విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇంటర్ సెకండియర్‌లో ఘటన
విద్యారణ్యపురి : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలో హన్మకొండలోని ప్రతిభా జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో శుక్రవారం ఇంటర్ సెకండియర్ ఫిజిక్స్ పరీక్షలో ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాస్తూ ఇన్విజిలేటర్‌కు దొరికిపోయూడు. ఇంటర్ విద్య ఆర్‌ఐవో మలహల్‌రావు కథనం ప్రకారం.. నగరంలో జయముఖి జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ పూర్తయిన విద్యార్థి ఎం. సాగర్ ప్రతిభ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఫిజిక్స్ పరీక్ష రాస్తుండగా సంబంధిత ఇన్విజిలేటర్ హాల్ టికెట్‌ను పరిశీలించారు. దీంతో సూర శివకృష్ణకు బదులుగా సాగర్ పరీక్ష రాస్తున్నట్లుగా గుర్తించారు.
శివకృష్ణ హాల్‌టికెట్‌పై సాగర్ ఫోటో పెట్టి జిరాక్స్ తీసి ఆ హాల్‌టికెట్‌తో హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలోని హాల్‌టికెట్‌తో సరిపోల్చగా తేడాగా ఉన్నట్లు గుర్తించి అతనివద్ద నుంచి పరీక్ష రాస్తున్న పత్రాలను స్వాధీనం చేసుకుని సాగర్‌ను కేయూ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అదపులోనికి తీసకొని కేసు నమోదు చేశారు. అసలు విద్యార్ధి శివకృష్ణ తాను రాయాల్సిన పరీక్షను మరొకరితో రాయిస్తున్నందున అతడిని డిబార్ చేశారు. శివకృష్ణది నగరంలోని జయముఖి జూనియర్ కళాశాల. అయితే ప్రతిభ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రంగా ఉంది. ఎం. సాగర్ కూడా జయముఖి జూనియర్ కళాశాలలోనే ఇటీవల ఇంటర్ సెకండియర్ పూర్తిచేశాడు.
ఫస్టీయర్‌లో మరొకరి డిబార్
శుక్రవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలో జిల్లాలోని తొర్రూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో కాపీయింగ్ చే స్తూ ఓ విద్యార్థి డిబార్ అయ్యారని ఇంటర్‌విద్య ఆర్‌ఐవో మలహల్‌రావు తెలిపారు. ఫస్టీయర్‌లో 20,664 మంది విద్యార్థులకు 18,764మంది విద్యార్థులు హా జరయ్యారని తెలిపారు. అలాగే సెకండియర్ ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు 6,352 మంది విద్యార్థులకు 5,795 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఒకరి బదులు మరొకరు రాసిన పరీక్ష
Published Sat, May 30 2015 2:55 AM | Last Updated on Fri, Nov 9 2018 4:19 PM
Advertisement