అధికారులు హద్దురాళ్లు తొలగిస్తున్నా మళ్లీ ఏర్పాటు
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ వెంచర్లు
మంచిర్యాల రూరల్ : కొత్త జిల్లా భూంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. అక్రమ లేఅవుట్ వేసి అమాయక ప్రజలను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని అక్రమ వెంచర్లపై ఇటీవల జిల్లా కలెక్టర్ కొరడా ఝుళిపించినా ఏ మాత్రం తగ్గడం లేదు. ఓ వైపు హద్దు రాళ్లు తొలగిస్తున్నా మరోవైపు ఏర్పాటు చేస్తూ దందా కొనసాగిస్తున్నారు.
మంచిర్యాల మండలంలో 16 గ్రామపంచాయితీలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా నస్పూర్, తీగల్‌పహాడ్, వేంపల్లి, ముల్కల్ల, గు డిపేట, హాజీపూర్, దొనబండ, రాపల్లి, పడ్తనపల్లి, నర్సింగాపూర్‌లో విస్తృతంగా రియల్ ఎస్టే ట్ వ్యాపారం సాగుతోంది. నూతనంగా కొము రం భీం జిల్లా, నస్పూర్ మండలం ఏర్పడుతుం డడంతో భూములకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో మండల పరిధిలో అనుమతి లేని వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నారుు. అలాగే వీటిపై ఫిర్యాదులు కూడా అదే స్థారుులో వెల్లువెత్తారుు.
దీంతో జిల్లా కలెక్టర్ జగన్మోహన్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య ఆధ్వర్యంలో డివిజనల్ పంచాయతీ అధికారి సారథ్యంలో ఈఓపీఆర్‌డీలు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఒకే రోజు మండలంలోని ఏర్పాటు చేసిన పలు అక్రమ లేఅవుట్లలో మూకుమ్మడి దాడులు నిర్వహించి హద్దురాళ్లను తొలగించారు. ఆయా అనుమతులు లేని వెంచర్లలో అందంగా ముస్తాబు చేసిన బీటీ రోడ్లను చెదరగొట్టించారు. నస్పూర్‌లో 17 ఎకరాలు, వేంపల్లిలో 37, తీగల్‌పహాడ్‌లో 11, ముల్కల్లలో 32, హాజీపూర్‌లో 6, దొనబండలో 2, పడ్తనపల్లిలో 4, నర్సింగాపూర్‌లో 3, గుడిపేటలో 7 ఎకరాల్లో అనుమతులు లేకుండా వెలిసిన లే అవుట్లలోని హద్దురాళ్లను తీసేరుుంచారు. ఈ మొత్తం 120 ఎకరాలు కాగా ఇందులో ఏర్పాటు చేసిన రాళ్లను తొలగించారు. ఈ చర్య ఇకపై కూడా కొనసాగుతుందని అధికారులు హెచ్చరించినా రియల్ వ్యాపారుల ఆగడాలు ఆగడం లేదు.
నోటీసులకు స్పందించని వ్యాపారులు
2012 నుంచి ఇప్పటి వరకు అనుమతులు లే కుండా వ్యాపారాలు సాగిస్తున్న రియల్ వ్యాపారులకు అధికారులు నోటీసులు అందజేశారు. అయినా స్పందించకపోవడంతో ఈ హద్దురాళ్ల తొలగింపు చేపట్టారు. రియల్ వ్యాపారులు మాత్రం దసరాకు కొత్త జిల్లా ఏర్పాటు కానుండటంతో ఇదే అదనుగా భావిస్తూ అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. హద్దురాళ్లను తొలగించినా తిరిగి వాటిని యథాస్థానంలో ఏర్పాటు చేస్తూ ప్లాటింగ్ చేస్తున్నారు. తాజాగా జిల్లా, మండల ఏర్పాటుతో భూముల ధర లను అమాంతం పెంచేశారు.
కొనేవారికి ఏమైనా ఫర్వాలేదు కాని తమ వ్యాపారం సాగాలన్నా ధోరణితో వ్యవహరిస్తున్నారు. లే అవుట్‌లేని ప్లాట్లను అమాయకులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలు కూడా స్పందించి అన్నీ పరిశీలించిన మీదట స్థలాలు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ రియల్ వ్యాపారులు మాత్రం రాజకీయ అండదండలతో పాటు తమ పలుకుబడిని వినియోగిస్తూ అనుమతి లేని లే అవుట్ ప్లాట్లను అంటగడుతున్నారు. అధికారులు మరోసారి ఈ దందాపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అక్రమ లేఅవుట్లపై చర్యలు తప్పవు
మండలంలోని అక్రమ లే అవుట్ చేసి వ్యాపారాలు చేస్తే చర్యలు తప్పవు. అమాయక ప్రజలను మోసగిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు మూకుమ్మడి దాడులు నిర్వహించి హద్దురాళ్లను ఇప్పటికే తొలగించాం. ప్రజలు కూడా ఇలాంటి ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బంది పడొద్దు.
- శంకర్, ఈవోపీఆర్డీ, మంచిర్యాల
Real estate , illegal ventures, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అక్రమ వెంచర్లు,