రొనాల్డోను దాటేసిన మెస్సీ.. | Lionel Messi Claims Record 6th Ballon D'Or | Sakshi
Sakshi News home page

రొనాల్డోను దాటేసిన మెస్సీ..

Published Tue, Dec 3 2019 12:11 PM | Last Updated on Tue, Dec 3 2019 12:16 PM

Lionel Messi Claims Record 6th Ballon D'Or - Sakshi

పారిస్‌: ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘బ్యాలన్‌ డి ఓర్‌’ అవార్డును అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ లియోనల్‌ మెస్సీ  మరోసారి ఎగరేసుకుపోయాడు. ఈ అవార్డు కోసం పోర్చుగల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోతో పాటు డచ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ వాన్‌ దిజ్క్‌లు పోటీ పడ్డారు. అయితే వీరిద్దర్నీ వెనక్కినెట్టిన మెస్సీ బ్యాలర్‌  డి ఓర్‌ పురస్కారాన్ని అందుకున్నాడు. ఇలా తన ఫుట్‌బాల్‌ కెరీర్‌లో బ్యాలన్‌ డి ఓర్‌ అవార్డును మెస్సీ సాధించడం ఆరోసారి. ఫలితంగా రొనాల్డో రికార్డును మెస్సీ బ్రేక్‌ చేశాడు. రొనాల్డో ఐదుసార్లు మాత్రమే బ్యాలన్‌ డి ఓర్‌ అవార్డును అందుకోగా, మెస్సీ దాన్ని సవరిస్తూ ‘సిక్సర్‌’ కొట్టాడు. 2009, 2010, 2011, 2012, 2015, 2019ల్లో బ్యాలన్‌ డి ఓర్‌ పురస్కారాన్ని మెస్సీ దక్కించుకున్నాడు. ఇక రొనాల్డో 2008, 2013, 2014, 2016, 2017ల్లో ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక మహిళల కేటగిరిలో అమెరికా సాకర్‌ ప్లేయర్‌ మెగాన్‌ రాపినో బ్యాలన్‌ డీ ఓర్‌ పురస్కారాన్ని అందుకున్నారు.

తాజాగా మెస్సీ బ్యాలన్‌ డి  ఓర్‌ పురస్కారాన్ని అందుకోవడం ఇంగ్లండ​ ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ బెక్‌హామ్‌ అభినందనలు తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో మెస్సీని అభినందించాడు. ‘ కంగ్రాట్స్‌ మై డియర్‌ ఫ్రెండ్‌’  అంటూ మెస్సీకి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ అవార్డుల కార్యక్రమానికి రొనాల్డో గైర్హాజరీ అయ్యాడు. కాగా, సోషల్‌ మీడియా ద్వారా మెస్సీని అభినందించాడు. ఇక ఈ ప్రతిష్టాత్మక అవార్డును రికార్ఢు స్థాయిలో మరొకసారి గెలుచుకోవడంతో మెస్సీ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ నేను చాలా అదృష్టవంతుడ్ని. దేవుని ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైంది. నా ప్రదర్శన ఇలానే కొనసాగిస్తూ మరిన్ని అవార్డులు గెలుచుకుంటానని ఆశిస్తున్నా’ అని  32 ఏళ్ల మెస్సీ తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement