భువనేశ్వర్ : ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం న్యూ ఢిల్లీ బయల్దేరారు. 4 రోజులపాటు ఈ పర్యటన కొనపాగుతుంది. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల నిర్వహణను పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చిన సమావేశంలో పాల్గొనేందుకు ఆయన బయల్దేరారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన న్యూ ఢిల్లీలో బుధవారం ఈ సమావేశం జరగనుంది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించినట్లు సమాచారం. ఈ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. రాష్ట్ర సమస్యలకు సంబంధించి వారితో ముఖాముఖి చర్చించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం. ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి రాష్ట్రానికి తిరిగి రావడంతో ఢిల్లీ పర్యటన పూర్తవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment