికా గడ్డపై తొలుత వన్డే సిరీస్‌ను సాధించిన భారత మహిళలు.. ట్వంటీ 20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్నారు. నాల్గో టీ 20 వర్షం కారణంగా రద్దు కావడంతో చివరిదైన ఐదో టీ20లో విజయం సాధించేందుకు హర్మన్‌ప్రీత్ సేన కసరత్తులు చేస్తోంది. శనివారం సాయంత్రం ఆరంభయ్యే మ్యాచ్‌లో భారత మహిళలు గెలిస్తే దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్, టీ 20 సిరీస్‌లను దక్షిణాఫ్రికా గడ్డపై సాధించిన మొదటి భారత మహిళా జట్టుగా నిలుస్తుంది.
తొలి టీ 20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన భారత మహిళా జట్టు.. రెండో టీ 20లోల తొమ్మిది వికెట్లతో విజయం సొంతం చేసుకుంది. కాగా, మూడో టీ20లో భారత జట్టుకు ఐదు వికెట్ల తేడాతో పరాజయం ఎదురుకావడంతో పాటు నాల్గో మ్యాచ్ రద్దయిన నేపథ్యంలో చివరిదైన ఐదో టీ20కి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే.. సిరీస్‌ను 3-1తో సిరీస్‌ను గెలుస్తుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా గెలిచినా సిరీస్ సమం అవుతుంది. మరొకవైపు మ్యాచ్ రద్దయిన పక్షంలో సిరీస్ భారత్ వశమే అవుతుంది.
ఇది దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌కు మొదటి టీ 20 సిరీస్ కావడంతో 'తొలి డబుల్'ను సాధించే అవకాశం అడుగు దూరంలో ఉంది. మరొకవైపు 2015-16 సీజన్‌లో ఆస్ట్రేలియాలో ఆ జట్టుతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత మహిళా జట్టు గెలుచుకుంది. ఆ తర్వాత ఇదే భారత మహిళా జట్టుకు మొదటి విదేశీ టీ20 సిరీస్. ఈ నేపథ్యంలో విదేశాల్లో వరుసగా రెండో టీ 20 సిరీస్‌ను కూడా సాధించి అరుదైన మైలురాయిని సొంతం చేసుకోవాలని టీమిండియా మహిళా బృందం భావిస్తోంది.మూడు వన్డేల సిరీస్‌ను భారత జట్టు 2-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment