స్కూల్ వరండా బయటకు వచ్చి వేలిముద్ర వేస్తున్న ఉపాధ్యాయుడు విజయ్‌కుమార్
సాక్షి, ఏటూరునాగారం: రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకొచ్చిన బయోమెట్రిక్ హాజరు విధానం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కుంటుపడింది. ఇందుకు సాంకేతిక కారణాలతో పాటు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, యాజమాన్య పాఠశాలలు మొత్తం 783 ఉండగా ఉపాధ్యాయులు 2,248 మంది పనిచేస్తున్నారు. మొత్తం 37,199 మంది విద్యార్థులు చదువుతున్నారు. బయోమెట్రిక్ యంత్రాలు ఈ ఏడాది జూన్‌లో వచ్చాయి.
ఆగస్టు నుంచి ఉపయోగిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో నెట్‌వర్క్ సరిగా లేకపోవడంతో 379 బయోమెట్రి క్ యంత్రాలు మూలనపడి ఉన్నాయి. విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం 404 బయోమెట్రిక్ యంత్రాల ద్వారా ఉపాధ్యాయులు హాజరు నమోదు చేసుకుంటున్నారు. కొన్ని పాఠశాలలో సిగ్నల్ అందక భవనాల పైకి, పాఠశాల ఆవరణలోకి యంత్రాన్ని తీసుకెళ్లి హాజరు వేసుకో వాల్సిన పర్థితులు నెలకొన్నాయి.
మొదలుకాని పరిశీలన ప్రక్రియ
విద్యాశాఖ రాష్ట్రంలోని 12 జిల్లాల నుంచి రోజు వారీ బయోమెట్రిక్ హాజరు నివేదికను కోరుతోం ది. పాఠశాలల్లో వేలిముద్రల హాజరును పరిశీలించేందుకు క్లస్టర్, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో లాగిన్‌లను ఏర్పాటు చేశారు. అన్ని స్థాయిల్లో పరిశీలించే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. యంత్రాలు సిద్ధం చేసినప్పటికీ వందలాది పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు వీటిని వివిధ కారణాలతో ప్రారంభించడం లేదు.
విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం..
బయోమెట్రిక్ హాజరు నమోదులో విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పలు పాఠశాలల్లో విద్యార్థుల లాగిన్ ఐడీ నంబర్లు,వేలి ముంద్రలు సరిపోవడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వా రం రోజుల విద్యార్థుల హాజరు పరిశీలిస్తే 4 శాతం కంటే తక్కువగా నమోదుకావడం గమనార్హం.
ఆసక్తి చూపని కొందరు టీచర్లు..
బయోమెట్రిక్‌లో హాజరు నమోదుకు కొందరు ఉ పాధ్యాయులు ఆసక్తి చూడపంలేదు. ఇందుకు సాంకేతిక కారణాలు ఉన్నాయి. జిల్లాలో 2,248 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా చాలా మంది వివిధ ప్రాంతాలకు వెళ్లారు. యంత్రాల్లో కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుల ఐడీ లేకపోవడంతో లాగిన్ అవ్వ డం లేదు. వీరి విషయం పక్కనబెడితే బదిలీ కా కుండా అదే పాఠశాలలో పనిచేస్తున్న కొంత మం ది టీచర్లు సైతం బయోమెట్రిక్ హాజరుపై నిర్లక్ష్యం గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానంపై విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు అవగాహ న కల్పించడం లేదని పలువురు చెబుతున్నారు.
మూడు జోన్లు..
పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు ప్రార్థన సమ యం కంటే ముందుగానే బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో బయోమెట్రిక్ ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు గ్రీన్ జోన్, 9.35 నుంచి 9.45 వరకు ఎల్లో జోన్‌లో ఉంటుంది. ఆ తర్వాత ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయులకు రెడ్‌జోన్ చూపిస్తోంది. సాయంత్రం 4.45 నుంచి 5 గంటల వరకు గ్రీన్‌జోన్ చూపిస్తుంది.
మారని పరిస్థితి..
మధ్యాహ్న భోజన విషయంలో తక్కువ పిల్లలు ఉంటే ఎక్కువ పిల్లలు ఉన్నట్లు నమోదు చేసుకొని ఏజెన్సీ, హెచ్‌ఎంలు నిధులు స్వాహా చేస్తున్నారని, దీనిని కట్టడి చేయడానికి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలను అమలులోకి తెచ్చారు. బయోమెట్రిక్ యంత్రానికి విద్యార్థుల ఆధార్‌ను లింక్ చేశా రు. అలాగే ఐరిష్ కనుపాప ద్వారా హాజరు వేసే విధంగా ఏర్పాటు చేశారు. అయితే విద్యార్థుల వేలిముద్రలు నమోదు కావడంలేదు. ఐరిష్ సైతం పనిచేయడం లేదు.
సిమ్ కార్డులు మార్చుతున్నారు
బయోమెట్రిక్ మిషన్లకు సెల్ సిగ్నల్స్ అందకపోవడంతో ఆ ప్రాంతంలో పనిచేసే సిమ్ కార్డులను మార్చుతున్నారు. పిల్లలకు ఐరీష్, ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల చేతి వేలి ముద్రలు పడడం లేదు. సమస్య పరిష్కరించడానికి మండలానికి ఒక ఆధార్ నమోదు మిషన్ ఏర్పాటు చేసి ఆధార్ అనుసంధానం చేయడంతోపాటు కొత్తవారికి సైతం నమోదు చేస్తున్నాం. రోజుకు వంద మంది పిల్లలకు ఆధార్ తీయడం వల్ల ఆలస్యమవుతోంది. మిషన్లతో సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. – శ్రీనివాస్‌రెడ్డి, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment