న్యూఢిల్లీ: భారత క్రికెట్ మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తన క్రికెట్ కెరీర్ ఆద్యంతం అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. ఎలా కొట్టామన్నది కాదు.. కొట్టామా?లేదా?అన్న రీతిలో సెహ్వాగ్ శైలి ఉండేది. సిక్స్తో సెంచరీ పూర్తి చేయాలన్నా, భారీ షాట్ తో డబుల్ సెంచరీ కొట్టాలన్నా సెహ్వాగ్ కు సాటివ్వరూ లేరని చెప్పొచ్చు. అయితే తన క్రికెట్ కెరీర్కు ముగింపు పలికిన తరువాత సెహ్వాగ్.. ట్విట్టర్లో ప్రత్యేకం స్థానం సంపాదించుకున్నాడు సెహ్వాగ్. తన ట్వీట్లో ఎన్నో చమత్కారలు, మరెన్నో ఛలోక్తులు. అదే క్రమంలో మనల్ని ఆలోచనలో పడేస్తూ ఉంటాడు ఈ ట్విట్టర్ కింగ్.
తాజాగా తన ట్వీట్లపై స్పందించిన సెహ్వాగ్.. ఈ విషయంలో తనకు తానే ఫేవరెట్ను స్పష్టం చేశాడు. ఆ ట్వీట్లు కేవలం అభిమానులు ఎంజాయ్ చేసేలా ఉండటమే కాదు.. వాటిని తాను కూడా ఎంతగానో ఆస్వాదిస్తానని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఆ ట్వీట్లను చూసుకుని తాను కూడా అమితమైన ఆనందాన్ని పొందుతుంటానన్నాడు.
'మన భావాల్ని వ్యక్తీకరించడానికి సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్. మనం అవతలి వాళ్లతో మన అభిప్రాయాన్ని పంచుకునే స్వేచ్ఛ ఇక్కడ ఉంటుంది. అయితే నేను ఇక్కడ కూడా వినోదం ఉండాలని భావిస్తా. ఇప్పటికే ఎన్నో ఒత్తిడిళ్లతో సతమతమయ్యే మనం.. కాసేపు ఎంటర్టైన్మెంట్తో సేద తీరితే కాస్త రిలీఫ్ గా ఉంటుంది. నువ్వు ఒకరి ముఖంలో సంతోషాన్ని, నవ్వుని చూస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. అందుకే సోషల్ మీడియాతో అభిమానులకు తగినంత నవ్వుని పంచాలని అలా చేస్తూ ఉంటా'అని సెహ్వాగ్ తెలిపాడు.
ఇటీవల తాను చేసిన ఒక ట్వీట్కు బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ పడిపడి నవ్విన విషయాన్ని సెహ్వాగ్ ప్రస్తావించాడు. అర్థరాత్రి బెడ్ మీద ఉండగా తన ట్వీట్లు చదివి పగలబడినవ్వినట్లు రణ్వీర్ తెలిపినట్లు సెహ్వాగ్ పేర్కొన్నాడు.
నేను కూడా ఫేవరెటే: సెహ్వాగ్
Published Fri, Dec 9 2016 12:26 PM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM
Advertisement
Advertisement