మెట్రో స్టేషన్ వద్ద కాల్పుల కలకలం
మెట్రో స్టేషన్ వద్ద కాల్పుల కలకలం
Published Mon, Feb 6 2017 8:38 AM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM
దేశరాజధానిలో తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ మెట్రోస్టేషన్ వద్ద తనను పట్టుకోడానికి ప్రయత్నించిన పోలీసులపై కరడుగట్టిన నేరస్థుడు అక్బర్ కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరిపి, అతడితో పాటు అతడి అనుచరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్బర్‌ను పట్టించినా, అతడి ఆచూకీ తెలిపినా రూ. 25వేల బహుమానం ఇస్తామని ఢిల్లీ పోలీసులు గతంలో ప్రకటించారు.
ఇద్దరి మధ్య దాదాపు 13 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఎట్టకేలకు పోలీసులు అక్బర్‌ను పట్టుకోగలిగారు. ఈ గొడవలో అక్బర్ సహచరుడు తప్పించుకున్నట్లు కొన్ని వర్గాలు చెబుతుండగా, అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మరికొందరు అంటున్నారు. అదృష్టవశాత్తు పోలీసులు అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి ఉండటంతో ఎవరికీ గాయాలు కాలేదు.
Advertisement
Advertisement