కోర్టుకు హాజరైన ఇరాన్ కమిషనర్
రాయగడ: రాయగడ ఎస్‌డీజేఎం కోర్టుకు ఇరాన్ దేశం కమిషనర్, ఆదేశపు న్యాయవాది శుక్రవారం హాజయ్యారు. వీరు హాజరయ్యేందుకు గల కారణాలు, వారి పేర్లు వివరించేందుకు సభ్యులు గాని, వారి తరఫు న్యాయవాది వి.ఎస్.ఎన్.రాజు నిరాకరించారు. ఈ విషయానికి సంబంధించి అందిన సమచారం మేరకు... రాయగడ జిల్లాలో ముకుందపూర్ ప్రాంతంలో, రాయగడ ప్రాంతంలో దివ్యాంగులు, అనాథ బాలికలను ఆదరించేందుకు బ్రిటీష్‌కు సంబంధించిన ప్రిషాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశ్రమం నెలకొల్పారు.
ముకుందపూర్ ప్రాంతానికి చెందిన ఆశ్రమంలో ఇరాన్ దేశానికి చెందిన నర్గిస్‌కేఆస్ట్రియా అనే మహిళ ఉద్యోగం పేరుతో సేవలు అందిస్తున్నారు. ఆమె ఆదీనంలో ఉన్న ఆశ్రమ విద్యార్థులతో వార్డెన్ పీటర్‌జిలాక్ 11 మార్చి 2014న రాయగడలో పర్యటించారు. ఆ సమయంలో మూడురోజుల పాటు రాయగడ బంద్ కావడంతో ఆశ్రమ పిల్లలతో ఒకరోజు పిక్నిక్ చేయాలని నిర్ణయించుకొని రాయగడ చేక్కగుడ దగ్గరలో ఉన్న రోఫ్ బ్రిడ్జి చూసేందుకు వెళ్లారు.
అయితే వార్డెన్ కుమార్తె నీటిలో కొట్టుకుపోవడంతో ఈ సంఘటన నర్గిస్‌కేఆస్ట్రియా నిర్లక్ష్యంతో జరి గినట్టు అనుమానిస్తు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అదే సంస్థలో ఒక అత్యాచారం కేసులో ఈమె పేరు ఉంది. ఈ రెండు కేసుల్లో ఒకటి శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. దీంతో నర్గిస్‌కేఆస్ట్రియా, ఇరాన్ దేశపు కమిషనర్, న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు.
వీసా మంజూరుకు నిరాకరణ
నర్గిస్‌కేఆస్ట్రియా తన సొంతదేశం అయిన ఇరాన్ వెళ్లేందుకు వీసా కోరగా ప్రభుత్వం వీసా మంజూరు చేసేందుకు నిరాకరించిరి. కారణం ఆమె ఒక కేసులో నిందితురాలిగా ఉంది. కేసు పరిష్కారం అయ్యేవరకు డిసెంబర్ 2016 వరకు ఆమె దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు నిబంధన పెట్టింది. దీనికి ఆమె అంగీకరించడంతో అప్పట్లో బెయిల్ మంజూరు అయింది. దీనికి సంబంధించి ఆమేరకు ఇరాన్ వెళ్లేందుకు అనుమతి లభించడం లేదు. నర్గిస్‌కే ఆస్ట్రియా వివరణ ప్రకారం తనపై తప్పుడు కేసు బనాయించినట్టు వివరించారు.