హైదరాబాద్: హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజును కాంగ్రెస్ ఆనవాయితీగా జరుపుకుంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వం వల్లే హైదరాబాద్ సంస్థానం భారంత దేశంలో విలీనమైందని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జాతీయ జెండాను ఉత్తమ్ గాంధీభవన్లో ఎగురవేసి తెలంగాణ విలీన దినోత్సవ కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమానికి జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్కతో పాటూ పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మరోవైపు వినాయక చవితి వేడుకలను కూడా గాంధీభవన్లో ఉత్తమ్ ప్రారంభించారు.