ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన అమెజాన్
ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన అమెజాన్
Published Thu, Jan 12 2017 8:06 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు అమెజాన్ దిగొచ్చింది. అమెరికాలో ఉద్యోగాలను అమెరికన్లకే ఇవ్వాలన్న నిబంధనతో అమెరికన్లకు ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటించింది. రాబోయే ఏడాదిన్నర కాలంలో అమెరికాలో లక్షకు పైగా ఫుల్‌టైం ఉద్యోగాలు కల్పిస్తామని ఆ సంస్థ చెబుతోంది. దీంతో అమెజాన్‌లో ఉద్యోగుల సంఖ్య 2.80 లక్షలకు చేరనుంది. అమెరికాలో దేశవ్యాప్తంగా ఉన్న అందరి కోసం, అన్ని రకాల అనుభవాలు, విద్యార్హతలు, నైపుణ్య స్థాయులు ఉన్నవారి కోసం ఈ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇంజనీర్ల నుంచి సాఫ్ట్‌వేర్ డెవలపర్ల వరకు ఎంట్రీ లెవెల్ పొజిషన్లు, ఆన్ ద జాబ్ శిక్షణలు కూడా ఇస్తామని అమెజాన్ చెప్పింది.
ఈ ఉద్యోగాల్లో చాలావరకు ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో కొత్తగా నిర్మాణంలో ఉన్న తమ కేంద్రాల్లో ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ తదితర రాష్ట్రాల్లో అమెజాన్ తన కొత్త కార్యాలయాలు తెరుస్తోంది. మిగిలినవాళ్లను టెక్నాలజీ, లాజిస్టిక్స్, మెషీన్ ఇంజనీరింగ్ లాంటి రంగాల్లోకి తీసుకుంటామంది. రాబోయే ఐదేళ్లలో 25 వేల మంది వెటరన్లు, సైనికుల భార్యలను కూడా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది.
Advertisement