కేజ్రీవాల్‌పై కేసు ఏప్రిల్ 9కి వాయిదా | Delhi Court to Hear Kejriwal 'Bribery' Case on April 9 | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌పై కేసు ఏప్రిల్ 9కి వాయిదా

Published Tue, Feb 3 2015 10:09 PM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

Delhi Court to Hear Kejriwal 'Bribery' Case on April 9

న్యూఢిల్లీ: ఆప్ అధినేత కేజ్రీవాల్ వ్యాఖ్యలపై నమోదైన కేసు తీర్పును ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ‘బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి డబ్బులు తీసుకోండి. ఓటు మాత్రం ఆప్‌కే వేయండి’ అని జనవరి 18న ఉత్తమ్ నగర్, జనవరి 22న కృష్ణా నగర్ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే కేసుపై మరో అడ్వకేట్ ఇక్రాంత్ శర్మ పెట్టిన కేసుపై నమోదు చేసిన వివరాలను సమర్పించాలని కోర్టు ఢిల్లీ పోలీసుల్ని కోరింది. ఆప్ చీఫ్‌ను తనవ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే మూడు నోటీసులు ఇచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement