సాక్షి, హైదరాబాద్: కరోనా రోగులకు చికిత్స చేయడానికి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బం ది జంకుతున్నారు. నేరుగా వారి వద్దకు వెళ్లి చికిత్స చేయడం ప్రాణసంకటంగా మారుతోం ది. సాధారణ ప్రజల కంటే వైద్య సిబ్బందే కరో నా బారినపడే ప్రమాదం అధికంగా ఉంది. మరోవైపు వైద్యులు తమ వద్దకు వచ్చి చికిత్స చేయడం లేదన్న ఫిర్యాదులు కూడా కరోనా రోగుల నుంచి వస్తున్నాయి. కరోనా యుద్ధం లో ముందుండి పోరాడే వైద్య సిబ్బందిని కా పాడుకోవడం, కరోనా రోగులకు సక్రమంగా వైద్యం చేయడం ఇప్పుడున్న ప్రధాన సవాల్. ఈ సవాల్‌ను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఎదుర్కోవాలన్న దానిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. చైనాలో ఈ వైరస్ వ్యాప్తి చెందినప్పుడు రోబోలను రంగంలోకి దింపారు. తద్వారా అక్కడ అనేకమంది వైద్య సిబ్బందిని కాపాడుకోగలిగారు. మన దేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లో రోబోలను కరోనా రోగులకు సేవలు అందించడంలో భాగస్వామ్యం చేస్తున్నారు.
రోగికి రోబోనే అండాదండ...
రోబోలను ఉపయోగించడం వల్ల రోగికి, వైద్య సిబ్బందికి మధ్య భౌతిక దూరాన్ని పాటించడానికి వీలు కలుగుతుంది. చైనాలో అనేక ఆసుపత్రులు రోగులకు ఆహారాన్ని అందించడం, జ్వ రాన్ని తెలుసుకోవడం, మందులను పంపిణీ, ఆసుపత్రులను పూర్తిస్థాయిలో క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయడం వంటి వాటికి హైటెక్ రోబోలను ఉపయోగించారు. స్పానిష్ ప్రభుత్వం రోజుకు 80 వేల మంది రోగులను పరీక్షించడానికి రో బోలను ఉపయోగించింది. మన దేశంలో చూస్తే చెన్నైలోని ప్రభు త్వ స్టాన్లీ బోధనాసుపత్రిలో కరో నా రోగుల సేవకు రోబోటిక్ నర్సు ను అందుబాటులోకి తెచ్చారు. రోగికి నర్సు చేసే అన్ని సపర్యలనూ రోబోటిక్ నర్సు చేస్తుంది.
అలాగే రోగులకు ఆహారం, నీరు, మందులను కూడా రోబోనే అందిస్తుంది. ఆ రోబోను ఎలా ఉపయోగించాలో నర్సుకు శిక్షణ ఇచ్చా రు. రోగి ఇబ్బందులను కూడా రోబోనే తెలుసుకుంటుంది. తద్వారా నర్సు ఇచ్చే ఆదేశాల ను రోబో పాటించి ఆ మేరకు రోగికి సేవలు చేస్తుంది. అలా రోబోకు రిమోట్ ద్వారా ఆదేశా లిస్తూ కరోనా రోగులకు సేవలు చేసే వీలు ఏర్పడింది. కేరళలో మాస్క్‌లు, శానిటైజర్ల పం పిణీకి హ్యూమనాయిడ్ రోబోలను ఉపయోగించారు. అలాగే కొచ్చికి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గించడానికి ఒక రోబోను అభివృద్ధి చేసింది. 3 చక్రాల రోబో ఆహారం, వైద్య, క్లినికల్ వినియోగ వస్తువులను తీసుకువెళ్ళగలదు. దీన్ని ప్రధానంగా ఐసోలేషన్ వార్డుల్లో ఉపయోగించుకునేలా రూపొందించారు. వీడియో కాలింగ్ ద్వారా వైద్యులు లేదా బంధువులు రోగులతో మాట్లాడేలా దీన్ని తయారు చేశారు.
ఇదిలా ఉండగా నటుడు మోహన్ లాల్ తన ఫౌండేషన్‌కు చెంది న వైద్య కళాశాలలోని ఐసోలేషన్ వార్డులో రోబోను వినియోగిస్తున్నారు. ఇక ఢిల్లీ ఎయి మ్స్ ఆసుపత్రి కరోనా వార్డుల్లోని ఫ్లోర్లను క్రిమిసంహారక మందుతో శుభ్రం చేయడానికి హ్యూమనాయిడ్ రోబోట్‌ను ఉపయోగిస్తున్నా రు. బెంగళూరులోని ఒక ఆసుపత్రి ప్రాంగణం లోకి ప్రవేశించే వైద్య సిబ్బందితో సహా ప్రతి ఒక్కరినీ పరీక్షించడానికి ప్రవేశద్వారం వద్ద ఇంటరాక్టివ్ రోబోట్‌ను ఉపయోగిస్తున్నారు. జార్ఖండ్‌లోని చైబాసా పట్టణంలో జిల్లా డిప్యూ టీ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారి ఆదిత్య రంజన్ చైనా ఎలా రోబోలను వినియోగించుకుందో అధ్యయనం చేసి, ఆ ప్రకారం తాను అటువంటి అధునాతన టెక్నాలజీని ఉపయోగించారు. ఇలా మన దేశంలో కరోనాతో పోరాడుతున్న వైద్య సిబ్బంది పనిభారాన్ని రోబోలు పంచుకుంటున్నాయి. ఆస్పత్రులను క్రిమి సంహారకం చేయడం నుండి, రోగులను పర్యవేక్షించడం, వారికి భోజనం, మం దులు, శానిటైజర్ల పంపిణీ వరకు ఉపయోగపడుతున్నాయి. జ్వరం, పల్స్, బీపీ చెక్ వంటివి ఇవే చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment