810... 108..!!
Published Mon, Dec 2 2013 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
పై శీర్షిక చూస్తే అసలు విషయమేంటో అర్థం కావడంలేదు కదూ...? ఏం లేదండీ.. మొదటి సంఖ్య ఢిల్లీ ఎన్నికల బరిలో నిలిచిన మొత్తం అభ్యర్థులకు సంబంధించినది. రెండో సంఖ్య మొత్తం అభ్యర్థుల్లో ముస్లిం అభ్యర్థులకు సంబంధించినది. ఇక వివరాల్లోకెళ్తే... ఢిల్లీ మొత్తం జనాభాలో ముస్లింలు 11 శాతం మంది ఉన్నారు. అయితే ఎన్నికైన అభ్యర్థుల్లో కేవలం ఐదుగురు మాత్రమే ముస్లింలున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు 108 మంది ఉన్నప్పటికీ వారిలో ఎంతమంది గెలుస్తారనేది ఈ నెల 8వ తేదీ తర్వాతనే తేలనుంది.
ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయా పార్టీలు ముస్లిం అభ్యర్థులనే బరిలోకి దించాయి. ఇలా దించినవారిలో మొదటి స్థానం బహుజన్ సమాజ్ పార్టీదే. బీఎస్పీ బరిలోకి దించిన 69 మంది అభ్యర్థుల్లోల11 మంది ముస్లింలున్నారు.గత ఎన్నికల్లో మొత్తం 875 మంది పోటీ చేయగా అందులో 92 మంది మాత్రమే ముస్లిం అభ్యర్థులు కాగా ఈసారి వారి సంఖ్య 108కి పెరిగింది. దాదాపు ఆరేడు నియోజకవర్గాల్లో గెలుపోటములు ముస్లిం ఓటర్లే నిర్ణయిస్తున్నారు. ఓఖ్లా, ముస్తఫాబాద్, సీలంపూర్, బల్లీమారన్, మాతియా మహల్ తదితర నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
Advertisement
Advertisement