న్యూఢిల్లీ: రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు.. విజయమైనా, పరాజయమైనా..! ఒకసారి మోదం, ఒకసారి ఖేదం. బిహార్ ఎన్నికల ఫలితాలతో మరోసారి ఇదే నిరూపితమైంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాల వద్ద భిన్నమైన వాతావరణం కనిపించింది. ఇటీవల ఎన్నికల్లో వరుస విజయాలతో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం సంబరాలతో మిన్నంటిపోగా.. అదే కాంగ్రెస్ కార్యాలయం బోసిపోయి కనిపించేది. కానీ ఆదివారం పరిస్థితి మారింది. బిహార్ ఎన్నికల ఫలితాలతో బీజేపీ కార్యాలయం నిర్మానుష్యంగా మారిపోగా.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాత్రం ఆనందోత్సాహాలతో దద్దరిల్లింది.
బిహార్ ఎన్నికల్లో తాము జట్టుకట్టిన మహాకూటమి గెలుపొందడం, 41 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ 27 స్థానాలు గెలుపొందడంతో హస్తం శ్రేణులు హస్తిన కార్యాలయం వద్ద విజయోత్సవ వేడుకలు నిర్వహించాయి. బాణాసంచా కాల్చి సంబరంగా గడిపాయి. నిజానికి ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సంబరాలు లేవు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీని విజయాలు పలుకరించడం మానేశాయి. కర్ణాటకలో బీజేపీని కాంగ్రెస్ ఓడించింది. ఆ తర్వాత బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊరట విజయం లభించడంతో ఆ పార్టీ శ్రేణులు ప్రధాన కార్యాలయం వద్ద ధూంధాం చేశాయి. అదేసమయంలో దారుణ ఓటమితో బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వేదం అలుముకుంది.
అటు సంతోషం.. ఇటు నిర్వేదం!
Published Sun, Nov 8 2015 8:23 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM
Advertisement
Advertisement