Cricket
-
BGT: కపిల్ రికార్డుపై కన్నేసిన బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా భారత దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ పేరిట నమోదై ఉన్న ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా మరో 20 వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ రికార్డు ప్రస్తుతం కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ ఆసీస్ గడ్డపై 11 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు తీశాడు. కంగారూల గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. బుమ్రా ఆసీస్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో బుమ్రాకు ముందు కపిల్ దేవ్ (51), అనిల్ కుంబ్లే (49), రవిచంద్రన్ అశ్విన్ (39), బిషన్ సింగ్ బేడీ (35) ఉన్నారు. బీజీటీలో మొత్తం ఐదు టెస్ట్‌లు జరుగనున్న నేపథ్యంలో కపిల్ రికార్డును బద్దలు కొట్టడం బుమ్రాకు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. అందులోనూ ఆసీస్ పిచ్‌లు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి బుమ్రాకు కపిల్ రికార్డును అధిగమించడం మరింత సలభమవుతుంది.కాగా, బీజీటీలో భాగంగా ఆసీస్‌తో జరుగబోయే తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. రోహిత్ భార్య రితిక రెండో బిడ్డకు జన్మనివ్వడంతో అతను భారత్‌లోనే ఉండిపోయాడు. దీంతో తొలి టెస్ట్‌లో బుమ్రా టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. బుమ్రా టెస్ట్‌లో టీమిండియాకు సారధిగా వ్యవహరించడం ఇది రెండోసారి. 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో బుమ్రా తొలి సారి టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. మరి బుమ్రా కెప్టెన్‌గా తన రెండో టెస్ట్‌లోనైనా టీమిండియాను గెలిపిస్తాడో లేదో వేచి చూడాలి. -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. జడేజాకు నో ప్లేస్..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు తుది జట్టు కూర్పు సమస్యగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం.. శుభ్‌మన్ గిల్ గాయపడటంతో టీమిండియా ప్రత్యామ్నాయ ఆటగాళ్లను వెతుక్కునే పనిలో పడింది.రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ వైపు మొగ్గు చూపుతున్న టీమిండియా మేనేజ్మెంట్.. శుభ్‌మన్ గిల్ స్థానంలో (వన్‌డౌన్‌లో) ఎవరిని ఆడించాలో అర్దం కాక తలలు పట్టుకుని కూర్చుంది. జట్టులో లేని దేవ్‌దత్ పడిక్కల్‌ను ఆడించాలని కొందరంటుంటే.. ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరో ఒకరికి అవకాశం కల్పించాలని మరికొందరంటున్నారు. మొత్తానికి ఎలా చూసినా టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో విరాట్, రిషబ్ పంత్ మినహా పెద్ద అనుభవజ్ఞులు లేరు.ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఓ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగాలని భావిస్తుంది. స్పెషలిస్ట్ పేసర్ల కోటాలో బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ తుది జట్టులో చోటు దక్కించుకోనుండగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైపోయింది. పెర్త్ పిచ్ పేసర్లకు సహకరించనుండటంతో భారత్ తప్పకుండా నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగుతుంది.జడేజాకు నో ప్లేస్ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఒకే ఒక స్పిన్నర్ ఫార్ములాతో బరిలోకి దిగుతుంది. ఈ క్రమంలో భారత మేనేజ్మెంట్ రవీంద్ర జడేజాను పక్కన పెట్టి అశ్విన్‌ను తుది జట్టులో ఆడించనుంది. ఆసీస్ జట్టులో ఎక్కువగా లెఫ్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటంతో కోచ్ గంభీర్ సైతం ఇదే నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నాడు. రోహిత్ గైర్హాజరీలో తొలి టెస్ట్‌లో బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా -
IND Vs AUS: ప్రత్యేకమైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఓ ప్రత్యేకమైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరుగబోయే తొలి టెస్ట్‌లో విరాట్ మరో 21 పరుగులు చేస్తే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2000 పరుగుల మైలురాయిని తాకిన ఏడో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. బీజీటీలో విరాట్ 42 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీల సాయంతో 1979 పరుగులు చేశాడు.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా..1.సచిన్ టెండూల్కర్ - 3262 పరుగులు 2. రికీ పాంటింగ్ - 2555 పరుగులు 3. వీవీఎస్ లక్ష్మణ్ - 2434 పరుగులు 4. రాహుల్ ద్రావిడ్ - 2143 పరుగులు 5. మైఖేల్ క్లార్క్ - 2049 పరుగులు 6. చెతేశ్వర్ పుజారా - 2033 పరుగులు 7. విరాట్ కోహ్లీ - 1979 పరుగులుకాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1996-97 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు దిగ్గజాల పేరిట ఈ ట్రోఫీని నిర్వహిస్తారు. భారత్ 2013 నుంచి గత నాలుగు పర్యాయాలుగా ఇంటాబయటా ఈ ట్రోఫీకి గెలుచుకుంది. స్వదేశంలో జరుగనున్న సిరీస్ కాబట్టి ఆస్ట్రేలియా ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. భారత్ తాజాగా న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో సిరీస్ కోల్పోవడంలో సిరీస్ గెలవాలన్న ఆసీస్ ఆశలు రెట్టింపు అయ్యాయి. -
కోహ్లి ‘కీ’లకం!
జట్టుకు దూకుడు నేర్పిన సారథి... విదేశీ పిచ్‌లపై సైతం అలవోకగా పరుగులు చేయగల నేర్పరి... టెక్నిక్, టెంపర్మెంట్లో అతడికెవరూ రారు సాటి! కంగారూ గడ్డపై పరుగులు చేసేందుకు సహచరలంతా తీవ్రంగా తడబడుతుంటే... ఆసీస్ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో నిరూపించిన అసలు సిసలు నాయకుడు అతడు. అందుకే ప్రస్తుతం అతడు పెద్దగా ఫామ్‌లో లేకపోయినా... కీలక ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ సిరీస్‌కు ముందు ఎవరినోట విన్నా అతడి గురించే చర్చ. ‘బాడీలైన్’ బౌలింగ్‌తో ఇబ్బంది పట్టాలని ఒకరు... రెచ్చగొట్టకుండా వదిలేయాలని మరొకరు... ఇలా ఆ్రస్టేలియా మాజీ ఆటగాళ్లంతా తీవ్రంగా చర్చిస్తున్న ఆ ప్లేయర్ మరెవరో కాదు... టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ కు గురైన టీమిండియా... ఆసీస్ పర్యటనలో ఆకట్టుకోవాలంటే అతడు రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది! సుదీర్ఘ ఫార్మాట్‌ను అమితంగా ఇష్టపడే విరాట్ కోహ్లికి ఆ్రస్టేలియాపై మెరుగైన రికార్డు ఉంది. క్రీజులో కుదురుకుంటే మంచినీళ్ల ప్రాయంలా పరుగులు రాబట్టే విరాట్... ఆసీస్‌లో ఆసీస్‌పై అదరగొట్టాడు. కంగారూ గడ్డపై ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడిన కోహ్లి 1352 పరుగులు చేశాడు. 54.08 సగటు నమోదు చేసిన విరాట్... 6 సెంచరీలు, 4 అర్ధశతకాలు కొట్టాడు. పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై యాభైకి పైగా సగటుతో పరుగులు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. సుదీర్ఘ కాలంగా భారత జట్టులో కీలక సభ్యుడిగా సాగుతున్న విరాట్ తన కెరీర్లో దాదాపు చివరి ఆసీస్ పర్యటనకు సిద్ధమవుతున్నాడు. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్‌లో అందరి దృష్టి కోహ్లిపైనే నిలవనుంది. వ్యక్తిగత కారణాల వల్ల రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడం... మరో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గాయంతో జట్టుకు దూరమవడం... గత పర్యటనలో అదరగొట్టిన సీనియర్ ప్లేయర్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఇప్పుడు జట్టులోనే లేకపోవడం... ఇవన్నీ వెరసి విరాట్ కోహ్లీ విలువను మరింత పెంచాయి. పెద్దగా అనుభవం లేని యశస్వి జైస్వాల్, ఇప్పటి వరకు అరంగేట్రమే చేయని అభిమన్యు ఈశ్వరన్, నిలకడ లోపించిన కేఎల్ రాహుల్, తొలిసారి ఆసీస్‌లో పర్యటిస్తున్న ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ వంటి వాళ్లతో కూడిన బ్యాటింగ్ లైనప్‌లో కోహ్లీ ఒక్కడే శిఖరంలా కనిపిస్తున్నాడు. పరీక్ష పెట్టే పేస్ పిచ్‌లు, సవాలు విసిరే బౌన్సీ వికెట్లు స్వాగతం పలుకుతున్న సమయంలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయాలంటే బ్యాటింగ్ దళాన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత కోహ్లిదే. ఫామ్ అందుకుంటాడా... గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా గడ్డపై అద్వితీయ ప్రదర్శన కనబర్చిన టీమిండియా... ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్‌ను ఒడిసి పట్టింది. ముచ్చటగా మూడోసారి అదే జోరు కొనసాగాలంటే బ్యాటింగ్ బలగం రాణించాల్సిన అవసరముంది. అయితే సహనానికి పరీక్ష పెట్టే ఆసీస్ పిచ్‌లపై మెరుగైన ప్రదర్శన చేయాలంటే మొక్కవోని దీక్ష ముఖ్యం. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన కోహ్లి... మూడు మ్యాచ్‌ల్లో కలిపి 100 పరుగులు కూడా చేయలేదు. మరి ఇలాంటి స్థితిలో పెద్దగా అనుభవం లేని బ్యాటింగ్ ఆర్డర్‌తో భారత జట్టు ప్రతిష్టాత్మక ట్రోఫీ నిలబెట్టుకోవాలంటే కోహ్లి సత్తా చాటాల్సిన అవసరముంది. భారత జట్టు వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించాలంటే టీమిండియా ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా... 4–0తో ట్రోఫీ చేజిక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఇది సాధ్యపడాలంటే కోహ్లి తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని తట్టి లేపాల్సిన అవసరముంది. గతంతో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా చెలరేగిపోయిన కోహ్లీ... కొంతకాలంగా నెమ్మదించాడు. మునుపటి మెరుపులు మెరిపించ లేకపోతున్నాడు. ఈ ఏడాది 6 టెస్టులు ఆడిన కోహ్లి... అందులో 22.72 సగటుతో కేవలం 250 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో రాణిస్తాడనే నమ్మకం సాధించిన కోహ్లి... ఆసీస్ పర్యటనలో అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. కోహ్లిని వదిలేయండి: వాట్సన్ కీలక సిరీస్‌కు ముందు ఆ్రస్టేలియా ఆటగాళ్లకు... ఆ దేశ మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్ కీలక సూచన చేశాడు. మైదానంలో కోహ్లి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదని తమ ప్లేయర్లకు చెప్పాడు. రెచ్చగొడితే కోహ్లిలోని అత్యుత్తమ ఆటగాడు బయటకు వస్తాడని హితవు పలికాడు. ‘విరాట్‌ను దగ్గర నుంచి గమనించా. అతడిలో మెరుగైన ప్రదర్శన చేయాలనే కసి ఎక్కువ. అది లోలోపల ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. దాన్ని రెచ్చగొట్టి బయటకు తీయకపోవడమే మేలు. అందుకే ఆసీస్ ఆటగాళ్లు అతడిని వదిలేయాలి. లేకుంటే అతడు చాలా ప్రమాదకరం’ అని వాట్సన్ అన్నాడు. ఇప్పటి వరకు ఐదుసార్లు ఆసీస్‌లో పర్యటించిన కోహ్లి... 2014–15 పర్యటనలో 86.50 సగటుతో 692 పరుగులు చేశాడు. ‘ఆసీస్‌లో అతడు ఎలాంటి ప్రదర్శన కనబర్చాడో అందరికీ తెలుసు. అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పుడు అతడు ప్రతి బంతిని మెరుగ్గా అర్థం చేసుకుంటాడు. అది జరగకుండా ఉండాలనే కోరుకుంటున్నా’ అని వాట్సన్ అన్నాడు. కోహ్లికి బాడీలైన్ బౌలింగ్ చేయాలి: హీలీ భారత ప్రధాన ఆటగాడు కోహ్లిని అడ్డుకోవాలంటే బాడీలైన్ బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాలని ఆసీస్ ఆటగాళ్లకు ఆ దేశ మాజీ ప్లేయర్ ఇయాన్ హీలీ సూచించాడు. పదే పదే ముందరి ప్యాడ్‌ను లక్ష్యంగా చేసుకొని బంతులేయడం ద్వారా అతడిని బ్యాక్‌ఫుట్‌కు పరిమితం చేసి త్వరగా అవుట్ చేయవచ్చని సూచించాడు. ‘తొలి టెస్టులో ఆ్రస్టేలియా పేసర్లు కోహ్లికి ఎలా బౌలింగ్ చేస్తారో చూసేందుకు ఆసక్తిగా చూస్తున్నా. క్రీజులో కోహ్లీ మెరుగైన కాళ్ల కదలికలు కనబర్చితే అతడు త్వరగా కుదురుకుంటాడు. అందుకే ముందరి ప్యాడ్ లక్ష్యంగా ప్రయతి్నంచాలి. అప్పుడే అతడిని నియంత్రించవచ్చు. ఒకవేళ అది ఫలితాన్ని ఇవ్వకపోతే. బాడీలైన్ బౌలింగ్ చేయడం మంచిది’ అని హీలీ ఆసీస్ పేసర్లకు హితవు పలికాడు. విరాట్ ఒక చాంపియన్: లయన్ భారత సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లిపై ఆ్రస్టేలియా స్పిన్నర్ నాథన్ లయన్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ అసలు సిసలు చాంపియన్ అని అన్నాడు. గత 60 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి కేవలం 2 సెంచరీలు, 11 అర్ధశతకాలు మాత్రమే చేసినా... అతడిని తక్కువ అంచనా వేయడం లేదని లయన్ పేర్కొన్నాడు. ‘ఫామ్‌లో ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే... అతడి రికార్డులు నమ్మశక్యం కానివి. అతడి పట్ల నాకు గౌరవం ఉంది. అతడిని అవుట్ చేయాలని తప్పక ప్రయతి్నస్తా. కానీ అది ఎంత కష్టమో నాకు తెలుసు. చాన్నాళ్లుగా మా మధ్య రసవత్తర సమరం జరుగుతుంది. కోహ్లి, స్మిత్ అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లు’ అని లయన్ అన్నాడు. -
మహారాష్ట్ర కెప్టెన్‌గా రుతురాజ్
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024 కోసం మహారాష్ట్ర జట్టును నిన్న (నవంబర్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. ఈ జట్టు అనుభవజ్ఞులు, యువకుల మేళవింపుగా ఉంది. అంకిత్ బవానే, రాహుల్ త్రిపాఠి, ముకేశ్ చౌదరీ లాంటి సీనియర్లు జట్టులో ఉన్నారు. నిఖిల్ నాయక్, ధన్‌రాజ్ షిండే వికెట్కీపర్లుగా ఎంపికయ్యారు. రాజవర్ధన్ హంగర్గేకర్, ప్రశాంత్ సోలంకి బౌలింగ్ విభాగంలో కీలకంగా ఉంటారు.ఈ టోర్నీలో మహారాష్ట్ర గ్రూప్-ఈలో ఉంది. ఈ గ్రూప్‌లో కేరళ, ముంబై, ఆంధ్రప్రదేశ్, గోవా, సర్వీసెస్, నాగాలండ్ లాంటి పటిష్ట జట్లు ఉన్నాయి. మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్‌ను నవంబర్ 23న ఆనుంది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ సేన నాగాలాండ్‌తో తలపడుతుంది. ఈ టోర్నీలో మహారాష్ట్ర గతేడాది నాకౌట్ దశకు చేరలేకపోయింది. ఈసారి పటిష్ట జట్టు ఉండటంతో పాటు రుతురాజ్ సారథ్యం తోడవ్వడంతో మహారాష్ట్ర టైటిల్‌పై కన్నేసింది.కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఈసారి రసవత్తరంగా మారనుంది. ఈ ఎడిషన్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు పలు జట్లను ముందుండి నడిపించనున్నారు. మహారాష్ట్రకు రుతురాజ్ సారథ్యం వహిస్తుండగా.. ముంబైకు శ్రేయస్ అయ్యర్, ఉత్తర్‌ప్రదేశ్‌కు భువనేశ్వర్ కుమార్, కేరళకు సంజూ శాంసన్, బరోడాకు కృనాల్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా (బరోడా), మొహమ్మద్ షమీ (బెంగాల్) లాంటి టీమిండియా స్టార్లు కూడా పాల్గొననున్నారు. ఈ టోర్నీ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 135 మ్యాచ్‌లు జరుగనున్నాయి.మహారాష్ట్ర జట్టు..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అంకిత్ బవానే, అర్షిన్ కులకర్ణి, రాహుల్ త్రిపాఠి, నిఖిల్ నాయక్ (వికెట్‌కీపర్), ధన్‌రాజ్ షిండే (వికెట్‌కీపర్), దివ్యాంగ్ హింగనేకర్, విక్కీ ఓస్త్వాల్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, అథర్వ కాలే, సిద్ధార్థ్ మాత్రే, సత్యజీత్ బచ్చవ్, రాజవర్ధన్ హంగర్గేకర్, అజీమ్ కాజీ, రుషబ్ రాథోడ్, సన్నీ పండిట్ -
Hardik Pandya: అన్న సారథ్యంలో తమ్ముడు
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ టోర్నీలో హార్దిక్ తన అన్న కృనాల్ పాండ్యా సారథ్యంలో బరోడా జట్టుకు ఆడనున్నాడు. తొలుత ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో హార్దిక్ పేరు లేదు. అయితే హార్దిక్ స్వయంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడేందుకు ఆసక్తి కనబర్చాడని తెలుస్తుంది. జాతీయ జట్టుకు ఆడని సమయంలో దేశవాలీ క్రికెట్లో ఆడతానని హార్దిక్ బీసీసీఐకి చెప్పాడట. దీంతో బరోడా క్రికెట్ అసోసియేషన్ హార్దిక్‌ను తమ జట్టులో చేర్చుకుంది. సహజంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి 18 మంది సభ్యుల జట్టును ప్రకటిస్తారు. తాజాగా హార్దిక్ చేరికతో బరోడా టీమ్ సంఖ్య 18కి పెరిగింది. ముస్తాక్ అలీ టోర్నీలో బరోడా గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో బరోడాతో పాటు తమిళనాడు, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, సిక్కిం, త్రిపుర జట్లు ఉన్నాయి. హార్దిక్ త్వరలో ఇండోర్‌లో జరిగే ట్రైనింగ్ క్యాంప్‌లో బరోడా జట్టుతో జాయిన్ అవుతాడు. బరోడా తమ టోర్నీ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ శనివారం (నవంబర్ 23) జరుగుతుంది.కాగా, హార్దిక్ ఇటీవల దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత టీ20 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో హార్దిక్ 59 పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది.ముంబై ట్రైనింగ్ క్యాంప్లోన కనిపించిన హార్దిక్హార్దిక్ దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన వెంటనే నవీ ముంబైలోని ఏర్పాటు చేసిన ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ సెషన్స్‌లో కనపడ్డాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి.బరోడా జట్టుకు బూస్టప్హార్దిక్ చేరికతో బరోడా జట్టు బలపడింది. ఈ టోర్నీలో ఆ జట్టు విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి. హార్దిక్ ఎనిమిదేళ్ల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొంటున్నాడు. -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్
రాజ్‌గిర్ (బిహార్): భారత మహిళల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, జపాన్‌పై 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ 48వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచింది. అనంతరం లాల్రెమ్సియామి 56వ నిమిషంలో మరో గోల్ చేసింది. రేపు జరుగబోయే ఫైనల్లో భారత్ చైనాతో తలపడనుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ లీగ్ దశలో చైనాను ఓడించింది. చైనా తొలి సెమీఫైనల్లో మలేసియాపై 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది.మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లో మలేసియా, జపాన్ తలపడతాయి. ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో కొరియా థాయ్‌లాండ్‌ను 3-0 గోల్స్ తేడాతో ఓడించి, ఐదో స్థానాన్ని దక్కించుకుంది. -
శ్రీలంక, న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు
పల్లెకెలె వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య ఇవాళ (నవంబర్ 19) జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 21 ఓవర్ల పాటు మ్యాచ్ సజావుగా సాగింది. ఆతర్వాత వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. టిమ్ రాబిన్సన్ 9 పరుగులు చేసి ఔట్ కాగా.. విల్ యంగ్ 56, హెన్రీ నికోల్స 46 పరుగులతో అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్‌కు ఓ వికెట్ దక్కింది.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో శ్రీలంక తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌కు ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. రెండు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటించింది. -
పాక్‌కు షాక్.. అంధుల టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన భారత్
ఈనెల (నవంబర్) 23 నుంచి పాకిస్తాన్లో జరగాల్సిన అంధుల టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా వైదొలిగింది. ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో టీమిండియా ఈ మెగా టోర్నీని బాయ్‌కాట్ చేసింది. టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలుగుతున్న విషయాన్ని భారత అంధుల క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి శైలేంద్ర యాదవ్ ధృవీకరించారు. ఇండియా టుడేతో ఆయన మాట్లాడుతూ.. అంధుల టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్‌కు వెళ్లడానికి భారత ప్రభుత్వం (విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) అనుమతి నిరాకరించిందని తెలిపారు. తొలుత ఈ టోర్నీలో పాల్గొనేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేసింది. అయితే చివరి నిమిషంలో పాక్ పర్యటనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒప్పుకోలేదు. భారత అంధుల క్రికెట్ సంఘానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి లిఖితపూర్వమైన ఆదేశాలు రావాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా పాల్గొనడం లేదు. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు ఈ టోర్నీలో భారత్ పాల్గొనకపోవడంతో పాకిస్తాన్‌కు వాక్ ఓవర్ లభిస్తుంది. ఈ టోర్నీలో భారత్ పాల్గొనకపోయినా ఎలాంటి నష్టం లేదని పాకిస్తాన్ అంధుల క్రికెట్ కౌన్సిల్ (PBCC) తెలిపింది. తమవరకైతే భారత ఆటగాళ్లకు వీసాలు జారీ చేశామని పీబీసీసీ పేర్కొంది.కాగా, అంధుల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ టోర్నీ జరిగిన మూడు ఎడిషన్లలో (2012, 2017, 2022) టీమిండియానే విజేతగా నిలిచింది. 2022 ఎడిషన్ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌పై 120 పరుగుల తేడాతో గెలుపొంది మూడోసారి జగజ్జేతగా నిలిచింది.ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం భారత్ పాక్‌లో పర్యటించబోదని బీసీసీఐ ఐసీసీకి తేల్చి చెప్పంది. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాక్‌లో పర్యటించడం సాధ్యం కాదని బీసీసీఐ ఖరాఖండిగా చెప్పింది. తటస్థ వేదికపై తమ మ్యాచ్‌లు నిర్వహిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని బీసీసీఐ అంటుంది. దీనికి పాక్ అంగీకరించడం లేదు. తాజాగా భారత అంధుల క్రికెట్ టీమ్ టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల కిందట భారత ప్రభుత్వం పురుషుల కబడ్డీ టీమ్‌ను కూడా పాకిస్తాన్‌కు పంపలేదు. -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న మంధన
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధన కళ్లు చెదిరే రన్నింగ్ క్యాచ్ పట్టుకుంది. డబ్ల్యూబీబీఎల్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్‌కు ఆడే మంధన పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాన్ని ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో మంధన అమండ జేడ్ బౌలింగ్‌లో కార్లీ లీసన్ క్యాచ్‌ను పట్టుకుంది. స్కార్చర్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ తొలి బంతికి లీసన్ కవర్స్ దిశగా షాట్ ఆడగా.. మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మంధన వెనక్కు పరిగెడుతూ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరవతువుంది.WHAT A STUNNING CATCH BY SMRITI MANDHANA IN WBBL 🤯🔥 pic.twitter.com/byoJRzx69i— Johns. (@CricCrazyJohns) November 19, 2024మూడు క్యాచ్‌లు పట్టుకున్న మంధన ఈ మ్యాచ్‌లో మంధన మొత్తం మూడు క్యాచ్‌లు పట్టుకుంది. ఈ మూడు అద్భుతమైన క్యాచ్‌లే. మైదానంలో పాదరసంలా కదిలిన మంధన బ్యాట్‌తోనూ రాణించింది. 29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 41 పరుగులు చేసింది. మంధన బ్యాట్‌తో, ఫీల్డ్‌లో రాణించడంతో అడిలైడ్ స్ట్రయికర్స్ 30 పరుగులు తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్.. మంధన (41), కేటీ మ్యాక్(41), లారా వోల్వార్డ్ట్ (48) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. స్కార్చర్స్ బౌలర్లలో అలానా కింగ్ 3, కెప్టెన్ సోఫీ డివైన్ 2, క్లో ఐన్స్‌వర్త్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కార్చర్స్.. మెగాన్ షట్ (3/19), ముషాంగ్వే (2/35), అమండ జేడ్ వెల్లింగ్టన్ (2/26), తహిల మెక్‌గ్రాత్ (1/27) ధాటికి నిర్ణీత ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో బ్రూక్ హ్యాలీడే (47), సోఫీ డివైన్ (35), అలానా కింగ్ (29 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు మరో షాక్..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాను గాయాల సమస్య వేధిస్తుంది. చేతి వేలి గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ ఇదివరకే తొలి టెస్ట్‌కు దూరంగా కాగా.. తాజాగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ గాయం బారిన పడినట్లు తెలుస్తుంది. ప్రాక్టీస్ సందర్భంగా యశస్వి మెడ పట్టేసినట్లు సమాచారం. యశస్వి నొప్పితో విలవిలలాడుతున్న దృష్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. టీమ్ ఫిజియో యశస్వి మెడకు మసాజ్ చేస్తూ కనిపించాడు. యశస్వి గాయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. ఈ విషయం మాత్రం టీమిండియా అభిమానులను తెగ కలవరపెడుతుంది.ఇప్పటికే రోహిత్ దూరమయ్యాడు..!తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశంలోనే ఉండిపోయాడు. తొలి టెస్ట్‌కు అతను అందుబాటులో ఉండడం లేదు. రోహిత్‌కు ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ పేర్లను పరిశీలుస్తున్నారు. ఇప్పుడు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా గాయం బారిన పడితే తొలి టెస్ట్‌కు భారత్ రెగ్యులర్ ఓపెనర్లు లేకుండా బరిలోకి దిగినట్లవుతుంది.2020-21లోనూ ఇదే సీన్బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 సిరీస్‌లోనూ టీమిండియా ఇదే తరహాలో గాయల బారిన పడింది. నాటి సిరీస్‌లోనూ భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సందర్భంగా గాయాల బారిన పడ్డారు. దీంతో టీమిండియా ఆ సిరీస్‌లో ప్రత్యామ్నాయ ఆటగాళ్లతో బరిలోకి దిగింది.అనుభవం లేని ఆటగాళ్లతో టీమిండియా..!పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌లో టీమిండియా పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియా అభిమన్యు ఈశ్వరన్ లేదా కేఎల్ రాహుల్‌పై ఆధారపడాల్సి ఉంది. శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా తప్పుకోవడంతో సర్ఫరాజ్ ఖాన్‌కు ఛాన్స్ దక్కవచ్చు. ఈ సిరీస్‌లో భారత పేస్ అటాక్ అత్యంత బలహీనంగా కనిపిస్తుంది. బుమ్రా మినహా జట్టులో పెద్దగా అనుభవజ్ఞులు లేరు. సిరాజ్‌కు పదుల సంఖ్యలో టెస్ట్‌లు ఆడిన అనుభవమున్నా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ టెస్ట్ మ్యాచ్‌లే ఆడారు. ఈ సిరీస్‌లో టీమిండియా ప్రధాన బలం స్పిన్నర్లు. అయితే తొలి టెస్ట్‌కు వేదిక అయిన పెర్త్ స్పిన్నర్లకు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. -
భారత్, పాక్ మధ్య ఐసీసీ మధ్యవర్తిత్వం
ఛాంపియన్స్ ట్రోఫీ సందిగ్దత నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారత్, పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తుంది. మెగా టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ఐసీసీ పాక్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు ఐసీసీ తెర వెనుక పావులు కదుపుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనకపోతే ఎదురయ్యే నష్టాలను ఐసీసీ పాక్‌కు వివరిస్తుంది.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాక్‌లో పర్యటించేందుకు ససేమిరా అంటున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీని తటస్థ వేదికపై నిర్వహిస్తేనే తాము పాల్గొంటామని భారత్ ఖరాఖండిగా తేల్చి చెప్పింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ పాక్‌లో పర్యటించేందుకు ఒప్పుకోవడం లేదు. మరోవైపు ఛాంపియన్స్ టోర్నీని ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశంలోనే నిర్వహించాలని పాక్ భీష్మించుకుని కూర్చుంది.ఈ టోర్నీ కోసం తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని, అలాగే టోర్నీ నిర్వహణ కోసం భారీగా నిధులు సమకూర్చామని పాక్ చెబుతుంది. టోర్నీ నిర్వహణ విషయంలో ఐసీసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పాక్ కోరుతుంది. ఒకవేళ భారత్ ఈ టోర్నీలో పాల్గొనపోతే వేరే దేశానికి అవకాశం కల్పించాలని పాక్ అంటుంది. టోర్నీ షెడ్యూల్‌ను వీలైనంత త్వరలో విడుదల చేయాలని పాక్ ఐసీసీని కోరుతుంది.వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను నవంబర్ 12నే విడుదల చేయాల్సి ఉండింది. అయితే భారత్, పాక్ మధ్య పంచాయితీ నడుస్తుండటంతో షెడ్యూల్ విడుదలను వాయిదా వేస్తూ వస్తున్నారు.పాక్ ఒప్పుకోకపోతే వేదిక మారనుందా..?హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాక్ ఒప్పుకోకపోతే వేదికను దక్షిణాఫ్రికాకు మార్చాలని ఐసీసీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. వేదికను దక్షిణాఫ్రికాకు షిప్ట్ చేస్తే పాక్ పాల్గొంటుందో లేదో వేచి చూడాలి. వాస్తవానికి భారత్ తాము ఆడబోయే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని కోరుతుంది. మిగతా మ్యాచ్‌లన్నిటినీ యధాతథంగా పాక్‌లోనే నిర్వహించుకోవచ్చని భారత్ అంటుంది. ఇందుకు పాక్ ఒప్పుకోవడం లేదు. -
దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు..!
స్వదేశంలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (నవంబర్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా ఎంపికయ్యాడు. బవుమా మోచేతి గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అక్టోబర్ 4 ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సందర్భంగా బవుమా గాయపడ్డాడు.రబాడ రీఎంట్రీలంకతో సిరీస్‌తో కగిసో రబాడ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రబాడ భారత్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. భారత్‌తో టీ20 సిరీస్‌లో సత్తా చాటిన మార్కో జన్సెన్, గెరాల్ట్ కొయెట్జీ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరిద్దరు ఈ ఏడాది ఆరంభంలో భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చివరిసారిగా దర్శనమిచ్చారు. గాయాల కారణంగా ఈ సిరీస్‌కు లుంగి ఎంగిడి, నండ్రే బర్గర్ దూరమయ్యారు. ర్యాన్ రికెల్టన్, డేన్ పీటర్సన్, సెనూరన్ ముత్తుస్వామి 14 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నారు.సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరాలంటే..?సౌతాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు చేరాలంటే శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌లతో పాటు తదుపరి (డిసెంబర్, జనవరి) స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, గెరాల్డ్ కొయెట్జీ, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, సెనూరన్ ముత్తుస్వామి, డేన్ పీటర్సన్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, కైల్ వెర్రిన్సౌతాఫ్రికా-శ్రీలంక సిరీస్ షెడ్యూల్తొలి టెస్ట్- నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 (డర్బన్)రెండో టెస్ట్- డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 9 (గెబెర్హా)కాగా, సౌతాఫ్రికాతో సిరీస్‌కు శ్రీలంక జట్టును కూడా ఇవాళ్లే ప్రకటించారు. లంక జట్టుకు సారధిగా ధనంజయ డిసిల్వ వ్యవహరించనున్నాడు.దక్షిణాఫ్రికా సిరీస్‌కు శ్రీలంక జట్టు..ధనంజయ డిసిల్వ (కెప్టెన్), పతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కుసాల్ మెండిస్, కమిందు మెండిస్, ఒషాద ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, ప్రబాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, లసిత్ ఎంబుల్దెనయ, మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార, కసున్ రజిత -
BGT 2024-25: టీమిండియాతో తొలి టెస్ట్.. ఆసీస్ తుది జట్టు ఇదే..!
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ ఫలితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ బెర్త్‌లను ఖరారు చేస్తుంది. ఈ కారణంగా ఈ సిరీస్‌కు ప్రాధాన్యత మరింత పెరిగింది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరాలంటే ఈ సిరీస్‌లో ఆసీస్‌ను 4-0 తేడాతో ఓడించాల్సి ఉంది.ఇలా జరగడం అంత ఆషామాషి విషయమేమీ కాదు. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించాలంటే భారత్ ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. భారత్ ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం (0-3 తేడాతో సిరీస్ కోల్పోయింది) ఎదుర్కొంది. దీని ప్రభావం బీజీటీపై ఎంతో కొంత ఉంటుంది. మరోవైపు ఈ సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాల సమస్య వేధిస్తుంది. తొలి టెస్ట్‌కు శుభ్‌మన్ గిల్ అందుబాటులో ఉండడని సమాచారం. వ్యక్తిగత కారణాల (రెండో సారి తండ్రైనందున) చేత రోహిత్ తొలి టెస్ట్‌కు దూరం కానున్న విషయం తెలిసిందే.నలుగురు పేసర్లతో అటాక్ చేయనున్న ఆసీస్తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా టీమిండియాను నలుగురు పేసర్లతో అటాక్ చేయనుంది. పేస్ త్రయం పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌తో పాటు మిచ్ మార్ష్ టీమిండియాపై నిప్పులు చెరగనున్నారు. పెర్త్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. భారత బ్యాటర్లు ఆసీస్ పేసర్లను ఏమేరకు ఎదుర్కొంటారో వేచి చూడాలి.ఆసీస్ బ్యాటింగ్ విభాగం విషయానికొస్తే.. డేవిడ్ వార్నర్‌కు రీప్లేస్‌మెంట్‌గా నాథన్ మెక్‌స్వీని బరిలోకి దిగడం దాదాపు ఖరారైపోయింది. మెక్‌స్వీని.. ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. వన్‌డౌన్‌లో మార్నస్ లబూషేన్ బరిలోకి దిగనుండగా.. స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో బరిలోకి దిగుతాడు. ఐదో స్థానంలో ట్రవిస్ హెడ్ బరిలోకి దిగనుండగా.. ఆల్‌రౌండర్‌గా మిచ్ మార్ష్.. వికెట్‌కీపర్‌గా అలెక్స్ క్యారీ బరిలో ఉంటారు. తొలి టెస్ట్‌లో ఆసీస్ ఏకైక స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది. స్పిన్ విభాగం నుంచి నాథన్ లియోన్ బరిలో ఉంటాడు.భారత్‌తో తొలి టెస్ట్ ఆసీస్ తుది జట్టు (అంచనా)..ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్‌స్వీని, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, నాథన్ లియోన్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ -
నన్ను రిటైన్ చేసుకోకపోవడానికి అది కారణం కాదు: రిషబ్ పంత్
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తనను రిటైన్ చేసుకోకపోవడంతో రిషబ్ వేలంలోకి వచ్చాడు.ఈ వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరగా పంత్ తన పేరును నమోదు చేసుకున్నాడు. రిషబ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉండడంతో ఈ మెగా వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశముంది.క్లారిటీ ఇచ్చిన పంత్..అయితే ఈ ఏడాది సీజన్లో పంత్ అద్బుతంగా రాణించినప్పటికి ఢిల్లీ ఎందుకు వేలంలోకి విడిచిపెట్టిందో ఎవరికి ఆర్ధం కావడం లేదు. ఢిల్లీ మేనెజ్మెంట్తో విభేదాల కారణంగానే పంత్ బయటకు వచ్చాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.అతడు ఎక్కువ డబ్బు అడిగిన కారణంగానే ఢిల్లీ విడిచిపెట్టిందని మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తాజాగా ఇదే విషయంపై రిషబ్ పంత్ క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తనను జట్టులో ఉంచుకోకపోవడానికి డబ్బు కారణం కాదని కచ్చితంగా నేను చెప్పగలను అని ఎక్స్‌లో రిషబ్ పోస్ట్ చేశాడు.కాగా ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ సపోర్ట్ స్టాప్‌లో సమూల మార్పులు చేసింది. ఢిల్లీ తమ హెడ్‌కోచ్‌గా రికీ పాంటింగ్ స్థానంలో హేమంగ్ బదానీని, సౌరవ్ గంగూలీ ప్లేస్‌లో వేణుగోపాల్ రావును క్రికెట్ డైరెక్టర్‌గా నియమించింది. ఇక ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో జెడ్డా వేదికగా జరగనుంది.చదవండి: BGT 2024: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌దే పైచేయి.. ఆసీస్‌కు మరోసారి సవాల్? The curious case of Rishabh Pant & Delhi! 🧐🗣 Hear it from #SunilGavaskar as he talks about the possibility of @RishabhPant17 returning to the Delhi Capitals!📺 Watch #IPLAuction 👉 NOV 24th & 25th, 2:30 PM onwards on Star Sports Network & JioCinema! pic.twitter.com/ugrlilKj96— Star Sports (@StarSportsIndia) November 19, 2024 -
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌దే పైచేయి.. ఆసీస్‌కు మరోసారి సవాల్?
ప్రపంచ క్రికెట్లో యాషెష్ తర్వాత అంత్యంత టెస్టు రైవలరీ ఏదైనా ఉందంటే అది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీనే. ఆస్ట్రేలియా-భారత్ మధ్య ప్రతీ రెండేళ్లకు ఓ సారి జరిగే ఈ రెడ్ బాల్ సమరానికి సమయం అసన్నమైంది. నువ్వా నేనా అన్నట్టుగా సాగే ఈ పోటీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఈ బీజీటీ ట్రోఫీ ప్రారంభం కానుంది. 32 ఏళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీ కోసం ఇరు జట్లు అన్ని విధాల సిద్దమయ్యాయి. భారత జట్టు అయితే 12 రోజుల ముందుగానే ఆసీస్ గడ్డపై అగుడుపెట్టి తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. ఈ సిరీస్ భారత్ చాలా కీలకం. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కి అర్హత సాధించాలంటే టీమిండియా ఈ టెస్టు సిరీస్‌ను 4-1 తప్పకగెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ హిస్టరీపై ఓ లుక్కేద్దాం.1996లో మొదలై..భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు క్రికెట్ జర్నీ 1947లో మొదలైంది. లాలా అమర్నాథ్ సారథ్యంలో భారత జట్టు తొలిసారిగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. మొట్టమొదటి సిరీస్‌ను కంగారులు 4-0 తేడాతో సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 1947 నుండి 1992 వరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య 50 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి.అయితే 1996లో భారత క్రికెట్ బోర్డు, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియా మాజీ సారథి అలన్ బోర్డర్ల గౌరవర్ధం ఓ సిరీస్ నిర్వహించాలని భావించాయి.దీంతో ఆసీస్-భారత్ మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు ‘బోర్డర్-గావస్కర్ ట్రోఫీ’గా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నామకరణం చేశాయి. అప్పటి నుంచి ఈ ట్రోఫీ విజయవంతంగా సాగుతోంది. కాగా గావస్కర్, అలెన్ బోర్డర్ వరల్డ్ టెస్టు క్రికెట్లో తమదైన ముద్ర వేసుకున్నారు. వీరిద్దరూ టెస్టుల్లో 10,000 కంటే ఎక్కువ పరుగులు చేసి తమ జట్లకు ఎన్నో అద్బుత విజయాలు అందించారు.మనదే పైచేయి..బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్‌పై భారత్‌దే పైచేయిగా కొనసాగుతోంది. ఈ ట్రోఫీ కింద ఇప్పటివరకు మొత్తం 16 సిరీస్‌లు జరిగాయి. అందులో టీమిండియా 10 సార్లు విజేతగా నిలవగా.. ఆసీస్ ఐదు సిరీస్‌లను సొంతం చేసుకుంది. 2003–04 సిరీస్ మాత్రమే డ్రా అయింది. ఓవరాల్‌గా 1996 నుంచి ఇరు జట్ల మధ్య 57 టెస్టుల్లో జరిగాయి. అందులో టీమిండియా 24, ఆస్ట్రేలియా 21 విజయాలు సాధించింది. 12 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.ఆసీస్ గడ్డపై సరికొత్త చరిత్ర..2018-19లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ను టీమిండియా తమ ఖాతాలో వేసుకుంది. 71 ఏళ్లగా ఆసీస్ గడ్డపై ఊరిస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుని తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది.ఆ తర్వాత 2021-22లో పర్యటనలో కూడా సత్తాచాటిన భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై మళ్లీ సిరీస్‌ను కైవసం చేసుకుంది. గత రెండు పర్యాయాలు ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించిన టీమిండియా ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.చదవండి: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్‌పై వేటు -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్‌పై వేటు
ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. అదే విధంగా ఎప్పటిలాగే ఆమెకు డిప్యూటీగా స్మృతి మంధాన వ్యవహరించనుంది.అయితే ఈ జట్టులో భారత స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మకు చోటు దక్కలేదు. జట్టు ఎంపికకు షఫాలీని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఆమెను పక్కన పెట్టడానికి గల కారణాన్ని అయితే సెలక్టర్లు వెల్లడించలేదు. షెఫాలీ మాత్రం ప్రస్తుతం పెద్దగా ఫామ్‌లో లేదు.ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో షఫాలీ వర్మ కేవలం 56 పరుగులు మాత్రమే చేసింది. ఆమె వన్డేల్లో హాఫ్ సెంచరీ సాధించి ఏడాది దాటింది. మరోవైపు హర్లీన్ డియాల్, టిటాస్ సాధు తిరిగి జట్టులోకి వచ్చారు. హర్లీన్ చివరగా భారత్ తరపున 2023లో ఆడింది. అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉంటుంది. డిసెంబర్ 5న బ్రిస్బేన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.భారత మహిళల జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, టిటాస్ సాధు , అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, సైమా ఠాకూర్ -
SMT 2024: ఒకే జట్టులో మహ్మద్ షమీ బ్రదర్స్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2024-25 కోసం బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సుదీప్ కుమార్ ఘరామి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దాదాపు ఏడాదిగా వైట్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఇండియన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ఈ జట్టులో చోటు దక్కింది.షమీ ఇటీవలే రంజీ ట్రోఫీ 2024-25లో తిరిగి మైదానంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే 6 వికెట్లతో ఈ సీనియర్ బౌలర్ సత్తచాటాడు. ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు ఈ బెంగాల్ స్టార్ సిద్దమయ్యాడు. కాగా ఈ జట్టులో మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్‌కు కూడా బెంగాల్ సెలక్టర్లు చోటిచ్చారు. నవంబర్ 23 నుంచి ఈ దేశవాళీ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో బెంగాల్ జట్టు హైదరాబాద్, మేఘాలయ, మధ్యప్రదేశ్, మిజోరాం, బీహార్, రాజస్థాన్, పంజాబ్‌లతో పాటు గ్రూప్-ఎలో ఉంది.బెంగాల్ జట్టు: సుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుదీప్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, కరణ్ లాల్, రిటిక్ ఛటర్జీ, రిత్విక్ రాయ్ చౌదరి, షకీర్ హబీబ్ గాంధీ (వికెట్ కీపర్), రంజోత్ సింగ్ ఖైరా, ప్రయాస్ రే బర్మన్ (వికెట్ కీపర్), అగ్నివ్ పాన్ (వికెట్ కీపర్), ప్రదీప్త ప్రమాణిక్, సాక్షం చౌదరి, మహ్మద్ షమీ, ఇషాన్ పోరెల్, మహ్మద్ కైఫ్, సూరజ్ సింధు జైస్వాల్, సయన్ ఘోష్, కనిష్క్ సేథ్ మరియు సౌమ్యదీప్ మండల్.చదవండి: IPL 2025 Mega Auction:'వేలంలో అతడికి రూ. 25 కోట్లు పైనే.. స్టార్క్ రికార్డు బద్దలవ్వాల్సిందే' -
'వేలంలో అతడికి రూ. 25 కోట్లు పైనే.. స్టార్క్ రికార్డు బద్దలవ్వాల్సిందే'
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌథీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది. ఇందుకు అన్నిరకాల ఏర్పాట్లు బీసీసీఐ చేస్తోంది. ఈ మెగా వేలంలో మొత్తం 574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్ నుంచి రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి స్టార్ క్రికెటర్లు సైతం ఉన్నారు.దీంతో ఫ్యాన్స్ కూడా ఈ వేలం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ క్యాష్ రిచ్ మెగా వేలానికి ముందు రిషబ్ పంత్‌పై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని పఠాన్ జోస్యం చెప్పాడు. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్-2024 మినీ వేలంలో స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక అమ్ముడుపోయిన ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. కానీ ఇప్పుడు అతడి రికార్డు డేంజర్లో ఉందని, పంత్ కచ్చితంగా బ్రేక్ చేస్తాడని పఠాన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.విడిచిపెట్టిన ఢిల్లీ..ఇక ఈ మెగా వేలానికి ముందు పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. దీంతో పంత్ వేలంలో తన పేరును రూ.2 కోట్ల కనీస ధరగా నమోదు చేసుకున్నాడు. పంత్ తన రీ ఎంట్రీలో అదరగొడుతుండడంతో వేలంలో అతడిపై కాసుల వర్షం కురిసే అవకాశముంది.అతడి కోసం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ పోటీ పడే ఛాన్స్ ఉన్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. 2016లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రిషబ్.. ఎనిమిది సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు తొలిసారి అతడిని వేలంలోకి ఢిల్లీ ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. దీంతో అందరి కళ్లు పంత్‌పైనే ఉన్నాయి.చదవండి: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్‌పై నిషేధం.. -
ఐపీఎల్ వేలం కోసం వెటోరి
పెర్త్: ఆ్రస్టేలియా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ డానియెల్ వెటోరి పెర్త్‌లో భారత్‌తో జరిగే తొలి టెస్టు మధ్యలోనే జట్టును వీడి ఐపీఎల్ మెగా వేలానికి బయలుదేరుతాడు. ఈ న్యూజిలాండ్ బౌలింగ్ దిగ్గజం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో 45 ఏళ్ల వెటోరి సౌదీ అరేబియాలోని రెండో పెద్ద నగరం జిద్దాలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే వేలంలో పాల్గొంటాడు. ఐదు టెస్టుల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో తొలి టెస్టు 22 నుంచి పెర్త్‌లో జరుగుతుంది. ‘ఐపీఎల్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్ అయిన వెటోరికి మద్దతిస్తాం. అతను మొదటి టెస్టు సన్నాహానికి చేయాల్సిందంతా (ట్రెయినింగ్) చేసే వేలానికి హాజరవుతాడు. ఇందులో మాకు ఏ ఇబ్బంది లేదు. మెగా వేలం ముగిసిన వెంటనే మళ్లీ మా జట్టుతో కలుస్తాడు’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సీఏ నేషనల్ డెవలప్మెంట్ కోచ్ లాచ్లన్ స్టీవెన్స్... తొలి టెస్టు కోసం వెటోరి పాత్రను భర్తీ చేస్తారని సీఏ తెలిపింది. కివీస్‌కు చెందిన వెటోరి మాత్రమే కాదు... ఆ్రస్టేలియన్ దిగ్గజాలు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్లు సైతం జిద్దాకు పయనమవుతారు. పాంటింగ్ పంజాబ్ కింగ్స్‌కు, లాంగర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు హెడ్ కోచ్‌లుగా ఉన్నారు. దీంతో ‘చానెల్ సెవెన్’లో వ్యాఖ్యాతలు వ్యవహరించనున్న వీళ్లిద్దరు కూడా పెర్త్ టెస్టు మధ్యలోనే మెగా వేలంలో పాల్గొననున్నారు. -
ఇంగ్లండ్, విండీస్‌ల ఆఖరి టి20 రద్దు
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): కరీబియన్ పర్యటనలో ఆఖరిదైన ఐదో టి20 రద్దవడంతో ఇంగ్లండ్ 3–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరగాల్సిన మ్యాచ్ సరిగ్గా ఐదు ఓవర్లు ముగిశాక వర్షంతో ఆగిపోయింది. అప్పటికే మ్యాచ్ నిలిచే సమయానికి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు లూయిస్ (20 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (10 బంతుల్లో 14 నాటౌట్, 3 ఫోర్లు) అజేయంగా ఉన్నారు. అయితే భారీ వర్షంతో అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారింది. తిరిగి ఆట నిర్వహించలేని పరిస్థితి తలెత్తడంతో ఫీల్డు అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో మొదటి మూడు టి20ల్లో వరుసగా ఇంగ్లండే గెలిచి మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను నెగ్గింది. ఈ సిరీస్‌లో 9 వికెట్లు తీసిన ఇంగ్లండ్ సీమర్ సాకిబ్ మహ్మూద్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఈ పర్యటనలో ముందు మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య వెస్టిండీస్ 2–1తో కైవసం చేసుకుంది. అయితే ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో ఫలితాలు వచ్చిన ఈ ఏడు మ్యాచ్‌ల్లోనూ టాస్ నెగ్గి... ఫీల్డింగ్ ఎంచుకొని, లక్ష్యాన్ని -
రోహిత్ నిర్ణయం సరైనదే.. నేనైనా అలానే చేసేవాడని: హెడ్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ (Border-Gavaskar Trophy) ప్రారంభానికి సమయం అసన్నమైంది. మరో రెండు రోజుల్లో భారత్-ఆసీస్ మధ్య ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీకి తెరలేవనుంది. ఈ బీజీటీ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆరంభం కానుంది.అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు.రోహిత్ భార్య రితికా సజ్దే కొన్నిరోజుల కిందటే పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రోహిత్ జట్టుతో పాటు ఆస్టేలియాకు వెళ్లకుండా భారత్‌లోనే ఉండిపోయాడు. అయితే మరి కొన్ని రోజుల పాటు భార్యతో పాటే ఉండాలని హిట్‌మ్యాన్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పెర్త్ టెస్టుకు రోహిత్ దూరమయ్యాడు.అయితే రోహిత్ నిర్ణయాన్ని కొంతమంది అభిమానులు సోషల్ మీడియా తప్పుబట్టారు. ముందుగానే తన భార్య బిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ తొలి టెస్టులో ఆడింటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మాత్రం రోహిత్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. టీమిండియా కెప్టెన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని హెడ్ తెలిపాడు."రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం వంద శాతం సరైనదే. అతడికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను. అదే పరిస్థితిలో నేను ఉన్నా రోహిత్‌లానే ఆలోచిస్తాను. క్రికెటర్లగా మేము ఎన్నో త్యాగాలు చేస్తున్నాము. వృత్తిని, ఫ్యామిలీని రెండూ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ముఖ్యమైన మ్యాచ్‌లు కూడా కోల్పోవాల్సి వస్తుంది.ఇక ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు మంచి రికార్డు ఉంది. గత రెండు పర్యటనలలో కీలక ఆటగాళ్లు గాయాలతో దూరంగా ఉన్నప్పటికి భారత్ అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. మా దృష్టిలో భారత్ ఎప్పుడూ బలమైన జట్టే" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెడ్ పేర్కొన్నాడు.చదవండి: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్‌పై నిషేధం.. -
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్‌పై నిషేధం..
న్యూజిలాండ్ పేస్ బౌలర్ డగ్లస్ బ్రేస్‌వెల్‌పై ఒక నెల నిషేధం పడింది. అతను మాదకద్రవ్యాలు తీసుకోవడంతో న్యూజిలాండ్ స్పోర్ట్ ఇంటిగ్రిటీ కమిషన్ (ఎన్ఎస్ఐసీ) వేటు వేసింది. ఈ ఏడాది అతను కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. 2011లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన బ్రేస్‌వెల్ జింబాబ్వేతో తన తొలి మ్యాచ్‌లో 6/40 బౌలింగ్ గణాంకాలతో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది జనవరి 13న కివీస్ దేశవాళీ టి20 టోర్నీలో భాగంగా వెల్లింగ్టన్ జట్టుతో జరిగిన పోరులో సెంట్రల్ డిస్ట్రిక్స్ జట్టుకు ఆడిన బ్రేస్‌వెల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు.మ్యాచ్ అనంతరం అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా పాజిటివ్ అని తేలడంతో ఎన్ఎస్ఐసీ అతన్ని ముందుగా మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. తర్వాత ఒక నెలకు పరిమితం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి నెలరోజులపాటు అతనిపై నిషేధం విధించారు.34 ఏళ్ల బ్రేస్‌వెల్ న్యూజిలాండ్ తరఫున 28 టెస్టులు ఆడి 74 వికెట్లు, 21 వన్డేలు ఆడి 26 వికెట్లు, 20 టి20 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. ‘తర్వాతి తరం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాల్సిన క్రికెటర్లు ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్‌లో బాధ్యతతో ప్రవర్తించాలి. ఇలాంటి నిషేధిత ఉ్రత్పేరకాలతో న్యూజిలాండ్ బోర్డు (ఎన్‌జడ్‌సీ) ప్రతిష్టను మసకబార్చవద్దు’ అని ఎన్‌జడ్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వీనింక్ తెలిపారు.చదవండి: కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ -
కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్
దేశవాలీ క్రికెట్ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం ఉత్తర్‌ప్రదేశ్ జట్టును ఇవాళ (నవంబర్ 18) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ జట్టులో టీమిండియా ఆటగాళ్లు రింకూ సింగ్, నితీశ్ రాణా, పియూశ్ చావ్లా, శివమ్ మావికి చోటు దక్కింది. ఈ జట్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సోదరుడు కార్తికేయ జైస్వాల్ కూడా ఉన్నాడు. ఈ టోర్నీలో భువీకి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) మాధవ్ కౌశిక్ వ్యవహరిస్తాడు.టోర్నీ విషయానికొస్తే.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024-25 నవంబర్ 23 నుంచి మొదలవుతుంది. 38 జట్లు పాల్గొనే ఈ టోర్నీ దేశంలోని 12 వేర్వేరు వేదికలపై జరుగనుంది. డిసెంబర్ 15న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీలో ఉత్తర్‌ప్రదేశ్ గ్రూప్-సిలో ఉంది. ఈ గ్రూప్‌లో యూపీతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, మణిపూర్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, జార్ఖండ్ జట్లు ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ తమ తొలి మ్యాచ్‌ను నవంబర్ 23న ఆడనుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో యూపీ ఢిల్లీని ఢీకొట్టనుంది.కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ విషయానికొస్తే.. భువీకి ఐపీఎల్లో కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. భువీ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సారధిగా వ్యవహరించాడు. భువీ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరెంజ్ ఆర్మీని నాయకత్వం వహించాడు. ఇందులో ఆరెంజ్ ఆర్మీ రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, ఆరింట ఓడింది.సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ కోసం ఉత్తర్‌ప్రదేశ్ జట్టు..భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), మాధవ్ కౌశిక్ (వైస్ కెప్టెన్), కరణ్ శర్మ, రింకూ సింగ్, నితీశ్ రాణా, సమీర్ రిజ్వి, స్వస్తిక్ చికార, ప్రియమ్ గార్గ్, ఆర్యన్ జుయల్, పియూశ్ చావ్లా, విప్రాజ్ నిగమ్, కార్తికేయ జైస్వాల్, శివమ్ శఱ్మ, యవ్ దయాల్, మొహిసిన్ ఖాన్, ఆకిబ్ ఖాన్, శివమ్ మావి, వినీత్ పన్వర్