యాంటీబయోటిక్స్ బదులు వాము నూనె!
బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో యాంటీబయోటిక్స్ వాడకానికి బదులు వాము నూనెను వాడొచ్చని తేలింది. అమెరికాలోని ఫ్రెడ్‌రిక్ బర్డ్‌కు చెందిన సేంద్రియ మాసం ఉత్పత్తులు విక్రయించే బెల్ అండ్ ఇవాన్స్ కంపెనీ ఈ కొత్త పద్ధతిని అనుసరిస్తోంది. గత మూడేళ్ల నుంచి యాంటీబయోటిక్స్‌కు బదులు కోళ్లకు దాణాలో వాము నూనెతో పాటు కొంచెం దాల్చిన చెక్క పొడిని కలిపి ఇస్తున్నారు.
తమ కోడి మాంసం తినే వినియోగదారులు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతోనే యాంటీబయోటిక్స్‌కు బదులు వాము నూనెను వాడుతున్నామని కంపెనీ యజమాని స్కాట్ సెచ్లర్ అంటున్నారు.