- మంగళూరు ప్రాంతంలో వ్యాధిగ్రస్తులు?
- బాధితుల్లో 120 మంది నర్సింగ్ విద్యార్థులు
- అనుమానిత వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చికిత్స
- వ్యాధి నిర్ధారణపై స్పష్టత లేదంటున్న మంత్రి ఖాదర్
- ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్యులకు సూచన
సాక్షి, బెంగళూరు : యూరోపియన్ యూనియన్ దేశాలను ఇటీవల తీవ్ర భయభ్రాంతులకు గు రిచేసిన మార్సా (మెథిలీషియన్ రెసిస్టెంట్ స్టిఫైలో కాకస్ ఆరియోస్) వ్యాధి లక్షణాలు రాష్ట్రంలోని మంగళూరులోని విద్యార్థుల్లో గుర్తించినట్లు సమాచారం. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి యూటీ ఖాదర్ మాత్రం మార్సా అన్న విషయంపై స్పష్టత రాలేదని ఇంకా వ్యాధి నిర్ధారణ పరీక్షల నివేదిక అందాల్సి ఉందన్నారు. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా మార్సా ను అరికట్టడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వైద్యాధికారులకు ఇప్పటికే సూచించినట్లు వెల్లడించారు. మంగళూరులోని ఓ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల్లో మార్సా వ్యాధి లక్షణాలను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గుర్తించారు.
ఈ విషయాన్ని సదరు కళాశాల యాజమాన్యంృదష్టికి తీసుకువెళ్లినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు శనివారానికి 120 మంది విద్యార్థులకు ఈ వ్యాధి సోకినట్లు అక్కడి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కళాశాల యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంతమంది ఈ వ్యాధి బారిన పడేవారు కాదని పేర్కొంటూ కళాశాల ముందు విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ విషయమై కళాశాల ప్రిన్స్‌పాల్ మాథ్యూ మాట్లాడుతూ మార్సా సోకినట్లు భావిస్తున్న విద్యార్థులను వేరుగా ఉంచి యాంటీ బయాటిక్స్ ఇస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో మార్సా!
Published Sun, Jun 14 2015 5:11 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM
Advertisement
Advertisement