-
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
మైదానంలో ఉన్నంత సేపు ప్రత్యర్థులు.. ఒక్కసారి ఆట ముగియగానే స్నేహితులు.. దాదాపు క్రీడాకారులంతా ఇలాగే ఉంటారు. ముఖ్యంగా లీగ్ క్రికెట్లో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.ఐపీఎల్-2024లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమైంది. సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో ముచ్చటించాడు.పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుని ముచ్చట్లలో మునిగిపోయిన వేళ.. కమిన్స్ తన వేలి గాయం గురించి పాండ్యా, సూర్యలకు చెప్పాడు. తన కుడిచేతి మధ్యవేలు ముందరి భాగం చిన్నప్పుడే విరిగిపోయిందని కమిన్స్ చెప్పగానే వాళ్లిద్దరు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అయితే.. ‘‘అయ్యె అవునా?’’ అన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. సాటి ఫాస్ట్ బౌలర్‌గా కమిన్స్ కష్టాన్ని తెలుసుకుని సానుభూతి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా రైటార్మ్ పేసర్ అయిన ప్యాట్ కమిన్స్ 2011లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా.. ‘‘నాకు నాలుగేళ్ల వయసున్నపుడు.. డోర్ మధ్య వేలు ఇరుక్కోవడంతో పైభాగంలో సెంటీమీటర్ మేర విరిగిపోయింది. అయినా.. నా బౌలింగ్ యాక్షన్‌పై ఎలాంటి ప్రభావం పడలేదు.ఎందుకంటే నా వేళ్లు అన్నీ దాదాపుగా ఒకే లెంగ్త్‌తో ఉంటాయి. ఈ విషయంలో ఇప్పటికీ నా సోదరి బాధపడుతూనే ఉంటుంది. ఎందుకంటే తనే డోర్ వేసింది’’ అని కమిన్స్ తెలిపాడు. అదన్న మాట సంగతి!ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై సన్‌రైజర్స్‌ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ వీరోచిత అజేయ శతకం(51 బంతుల్లో 102)తో రాణించి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్ బ్యాట్(17 బంతుల్లో 35)తో రాణించడమే గాక ఒక వికెట్ కూడా తీశాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా మూడు కీలక వికెట్లు తీసి సన్‌రైజర్స్ ఓటమిలో సూర్యతో పాటు తానూ కీలక పాత్ర పోషించాడు.చదవండి: T20 WC: ద్రవిడ్, రోహిత్‌కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!Pat Cummins must be telling about how he lost the top of his middle finger on his dominant right hand when his sister accidentally slammed a door on it. Hardik's reaction 😱 pic.twitter.com/oinHeW99mn— 𝗔𝗱𝗶𝘁𝘆𝗔 (@StarkAditya_) May 7, 2024 -
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అతి ప్రవర్తన.. ఇందులో నిజమెంత..?
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో నిన్నటి (మే 7) మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అనుమానాస్పద క్యాచ్ ఔట్ నిర్ణయం పెండింగ్‌లో ఉన్నప్పుడు పార్థ్ అతిగా ప్రవర్తించాడు. థర్డ్ అంపైర్ రీప్లే చూస్తున్నప్పుడు గ్యాలరీలో నుంచి ఔట్ ఔట్ అంటూ అరుస్తూ కేకలు పెట్టాడు. ఫ్రాంచైజీకి సహ యాజమాని అయిన వ్యక్తి నుంచి ఇలాంటి ప్రవర్తనను నెటిజన్లు అస్సలు తీసుకోలేకపోయారు. ఈ విషయంపై పార్థ్ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుండగానే ఇతని మరో వీడియో ఒకటి బాగా వైరలైంది. No #DC fan scroll without liking this।No of likes=No of slap to this mf Parth Jindal#DCvsRR pic.twitter.com/irD7dFSZoz— विक्की पाल ✍️ (@vicky_pal0515) May 7, 2024ఆ వీడియోలో పార్థ్ తన స్థాయిని మరిచి అతిగా విజయోత్సవ సంబురాలు చేసుకుంటూ కనిపించాడు. రాయల్స్‌పై విజయం అనంతరం పార్థ్ సంతోషం పట్టలేక ఇలా ఓవరాక్షన్ చేశాడని ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని తెలిసింది. ఈ వీడియోలో ఉన్నది పార్థే అయినప్పటికీ.. అతను చేసుకున్న సంబురాలు మాత్రం ఇప్పటివి కాదని తేలింది. 2023 మహిళల ఐపీఎల్ సందర్భంగా ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠ సమరంలో గెలుపు అనంతరం పార్థ్ ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. నాటి సంబురాలకు సంబంధించిన వీడియో నిన్నటి నుంచి వైరలవుతుంది. Reaction of Delhi Capitals co- owner Parth Jindal when DC defeated Rajasthan royals last night 🔥He is living the moment 💥#DCvRR #SRHvLSG #delhicapital pic.twitter.com/4NXL8ftFNB— AVANISH (@avanish_du187) May 8, 2024ఈ వీడియోను చూసి పార్థ్‌ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. వేల కోట్లకు అధిపతి, ఓ ఫ్రాంచైజీకి సహ యజమాని అయిన వ్యక్తి ఇలాగేనా ప్రవర్తించేదంటూ చురకలంటిస్తున్నారు. పార్థ్‌కు పారిశ్రామికవేత్తగా రాని పబ్లిసిటీ ఈ ఒక్క ఘటనతో వచ్చింది. Our Chairman and Co-owner, Parth Jindal, caught up with Rajasthan Royals' captain Sanju Samson & owner Manoj Badale, at the Arun Jaitley Stadium last night, after what was an exceptional contest of cricket. Parth also extended his congratulations to the RR skipper on being… pic.twitter.com/k47zwB7nzR— Delhi Capitals (@DelhiCapitals) May 8, 2024మ్యాచ్ అనంతరం పార్థ్.. సంజూ శాంసన్, రాజస్థాన్ రాయల్స్ యజమానితో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీకి సహ యజమాని అయిన పార్థ్.. జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. జిందాల్ కుటుంబం భారత దేశంలో అత్యంత ప్రముఖమైన వ్యాపార కుటుంబం.సంజూ వివాదాస్పద క్యాచ్ విషయానికొస్తే.. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో సంజూ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ రోప్‌కు అతి సమీపాన షాయ్ హోప్ చేతికి చిక్కాడు. ఈ క్యాచ్‌పై ఫీల్డ్ అంపైర్‌కు క్లారిటీ లేకపోవడంతో థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. రీ ప్లేలో హోప్ చేతిలో బంతి ఉన్నప్పుడు అతను బౌండరీ రోప్‌ను తాకినట్లు కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ఢిల్లీకి అనుకూలంగా ఇచ్చి శాంసన్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీనిపై శాంసన్ ఫీల్డ్ అంపైర్‌తో గొడవపడి అనంతరం మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సంజూ ఔటైన కావడంతో రాయల్స్ గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయింది. -
పాక్‌ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
వన్డే ప్రపంచకప్-2023 ఆరంభంలో ఓటములు చవిచూసిన అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్‌ను ఓడించి సంచలన గెలుపుతో విజయాల బాట పట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్‌ను మట్టికరిపించిన హష్మతుల్లా బృందం.. శ్రీలంక, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లలో కూడా గెలుపు బావుటా ఎగురవేసింది.ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ-2025కి కూడా అర్హత సాధించింది. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గన్ ఊహించని స్థాయిలో ప్రత్యర్థులకు షాకిచ్చి సత్తా చాటింది.అదే హైలైట్ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ ఆఖరి వరకు అద్భుతంగా పోరాడి ఓడినా అభిమానుల హృదయాలు గెలిచింది. సంతృప్తిగానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, అన్నింటికంటే పాకిస్తాన్‌పై గెలుపు మాత్రం అఫ్గన్‌కు ప్రత్యేకంగా నిలిచిపోయింది.ఎందుకంటే.. అంతర్జాతీయ వన్డేల్లో అది కూడా.. వరల్డ్‌కప్ లాంటి ప్రధాన ఈవెంట్లో తొలిసారి పాక్‌పై అఫ్గనిస్తాన్ పైచేయి సాధించింది. స్టార్ బ్యాటర్లు రహ్మనుల్లా గుర్బాజ్(65), ఇబ్రహీం జద్రాన్(87), రెహమత్ షా(77) ఇన్నింగ్స్ కారణంగా తొలిసారి పాక్‌ను ఓడించింది. దీంతో అఫ్గన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి.రాత్రి మొత్తం డాన్స్ చేస్తూతాజాగా ఈ విషయం గురించి గుర్తుచేసుకున్నాడు అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్. ‘‘పాకిస్తాన్ మీద గెలిచిన తర్వాత ఆ రోజు రాత్రి మొత్తం నేను డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాను.గ్రౌండ్ నుంచి హోటల్ దాకా సంబరాలు చేసుకున్నా. అర్ధరాత్రి దాటిన తర్వాత నేను విశ్రాంతి తీసుకోలేదు. అప్పుడు నన్నెవరైనా చూసి ఉంటే.. అసలు నాకు వెన్నునొప్పి ఉందంటే నమ్మేవారే కాదు.గతంలో ఎప్పుడూ లేని విధంగాఅప్పటికీ జాగ్రత్తగా ఉండాలని మా ఫిజియో చెప్తూనే ఉన్నారు. ఏదేమైనా నేను అలా పిచ్చిపట్టినట్లుగా డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మా జట్టు మొత్తం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ వాళ్లు నన్ను అలా చూడనేలేదు’’ అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.కాగా ఆ మ్యాచ్‌లో పది ఓవర్లు బౌల్ చేసిన రషీద్ వికెట్ తీయకపోయినా పొదుపుగా(ఎకానమీ 4.10) బౌలింగ్ చేశాడు. నాటి మ్యాచ్‌లో నూర్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగి పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. ఐపీఎల్‌తో బిజీఇదిలా ఉంటే.. రషీద్ ఖాన్ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇప్పటి వరకు 102 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీశాడు.చదవండి: T20 WC: ద్రవిడ్, రోహిత్‌కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే! -
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఛాంపియన్‌గా శ్రీలంక
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్-2024 పోటీల్లో శ్రీలంక జట్టు విజేతగా అవతరించింది. అబుదాబీలో నిన్న (మే 7) జరిగిన ఫైనల్లో లంక జట్టు స్కాట్లాండ్పై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక కెప్టెన్ చమారీ ఆటపట్టు మెరుపు శతకంతో (63 బంతుల్లో 102; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక చమారీ రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో చమారీ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. నీలాక్షి డిసిల్వ 26 నాటౌట్, కవిశ దిల్హరి 15, విశ్మి గుణరత్నే 9, హర్షిత మాధవి 8, హాసిని పెరెరా 0 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో రేచల్ స్లేటర్ 2, ప్రయనాజ్, కేథరీన్ ఫ్రేజర్, అబ్తహా మక్సూద్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 170 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉదేషిక ప్రబోధని 3 వికెట్లతో చెలరేగగా.. ఇనోశి ప్రియ, సుగందిక కుమారి, కవిశ దిల్హరి తలో వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో ప్రియనాజ్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగబోయే మహిళల టీ20 ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యాయి. మహిళల పొట్టి ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా అక్టోబర్ 3న ప్రారంభమవుతుంది. -
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టును ఏప్రిల్ 30న ప్రకటించారు. ఈ జట్టులో 15 మంది రెగ్యులర్ ఆటగాళ్లు, నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్స్ ఉన్నారు. రోహిత్ శర్మ ఈ జట్టుకు సారధిగా వ్యవహరించనుండగా.. హార్దిక్ అతనికి డిప్యూటీగా ఎంపికయ్యాడు. రెగ్యులర్ జట్టులో విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్లు ఉండగా.. శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. అందరూ ఊహించిన విధంగానే ఐపీఎల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్, శివమ్ దూబేలకు చోటు దక్కింది. యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చహల్, అర్షదీప్ సింగ్, సిరాజ్ మిగతా సభ్యులుగా ఎంపికయ్యారు.ఈ జట్టును ప్రకటించిన అనంతరం పలువురు ఆటగాళ్లకు అన్యాయం (19 మంది సభ్యుల జట్టులో చోటు దక్కక పోవడంపై) జరిగిందని సోషల్‌మీడియా గగ్గోలు పెట్టింది. మాజీలు, విశ్లేషకులు రింకూ సింగ్, కేఎల్ రాహుల్, రుతురాజ్, రియాన్ పరాగ్, నటరాజన్, రవి భిష్ణోయ్ లాంటి ఆటగాళ్లను పక్కకు పెట్టడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. Wisden picks India's T20I "B Team" for T20 World Cup 2024: (Who didn't pick in main)1. KL Rahul (C).2. Abhishek Sharma.3. Ruturaj Gaikwad.4. Riyan Parag.5. Tilak Verma.6. Shashank.7. Nitish Reddy.8. Ravi Bishnoi.9. Harshit Rana.10. Varun Chakravarthy.11. T Natarajan. pic.twitter.com/DmwAh1iAfn— Tanuj Singh (@ImTanujSingh) May 8, 2024రింకూ సింగ్ విషయంలో కొందరు మాజీలు ఏకంగా సెలక్టర్లనే తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెట్ గైడ్ విజ్డన్ ప్రపంచకప్‌కు ఎంపిక కాని అర్హులైన ఆటగాళ్లతో ఓ జట్టును ఎంపిక చేసింది.ఈ జట్టుకు కేఎల్ రాహుల్ సారధిగా ఎంపికయ్యాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆయా ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా మిగతా జట్టు సభ్యుల ఎంపిక జరిగింది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, అభిషేక్ శర్మ, వన్‌డౌన్‌లో రుతురాజ్ గైక్వాడ్, నాలుగో స్థానంలో రియాన్ పరాగ్, ఐదో ప్లేస్‌లో తిలక్ వర్మ, ఆరో స్థానంలో శశాంక్ సింగ్, ఆల్‌రౌండర్ కోటాలో విశాఖ చిన్నోడు నితీశ్ కుమార్ రెడ్డి, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.. పేసర్లుగా హర్షిత్ రాణా, నటరాజన్ ఎంపికయ్యాడు. ఈ జట్టుకు విజ్డన్ భారత-బి జట్టుగా నామకరణం చేసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
తప్పక చదవండి
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement