ఆమె నా బెస్ట్ ఫ్రెండ్.. ఆమెను పెళ్లాడాక..!
ఫిలడెల్ఫియా: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన భార్య , హిల్లరీ క్లింటన్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆమె తన బెస్ట్‌ఫ్రెండ్ అని, 1971 వసంతకాలంలో ఆమెను చూడగానే తాను ప్రేమలో పడిపోయినట్టు చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమొక్రటిక్ పార్టీ తరఫున హిల్లరీకి అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఫిలడెల్ఫియాలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. తమ దాంపత్య జీవితంలోని ఎన్నో విషయాలను స్పృశిస్తూనే.. ఆమెను అమెరికా అధ్యక్షురాలిగా ఎందుకు ఎన్నుకోవాలో వివరించారు.. ఆ వివరాలివి..
-
1971లో వసంతకాలంలో హిల్లరీనితొలిసారి కలిశాను. చూడగానే ఆమెతో ప్రేమలో పడ్డాను. బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆమెను పెళ్లాడాను. ఆమె చూపే తెలివితేటలు, శక్తిమంతమైన వ్యక్తిత్వం, ప్రేమ, శ్రద్ధ ఇప్పటికీ నన్ను విస్మయపరుస్తుఘుంటాయి.
-
ఆమెతో ప్రేమలో పడిన తర్వాత నేను సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించాను.
-
ప్రజాసేవ గురించి నా కళ్లు తెరిపించి నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి నడిపించింది హిల్లరీనే.
-
ఒసామా బిన్ లాడెన్‌ను గాలించడంలో అధ్యక్షుడు ఒబామాకు హిల్లరీ ఎప్పుడూ అండగా నిలిచింది.
-
మీరు యువ ఆఫ్రికన్-అమెరికన్ అయితే ఆరుబయట స్వేచ్ఛగా నడిచేందుకు ఎవరూ భయపడని భవిష్యత్తును నిర్మించుకునేందుకు హిల్లరీకి అండగా నిలువండి.
-
మీరు ముస్లిం అయితే, అమెరికాను, స్వేచ్ఛను ప్రేమిస్తే.. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తే.. ఇక్కడే ఉండండి. మేం గెలిచేందుకు అండగా నిలువండి.
-
హిల్లరీ మార్పుసాధకురాలు. ఆమె ఎప్పుడూ యథాతథ స్థితిని అంగీకరించదు.
-
భూగోళంపై అత్యంత గొప్ప దేశం మనది. మనం ఎప్పుడూ రేపటి గురించే ఆలోచించాలి. మీరు హిల్లరీని ఎందుకు ఎన్నుకోవాలంటే ఆమె మన భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది కాబట్టి.
- హిల్లరీకి ప్రత్యర్థిగా పోటీలోకి దిగింది ఓ కార్టూన్ (ట్రంప్) మాత్రమే.