
సాక్షి, నర్సాపూర్ : లాక్‌డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో సైతం పలువురు అధికారులు తమదైన రీతిలో ఆఫీస్ పనులు చేస్తున్నారు. ఇదే కోవకు చెందిన కౌడిపల్లి ఏఈఓ రాజశేఖర్‌గౌడ్ శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి మట్టి నమూనాలు సిద్ధం చేశారు. వివరాల్లోకి వెళితే మండలంలోని వెంకటాపూర్(ఆర్) గ్రామం పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయడంతో గ్రామంలో సేకరించిన మట్టి నమూనాలను సేకరించారు. ఈ క్రమంలో ఇంటి వద్ద ఉన్న ఏఈఓ ప్యాకెట్లలో రైతుల పేర్లు, సర్వే నంబర్ ఇతర వివరాలను చీటిపై రాసి సేకరించిన మట్టిని ప్యాకెట్లలో భద్రపరిచారు. సేకరించిన మట్టి నమూనాలను ల్యాబ్‌కు పంపించనున్నట్లు ఈ మేరకు ఆయన పేర్కొన్నారు. రైతులు భూసార పరీక్షల ఆధారంగా సాగు చేయడంవల్ల ఖర్చు తగ్గుతుందని సూచనలు చేశారు.
(లాక్‌డౌన్ : విషం పెట్టి కోతులను చంపారు)
Comments
Please login to add a commentAdd a comment