సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని ముంపు ప్రాంతాల్లో స్థిరాస్తుల నిర్వహణ, వాటి సమాచారం అందించేం దుకు ప్రత్యేకంగా ఎస్టేట్ ఆఫీసర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్‌కు ఈ బాధ్యత లను అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. స్థిరాస్తులకు సంరక్షణా ధికారిగా ఎస్టేట్ ఆఫీసర్ వ్యవహరిస్తారని సాగునీటి పారుదల ప్రత్యేక సీఎస్ ఎస్‌కే జోషి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆంధ్రా బ్యాంకుకు రూ.50 కోట్లు మార్జిన్ మనీ
కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ కోసం నిధుల సమీకరణకు కన్సార్టి యంగా వ్యవహరిస్తున్న ఆంధ్రా బ్యాం కుకు మార్జిన్ మనీ కింద రూ.50 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు బ్యారేజీల నిర్మాణానికి (లింక్ –1) అయ్యే రూ.17,500 కోట్ల వ్యయంలో రూ.7,400 కోట్ల రుణం ఇవ్వడానికి ఆంధ్రా బ్యాంకు అంగీకరిం చిన విషయం తెలిసిందే. దీంతో పాటే మూసీపై ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో, స్టోరేజీ సామర్థ్యాలను కొలిచేందుకు యంత్రాల కొనుగోలుకు సాగునీటి శాఖకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ముంపు ప్రాంతాల్లో ఎస్టేట్ ఆఫీసర్
Published Fri, Mar 10 2017 12:37 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM
Advertisement