
మహ్మద్ క్యాప్ మార్ట్ , నిర్వాహకులు ఇల్యాస్ బుకారీ (ఫైల్)
సాక్షి, సిటీబ్యూరో : జూన్‌లో స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ బ్యాగ్‌ల విక్రయాలు ఊపందుకున్నాయి. విద్యార్థులపై అధిక భారం పడకుండా, బరువును తగ్గించాలని గతేడాది ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇప్పుడు మార్కెట్‌లోకి లైట్ వెయిట్ బ్యాగ్‌లు వచ్చాయి. మదీనా సర్కిల్‌లోని మహ్మద్ క్యాప్ మార్ట్‌లో అతి తక్కువ బరువున్న బ్యాగులు అందుబాటులో ఉన్నాయి.
100 గ్రాముల నుంచి 500గ్రా ముల వరకు ఇవి అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ‘ప్రభుత్వ ఉత్తర్వులకు అ నుగుణంగా తక్కువ బరు వుతో బ్యాగులు తయారు చేస్తున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులు బ్రాండెడ్ కంపెనీల లైట్ వెయిట్ బ్యాగ్‌లు కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ధరలు రూ.250 నుంచి రూ.1,000 వరకు ఉన్నాయి. ఏడాది గ్యారంటీ కూడా ఇస్తున్నామ’ని చెప్పారు. మహ్మద్ క్యాప్ మార్ట్ నిర్వాహకులు ఇల్యాస్ బుకారీ.