సాక్షి, హైదరాబాద్: సీఎం సహాయనిధికి హీరో విజయ్ దేవరకొండ రూ.25 లక్షల విరాళం ఇచ్చారు. ఇటీవల తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేయగా ఈ డబ్బులు వచ్చాయి. విజయ్ కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం మంత్రి కేటీఆర్‌కు ఈ మేరకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా విజయ్‌ను కేటీఆర్ అభినందించడంతో పాటు ఓ మొక్క ను కానుకగా అందించి, హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
పురపాలక శాఖ తరఫున చేప ట్టిన జలం జీవం కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణంలోనూ పాల్గొని, దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. త్వరలోనే జలమండలి అధికారులతో కార్యక్రమంలో పాల్గొంటాన ని విజయ్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా అమ్మకాలు జరుపుతున్న వస్త్రాల తయా రీని తెలంగాణలోనే చేపట్టాలని, దీనికి అవసరమైన సహాయం అం దిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గుండ్లపోచంపల్లి అపారెల్ పార్కు వస్త్ర తయారీదారులతో కలసి పనిచేయాలని మంత్రి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment