ఇందూరు: తెలంగాణ రాష్ర్టం ఏర్పడగానే తెలంగాణలోని ప్రతి నిరుద్యోగికి ఉద్యో గం వస్తుందని, లక్షాలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే మాటను నిలబెట్టుకోకుండా నిరుద్యోగులతో ఆటలాడుతున్నారని తెలు గు యువత జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ యాదవ్ ఆరోపించారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలవుతున్నా ఇంత వర కు ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఎలాంటి నోటిఫికేషన్‌లు జారీ చేయలేదన్నారు.
ఉపాధి లేక పైచదువులు చదివిన నిరుద్యో గ యువత ఉపాధిహామీ పనులకు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యా య కొలువుల కోసం శిక్షణ పూర్తి చేసుకు న్న వారు ప్రస్తుతం డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. బీసీ విద్యార్థులకు 2013-14 సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దీంతో వారు చదువులకు దూరమవుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో దాదాపు రూ.1,250 కోట్లు ఫీజు బకాయిలున్నాయన్నారు. ఫీజులు చెల్లిస్తే కాని విద్యార్థులకు చదువు చెప్పలేమని, టీసీలు ఇవ్వలేమని ప్రైవేట్ కళాశాలు స్పష్టం చేయడంతో విద్యార్థుల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైందన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు.
డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి
Published Thu, Sep 4 2014 2:51 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM
Advertisement