
బతుకమ్మ సెంటిమెంట్‌తో బిడ్డకే రూ.10 కోట్లు ఖర్చు
సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగ సెంటిమెంట్‌ను అడ్డు పెట్టుకుని... తన బిడ్డ పండుగ జరుపుకునేందుకు ..
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎర్రబెల్లి ఆరోపణ
తొర్రూరు: సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగ సెంటిమెంట్‌ను అడ్డు పెట్టుకుని... తన బిడ్డ పండుగ జరుపుకునేందుకు రూ. 10 కోట్లు ఖర్చు చేస్తున్నారని టీడీపీ శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణలో బతుకమ్మ పండుగకు రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇచ్చామని గొప్పలు చెప్పుకునే టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామీణ మహిళలు ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు ఒక్కపైసా కుడా ఇవ్వడం లేదని విమర్శించారు.