టి20 సిరీస్‌ మనదే.. | India Women Team Clinch T20 Series Against South Africa | Sakshi
Sakshi News home page

టి20 సిరీస్‌ గెలిచిన భారత అమ్మాయిలు 

Oct 2 2019 8:50 AM | Updated on Oct 2 2019 8:50 AM

India Women Team Clinch T20 Series Against South Africa - Sakshi

సూరత్‌: భారత మహిళలు మరో మ్యాచ్‌ మిగిలుండగానే ఐదు టి20ల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకున్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఐదో టి20లో భారత్‌ 51 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై విజయం సాధించింది. వర్షం వల్ల ఆలస్యమైన ఈ మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. ముందుగా భారత్‌ 17 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (33 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా (22 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా... భారత స్పిన్‌ వలలో పడింది. 17 ఓవర్లలో 7 వికెట్లకు 89 పరుగులే చేయగలిగింది. స్పిన్నర్లు పూనమ్‌ (3/13), రాధాయాదవ్‌ (2/16) సఫారీని కట్టడి చేశారు. తొలి టి20 భారత మహిళలు గెలుపొందగా... తర్వాత రెండు మ్యాచ్‌లు వర్షార్పణమయ్యాయి. ఆఖరి టి20 ఇక్కడే 4వ తేదీన జరుగనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement