Cricket
-
'వేలంలో అతడికి రూ. 25 కోట్లు పైనే.. స్టార్క్ రికార్డు బద్దలవ్వాల్సిందే'
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌథీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది. ఇందుకు అన్నిరకాల ఏర్పాట్లు బీసీసీఐ చేస్తోంది. ఈ మెగా వేలంలో మొత్తం 574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్ నుంచి రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి స్టార్ క్రికెటర్లు సైతం ఉన్నారు.దీంతో ఫ్యాన్స్ కూడా ఈ వేలం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ క్యాష్ రిచ్ మెగా వేలానికి ముందు రిషబ్ పంత్‌పై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని పఠాన్ జోస్యం చెప్పాడు. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్-2024 మినీ వేలంలో స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక అమ్ముడుపోయిన ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. కానీ ఇప్పుడు అతడి రికార్డు డేంజర్లో ఉందని, పంత్ కచ్చితంగా బ్రేక్ చేస్తాడని పఠాన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.విడిచిపెట్టిన ఢిల్లీ..ఇక ఈ మెగా వేలానికి ముందు పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. దీంతో పంత్ వేలంలో తన పేరును రూ.2 కోట్ల కనీస ధరగా నమోదు చేసుకున్నాడు. పంత్ తన రీ ఎంట్రీలో అదరగొడుతుండడంతో వేలంలో అతడిపై కాసుల వర్షం కురిసే అవకాశముంది.అతడి కోసం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ పోటీ పడే ఛాన్స్ ఉన్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. 2016లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రిషబ్.. ఎనిమిది సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు తొలిసారి అతడిని వేలంలోకి ఢిల్లీ ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. దీంతో అందరి కళ్లు పంత్‌పైనే ఉన్నాయి.చదవండి: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్‌పై నిషేధం.. -
ఐపీఎల్ వేలం కోసం వెటోరి
పెర్త్: ఆ్రస్టేలియా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ డానియెల్ వెటోరి పెర్త్‌లో భారత్‌తో జరిగే తొలి టెస్టు మధ్యలోనే జట్టును వీడి ఐపీఎల్ మెగా వేలానికి బయలుదేరుతాడు. ఈ న్యూజిలాండ్ బౌలింగ్ దిగ్గజం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో 45 ఏళ్ల వెటోరి సౌదీ అరేబియాలోని రెండో పెద్ద నగరం జిద్దాలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే వేలంలో పాల్గొంటాడు. ఐదు టెస్టుల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో తొలి టెస్టు 22 నుంచి పెర్త్‌లో జరుగుతుంది. ‘ఐపీఎల్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్ అయిన వెటోరికి మద్దతిస్తాం. అతను మొదటి టెస్టు సన్నాహానికి చేయాల్సిందంతా (ట్రెయినింగ్) చేసే వేలానికి హాజరవుతాడు. ఇందులో మాకు ఏ ఇబ్బంది లేదు. మెగా వేలం ముగిసిన వెంటనే మళ్లీ మా జట్టుతో కలుస్తాడు’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సీఏ నేషనల్ డెవలప్మెంట్ కోచ్ లాచ్లన్ స్టీవెన్స్... తొలి టెస్టు కోసం వెటోరి పాత్రను భర్తీ చేస్తారని సీఏ తెలిపింది. కివీస్‌కు చెందిన వెటోరి మాత్రమే కాదు... ఆ్రస్టేలియన్ దిగ్గజాలు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్లు సైతం జిద్దాకు పయనమవుతారు. పాంటింగ్ పంజాబ్ కింగ్స్‌కు, లాంగర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు హెడ్ కోచ్‌లుగా ఉన్నారు. దీంతో ‘చానెల్ సెవెన్’లో వ్యాఖ్యాతలు వ్యవహరించనున్న వీళ్లిద్దరు కూడా పెర్త్ టెస్టు మధ్యలోనే మెగా వేలంలో పాల్గొననున్నారు. -
ఇంగ్లండ్, విండీస్‌ల ఆఖరి టి20 రద్దు
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): కరీబియన్ పర్యటనలో ఆఖరిదైన ఐదో టి20 రద్దవడంతో ఇంగ్లండ్ 3–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరగాల్సిన మ్యాచ్ సరిగ్గా ఐదు ఓవర్లు ముగిశాక వర్షంతో ఆగిపోయింది. అప్పటికే మ్యాచ్ నిలిచే సమయానికి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు లూయిస్ (20 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (10 బంతుల్లో 14 నాటౌట్, 3 ఫోర్లు) అజేయంగా ఉన్నారు. అయితే భారీ వర్షంతో అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారింది. తిరిగి ఆట నిర్వహించలేని పరిస్థితి తలెత్తడంతో ఫీల్డు అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో మొదటి మూడు టి20ల్లో వరుసగా ఇంగ్లండే గెలిచి మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను నెగ్గింది. ఈ సిరీస్‌లో 9 వికెట్లు తీసిన ఇంగ్లండ్ సీమర్ సాకిబ్ మహ్మూద్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఈ పర్యటనలో ముందు మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య వెస్టిండీస్ 2–1తో కైవసం చేసుకుంది. అయితే ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో ఫలితాలు వచ్చిన ఈ ఏడు మ్యాచ్‌ల్లోనూ టాస్ నెగ్గి... ఫీల్డింగ్ ఎంచుకొని, లక్ష్యాన్ని -
రోహిత్ నిర్ణయం సరైనదే.. నేనైనా అలానే చేసేవాడని: హెడ్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ (Border-Gavaskar Trophy) ప్రారంభానికి సమయం అసన్నమైంది. మరో రెండు రోజుల్లో భారత్-ఆసీస్ మధ్య ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీకి తెరలేవనుంది. ఈ బీజీటీ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆరంభం కానుంది.అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు.రోహిత్ భార్య రితికా సజ్దే కొన్నిరోజుల కిందటే పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రోహిత్ జట్టుతో పాటు ఆస్టేలియాకు వెళ్లకుండా భారత్‌లోనే ఉండిపోయాడు. అయితే మరి కొన్ని రోజుల పాటు భార్యతో పాటే ఉండాలని హిట్‌మ్యాన్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పెర్త్ టెస్టుకు రోహిత్ దూరమయ్యాడు.అయితే రోహిత్ నిర్ణయాన్ని కొంతమంది అభిమానులు సోషల్ మీడియా తప్పుబట్టారు. ముందుగానే తన భార్య బిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ తొలి టెస్టులో ఆడింటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మాత్రం రోహిత్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. టీమిండియా కెప్టెన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని హెడ్ తెలిపాడు."రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం వంద శాతం సరైనదే. అతడికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను. అదే పరిస్థితిలో నేను ఉన్నా రోహిత్‌లానే ఆలోచిస్తాను. క్రికెటర్లగా మేము ఎన్నో త్యాగాలు చేస్తున్నాము. వృత్తిని, ఫ్యామిలీని రెండూ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ముఖ్యమైన మ్యాచ్‌లు కూడా కోల్పోవాల్సి వస్తుంది.ఇక ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు మంచి రికార్డు ఉంది. గత రెండు పర్యటనలలో కీలక ఆటగాళ్లు గాయాలతో దూరంగా ఉన్నప్పటికి భారత్ అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. మా దృష్టిలో భారత్ ఎప్పుడూ బలమైన జట్టే" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెడ్ పేర్కొన్నాడు.చదవండి: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్‌పై నిషేధం.. -
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్‌పై నిషేధం..
న్యూజిలాండ్ పేస్ బౌలర్ డగ్లస్ బ్రేస్‌వెల్‌పై ఒక నెల నిషేధం పడింది. అతను మాదకద్రవ్యాలు తీసుకోవడంతో న్యూజిలాండ్ స్పోర్ట్ ఇంటిగ్రిటీ కమిషన్ (ఎన్ఎస్ఐసీ) వేటు వేసింది. ఈ ఏడాది అతను కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. 2011లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన బ్రేస్‌వెల్ జింబాబ్వేతో తన తొలి మ్యాచ్‌లో 6/40 బౌలింగ్ గణాంకాలతో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది జనవరి 13న కివీస్ దేశవాళీ టి20 టోర్నీలో భాగంగా వెల్లింగ్టన్ జట్టుతో జరిగిన పోరులో సెంట్రల్ డిస్ట్రిక్స్ జట్టుకు ఆడిన బ్రేస్‌వెల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు.మ్యాచ్ అనంతరం అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా పాజిటివ్ అని తేలడంతో ఎన్ఎస్ఐసీ అతన్ని ముందుగా మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. తర్వాత ఒక నెలకు పరిమితం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి నెలరోజులపాటు అతనిపై నిషేధం విధించారు.34 ఏళ్ల బ్రేస్‌వెల్ న్యూజిలాండ్ తరఫున 28 టెస్టులు ఆడి 74 వికెట్లు, 21 వన్డేలు ఆడి 26 వికెట్లు, 20 టి20 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. ‘తర్వాతి తరం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాల్సిన క్రికెటర్లు ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్‌లో బాధ్యతతో ప్రవర్తించాలి. ఇలాంటి నిషేధిత ఉ్రత్పేరకాలతో న్యూజిలాండ్ బోర్డు (ఎన్‌జడ్‌సీ) ప్రతిష్టను మసకబార్చవద్దు’ అని ఎన్‌జడ్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వీనింక్ తెలిపారు.చదవండి: కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ -
కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్
దేశవాలీ క్రికెట్ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం ఉత్తర్‌ప్రదేశ్ జట్టును ఇవాళ (నవంబర్ 18) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ జట్టులో టీమిండియా ఆటగాళ్లు రింకూ సింగ్, నితీశ్ రాణా, పియూశ్ చావ్లా, శివమ్ మావికి చోటు దక్కింది. ఈ జట్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సోదరుడు కార్తికేయ జైస్వాల్ కూడా ఉన్నాడు. ఈ టోర్నీలో భువీకి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) మాధవ్ కౌశిక్ వ్యవహరిస్తాడు.టోర్నీ విషయానికొస్తే.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024-25 నవంబర్ 23 నుంచి మొదలవుతుంది. 38 జట్లు పాల్గొనే ఈ టోర్నీ దేశంలోని 12 వేర్వేరు వేదికలపై జరుగనుంది. డిసెంబర్ 15న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీలో ఉత్తర్‌ప్రదేశ్ గ్రూప్-సిలో ఉంది. ఈ గ్రూప్‌లో యూపీతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, మణిపూర్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, జార్ఖండ్ జట్లు ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ తమ తొలి మ్యాచ్‌ను నవంబర్ 23న ఆడనుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో యూపీ ఢిల్లీని ఢీకొట్టనుంది.కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ విషయానికొస్తే.. భువీకి ఐపీఎల్లో కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. భువీ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సారధిగా వ్యవహరించాడు. భువీ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరెంజ్ ఆర్మీని నాయకత్వం వహించాడు. ఇందులో ఆరెంజ్ ఆర్మీ రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, ఆరింట ఓడింది.సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ కోసం ఉత్తర్‌ప్రదేశ్ జట్టు..భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), మాధవ్ కౌశిక్ (వైస్ కెప్టెన్), కరణ్ శర్మ, రింకూ సింగ్, నితీశ్ రాణా, సమీర్ రిజ్వి, స్వస్తిక్ చికార, ప్రియమ్ గార్గ్, ఆర్యన్ జుయల్, పియూశ్ చావ్లా, విప్రాజ్ నిగమ్, కార్తికేయ జైస్వాల్, శివమ్ శఱ్మ, యవ్ దయాల్, మొహిసిన్ ఖాన్, ఆకిబ్ ఖాన్, శివమ్ మావి, వినీత్ పన్వర్ -
పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం జింబాబ్వే జట్ల ప్రకటన
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం రెండు వేర్వేరు జింబాబ్వే జట్లను ఇవాళ (నవంబర్ 18) ప్రకటించారు. వన్డే జట్టుకు కెప్టెన్‌గా క్రెయిస్ ఎర్విన్.. టీ20 జట్టు సారధిగా సికందర్ రజా ఎంపికయ్యారు. వన్డే జట్టులో కొత్తగా ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు (ట్రెవర్ గ్వాండు, తషింగ ముసెకివా, టినొటెండా మపోసా) చోటు దక్కింది. వన్డే జట్టులో సికందర్ రజా, సీన్ విలియమ్స్, బ్లెస్సింగ్ ముజరబాని, రిచర్డ్ నగరవ లాంటి సీనియర్ ప్లేయర్లు.. క్లైవ్ మదండే, బ్రియాన్ బెన్నెట్, డియాన్ మైర్స్ లాంటి యువ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. టీ20 జట్టులో వన్డే జట్టు కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్, జాయ్‌లార్డ్ గుంబీకు చోటు దక్కలేదు. పాకిస్తాన్ జట్టు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో పాక్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం పాక్ జట్లను ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్‌ల కోసం పాక్ మేనేజ్మెంట్ బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది లాంటి సీనియర్లకు రెస్ట్ ఇచ్చింది.జింబాబ్వే పర్యటనలో పాక్ షెడ్యూల్..నవంబర్ 24- తొలి వన్డే నవంబర్ 26- రెండో వన్డేనవంబర్ 28- మూడో వన్డేడిసెంబర్ 1- తొలి టీ20డిసెంబర్ 3- రెండో టీ20డిసెంబర్ 5- మూడో టీ20మ్యాచ్‌లన్నీ బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగనున్నాయి.జింబాబ్వే వన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జాయ్‌లార్డ్ గుంబీ, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, బ్రాండన్ మవుటా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరాబనీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, సికందర్ రజా, సీన్ విలియమ్స్.జింబాబ్వే టీ20 జట్టు: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్రాండన్ మవుటా, తషింగ ముసెకివా, బ్లెస్సింగ్ ముజరాబనీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ -
పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా చీఫ్ సెలెక్టర్
పాకిస్తాన్ మెన్స్ క్రికెట్ టీమ్ వైట్‌బాల్ హెడ్ కోచ్‌గా మాజీ పేసర్ ఆకిబ్ జావిద్ ఎంపికయ్యాడు. జావిద్ ఎంపిక టెంపరరీ బేసిస్ (తాత్కాలికం) మీద జరిగింది. జావిద్ వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పదవిలో కొనసాగుతాడు. జావిద్ ప్రస్తుతం పాకిస్తాన్ జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు.కాగా, కొద్ది రోజుల కిందట గ్యారీ కిర్‌స్టన్ పాకిస్తాన్ వైట్ బాల్ కోచ్ పదవికి అర్దంతరంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి రెడ్‌బాల్ కోచ్ జేసన్ గిల్లెస్పీ పాక్ వైట్‌బాల్ కోచ్‌గానూ వ్యవహరిస్తున్నాడు. గిల్లెస్పీ ఆథ్వర్యంలో పాక్ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో (2-1) ఓడించింది. అయితే పాక్ టీ20 సిరీస్‌ను మాత్రం 0-3 తేడాతో కోల్పోయింది.గిల్లెస్పీకి ముందు పెర్మనెంట్ వైట్‌బాల్ కోచ్‌గా ఎంపికైన గ్యారీ కిర్‌స్టన్ బోర్డుతో విభేదాల కారణంగా ఒక్క వన్డేలో కూడా కోచ్‌గా పని చేయకుండా వైదొలిగాడు. పాక్ గత ఏడాది కాలంలో ఐదుగురు వైట్‌బాల్ కోచ్‌లను మార్చింది. పాక్ పెర్మనెంట్ వైట్‌బాల్ హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియ ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయ్యేలోగా ముగుస్తుందని పాక్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ బిజీ షెడ్యూల్ కలిగి ఉంది. జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అలాగే మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. అనంతరం పాక్ స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో కలిసి ట్రయాంగులర్ సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ సిరీస్లన్నిటికీ పాక్ హెడ్‌కోచ్‌గా ఆకిబ్ జావిద్ వ్యవహరించనున్నాడు.కాగా, పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్యలో జరుగనుంది. ఈ టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. భద్రతా కారణాల రిత్యా భారత్ ఈ టోర్నీలో పాల్గొనదని తేల్చిచెప్పింది. దీంతో టోర్నీ ఆతిథ్య హక్కులను పాక్ నుంచి ఇతర దేశానికి మార్చాలని ఐసీసీ చూస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీని తటస్ఠ వేదికపై నిర్వహించాలన్న భారత ప్రతిపాదనకు పాక్ నో చెప్పడంతో ఐసీసీ పునరాలోచనలో పడింది. -
విరాట్ కోహ్లిని అధిగమించిన బాబర్ ఆజమ్
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (నవంబర్ 18) జరిగిన మూడో టీ20లో బాబర్ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 41 పరుగులు చేసిన బాబర్.. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లిని అధిగమించాడు. ప్రస్తుతం బాబర్ కంటే ముందు రోహిత్ శర్మ మాత్రమే ఉన్నాడు.టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-4 ఆటగాళ్లు..1. రోహిత్ శర్మ- 4231 పరుగులు2. బాబర్ ఆజమ్- 41923. విరాట్ కోహ్లి- 41884. పాల్ స్టిర్లింగ్- 3655మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో పాక్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 18.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లు ఆరోన్ హార్డీ మూడు.. ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ తలో రెండు.. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. మార్కస్ స్టోయినిస్ (27 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో కేవలం 11.2 ఓవర్లలోనే (3 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో జోస్ ఇంగ్లిస్ 27, జేక్ ఫ్రేజర్ 18, టిమ్ డేవిడ్ 7 (నాటౌట్), మాథ్యూ షార్ట్ 2 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, జహన్దాద్ ఖాన్, అబ్బాస్ అఫ్రిదిలకు తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా ఆస్ట్రేలియానే గెలుపొందింది. టీ20 సిరీస్‌కు ముందు జరిగిన వన్డే సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో పర్యటించింది. -
స్టోయినిస్ ఊచకోత.. పాక్‌ను ఊడ్చేసిన ఆస్ట్రేలియా
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. సిరీస్‌లో భాగంగా ఇవాళ (నవంబర్ 18) జరిగిన మూడో టీ20లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 18.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (41) టాప్ స్కోరర్‌గా నిలువగా.. హసీబుల్లా ఖాన్ (24), షాహీన్ అఫ్రిది (16), ఇర్ఫాన్ ఖాన్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆరోన్ హార్డీ మూడు వికెట్లతో పాక్ నడ్డి విరచగా.. ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ తలో రెండు వికెట్లు.. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ కేవలం 11.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది (3 వికెట్లు కోల్పోయి). మార్కస్ స్టోయినిస్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి పాక్ బౌలర్లను చీల్చిచెండాడు. జోష్ ఇంగ్లిస్ 24 బంతుల్లో 27 పరుగులు.. జేక్ ఫ్రేజర్ 11 బంతుల్లో 18 పరుగులు.. టిమ్ డేవిడ్ 3 బంతుల్లో 7 పరుగులు.. మాథ్యూ షార్ట్ 4 బంతుల్లో 2 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, జహన్దాద్ ఖాన్, అబ్బాస్ అఫ్రిదిలకు తలో వికెట్ దక్కింది. కాగా, ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా గెలుపొందిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌కు ముందు జరిగిన వన్డే సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
IPL 2025: ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా..!
ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఓంకార్ సాల్వి నియమితుడయ్యాడని తెలుస్తుంది. సాల్వి ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత (2024-25) రంజీ సీజన్ ముగిసిన అనంతరం సాల్వి ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడని సమాచారం.దేశవాలీ క్రికెట్లో సాల్వికి లో ప్రొఫైల్ మరియు ప్లేయర్ ఫేవరెట్ కోచ్‌గా పేరుంది. సాల్వికి ఐపీఎల్లో ఇది రెండో కమిట్మెంట్. గతంలో సాల్వి కోల్‌కతా నైట్‌రైడర్స్ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు.కాగా, సాల్వి ఆథ్వర్యంలో ముంబై జట్టు 2023-24 రంజీ సీజన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇది రంజీల్లో ముంబైకు 42వ టైటిల్. ఈ సీజన్ ఫైనల్లో ముంబై విదర్భపై 102 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబైకు ఎనిమిదేళ్ల తర్వాత లభించిన తొలి రంజీ టైటిల్ ఇది.సాల్వి హెడ్ కోచ్‌గా ఉండగా ముంబై ఈ ఏడాది ఇరానీ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది. ముంబై ఇరానీ కప్ గెలవడం 27 తర్వాత ఇది తొలిసారి. ఇరానీ కప్ ఫైనల్లో ముంబై రెస్ట్ ఆఫ్ ఇండియాపై గెలిచింది. ముంబై ఒకే సీజన్లో రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ గెలవడం చాలాకాలం తర్వాత ఇదే మొదలు.ఓంకార్ సాల్వి సోదరుడు ఆవిష్కార్ సాల్వి భారత్ మహిళల క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆవిష్కార్ సాల్వి హెడ్ కోచ్‌గా ఉండగా పంజాబ్ క్రికెట్ జట్టు గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది.ప్రస్తుతం 40ల్లో ఉన్న ఓంకార్ సాల్వి టీమిండియా తరఫున ఎప్పుడూ ఆడలేదు. సాల్వికి దేశవాలీ క్రికెట్లో కూడా అనుభవం తక్కువే. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సాల్వి కేవలం ఒకే ఒక మ్యాచ్ (2005లో రైల్వేస్ తరఫున) ఆడాడు. సాల్వి ఆథ్వర్యంలో ముంబై జట్టు ప్రస్తుత రంజీ సీజన్లో అద్బుత ప్రదర్శన చేస్తుంది. ఈ సీజన్లో ముంబై ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి ఎలైట్ గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. -
ఆసీస్ బౌలర్ల విజృంభణ.. 117 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
హోబర్ట్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. ఆసీస్ బౌలర్లు ఆరోన్ హార్డీ (4-1-21-3), ఆడమ్ జంపా (4-0-11-2), స్పెన్సర్ జాన్సన్ (3.1-0-24-2), జేవియర్ బార్ట్లెట్ (3-0-25-1), నాథన్ ఇల్లిస్ (3-0-20-1) ధాటికి 18.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (41) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్‌తో రాణించాడు. హసీబుల్లా ఖాన్ (24), షాహీన్ అఫ్రిది (16), ఇర్ఫాన్ ఖాన్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. సాహిబా్జాదా ఫర్హాన్ 9, ఉస్మాన్ ఖాన్ 3, అఘా సల్మాన్ 1, అబ్బాస్ అఫ్రిది 1, జహందాద్ ఖాన్ 5, సూఫియాన్ ముఖీమ్ 1 పరుగు చేశారు.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టీ20 నామమాత్రంగా సాగుతుంది. వర్షం కారణంగా 7 ఓవర్లకు కుదించిన తొలి గేమ్‌లో 29 పరుగుల తేడాతో గెలుపొందిన ఆసీస్.. రెండో టీ20లో 13 పరుగుల తేడాతో నెగ్గింది. టీ20 సిరీస్‌కు ముందు పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. -
పాకిస్తాన్ రికార్డు బద్దలు.. భారీ మైలురాయిని అధిగమించిన టీమిండియా
నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాపై గ్రాండ్ విక్టరీ (3-1) అనంతరం టీమిండియా ఓ భారీ మైలురాయిని అధిగమించింది. పొట్టి ఫార్మాట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 90కు పైగా విజయాల శాతం నమోదు చేసిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు ఓ క్యాలెండర్ ఇయర్లో 90కు పైగా విజయాల శాతాన్ని నమోదు చేయలేదు.భారత్.. పాకిస్తాన్ పేరిట ఉన్న లాంగ్ స్టాండింగ్ రికార్డును బద్దలు కొట్టింది. షార్ట్ ఫార్మాట్లో ఈ ఏడాది భారత్ 92.31 విజయాల శాతం కలిగి ఉంది. 2018లో పాక్ 89.43 విజయాల శాతాన్ని నమోదు చేసింది. సౌతాఫ్రికా సిరీస్‌తో కలుపుకుని ఈ ఏడాది భారత్ మొత్తం 26 టీ20లు ఆడింది. ఇందులో 24 విజయాలు నమోదు చేసింది. భారత్ ఈ ఏడాది కేవలం రెండు టీ20ల్లో మాత్రమే ఓడింది.టీమిండియా ఈ ఏడాది టీ20 వరల్డ్ ఛాంపియన్‌గానూ అవతరించింది. యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ 2024లో భారత్ జగజ్జేతగా నిలిచింది. టీ20 వరల్డ్‌కప్ అనంతరం భారత్.. జింబాబ్వే, బంగ్లాదేశ్, శ్రీలంక, సౌతాఫ్రికాపై వరుస సిరీస్‌ల్లో విజేతగా నిలిచింది. సౌతాఫ్రికా సిరీస్‌లో కేవలం మూడో టీ20లో మాత్రమే ఓడిన భారత్.. 1, 2, 4 టీ20ల్లో విజేతగా నిలిచింది.పొట్టి ఫార్మాట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాల శాతం నమోదు చేసిన జట్లు..భారత్- 92.31 (2024)పాకిస్తాన్- 89.43 (2018)ఉగాండ- 87.88 (2023)పపువా న్యూ గినియా- 87.5 (2019)టాంజానియా- 80.77 (2022)ఇదిలా ఉంటే, భారత టెస్ట్ జట్టు ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సన్నాహకాల్లో బిజీగా ఉంది. ఈ సిరీస్ కోసం భారత్ ఇదివరకే ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ కోసం టీమిండియా కఠోర సాధన చేస్తుంది. ఈ మ్యాచ్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చు. హిట్‌మ్యాన్ రెండోసారి తండ్రైనందున కుటుంబంతో గడిపేందుకు భారత్‌లోనే ఉన్నాడు. -
ఆసీస్‌తో టెస్టు సిరీస్.. టీమిండియా భయపడుతోంది: పాక్ మాజీ క్రికెటర్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం టీమిండియా తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఇప్పటికే 12 రోజుల ముందే ఆసీస్ గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే నెట్స్‌లో ఎక్కువ సమయం గడిపేందుకు ఇండియా 'ఎ'తో తమ సన్నాహక మ్యాచ్‌ను టీమిండియా రద్దు చేసుకుంది.అందుకు బదులుగా ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ గేమ్‌లో భారత ప్లేయర్లు పాల్గోన్నారు. ఈ ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ గేమ్ మూడు రోజుల పాటు వెస్ట్రన్ ఆస్ట్రేలియా గ్రౌండ్లో జరిగింది. అయితే ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్, ప్రాక్టీస్ సెషన్లను ప్రజలు వీక్షించేందుకు భారత్ అనుమతించలేదు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్లేయర్ బసిత్ అలీ టీమిండియాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు భయపడుతుందని,బోర్డర్-గవాస్కర్ సిరీస్ టైటిల్‌ను డిఫెండ్ చేసుకుంటుందన్న నమ్మకం లేదని అలీ అన్నాడు."భారత జట్టు ఓటమి భయంతోనే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది. వారికి గెలుస్తామన్న నమ్మకం లేదు. ప్రాక్టీస్‌ను కూడా సీక్రెట్ క్యాంప్‌లో చేస్తున్నారు. సిరీస్‌కు ముందు తగినంత ప్రిపరేషన్ భారత జట్టుకు లేదు. 12 రోజులు లేదా 12 నెలల ముందు ఆస్ట్రేలియాకు వచ్చామాన్నది ముఖ్యం కాదు. ప్రత్యర్ధి బౌలర్లను ఎదుర్కోవాలంటే కచ్చితంగా ఆస్ట్రేలియాలో కనీసం ఓ ప్రాక్టీస్ మ్యాచ్ అయినా ఆడాలి. ఇక సూపర్ ఫామ్‌లో ఉన్న ధృవ్ జురెల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటువ్వాలి. అతడికి అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. పుల్ షాట్, కట్ షాట్ చక్కగా ఆడగలడు. ధృవ్‌ను మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపించిండి. టాపర్డర్‌లో ఆడే సత్తా అతడికి ఉందని" బసిత్ అలీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: అతడొక అద్బుతం.. తొలి టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించండి: రవిశాస్త్రి -
ఆసీస్‌తో మూడో టీ20.. పాకిస్తాన్‌కు కొత్త కెప్టెన్! ఎవరంటే?
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టీ20లో తలపడేందుకు పాకిస్తాన్ సిద్దమైంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్.. కనీసం ఆఖరి టీ20లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.అయితే ఈ చివరి మ్యాచ్‌లో పాక్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో పాక్ జట్టుకు సల్మాన్ అలీ అఘా సారథ్యం వహించనున్నాడు. రిజ్వాన్‌తో పాటు స్టార్ పేసర్ నషీం షాకు కూడా జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. వీరిద్దరి స్థానాల్లో హసీబుల్లా ఖాన్, పేసర్ జహందాద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చారు. అయితే 21 ఏళ్ల జహందాద్ ఖాన్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 కావడం గమనార్హం. దేశవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండండంతో జహందాద్కు సెలక్టర్లు చోటు ఇచ్చారు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లుఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, జోష్ ఇంగ్లిస్(కెప్టెన్/ వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జాంపాపాకిస్తాన్: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), సాహిబ్జాదా ఫర్హాన్, బాబర్ ఆజం, హసీబుల్లా ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మహ్మద్ అబ్బాస్, షాహీన్ అఫ్రిది, జహందాద్ ఖాన్, హరీస్ రవూఫ్, సోఫియన్ ముఖీమ్చదవండి: అతడొక అద్బుతం.. తొలి టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించండి: రవిశాస్త్రి -
అతడొక అద్బుతం.. తొలి టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించండి: రవిశాస్త్రి
పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న మొదటి టెస్టుకు టీమిండియా అన్ని విధాల సన్నదమవుతోంది. ఈ మ్యాచ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో బుమ్రా సారథ్యంలో భారత జట్టు ఆసీస్‌ను ఢీకొట్టనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి టీమ్ మేనెజ్మెంట్కు కీలక సూచనలు చేశాడు. ఆసీస్‌తో తొలి టెస్టుకు యవ ఆటగాడు ధృవ్ జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఎంపిక చేయాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.కాగా ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ధృవ్ జురెల్ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి రావడంతో జురెల్‌కు తుది జట్టులో అవకాశాలు లభించడం లేదు.స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు జురెల్ ఎంపికైనప్పటికి ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఈ సిరీస్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా-ఎతో తలపడిన మ్యాచ్‌లో భారత్ -ఎ తరఫున రెండు హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు.ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూలో శాస్త్రి మాట్లాడుతూ.."తొలి టెస్టుకు ధృవ్ జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఎంపిక చేయండి. అతడికి ఆ సత్తా ఉంది. ఒత్తిడిలో చాలా మంది ఆటగాళ్లు తీవ్ర ఇబ్బంది పడటం మనం చూసి ఉంటాం. మరి కొంతమంది వెంటనే వికెట్‌ను సమర్పించుకుని ఔటవ్వడం చూసి ఉంటాము. కానీ ధృవ్ జురెల్ కథ మాత్రం వేరు. జురెల్ ఎటువంటి పరిస్థితులోనైనా ప్రశాంతంగా బ్యాటింగ్ చేయగలడు. అతడి కూల్‌నెస్ నాకు బాగా నచ్చింది. అదే అతడి స్పెషల్ కూడా. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ సిరీస్‌లో కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతడెంతో పరిపక్వతను చూపించాడు. కాబట్టి పెర్త్ టెస్టులో అతడు ఆడితే చూడాలనుకుంటున్నాను" పేర్కొన్నాడు.చదవండి: ఆస్ట్రేలియా అంటే చాలు కోహ్లికి పూనకాలే.. జాగ్రత్తగా ఉండండి: వార్నర్ -
ఆస్ట్రేలియా అంటే చాలు కోహ్లికి పూనకాలే.. జాగ్రత్తగా ఉండండి: వార్నర్
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా మొదలు కానుంది. మొదటి టెస్టు కోసం ఇప్పటికే పెర్త్‌కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన జట్టుకు హెచ్చరిక జారీ చేశాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో జాగ్రత్తగా ఉండాలని కమ్మిన్స్ సేనకు వార్నర్ సూచించాడు. కాగా విరాట్ కోహ్లికి ఆసీస్ గడ్డపై టెస్టుల్లో అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 54.08 సగటుతో 1352 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 సెంచరీలు ఉన్నాయి."బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అంటే చాలు విరాట్ కోహ్లి చెలరేగిపోతాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అతడిని అడ్డుకోవడం అంత సులువు కాదు. అతడు ఎల్లప్పుడూ పరుగుల దాహంతో ఉంటాడు. ఆసీస్ గడ్డపై అతడిని మించిన ఆటగాడు ఇంకొకరు లేరు. విమర్శకుల నోళ్లు మూయించడానికి కోహ్లికి ఇదే సరైన సమయం.ఈ సిరీస్‌లో కోహ్లి నుంచి పెద్ద ఇన్నింగ్స్‌లు వస్తాయాని నేను ఆశిస్తున్నాను. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కచ్చితంగా విరాట్ నుంచి ముప్పు పొంచి ఉంది. కోహ్లి ఫామ్‌పై పెద్దగా ఆందోళన లేదు. ఎందుకంటే ఇటువంటి పెద్ద సిరీస్‌లలో ఎలా ఆడాలో కోహ్లికి బాగా తెలుసు" అని హెరాల్డ్ సన్ కాలమ్‌లో డేవిడ్ భాయ్ రాసుకొచ్చాడు.చదవండి: రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్ -
SL vs NZ: మెండిస్ సూపర్ ఇన్నింగ్స్.. కివీస్‌పై శ్రీలంక విజయం
పల్లెకలె వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో ఆతిథ్య శ్రీలంక సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 45.1 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది.మార్క్ చాప్మన్ (81 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిచెల్ హే (62 బంతుల్లో 49; 4 ఫోర్లు) రాణించారు. శ్రీలంక బౌలర్లలో వాండర్సే, తీక్షణ చెరో 3 వికెట్లు తీయగా, అసిత ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 210 పరుగుల సులువైన లక్ష్యాన్ని చేధించేందుకు లంకేయులు తీవ్రంగా శ్రమించారు. చివరకు 46 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి గెలిచింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుశాల్ మెండీస్ (102 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... మిగతావారిలో ఓపెనర్ నిసాంక (28; 4 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (5), కమిండు (0), కెపె్టన్ అసలంక (13), సమరవిక్రమ (8) విఫలమవడంతో లంక 163 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.83 బంతుల్లో 47 పరుగులు చేయాల్సివుండగా... కుశాల్, మహీశ్ తీక్షణ (44 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు అవసరమైన 47 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బ్రాస్‌వెల్ 4, సాంట్నర్, ఫిలిప్స్, స్మిత్ తలా ఒక వికెట్ తీశారు. మంగళవారం ఇదే వేదికపై ఆఖరి వన్డే జరుగనుంది. కాగా 2012 తర్వాత కివీస్‌పై శ్రీలంక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.చదవండి: రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్ -
అవన్నీ రూమర్సే.. మా హెడ్‌కోచ్ అతడే: పాక్ క్రికెట్ బోర్డు
పాకిస్తాన్ టెస్టు టీమ్ పదవినుంచి జాసన్ గిలెస్పీని తొలగిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్రంగా ఖండించింది. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, పూర్తిగా అర్థరహితమని స్పష్టం చేసింది. ‘గిలెస్పీని తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలు అన్నీ అబద్ధం.గతంలోనే ప్రకటించిన విధంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టు సిరీస్‌ల వరకు కూడా గిలెస్పీని కోచ్‌గా కొనసాగుతాడు’ అని పీసీబీ పేర్కొంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై వన్డే, టి20 సిరీస్‌లు ఆడిన పాక్ జట్టుకు గిలెస్పీ తాత్కాలిక కోచ్‌గా కూడా వ్యవహరించాడు. అయితే ఈ రెండు ఫార్మాట్లతో పాటు టెస్టుల్లో కూడా అతని స్థానంలో పాక్ మాజీ పేసర్, ప్రస్తుత సెలక్షన్ కమిటీ కనీ్వనర్ ఆకిబ్ జావేద్‌ను కోచ్‌గా ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గిలెస్పీ కోచ్‌గా ఉన్న సమయంలో బంగ్లాదేశ్ చేతిలో 0–2తో ఓడిన పాక్...ఆ తర్వాత ఇంగ్లండ్‌పై 2–1తో విజయం సాధించింది. ఆసీస్ సిరీస్ తర్వాత పాక్ జట్టు నేరుగా జింబాబ్వేకు వెళుతుంది.చదవండి: రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్ -
రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. దీంతో మొదటి టెస్టులో భారత జట్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించనున్నాడు. రోహిత్ శర్మ ఇటీవల రెండోసారి తండ్రి అయినందున తన కుటుంబంతో మరింత ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలోనే అతడు పెర్త్ టెస్టుకు దూరమయ్యాడు. హిట్‌మ్యాన్ తిరిగి మళ్లీ అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టుకు భారత జట్టుతో కలవనున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొత్తంలో భారత కెప్టెన్‌గా ఒకరే ఉండాలని భజ్జీ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ జట్టులోకి వచ్చినప్పటికి బుమ్రానే కెప్టెన్‌గా కొనసాగించాలని అతడు సూచించాడు."రోహిత్ రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. మొదటి రెండు టెస్టుల్లో భారత్ గెలిస్తే, బుమ్రా కెప్టెన్‌గా కొనసాగాలని భారత అభిమానులందరూ కోరుకుంటారు. ఒకవేళ రెండు గేమ్‌లలో భారత్ ఓడిపోతే రోహిత్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని అదే ఫ్యాన్స్ డిమాండ్ చేస్తారు. అభిమానుల మనసు చాలా త్వరగా మారిపోతుంది. నేను ఇప్పుడు సునీల్ గవాస్కర్ సర్ కోసం మాట్లడటం లేదు. నేను సాధారణ ప్రజల అభిప్రాయాన్ని చెబుతున్నా అంతే.నా వరకు అయితే మొత్తం సిరీస్‌కు ఒక కెప్టెన్ ఉంటే బెటర్ అన్పిస్తోంది. అదే జట్టుకు కూడా మంచిది. అప్పుడు ఒక వేళ ఓడిపోయినా ఎవరూ ప్రశ్నించరు. అదే బుమ్రా కెప్టెన్సీలో గెలిచి, తర్వాత రోహిత్ నాయకత్వంతలో ఓడిపోతే కచ్చితంగా ప్రశ్నల వర్షం కురుస్తోంది" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు. కాగా ఇంతకుముందు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా బుమ్రానే సిరీస్ మొత్తానికి కెప్టెన్‌గా ఉండాలని అభిప్రాయపడ్డాడు.చదవండి: SMT 2024: ముంబై జట్టు ప్రకటన.. పృథ్వీ షా, రహానేలకు చోటు -
SMT 2024: ముంబై జట్టు ప్రకటన.. పృథ్వీ షా, రహానేలకు చోటు
దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నాడు. ఈ నెల 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరగనున్న ఈ ట్రోఫీ కోసం ముంబై క్రికెట్ సంఘం ఆదివారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. రంజీ ట్రోపీలో ముంబై జట్టుకు సారథ్యం వహించిన అజింక్యా రహానేతో పాటు... ఫిట్నెస్ లేమితో పాటు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడి రంజీ జట్టులో చోటు కోల్పోయిన ఓపెనర్ పృథ్వీ షా కూడా ముస్తాక్ అలీ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత టెస్టు జట్టులో సుస్థిర స్థానం సాధించాలనుకుంటున్న శ్రేయస్ అయ్యర్ ప్రస్తుత రంజీ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు.తాజా సీజన్లో అయ్యర్ 90.40 సగటుతో 452 పరుగులు సాధించాడు. అందులో ఒక డబుల్ సెంచరీ, మరో సెంచరీ ఉంది. ఇక ఇటీవల ఆస్ట్రేలియా–‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తనుశ్ కోటియాన్, పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, సిద్ధేశ్ లాడ్, యువ ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ ముంబై జట్టులో చోటు దక్కించుకున్నారు. ముంబై జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, అంగ్క్రిష్ రఘువంశీ, జయ్ బిస్తా, అజింక్యా రహానే, సిద్ధేశ్ లాడ్, సూర్యాన్ష్ షెడ్గె, సాయిరాజ్ పాటిల్, హార్దిక్ తమోర్, ఆకాశ్ ఆనంద్, షమ్స్ ములానీ, హిమాన్షు సింగ్, తనుశ్ కోటియాన్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, రోస్టన్ డియాస్, జునేద్ ఖాన్.చదవండి: కోహ్లిపై ఒత్తిడి పెంచండి! -
కోహ్లిపై ఒత్తిడి పెంచండి!
మెల్బోర్న్: ఆ్రస్టేలియా గడ్డపై విరాట్ కోహ్లి ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ ఆడిన 13 టెస్టుల్లో ఏకంగా 54.08 సగటుతో 1352 పరుగులు చేసిన కోహ్లి ఖాతాలో 6 సెంచరీలు ఉన్నాయి. కెపె్టన్‌గా 2018–19లో తొలిసారి భారత జట్టుకు ఆ్రస్టేలియా గడ్డపై సిరీస్ అందించిన ఘనత అతని సొంతం. అందుకే ఇటీవల కోహ్లి గొప్ప ఫామ్‌లో లేకపోయినా...ఆసీస్ దృష్టిలో అతనే ప్రధాన బ్యాటర్. కోహ్లిని నిలువరిస్తే భారత్‌ను అడ్డుకున్నట్లే అని అక్కడి మాజీ ఆటగాళ్లకూ తెలుసు. అందుకే కోహ్లిపై ఒత్తిడి పెంచాలని, అతడి భావోద్వేగాలతో ఆడుకోవాలని దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ తమ బౌలర్లకు చెబుతున్నాడు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో చిత్తయిన విషయం వారి మనసుల్లో ఇంకా ఉంటుందని...దానిని కొనసాగించాలని అతను అన్నాడు. ‘ఒక జట్టు సొంతగడ్డపై 0–3తో ఓడి వస్తుందంటే కచ్చితంగా మనమే పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి భారత్‌పై ఒత్తిడి కొనసాగించాలి. వారు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుస్తుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లిపై కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి’ అని మెక్‌గ్రాత్ చెప్పాడు. అయితే కొన్ని సార్లు ఇలా రెచ్చగొడితే కోహ్లి మరింత దూకుడుగా చెలరేగిపోయే ప్రమాదం కూడా ఉంటుందని ఆసీస్ మాజీ పేసర్ చిన్న హెచ్చరిక కూడా జారీ చేశాడు. ‘కోహ్లిని లక్ష్యంగా చేసుకొని ఆ్రస్టేలియా బౌలర్లు పదేపదే తలపడితే అతనూ సిద్ధమైపోతాడు. అది అతడి అత్యుత్తమ ఆటను కూడా బయటకు తీయవచ్చు. సిరీస్ ఆరంభంలోనే తక్కువ స్కోర్లకు కట్టడి చేయగలిగితే కోహ్లి కూడా కోలుకోవడం కష్టమవుతుంది. నా దృష్టిలో కోహ్లితో భావోద్వేగాలపాలు ఎక్కువ. బాగా ఆడటం మొదలు పెడితే అస్సలు ఆగిపోడు. ఒక వేళ విఫలమైతే మాత్రం అదే కొనసాగుతుంది’ అని మెక్‌గ్రాత్ అభిప్రాయ పడ్డాడు. -
అశ్విన్‌తో ఢీకి రెడీ!
మెల్బోర్న్: భారత వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని, ఈసారి అతడు మ్యాచ్‌పై పట్టు బిగించకుండా చేస్తానని ఆ్రస్టేలియన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్నాడు. కంగారూ గడ్డపై అశ్విన్‌కు మంచి రికార్డు లేదు. స్వదేశంలో 21.57 సగటు నమోదు చేస్తే ఆసీస్‌లో అది 42.15 మాత్రమే. అయితే గత రెండు బోర్డర్–గావస్కర్ సిరీస్‌లలో ఫామ్‌లో ఉన్న స్మిత్‌ను అదే పనిగా అవుట్ చేసి పైచేయి సాధించాడు. ఈ రెండు సిరీస్‌లలో అశ్విన్ అతన్ని క్రీజులో పాతుకుపోనీయకుండా ఐదుసార్లు పెవిలియన్ చేర్చాడు. దీనిపై ఆసీస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ మాట్లాడుతూ ‘ఈసారి అలా జరగకుండా చూసుకోవాలి. అయితే అశ్విన్ మాత్రం ఉత్తమ స్పిన్నర్. తప్పకుండా తన ప్రణాళికలు తనకు ఉంటాయి. గతంలో అతని ఎత్తుగడలకు బలయ్యాను. నాపై అతనే ఆధిపత్యం కనబరిచాడు. ఇప్పుడలా జరగకుండా చూసుకోవాలంటే ఆరంభంలోనే అతను పట్టు బిగించకుండా దీటుగా ఎదుర్కోవాలి’ అని అన్నాడు. గత కొన్నేళ్లుగా తమ ఇద్దరి మధ్య ఆసక్తికర సమరమే జరుగుతోందన్నాడు. ఒకరు పైచేయి సాధిస్తే, మరొకరు డీలా పడటం జరుగుతుందని... ఐదు టెస్టుల్లో పది ఇన్నింగ్స్‌ల్లో ఇప్పుడు ఎవరూ ఆధిపత్యం కనబరుస్తారో చూడాలని స్మిత్ తెలిపాడు. అతన్ని బ్యాట్‌తో పాటు మానసికంగానూ దెబ్బకొట్టాలంటే ఆరంభంలోనే మంచి షాట్లతో ఎదురుదాడికి దిగాలని చెప్పాడు. 35 ఏళ్ల స్మిత్ టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయికి 315 పరుగుల దూరంలో ఉన్నాడు. త్వరలో జరిగే ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో అతను తనకెంతో ఇష్టమైన, అచ్చొచి్చన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇటీవలి కాలంలో స్మిత్ తరచూ ఓపెనర్‌గా బరిలోకి దిగి పూర్తిగా విఫలమయ్యాడు. -
బుమ్రా సారథ్యంలో...
పెర్త్: ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు రెగ్యులర్ టాప్–3 బ్యాటర్లలో ఇద్దరు లేకుండానే బరిలోకి దిగడం ఖాయమైంది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ, గాయంతో శుబ్‌మన్ గిల్ తొలి టెస్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ టాపార్డర్‌లో ఆడటం ఖాయమైంది. రెండో ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్‌కు అవకాశం దక్కవచ్చు. మరో వైపు పేస్ బౌలర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో టీమిండియా తొలి టెస్టు ఆడనుంది. కెరీర్లో 40 టెస్టులు ఆడిన బుమ్రా ఒకే ఒక్క మ్యాచ్‌లో భారత జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడటంతో అతను ఈ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. 2022లో ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడింది. భారత్, ఆ్రస్టేలియా మధ్య ఈ నెల 22 నుంచి తొలి టెస్టు జరుగుతుంది. సోమవారం భారత్ తమ ప్రాక్టీస్‌కు విరామం ఇచ్చి మంగళవారం నుంచి మ్యాచ్ వేదిక అయిన ఆప్టస్ స్టేడియంలో సాధన చేస్తుంది. రెండో టెస్టునుంచి అందుబాటులోకి... సహచరులతో పాటు ఆ్రస్టేలియాకు వెళ్లకపోవడంతో రోహిత్ తొలి టెస్టు ఆడటంపై సందేహాలు ఉన్నాయి. అతను కూడా బీసీసీఐకి ముందే సమాచారం అందించాడు. అయితే శుక్రవారమే అతనికి కొడుకు పుట్టగా...మ్యాచ్‌కు మరో వారం రోజుల సమయం ఉండటంతో మళ్లీ రోహిత్ ఆడటంపై చర్చ జరిగింది. దీనికి ఫుల్స్టాప్ పెడుతూ కెప్టెన్ తుది నిర్ణయం తీసుకున్నాడు. మరికొంత సమయం కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపించిన అతను తొలి మ్యాచ్‌నుంచి తప్పుకున్నాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరిగే రెండో (డే అండ్ నైట్) టెస్టుకు తాను అందుబాటులో ఉంటానని...నవంబర్ 30నుంచి ఆ్రస్టేలియన్ పీఎం ఎలెవన్‌తో జరిగే రెండు రోజుల పింక్ బాల్ వార్మప్ మ్యాచ్ కూడా ఆడతానని బోర్డుకు చెప్పినట్లు సమాచారం. ఈశ్వరన్‌కూ అవకాశం! శనివారం ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా శుబ్‌మన్ గిల్ ఎడమ చేతి బొటన వేలు విరిగింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను కూడా పెర్త్ టెస్టునుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో వైపు కేఎల్ రాహుల్ గాయంనుంచి పూర్తిగా కోలుకోవడం భారత్‌కు సానుకూలాంశం. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూ శుక్రవారం మోచేతికి గాయం కావడంతో రాహుల్ మైదానం వీడాడు. దాంతో అతని గాయంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఎక్స్‌రే అనంతం ఎలాంటి ప్రమాదం లేదని తేలింది. ఆదివారం మళ్లీ బ్యాటింగ్ చేసిన రాహుల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ పూర్తి స్థాయిలో మూడు గంటల పాటు నెట్ సెషన్స్‌లో పాల్గొన్నాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు రాహుల్ స్వయంగా వెల్లడించాడు. రాహుల్ మూడో స్థానంలో ఆడితే యశస్వి జైస్వాల్‌తో పాటు రెండో ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్ అరంగేట్రం చేయవచ్చు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన ఈశ్వరన్ ఆస్ట్రేలియా బయల్దేరడానికి ముందు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలు చేశాడు. అయితే భారత్ ‘ఎ’ తరఫున బరిలోకి దిగి ఆ్రస్టేలియా ‘ఎ’పై నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 36 పరుగులే చేయడంతో అతని ఆటపై సందేహాలు రేగాయి. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఓపెనర్ అవకాశం దక్కవచ్చు. మరో వైపు బీసీసీఐ ముందు జాగ్రత్తగా ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఉన్న మరో టాపార్డర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను ఆస్ట్రేలియాలోనే ఆగిపొమ్మని చెప్పింది. అవసరమైతే అతనూ టెస్టు సిరీస్ కోసం సిద్ధంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది. పడిక్కల్ తన ఏకైక టెస్టును ఇంగ్లండ్‌పై ధర్మశాలలో ఆడాడు. పడిక్కల్‌తో పాటు మరో ముగ్గురు పేసర్లు నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్ కూడా ఆ్రస్టేలియాలోనే ఆగిపోయారు. నితీశ్ రెడ్డికి చాన్స్! పెర్త్ టెస్టులో భారత జట్టులో మూడో పేసర్ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. బుమ్రా, సిరాజ్‌లతో పాటు మూడో పేసర్‌గా ఇప్పటి వరకు ప్రసిధ్ కృష్ణ పేరు వినిపించిది. ప్రాక్టీస్ గేమ్‌లోనూ అతను రాణించాడు. అయితే నెట్ సెషన్స్‌లో ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా కూడా ఆకట్టుకున్నాడు. నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న హర్షిత్ ఆ్రస్టేలియాలోని బౌన్సీ పిచ్‌లపై ‘ట్రంప్ కార్డ్’ కాగలడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. దాంతో ప్రసిధ్, హర్షిత్ మధ్య పోటీ నెలకొంది. ప్రసిధ్ ఇప్పటికే భారత్ తరఫున 2 టెస్టులు ఆడగా...హర్షిత్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టలేదు. అయితే ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి అరంగేట్రంపై కూడా చర్చ జరుగుతోంది. ప్రాక్టీస్ గేమ్‌లో తన స్వింగ్ బౌలింగ్‌లో అతను సత్తా చాటాడు. అతని బ్యాటింగ్ కూడా అదనపు బలం కాగలదు. ఇద్దరు సీనియర్లు దూరం కావడంతో మన బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టపర్చేందుకు నితీశ్ లాంటి ఆల్‌రౌండర్ అవసరం ఉంది. ఆదివారం టీమ్ ప్రాక్టీస్‌లో అతని ఆటను పర్యవేక్షించిన కోచ్ గౌతమ్ గంభీర్ సుదీర్ఘ సమయం పాటు చర్చిస్తూ తగిన సూచనలివ్వడం కనిపించింది. మరో వైపు గాయంనుంచి కోలుకొని రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన మొహమ్మద్ షమీ ఇప్పటికిప్పుడు ఆ్రస్టేలియా వెళ్లే అవకాశం లేదని...సిరీస్ చివర్లో జట్టుతో చేరవచ్చని బోర్డు వర్గాలు వెల్లడించాయి. -
వాషింగ్టన్ సుందర్‌కు భారీ ధర.. ఏకంగా రూ. 15.5 కోట్లు!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సర్వం సిద్దమైంది. నవంబర్ 24-25 తేదీలలో జెడ్డా వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ మెగా వేలంలో అందరి కళ్లు టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పైనే ఉన్నాయి. అద్బుత ఫామ్‌లో ఉన్న సుందర్ ఎంత ధరకు అమ్ముడు పోతాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన మాక్ వేలంలో వాషింగ్టన్కు కళ్లు చెదిరే ధర దక్కింది. కాగా మెగా వేలంలో వాషింగ్టన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. శ్విన్ ఆన్లైన్లో కండక్ట్ చేసిన ఈ మాక్ వేలంలో సుందర్ కోసం తొలుత ఆర్సీబీ రూ. 2 కోట్లకు బిడ్ వేసింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చింది. ఎస్ఆర్హెచ్ క్రమక్రమంగా వాషింగ్టన్ ధరను రూ. 8 కోట్లకు పెంచింది. దీంతో ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకొని గుజరాత్ జెయింట్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆఖరికి గుజరాత్ జెయింట్స్ సుందర్ కోసం ఏకంగా రూ. 15.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. కాగా సుందర్ గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మెగా వేలానికి ముందు అతడిని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోలేదు.న్యూజిలాండ్‌పై అదుర్స్..కాగా ఐపీఎల్-2024లో సుందర్ నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కానీ టీఎన్‌పీఎల్‌లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సుందర్ దుమ్ములేపాడు. ఆ తర్వాత అనుహ్యంగా భారత టెస్టు జట్టులోకి వచ్చిన వాషింగ్టన్.. న్యూజిలాండ్‌పై సంచలన ప్రదర్శన కనబరిచాడు. కేవలం రెండు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టి ఓవర్‌నైట్ హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలోనే సుందర్‌కు ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర దక్కనుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తెలుగోడి అరంగేట్రం ఫిక్స్!?