అగ్నిప్రమాద ఘటనపై విచారణకు ఆదేశం | enquiry on vikarabad fire accident says by minister mahender reddy | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాద ఘటనపై విచారణకు ఆదేశం

Published Mon, Mar 7 2016 6:33 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

enquiry on vikarabad fire accident says by minister mahender reddy

వికారాబాద్: రంగారెడ్డి జిల్లాలో సోమవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై మంత్రి మహేందర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. వికారాబాద్‌లోని ఆర్టీసీ బస్ డిపో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి 60 ఆటోలు కాలిపోగా, ఆర్టీసీ డిపోకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గురైన ఆటోలు ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాలుగా గుర్తించారు. ఈ ఘటనకు బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై ఉన్నతాధికారితో విచారణ చేయించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement