హత్య కే సులో ఎంపీకి నో బెయిల్
Published Fri, Nov 29 2013 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
న్యూఢిల్లీ: పనిమనిషి హత్య కేసులో బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్, ఇతని భార్య జాగృతి సింగ్‌కు బెయిల్ ఇవ్వడానికి అడిషనల్ సెషన్స్‌కోర్టు శుక్రవారం తిరస్కరించింది. మెజిస్టేరియల్ కోర్టు ఇది వరకే వీరి బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో నిందితులు సెషన్స్‌కోర్టును ఆశ్రయించారు. ఎంపీ దంపతులపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి కాబట్టి ఈ దశలో బెయిల్ సాధ్యం కాదని మెజిస్టీరియల్ కోర్టు స్పష్టం చేసింది. కేసులో నిజానిజాలను పరిశీలించకుండానే దిగువకోర్టు తనకు బెయిల్ తిరస్కరించిందన్న సింగ్ వాదనను సెషన్స్‌కోర్టు న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ తిరస్కరించారు. పనిమనుషులను కొట్టేలా సింగ్ జాగృతిని తరచూ ప్రోత్సహించినందున అతనికి బెయిల్ తిరస్కరించాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ధనంజయ్ నివాసంలో రాఖీభద్ర (35) అనే పనిమనిషి హత్యకు గురికావడంతో వీరిని ఈ నెల ఐదున అరెస్టు చేశారు. ధనంజయ్‌పై ఇది వరకే యూపీ, ఢిల్లీలో పలు కేసులు ఉన్నాయి
Advertisement