Cricket
-
అశ్విన్‌తో ఢీకి రెడీ!
మెల్బోర్న్: భారత వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని, ఈసారి అతడు మ్యాచ్‌పై పట్టు బిగించకుండా చేస్తానని ఆ్రస్టేలియన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్నాడు. కంగారూ గడ్డపై అశ్విన్‌కు మంచి రికార్డు లేదు. స్వదేశంలో 21.57 సగటు నమోదు చేస్తే ఆసీస్‌లో అది 42.15 మాత్రమే. అయితే గత రెండు బోర్డర్–గావస్కర్ సిరీస్‌లలో ఫామ్‌లో ఉన్న స్మిత్‌ను అదే పనిగా అవుట్ చేసి పైచేయి సాధించాడు. ఈ రెండు సిరీస్‌లలో అశ్విన్ అతన్ని క్రీజులో పాతుకుపోనీయకుండా ఐదుసార్లు పెవిలియన్ చేర్చాడు. దీనిపై ఆసీస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ మాట్లాడుతూ ‘ఈసారి అలా జరగకుండా చూసుకోవాలి. అయితే అశ్విన్ మాత్రం ఉత్తమ స్పిన్నర్. తప్పకుండా తన ప్రణాళికలు తనకు ఉంటాయి. గతంలో అతని ఎత్తుగడలకు బలయ్యాను. నాపై అతనే ఆధిపత్యం కనబరిచాడు. ఇప్పుడలా జరగకుండా చూసుకోవాలంటే ఆరంభంలోనే అతను పట్టు బిగించకుండా దీటుగా ఎదుర్కోవాలి’ అని అన్నాడు. గత కొన్నేళ్లుగా తమ ఇద్దరి మధ్య ఆసక్తికర సమరమే జరుగుతోందన్నాడు. ఒకరు పైచేయి సాధిస్తే, మరొకరు డీలా పడటం జరుగుతుందని... ఐదు టెస్టుల్లో పది ఇన్నింగ్స్‌ల్లో ఇప్పుడు ఎవరూ ఆధిపత్యం కనబరుస్తారో చూడాలని స్మిత్ తెలిపాడు. అతన్ని బ్యాట్‌తో పాటు మానసికంగానూ దెబ్బకొట్టాలంటే ఆరంభంలోనే మంచి షాట్లతో ఎదురుదాడికి దిగాలని చెప్పాడు. 35 ఏళ్ల స్మిత్ టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయికి 315 పరుగుల దూరంలో ఉన్నాడు. త్వరలో జరిగే ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో అతను తనకెంతో ఇష్టమైన, అచ్చొచి్చన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇటీవలి కాలంలో స్మిత్ తరచూ ఓపెనర్‌గా బరిలోకి దిగి పూర్తిగా విఫలమయ్యాడు. -
బుమ్రా సారథ్యంలో...
పెర్త్: ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు రెగ్యులర్ టాప్–3 బ్యాటర్లలో ఇద్దరు లేకుండానే బరిలోకి దిగడం ఖాయమైంది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ, గాయంతో శుబ్‌మన్ గిల్ తొలి టెస్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ టాపార్డర్‌లో ఆడటం ఖాయమైంది. రెండో ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్‌కు అవకాశం దక్కవచ్చు. మరో వైపు పేస్ బౌలర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో టీమిండియా తొలి టెస్టు ఆడనుంది. కెరీర్లో 40 టెస్టులు ఆడిన బుమ్రా ఒకే ఒక్క మ్యాచ్‌లో భారత జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడటంతో అతను ఈ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. 2022లో ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడింది. భారత్, ఆ్రస్టేలియా మధ్య ఈ నెల 22 నుంచి తొలి టెస్టు జరుగుతుంది. సోమవారం భారత్ తమ ప్రాక్టీస్‌కు విరామం ఇచ్చి మంగళవారం నుంచి మ్యాచ్ వేదిక అయిన ఆప్టస్ స్టేడియంలో సాధన చేస్తుంది. రెండో టెస్టునుంచి అందుబాటులోకి... సహచరులతో పాటు ఆ్రస్టేలియాకు వెళ్లకపోవడంతో రోహిత్ తొలి టెస్టు ఆడటంపై సందేహాలు ఉన్నాయి. అతను కూడా బీసీసీఐకి ముందే సమాచారం అందించాడు. అయితే శుక్రవారమే అతనికి కొడుకు పుట్టగా...మ్యాచ్‌కు మరో వారం రోజుల సమయం ఉండటంతో మళ్లీ రోహిత్ ఆడటంపై చర్చ జరిగింది. దీనికి ఫుల్స్టాప్ పెడుతూ కెప్టెన్ తుది నిర్ణయం తీసుకున్నాడు. మరికొంత సమయం కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపించిన అతను తొలి మ్యాచ్‌నుంచి తప్పుకున్నాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరిగే రెండో (డే అండ్ నైట్) టెస్టుకు తాను అందుబాటులో ఉంటానని...నవంబర్ 30నుంచి ఆ్రస్టేలియన్ పీఎం ఎలెవన్‌తో జరిగే రెండు రోజుల పింక్ బాల్ వార్మప్ మ్యాచ్ కూడా ఆడతానని బోర్డుకు చెప్పినట్లు సమాచారం. ఈశ్వరన్‌కూ అవకాశం! శనివారం ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా శుబ్‌మన్ గిల్ ఎడమ చేతి బొటన వేలు విరిగింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను కూడా పెర్త్ టెస్టునుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో వైపు కేఎల్ రాహుల్ గాయంనుంచి పూర్తిగా కోలుకోవడం భారత్‌కు సానుకూలాంశం. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూ శుక్రవారం మోచేతికి గాయం కావడంతో రాహుల్ మైదానం వీడాడు. దాంతో అతని గాయంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఎక్స్‌రే అనంతం ఎలాంటి ప్రమాదం లేదని తేలింది. ఆదివారం మళ్లీ బ్యాటింగ్ చేసిన రాహుల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ పూర్తి స్థాయిలో మూడు గంటల పాటు నెట్ సెషన్స్‌లో పాల్గొన్నాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు రాహుల్ స్వయంగా వెల్లడించాడు. రాహుల్ మూడో స్థానంలో ఆడితే యశస్వి జైస్వాల్‌తో పాటు రెండో ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్ అరంగేట్రం చేయవచ్చు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన ఈశ్వరన్ ఆస్ట్రేలియా బయల్దేరడానికి ముందు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలు చేశాడు. అయితే భారత్ ‘ఎ’ తరఫున బరిలోకి దిగి ఆ్రస్టేలియా ‘ఎ’పై నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 36 పరుగులే చేయడంతో అతని ఆటపై సందేహాలు రేగాయి. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఓపెనర్ అవకాశం దక్కవచ్చు. మరో వైపు బీసీసీఐ ముందు జాగ్రత్తగా ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఉన్న మరో టాపార్డర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను ఆస్ట్రేలియాలోనే ఆగిపొమ్మని చెప్పింది. అవసరమైతే అతనూ టెస్టు సిరీస్ కోసం సిద్ధంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది. పడిక్కల్ తన ఏకైక టెస్టును ఇంగ్లండ్‌పై ధర్మశాలలో ఆడాడు. పడిక్కల్‌తో పాటు మరో ముగ్గురు పేసర్లు నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్ కూడా ఆ్రస్టేలియాలోనే ఆగిపోయారు. నితీశ్ రెడ్డికి చాన్స్! పెర్త్ టెస్టులో భారత జట్టులో మూడో పేసర్ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. బుమ్రా, సిరాజ్‌లతో పాటు మూడో పేసర్‌గా ఇప్పటి వరకు ప్రసిధ్ కృష్ణ పేరు వినిపించిది. ప్రాక్టీస్ గేమ్‌లోనూ అతను రాణించాడు. అయితే నెట్ సెషన్స్‌లో ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా కూడా ఆకట్టుకున్నాడు. నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న హర్షిత్ ఆ్రస్టేలియాలోని బౌన్సీ పిచ్‌లపై ‘ట్రంప్ కార్డ్’ కాగలడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. దాంతో ప్రసిధ్, హర్షిత్ మధ్య పోటీ నెలకొంది. ప్రసిధ్ ఇప్పటికే భారత్ తరఫున 2 టెస్టులు ఆడగా...హర్షిత్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టలేదు. అయితే ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి అరంగేట్రంపై కూడా చర్చ జరుగుతోంది. ప్రాక్టీస్ గేమ్‌లో తన స్వింగ్ బౌలింగ్‌లో అతను సత్తా చాటాడు. అతని బ్యాటింగ్ కూడా అదనపు బలం కాగలదు. ఇద్దరు సీనియర్లు దూరం కావడంతో మన బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టపర్చేందుకు నితీశ్ లాంటి ఆల్‌రౌండర్ అవసరం ఉంది. ఆదివారం టీమ్ ప్రాక్టీస్‌లో అతని ఆటను పర్యవేక్షించిన కోచ్ గౌతమ్ గంభీర్ సుదీర్ఘ సమయం పాటు చర్చిస్తూ తగిన సూచనలివ్వడం కనిపించింది. మరో వైపు గాయంనుంచి కోలుకొని రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన మొహమ్మద్ షమీ ఇప్పటికిప్పుడు ఆ్రస్టేలియా వెళ్లే అవకాశం లేదని...సిరీస్ చివర్లో జట్టుతో చేరవచ్చని బోర్డు వర్గాలు వెల్లడించాయి. -
వాషింగ్టన్ సుందర్‌కు భారీ ధర.. ఏకంగా రూ. 15.5 కోట్లు!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సర్వం సిద్దమైంది. నవంబర్ 24-25 తేదీలలో జెడ్డా వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ మెగా వేలంలో అందరి కళ్లు టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పైనే ఉన్నాయి. అద్బుత ఫామ్‌లో ఉన్న సుందర్ ఎంత ధరకు అమ్ముడు పోతాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన మాక్ వేలంలో వాషింగ్టన్కు కళ్లు చెదిరే ధర దక్కింది. కాగా మెగా వేలంలో వాషింగ్టన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. శ్విన్ ఆన్లైన్లో కండక్ట్ చేసిన ఈ మాక్ వేలంలో సుందర్ కోసం తొలుత ఆర్సీబీ రూ. 2 కోట్లకు బిడ్ వేసింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చింది. ఎస్ఆర్హెచ్ క్రమక్రమంగా వాషింగ్టన్ ధరను రూ. 8 కోట్లకు పెంచింది. దీంతో ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకొని గుజరాత్ జెయింట్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆఖరికి గుజరాత్ జెయింట్స్ సుందర్ కోసం ఏకంగా రూ. 15.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. కాగా సుందర్ గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మెగా వేలానికి ముందు అతడిని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోలేదు.న్యూజిలాండ్‌పై అదుర్స్..కాగా ఐపీఎల్-2024లో సుందర్ నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కానీ టీఎన్‌పీఎల్‌లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సుందర్ దుమ్ములేపాడు. ఆ తర్వాత అనుహ్యంగా భారత టెస్టు జట్టులోకి వచ్చిన వాషింగ్టన్.. న్యూజిలాండ్‌పై సంచలన ప్రదర్శన కనబరిచాడు. కేవలం రెండు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టి ఓవర్‌నైట్ హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలోనే సుందర్‌కు ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర దక్కనుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తెలుగోడి అరంగేట్రం ఫిక్స్!? -
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం
ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి మొదలు కానున్న తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడం దాదాపు ఖాయమైంది. తన భార్య రితికా సజ్దే రెండువ బిడ్డకు జన్మనివ్వడంతో మరింత ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడపాలని హిట్‌మ్యాన్ నిర్ణయించుకున్నాడంట. ఈ విషయాన్ని రోహిత్ ఇప్పటికే బీసీసీఐకు తెలియజేసినట్లు సమాచారం.ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టుకు ముందు రోహిత్ జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండనున్నట్లు రోహిత్ ముందే సెలెక్టర్లు, బీసీసీఐకి తెలియజేశాడు. అయితే అతడి సతీమణి రితికా కాస్త ముందుగానే డెలివరీ కావడంతో రోహిత్ తొలి టెస్టుకు ముందు జట్టుతో చేరుతాడని అంతా భావించారు. కానీ రోహిత్ తన ముందు అనుకున్న విధంగానే రెండు టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు."తొలి టెస్టుకు ముందే రోహిత్ ఆస్ట్రేలియాకు చేరుకుంటాడని ఆశించాము. కానీ అతడు తనకు మరికొంత సమయం కావాలని, ఇప్పుడు ఆసీస్‌కు వెళ్లలేనని బీసీసీఐకి తెలియజేశాడు. బోర్డు అతడి నిర్ణయాన్ని గౌరవించింది. రోహిత్ అడిలైడ్‌లో జరిగే పింక్ బాల్ టెస్టు(రెండో టెస్టు)కు ముందు జట్టుతో కలవనున్నాడు. మొదటి టెస్టుకు, రెండో టెస్టుకు మధ్య తొమ్మిది రోజుల గ్యాప్ ఉంది. కాబట్టి ఆ సమయానికి రోహిత్ ఆస్ట్రేలియాకు చేరుకుంటాడని" బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు.కెప్టెన్‌గా బుమ్రా..ఇక రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత జట్టు కెప్టెన్‌గా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బాధ్యతలు చేపట్టనున్నాడు. పెర్త్ టెస్టులో బుమ్రా ముందుండి జట్టును నడిపించనున్నాడు. అదేవిధంగా రోహిత్ స్ధానంలో కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్‌ను జైశ్వాల్‌తో కలిసి ప్రారంభించే అవకాశముంది.ప్రాక్టీస్‌లో గాయపడ్డ కేఎల్ రాహుల్ తిరిగి మైదానంలో వచ్చాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మరోవైపు యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తెలుగోడి అరంగేట్రం ఫిక్స్!? -
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తెలుగోడి అరంగేట్రం ఫిక్స్!?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ జట్టు ఇప్పటికే పెర్త్‌కు చేరుకుని తీవ్రంగా శ్రమిస్తుండగా.. తాజాగా ఆసీస్ జట్టు కూడా తొలి టెస్టు వేదికకు చేరుకుంది.కాగా ఈ మ్యాచ్‌తో టీమిండియా యువ ఆల్‌రౌండర్, ఆంధ్ర స్టార్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టు తుది జట్టులో నితీష్‌కు అవకాశమివ్వాలని ప్రధాన కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ విషయం ఇప్పటికే నితీష్‌కు జట్టు మేనెజ్మెంట్ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అతడు నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ తీవ్రంగా చేస్తున్నట్లు సమాచారం. మొదటి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కూడా దూరం కానున్నారు. ఈ క్రమంలోనే నితీష్ అరంగేట్రానికి మార్గం సుగమమైనట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది. కాగా ఈ ఏడాది నితీష్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవాలి.ఐపీఎల్లో అదరగొట్టి..ఐపీఎల్-2024లో నితీష్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అద్బుత ప్రదర్శన కనబరిచి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన నితీష్ రెడ్డి 142.92 స్ట్రైక్ రేట్‌తో 303 పరుగులు చేశాడు. దీంతో అతడికి భారత టీ20 జట్టులో చోటు దక్కింది.అక్కడ కూడా నితీష్ తనను తను నిరూపించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 74 పరుగులతో ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్ సత్తాచాటాడు. అదేవిధంగా బీజీటీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో అనాధాకరిక టెస్టులో కూడా నితీష్ భారత-ఎ జట్టు తరపున 47 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కూడా నితీష్ కుమార్ రెడ్డి తన మార్క్‌ను చూపించాడు. ఇప్పటివరకు 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి.. 779 పరుగులతో పాటు 56 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: Pat Cummins: కోహ్లి, పంత్ కాదు.. అతడితోనే మాకు డేంజర్ -
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆడనున్న సూర్యకుమార్..!
ముంబై జట్టు కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిద్దమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో అయ్యర్‌ను తమ జట్టు కెప్టెన్‌గా నియమించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్లో ముంబైకి కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేనే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా సారథిగా వ్యహరిస్తాడని తొలుత వార్తలు వినిపించాయి. కానీ ఎంసీఎ మాత్రం అయ్యర్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.ఈ దేశీవాళీ టోర్నీలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో రహానే ఆడనున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.ఇక టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నట్లు వినికిడి. అయ్యర్ కెప్టెన్సీలో అతడు ముంబై తరపున బరిలోకి దిగనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆరంభ మ్యాచ్‌లకు సూర్య దూరం కానున్నట్లు తెలుస్తోంది.కాగా ఇటీవలే సూర్య కెప్టెన్సీలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ముంబై స్టార్ ప్లేయర్లు శివమ్ దూబే, ముషీర్ ఖాన్ గాయాల కారణంగా దూరమయ్యారు. ఇక ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ముంబై ప్రాబుబుల్స్పృథ్వీ షా, ఆయుష్ మ్హత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్దేష్ లాడ్, హార్దిక్ తమోర్ (వికెట్‌కీపర్), ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), షా ముపార్కర్, సాయి పార్క్రాజ్, సాయి పార్క్, , హిమాన్షు సింగ్, సాగర్ ఛబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి, సిల్వెస్టర్ డిసౌజా, రాయిస్టన్ డయాస్, యోగేష్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడి, శశాంక్ అత్తార్డే, జునేద్ ఖాన్ -
కోహ్లి, పంత్ కాదు.. అతడితోనే మాకు డేంజర్: ఆసీస్ కెప్టెన్
టీమిండియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. గత రెండు పర్యాయాలు తమ సొంత గడ్డపై భారత్ చేతిలో సిరీస్ కోల్పోయిన ఆసీస్.. ఈసారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఇరు జట్ల మధ్య నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బ్రాడ్‌కాస్టర్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రాకు తనొక బిగ్ ఫ్యాన్ అని కమ్మిన్స్ తెలిపాడు. కాగా బుమ్రాకు ఇది మూడో బీజీటీ ట్రోఫీ కావడం గమనార్హం. ఒకవేళ తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరమైతే బుమ్రానే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. బుమ్రాకు ఆసీస్ గడ్డపై టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన జస్ప్రీత్.. 32 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు."నేను జస్ప్రీత్ బుమ్రాకు పెద్ద అభిమానిని. అతడొక అద్భుతమైన బౌలర్. ఈ సిరీస్‌లో భారత జట్టుకు అతడు కీలకం కానున్నాడు. ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం కూడా బుమ్రాకు ఉంది. అతడితో మా బ్యాటర్లకు ముంపు పొంచి ఉన్నది" అని కమ్మిన్స్ పేర్కొన్నాడు.ఇదే విషయంపై పాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ.. "పుజారా, రహానే జట్టులో లేకపోవడం మాకు కలిసిస్తోంది. వారిద్దరూ గతంలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. పుజారాకు బౌలింగ్ చేయడం నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. అతడితో పోటీ అంటే నాకు ఎంతో ఇష్టం. కొన్ని సార్లు గెలిచాను. మరి కొన్ని సార్లు అతడు నాపై పైయి చేయి సాధించాడు. అతడు ఎప్పుడూ ఓటమని అంగీకరించడు" అని చెప్పుకొచ్చాడు.చదవండి: రెండు భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి.. మరో 458 పరుగులు చేస్తే! -
రెండు భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి.. మరో 458 పరుగులు చేస్తే!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడి వికెట్ పారేసుకున్నాడు.ఈ నేపథ్యంలో కోహ్లి బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కివీస్ చేతిలో టీమిండియా 3-0తో వైట్‌వాష్ కావడంతో భారత మాజీ క్రికెటర్లు సైతం కోహ్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంత మంది మాత్రం.. ‘‘ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం’’ అని ఈ రన్‌మెషీన్‌కు అండగా నిలిచారు.రెండు భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి.. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పర్యటన రూపంలో కోహ్లి వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ.. తనను తాను మరోసారి నిరూపించుకునే సమయం వచ్చింది. మామూలుగానే కంగారూలతో టెస్టుల్లో చెలరేగి ఆడే ఈ ఢిల్లీ బ్యాటర్.. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మరింత గొప్పగా రాణిస్తాడని ఇటు టీమిండియా, అటు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు.ఒకవేళ ఇక్కడా విఫలమైతే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ) కోసం ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఇదే చివరిసారి అవుతుందని కూడా జోస్యం చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కోహ్లి గనుక మునుపటి ఫామ్ అందుకుంటే ఆస్ట్రేలియా గడ్డపై రెండు అరుదైన భారీ రికార్డులు సొంతం చేసుకునే అవకాశం ఉంది.మరో 458 పరుగులు చేస్తే!బీజీటీ 2024-25లో భాగంగా ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కోహ్లి గనుక 458 పరుగులు సాధిస్తే.. సచిన్ టెండుల్కర్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలవుతుంది. కంగారూ గడ్డపై సచిన్ 20 టెస్టులు ఆడి 53.20 సగటుతో.. 1809 పరుగులు సాధించాడు. తద్వారా ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.మరోవైపు కోహ్లి.. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు ఆడిన 13 టెస్టుల్లో 54.08 సగటుతో 458 పరుగులు సాధించాడు. కాబట్టి ఈసారి ఇంకో 458 పరుగులు చేశాడంటే.. సచిన్ టెండ్కులర్ను అధిగమిస్తాడు.ఇక ఆస్ట్రేలియా గడ్డపై సచిన్ టెండుల్కర్, కోహ్లి ఆరేసి శతకాలు చేసి.. ఈ ఘనత సాధించిన టీమిండియా బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈసారి కోహ్లి ఒక్క సెంచరీ చేస్తే.. సచిన్‌ను వెనక్కి నెట్టి భారత్ తరఫున ఆస్ట్రేలియాలో అత్యధిక శతకాలధీరుడిగా అవతరిస్తాడు.కాగా.. నవంబరు 22 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య మొదటి టెస్టు ఆరంభం కానుంది. జనవరి 3-7 వరకు జరుగనున్న ఐదో టెస్టుతో టీమిండియా ఆసీస్ టూర్ ముగుస్తుంది. ఇదిలా ఉంటే.. కోహ్లి ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో రాబట్టిన పరుగులు 0, 70, 1, 17, 4, 1.చదవండి: ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే ధర.. రూ. 14.5 కోట్లకు ఆ జట్టు సొంతం! -
ఆసీస్‌తో టెస్టు సిరీస్.. కపిల్ దేవ్ రికార్డుపై కన్నేసిన బుమ్రా
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు తెరలేవనుంది.ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఆసీస్-భారత జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరాలంటే 4-0 తేడాతో ఆతిథ్య ఆసీస్‌ను ఓడించాలి.కపిల్ రికార్డుపై కన్నేసిన బుమ్రా.. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ సిరీస్‌లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్‌లో బుమ్రా మరో 20 వికెట్లు పడగొడితే ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత విజయవంతమైన భారత బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు.బుమ్రా ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 7 టెస్టులు ఆడి 32 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆసీస్ గడ్డపై కపిల్ దేవ్ 11 టెస్టులు ఆడి 51 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బుమ్రా మరో 20 వికెట్లను తీస్తే కపిల్‌దేవ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భాత బౌలర్లు వీరేకపిల్ దేవ్ - 51అనిల్ కుంబ్లే - 49రవిచంద్రన్ అశ్విన్ - 39బిషన్ సింగ్ బేడీ - 35జస్ప్రీత్ బుమ్రా - 32ఎరపల్లి ప్రసన్న – 31మహ్మద్ షమీ - 31ఉమేష్ యాదవ్ - 31ఇషాంత్ శర్మ - 31చదవండి: WI Vs ENG 4th T20: విండీస్ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి -
ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే ధర.. రూ. 14.5 కోట్లకు వారి సొంతం!
టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఈ ఏడాది కలిసి రాలేదు. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్-2024లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 320 పరుగులు చేయగలిగాడు. అయితే, మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ మాత్రం అతడిని వదిలేసింది.జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలతో పాటు యువ క్రికెటర్ తిలక్ వర్మను రీటైన్ చేసుకున్న ముంబై.. ఇషాన్ పేరును మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికి 2018లో ముంబై తరఫునే క్యాచ్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఆరంభం నుంచే మెరుగ్గా రాణించిన ఇషాన్ కిషన్ కోసం ఐపీఎల్-2022లో ముంబై భారీ మొత్తం వెచ్చించింది.నాడు రూ. 15.25 కోట్ల ధరకు ముంబై సొంతంనాటి మెగా వేలంలో అతడిని ఏకంగా రూ. 15.25 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. కానీ.. అప్పటి నుంచి నేటి దాకా ఇషాన్ కిషన్ అందుకు తగ్గ పైసా వసూల్ ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోయాడు. అంతేకాదు.. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయి.. జాతీయ జట్టుకూ దూరమయ్యాడు.అయితే, ఇటీవలే రంజీల్లో సెంచరీలు చేయడంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. భారత్-‘ఎ’ జట్టుకు సెలక్ట్ అయ్యాడు. కానీ.. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇషాన్ కిషన్ ఐపీఎల్-2025 మెగా వేలంలోకి రాబోతున్నాడు.వికెట్ కీపర్ కోటాలో కళ్లు చెదిరే మొత్తంఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన ‘మాక్ వేలం’లో మాత్రం ఇషాన్ కిషన్ భారీ ధర పలకడం విశేషం. మెగా వేలంలో ఇషాన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. అయితే, అశ్విన్ మాత్రం తన వేలంలో.. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కోసం బిడ్ వేసే ఫ్రాంఛైజీలు రూ. 5 కోట్ల నుంచి మొదలుపెట్టాలని సూచించాడు.ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 5 కోట్లకు బిడ్ వేయగా.. క్రమక్రమంగా ఇషాన్ ధర రూ. 10 కోట్లకు పెంచింది. దీంతో పంజాబ్ కింగ్స్ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 14.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అతడు ఉన్నా కూడాఅయితే, అశ్విన్ నిర్వహించిన ఈ మాక్వేలంలో ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే మొత్తం దక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌లో లేని ఇషాన్ కోసం.. మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ అంతగా ఆసక్తి చూపదని.. మహా అయితే, అతడికి రూ. ఐదు కోట్లు దక్కవచ్చని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.అంతేకాదు.. లక్నో ఇప్పటికే వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అట్టిపెట్టుకుంది. అలాంటిది.. ఇషాన్‌ను ఆ ఫ్రాంఛైజీ కొనుక్కోవడం ఏమిటంటూ అశూ మాక్ వేలంలో లక్నో తరఫున పాల్గొన్న అభిమానులను ట్రోల్ చేస్తున్నారు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరుగనుంది.చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
వంద శాతం ఫిట్‌గా ఉన్నా.. మేనేజ్మెంట్ నుంచి పిలుపు రాలేదు: టీమిండియా స్టార్
ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతవరకు తనకు టీమిండియా మేనేజ్మెంట్ నుంచి పిలుపురాలేదని.. కానీ.. త్వరలోనే తాను జాతీయ జట్టు తరఫున పునగామనం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో శార్దూల్ ఠాకూర్‌కు చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే.నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశంఈ ముంబై ఆటగాడికి బదులు యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని బీసీసీఐ ఆస్ట్రేలియాకు పంపింది. ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో సీనియర్ అయిన శార్దూల్‌ను కాదని.. టెస్టు అరంగేట్రం చేయని నితీశ్‌ను సెలక్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ స్పందిస్తూ.. తాము గతాన్ని మరిచి సరికొత్తగా ముందుకు సాగాలని భావిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.ముంబై తరఫున రంజీ బరిలోఇదిలా ఉంటే..కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న శార్దూల్ ఠాకూర్ ఇటీవలే మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ముంబై తరఫున రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో బరిలోకి దిగాడు. తాజాగా ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా సర్వీసెస్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా సర్వీసెస్‌పై ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.వంద శాతం ఫిట్నెస్ సాధించానుఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన శార్దూల్ ఠాకూర్ టీమిండియా రీ ఎంట్రీ గురించి స్పందించాడు. ‘‘రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఆరంభ మ్యాచ్‌లలో కాస్త ఆందోళనకు గురయ్యా. సర్జరీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం వెంటాడింది. అయితే, క్రమక్రమంగా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు వంద శాతం ఫిట్నెస్ సాధించాను.బౌలింగ్‌లో నేను రాణించిన తీరు ఇందుకు నిదర్శనం. గత మూడు, నాలుగు మ్యాచ్‌లను గమనిస్తే బౌలింగ్ బాగానే ఉంది. కొన్నిసార్లు క్యాచ్‌లు మిస్ చేశాను. అయితే, ఐదు మ్యాచ్‌లలో కలిపి దాదాపు 20 వికెట్ల దాకా తీశాను. నా ఫిట్నెస్, బౌలింగ్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను.ఇప్పటి వరకు పిలుపు రాలేదుటీమిండియా మేనేజ్మెంట్ నుంచి నాకైతే ఇప్పటి వరకు పిలుపు రాలేదు. ఎవరూ నన్ను సంప్రదించలేదు. అయితే, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత.. టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడబోతోంది. కాబట్టి నాకు అవకాశం వస్తుందనే భావిస్తున్నా. ఇప్పుడైతే ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించి.. బౌలింగ్‌లో రాణించడమే నా ధ్యేయం’’ అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్)జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)యశస్వి జైస్వాల్అభిమన్యు ఈశ్వరన్శుభ్మన్ గిల్విరాట్ కోహ్లీకేఎల్ రాహుల్రిషభ్ పంత్ (వికెట్ కీపర్)సర్ఫరాజ్ ఖాన్ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్)రవిచంద్రన్ అశ్విన్రవీంద్ర జడేజామహ్మద్ సిరాజ్ఆకాశ్ దీప్ప్రసిద్ కృష్ణహర్షిత్ రాణానితీశ్ కుమార్ రెడ్డివాషింగ్టన్ సుందర్ చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
విండీస్ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వెస్టిండీస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇంగ్లిష్ జట్టు విధించిన భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి క్లీన్‌స్వీప్ గండం నుంచి బయటపడింది. కాగా స్వదేశంలో విండీస్.. బట్లర్ బృందంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది.ఇప్పటికే సిరీస్ ఇంగ్లండ్ కైవసంఇందులో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లలో గెలిచిన ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సెయింట్ లూయీస్ వేదికగా ఆదివారం తెల్లవారుజామున నాలుగో టీ20 జరిగింది. డారెన్ సామీ జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.బెతెల్ మెరుపు ఇన్నింగ్స్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విల్ జాక్స్ అదిరిపోయే ఆరంభం అందించారు. సాల్ట్ 35 బంతుల్లోనే 55 (5 ఫోర్లు, 4 సిక్స్‌లు), జాక్స్ 12 బంతుల్లోనే 25 (ఒక ఫోర్ 2 సిక్సర్లు) పరుగులు చేశారు. మిగతా వాళ్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (23 బంతుల్లో 38) రాణించగా.. జాకోబ్ బెతెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.ఇంగ్లండ్ భారీ స్కోరుమొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న బెతెల్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో సామ్ కర్రాన్ ధనాధన్ ఇన్నింగ్స్(13 బంతుల్లో 24)తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ రెండు, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.విండీస్ ఓపెనర్ల ఊచకోత.. విండీస్ ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆది నుంచే దుమ్ములేపింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్, షాయీ హోప్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో పరుగుల విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ లూయీస్ సిక్సర్ల వర్షం కురిపించగా.. హోప్ బౌండరీలతో పరుగులు రాబట్టాడు.Smashed💥...platform set for the #MenInMaroon#TheRivalry | #WIvENG pic.twitter.com/KHgwBGcYbJ— Windies Cricket (@windiescricket) November 16, 2024 మెరుపు అర్ధ శతకాలులూయీస్ మొత్తంగా 31 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేయగా... హోప్ 24 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 రన్స్ స్కోరు చేశాడు. వీరిద్దరి మెరుపు అర్ధ శతకాలకు తోడు కెప్టెన్ రోవ్‌మన్ పావెల్(23 బంతుల్లో 38), షెర్ఫానే రూథర్‌ఫర్డ్(17 బంతుల్లో 29 నాటౌట్)కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు.How good was @shaidhope tonight?🏏🌟#TheRivalry | #WIvENG pic.twitter.com/MkfP5wE7U7— Windies Cricket (@windiescricket) November 16, 2024 19 ఓవర్లలోనేఫలితంగా 19 ఓవర్లలోనే వెస్టిండీస్ టార్గెట్‌ను పూర్తి చేసింది. ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ మూడు, జాన్ టర్నర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ధనాధన్ హాఫ్ సెంచరీతో అలరించిన షాయీ హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. వన్డే సిరీస్ విండీస్దేకాగా తొలుత ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. అయితే, వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకుని పర్యాటక జట్టు ఆధిక్యాన్ని 3-1కు తగ్గించింది. ఇరుజట్ల మధ్య భారత కాలమానం ప్రకారం సోమవారం వేకువజామున(ఉదయం 1.20 నిమిషాలకు) ఐదో టీ20 జరుగనుంది.చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య -
BGT 2024: టీమిండియాకు గుడ్‌న్యూస్
ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్’(బీజీటీ) సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డ మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కోలుకున్నాడు. తిరిగి మైదానంలో అడుగుపెట్టి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో పాటు మిగతా ఆటగాళ్ల బౌలింగ్‌లో దాదాపు గంటసేపు క్రీజులో నిలబడినట్లు సమాచారం.నెట్స్లోనూఅనంతరం.. కేఎల్ రాహుల్ నెట్స్‌లోనూ తీవ్రంగా చెమటోడ్చాడు. కొత్త, పాత బంతులతో సైడ్ ఆర్మ్ త్రోయర్స్ బౌలింగ్ చేస్తుండగా.. రాహుల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కాగా బీజీటీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబరు 22న తొలి టెస్టు ఆరంభం కానుంది.ఇందుకోసం.. భారత జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఆసీస్‌తో సిరీస్ సన్నాహకాల్లో భాగంగా ఇండియా-‘ఎ’ జట్టుతో కలిసి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మోచేతికి గాయమైంది. దీంతో ఒకరోజు మొత్తం ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న ఈ సీనియర్ బ్యాటర్.. ఆదివారం తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు.శుబ్‌మన్ గిల్‌కు గాయంఇదిలా ఉంటే.. టీమిండియా మరో స్టార్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. టెస్టు మ్యాచ్‌ను పోలిన పరిస్థితుల మధ్య (సిమ్యులేషన్) ‘వాకా’ మైదానంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా... బంతిని ఆపే క్రమంలో గిల్ ఎడమ బొటన వేలికి తీవ్రగాయమైంది. బాధతో విలవిల్లాడి గిల్ వెంటనే గ్రౌండ్‌ను వీడాడు.పరీక్షల అనంతరం గిల్ వేలు ఫ్యాక్చర్ అయినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తొలి టెస్టుకు గిల్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. సాధారణంగా ఇలాంటి గాయాల నుంచి కోలుకునేందుకు కనీసం రెండు వారాల సమయం అవసరం కావడంతో... గిల్ తొలి మ్యాచ్ ఆడటం దాదాపు అసాధ్యమే. అయితే తొలి టెస్టుకు రెండో టెస్టుకు మధ్య వ్యవధి ఎక్కువ ఉండటంతో అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న రెండో మ్యాచ్ వరకు అతడు కోలుకోవచ్చని టీమ్ మేనేజ్మెంట్ అంచనా వేస్తోంది. గత ఆసీస్ పర్యటనలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన గిల్... ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీని నిలబెట్టుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. టాపార్డర్ బలహీనం! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరమవుతాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో... గిల్ కూడా అందుబాటులో లేకపోతే భారత టాపార్డర్ బలహీనపడే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మ భార్య శుక్రవారం పండంటి బాబుకు జన్మనివ్వగా... టెస్టు సిరీస్ ప్రారంభానికి ఇంకా గడువు ఉండటంతో అతడు జట్టుతో చేరితే ఓపెనింగ్ విషయంలో ఎలాంటి సమస్య ఉండదు.లేదంటే ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయని అభిమన్యు ఈశ్వరన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇలాంటి తరుణంలో కేఎల్ రాహుల్ కోలుకోవడం నిజంగా టీమిండియాకు సానుకూలాంశం. ఇక ఆదివారంతో ప్రాక్టీస్ మ్యాచ్ ముగియనుండగా... మంగళవారం నుంచి మూడు రోజుల పాటు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొననుంది.మరోవైపు గాయం నుంచి కోలుకొని రంజీ ట్రోఫీలో సత్తా చాటిన మహ్మద్ షమీ... ఆసీస్‌తో రెండో టెస్టుకు ముందు జట్టులో చేరే చాన్స్ ఉంది. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ 43.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడంతో పాటు 37 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య -
నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య
టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ సఫారీ గడ్డపై అదరహో అనిపించాడు. అంతర్జాతీయ టీ20లలో రెండు వరుస సెంచరీలతో చెలరేగి సౌతాఫ్రికాపై సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఈ హైదరాబాదీ ఆట తీరును కొనియాడకుండా ఉండలేకపోయాడు. నాలుగో టీ20 ముగిసిన తర్వాత తిలక్‌తో సంభాషిస్తూ.. వరుసగా రెండు శతకాలు బాదడం ఎలాంటి అనుభూతినిచ్చిందని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ఇదంతా మీ వల్లే అంటూ తిలక్ వర్మ కెప్టెన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే, సూర్య మాత్రం.. ‘‘నువ్వు థాంక్స్ చెప్పాల్సింది నాకు.. కాదు సెలక్టర్లకు’’ అంటూ చమత్కరించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాపై 3-1తో విజయం తర్వాత తిలక్ వర్మ.. కెప్టెన్ సూర్యకుమార్‌తో సంతోషాన్ని పంచుకుంటూ.. ‘‘అసలేం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. నాలో ఎన్నెన్నో భావోద్వేగాలు చెలరేగుతున్నాయి.నాకు అవకాశం ఇచ్చినందుకు టీమ్‌కు ధన్యవాదాలు తెలుపుకొంటున్నా. ఇలా వరుసగా టీ20 సెంచరీలు.. అది కూడా సవాళ్లకు నెలవైన సౌతాఫ్రికా పిచ్‌లపై సఫారీ జట్టుపై చేస్తానని అస్సలు ఊహించలేదు. నిజంగా చాలా గొప్పగా అనిపిస్తోంది. మీకు కూడా థాంక్యూ’’ అని సూర్యపై అభిమానం చాటుకున్నాడు.ఇందుకు బదులుగా సూర్యకుమార్ స్పందిస్తూ.. ‘‘ఇతగాడు ఎంత హుందాగా కృతజ్ఞతలు చెబుతున్నాడో చూడండి. అయినా నాకు నువ్వు థాంక్యూ చెప్పాల్సిన అవసరం లేదు. సెలక్టర్ సర్ అక్కడ కూర్చుని ఉంటారు’’ అంటూ సెలక్టర్లను మర్చిపోవద్దన్న ఉద్దేశంలో తిలక్ వర్మను సరదాగా ట్రోల్ చేశాడు. ఆ సమయంలో తిలక్ వర్మతో పాటు అక్కడే ఉన్న మరో సెంచరీల హీరో సంజూ శాంసన్ కూడా నవ్వులు చిందించాడు. ఈ దృశ్యాలు టీమిండియా అభిమానులను ఆకర్షిస్తున్నాయి.కాగా.. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా వెళ్లిన టీమిండియా 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి, ఆఖరి టీ20లలో సంజూ శతకాలు బాదగా.. మూడు, నాలుగో టీ20లో తిలక్ వర్మ సెంచరీలు కొట్టాడు. సంజూ, తిలక్ అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఆయా మ్యాచ్‌లలో గెలిచి సఫారీ టూర్ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. ఇదిలా ఉంటే.. సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును తిలక్ వర్మ సొంతం చేసుకోవడం విశేషం. Jersey number secret, hairdo and a special message for #TeamIndia Captain @ImRo45 🤗Skipper SKY interviews 'Humble' centurions @IamSanjuSamson & @TilakV9 💯WATCH 🎥 🔽 #SAvIND | @surya_14kumar— BCCI (@BCCI) November 16, 2024 -
నేనే గనుక రోహిత్ స్థానంలో ఉండి ఉంటే..: గంగూలీ
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభానికి సమయం సమీపిస్తున్న తరుణంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాకు చేరుకోవాలని సూచించాడు. జట్టుకు నాయకుడి అవసరం ఉందని.. ముఖ్యంగా ఇలాంటి ప్రతిష్టాత్మక సిరీస్‌లో కెప్టెన్ తోడుగా ఉంటే ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుందన్నాడు.ఒకవేళ తాను గనుక రోహిత్ స్థానంలో ఉంటే కచ్చితంగా ఆస్ట్రేలియాకు వెళ్లేవాడినని పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో తలపడనుంది. ఇందులో భాగంగా ఐదు టెస్టులు ఆడనుంది. కనీసం నాలుగు మ్యాచ్లైనాఇక కివీస్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్ కావడంతో.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే ఆసీస్‌తో కనీసం నాలుగు మ్యాచ్‌లైనా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా.. నవంబరు 22 నుంచి పెర్త్ వేదికగా ఆసీస్- టీమిండియా మధ్య ఈ సిరీస్ మొదలుకానుంది. పండంటి మగబిడ్డఅయితే, కెప్టెన్ రోహిత్ శర్మ మినహా ఇప్పటికే భారత ఆటగాళ్లంతా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి.. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. కాగా రోహిత్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా పెర్త్‌లో జరిగే తొలి టెస్టుకు దూరం కానున్నాడనే వార్తలు వచ్చాయి. అతడి భార్య రితికా సజ్దే తమ రెండో సంతానానికి జన్మనిచ్చే క్రమంలో.. భార్య ప్రసవం కోసం రోహిత్ ముంబైలోనే ఉంటాడని ప్రచారం జరిగింది.అందుకు తగ్గట్లుగానే రితికా శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు రోహిత్ శర్మ ధ్రువీకరించాడు. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ త్వరలోనే ఆస్ట్రేలియాకు చేరుకుంటాడని భావిస్తున్నా. ఎందుకంటే.. జట్టుకు ఇప్పుడు నాయకుడి అవసరం ఎంతగానో ఉంది.నేనే గనుక అతడి స్థానంలో ఉంటే.. అతడి భార్య శుక్రవారం రాత్రే మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలిసింది. కాబట్టి.. రోహిత్ ఇక ఆస్ట్రేలియాకు బయల్దేరవచ్చు. నేనే గనుక అతడి స్థానంలో ఉంటే.. ఇప్పటికే ఆసీస్‌కు పయనమయ్యేవాడిని.తొలి టెస్టు ఆరంభానికి ముందు ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఇదొక ప్రతిష్టాత్మక సిరీస్. రోహిత్ అద్భుతమైన కెప్టెన్ అనడంలో సందేహం లేదు. అయితే, ఇప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్లడం అత్యంత ముఖ్యం. జట్టుకు అతడి అవసరం ఉంది’’ అని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ తొలి టెస్టు ఆడితేనే బాగుంటుందని గంగూలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.చదవండి: చరిత్రపుటల్లోకెక్కిన మ్యాక్స్‌వెల్.. అత్యంత వేగంగా..! -
సరిలేరు మీకెవ్వరు!
ప్రపంచ క్రికెట్లో ఏ జట్టయినా మేటి ఆటగాళ్ల నిష్క్రమణతో డీలా పడటం సహజమే! టీమిండియా విషయంలో మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ ఫార్మాట్లోనైనా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు ఆటకు వీడ్కోలు పలికితే వారి స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు. ఈ ఏడాది ఐసీసీ టి20 ప్రపంచకప్ నెగ్గిన అనంతరం ఈ ముగ్గురు పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా... దిగ్గజాలను మైమరిపించేందుకు మేమున్నామంటూ యువతరం దూసుకొస్తోంది!సంజూ సామ్సన్ సుదీర్ఘ కెరీర్‌ను గాడిన పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే... అడిగి మరీ బరిలోకి దిగిన మూడో స్థానంలో తానే సరైన వాడినని హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ నిరూపించుకున్నాడు. సూర్యకుమార్ తన సారథ్యంతో సత్తా చాటుతుంటే... హార్దిక్ పాండ్యా అసలు సిసలు ఆల్‌రౌండర్‌గా తనని తాను ఆవిష్కరించుకుంటున్నాడు. ‘ఛోటా పటాకా... బడా ధమాకా’ మాదిరిగా అభిõÙక్ శర్మ చెలరేగుతుంటే... ‘నయా ఫినిషర్’ తానే అని రింకూ సింగ్ నిరూపించుకుంటున్నాడు. టి20ల్లో ప్రమాదకర బౌలర్‌గా అర్‡్షదీప్ సింగ్ పరిణతి సాధిస్తే... వరుణ్, రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో వైవిధ్యంతో కట్టిపడేస్తున్నారు. వీరంత సమష్టిగా కదం తొక్కుతుండటంతో భారత జట్టు ఈ ఏడాది టి20ల్లో జైత్రయాత్ర సాగించింది. ఆడిన 26 మ్యాచ్‌ల్లో 24 విజయాలతో అదరగొట్టిన నేపథ్యంలో ప్రత్యేక కథనం. –సాక్షి క్రీడా విభాగం టి20 ఫార్మాట్లో నిర్వహించిన తొలి ప్రపంచకప్ (2007) గెలిచిన తర్వాత... మరోసారి వరల్డ్ కప్ ట్రోఫీ ముద్దాడేందుకు సుదీర్ఘ కాలం నిరీక్షించిన టీమిండియా... ఈ ఏడాది రెండోసారి జగజ్జేతగా నిలిచింది. చాన్నాళ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న భారత జట్టు ఆ కల నెరవేర్చుకోవడంతో పాటు... అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టింది. వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్ ఓడకుండా కప్ కైవసం చేసుకున్న టీమిండియా... మరో ఐదు సిరీస్‌లు సైతం చేజిక్కించుకుంది. అఫ్గానిస్తాన్‌పై 3–0తో, జింబాబ్వేపై 4–1తో, శ్రీలంకపై 3–0తో, బంగ్లాదేశ్‌పై 3–0తో, దక్షిణాఫ్రికాపై 3–1తో సిరీస్‌లు హస్తగతం చేసుకుంది. ఇందులో అఫ్గానిస్తాన్‌తో సిరీస్ తర్వాత టి20 వరల్డ్‌కప్ జరగ్గా... ఆ తర్వాత నుంచి సీనియర్ ప్లేయర్లు లేకుండా యువ ఆటగాళ్లతోనే టీమిండియా అద్భుతాలు చేసింది. కోహ్లి, రోహిత్, జడేజా వంటి సీనియర్లు ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం... మిగిలిన కీలక ఆటగాళ్లు కూడా అన్ని సిరీస్‌లకు అందుబాటులే లేకపోవడం ఇలాంటి ఎన్నో ప్రతికూలతల మధ్య కూడా యువ ఆటగాళ్లు సత్తా చాటారు. భవిష్యత్తుపై భరోసా ఇస్తూ... బాధ్యత తీసుకునేందుకు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. ఫలితంగా ఈ ఏడాది ఆడిన 26 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో భారత్ 24 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. అందులో రెండు ‘సూపర్ ఓవర్’ విజయాలు కూడా ఉన్నాయి. ఓడిన రెండింట్లో ఒకటి వరల్డ్‌కప్ నెగ్గిన వారం రోజుల తర్వాత సరిగ్గా కుదురుకోకుండానే జింబాబ్వేతో ఆడిన మ్యాచ్ ఒకటి అయితే... తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్‌లో చివరి వరకు పోరాడి ఓడిన రెండో టి20 మరొకటి. ఈ రెండు మినహా మిగిలిన మ్యాచ్‌లు చూసుకుంటే మన జట్టు చక్కటి ప్రదర్శన కనబర్చింది. ఓవరాల్‌గా విజయాల శాతాన్ని పరిశీలిస్తే... భారత్ 92.31 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. 2018లో పాకిస్తాన్ 19 మ్యాచ్‌లాడి 17 గెలిచి 89.47 శాతంతో రెండో స్థానంలో ఉంది. ప్రతి 12 బంతులకో సిక్స్... టీమిండియా జైత్రయాత్ర వెనక యువ ఆటగాళ్ల దూకుడు ఉందనేది వాస్తవం. ఈ ఏడాది గణాంకాలు చూస్తే... భారత జట్టు సగటున ప్రతి 12 బంతులకో సిక్స్ బాదింది. జాతీయ జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలనుకునే ప్రతి ఆటగాడు తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని చెలరేగుతుండటం వల్లే ఇది సాధ్యమైంది. ముఖ్యంగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన తిలక్ వర్మ, అభిõÙక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్ వంటి హిట్టర్ల వల్ల జట్టు బ్యాటింగ్ శైలి మారిపోయింది. గతంలో కుదురుకున్నాక భారీ షాట్లు ఆడాలనే ధోరణి ఎక్కువగా కనిపించే టీమిండియాలో... ఇప్పుడు బాదుడే పరమావధి అనేది స్పష్టమవుతోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా వన్‌డౌన్‌లో అవకాశం దక్కించుకున్న తిలక్ వర్మకు... టీమిండియా తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇదే నూరిపోసానని వెల్లడించాడు.‘వికెట్ పడ్డా ఫర్వాలేదు. దూకుడు మాత్రం తగ్గించొద్దు. సహజసిద్ధమైన షాట్లు ఆడితేనే మెరుగైన ఫలితాలు వస్తాయి’అని లక్ష్మణ్ తనకు చెప్పినట్లు తిలక్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. ఈ ఏడాది 4.68 బంతులకో బౌండరీ (ఫోర్, సిక్స్) కొట్టిన భారత జట్టు ఈ జాబితాలో ఆస్ట్రేలియా (4.39) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఏడు సెంచరీలు.. 2024 క్యాలెండర్ ఏడాదిలో భారత ఆటగాళ్లు ఒక్క టి20 ఫార్మాట్లోనే ఏడు సెంచరీలు బాదారు. సంజూ సామ్సన్, తిలక్ వర్మ తాజా సిరీస్‌లోనే చెరో రెండు సెంచరీలు బాదగా... అంతకుముందు సామ్సన్ హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌పై మరో శతకం సాధించాడు. రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ కూడా ఒక్కోసారి మూడంకెల స్కోరు అందుకున్నారు. ఒక ఏడాదిలో టి20ల్లో ఒక జట్టు ప్లేయర్లు చేసిన అత్యధిక సెంచరీలు ఇవే కావడం విశేషం. సెంచరీ నమోదైన ప్రతి మ్యాచ్‌లోనూ టీమిండియా 200 పైచిలుకు పరుగులు చేసింది. మొత్తంగా 2024లో తొమ్మిది సార్లు భారత జట్టు 200+ స్కోర్లు నమోదు చేసింది. ప్రపంచంలో మరే జట్టు ఏడు సార్లకు మించి ఈ ఫీట్ అందుకోలేదు. ఈ క్రమంలో టీమిండియా 9.55 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టింది. ఇది ఆ్రస్టేలియా (9.87) తర్వాత రెండో అత్యధికం. కేవలం బ్యాటింగ్‌లోనే మెరుపులు మెరిపిస్తే ఈ స్థాయి జైత్రయాత్ర సాధ్యమయ్యేది కాదు! బ్యాటర్ల మెరుపులకు బౌలర్ల సహకారం కూడా తోడవడంతోనే ఈ నిలకడ సాధ్యమైంది. ఈ ఏడాది పొట్టి ఫార్మాట్లో భారత జట్టు పదిసార్లు ప్రత్యర్థులను ఆలౌట్ చేసింది. సగటున ప్రతి మ్యాచ్‌లో టీమిండియా 8.39 వికెట్లు పడగొట్టింది. 2023 వరకు టీమిండియా కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే ప్రత్యర్థిపై 100 పరుగుల తేడాతో విజయం సాధించగా... ఈ ఒక్క ఏడాదే మూడు సార్లు ఆ ఫీట్ నమోదు చేయడం కొసమెరుపు! ఫ్యూచర్ స్టార్స్ యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఇప్పటికే నిరూపించుకోగా... ఇప్పుడు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన తిలక్ వర్మ... ఈసారి సఫారీ టూర్లో రెండు సెంచరీలతో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’అవార్డు గెలుచుకున్నాడు. నాలుక మడతేసి కొడితే బంతి బౌండరీ దాటాల్సిందే అన్న తరహాలో... దక్షిణాఫ్రికాలో విధ్వంస రచన చేసిన తిలక్‌పై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఒకే బంతికి భిన్నమైన షాట్లు ఎలా ఆడొచ్చో తిలక్ చివరి మ్యాచ్‌లో నిరూపించాడు. జాన్సన్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి తిలక్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా కొట్టిన సిక్సర్ చూస్తే అతడు ఎంత పరిణతి సాధించాడో ఇట్టే చెప్పేయోచ్చు. గతంలో సంప్రదాయ షాట్లతోనే పరుగులు రాబట్టేందుకు ఎక్కువ ప్రయత్నించిన తిలక్... తాను కూడా వికెట్‌కు నాలుగు వైపులా పరుగుల వరద పారించగలనని నిరూపించుకున్నాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ , కోచ్ మాటలను బట్టి చూస్తే... తిలక్ మూడో స్థానంలో కుదురుకున్నట్లే అనిపిస్తోంది. ఇప్పటి వరకు 20 టి20లు ఆడిన తిలక్ వర్మ రెండు సెంచరీలు, రెండు హాఫ్‌సెంచరీలతో 51.33 సగటుతో 616 పరుగులు సాధించాడు. ఇన్నాళ్లు కోహ్లి ఆడిన మూడో స్థానంలో నిలకడ కొనసాగించగలిగితే 22 ఏళ్ల తిలక్‌కు మంచి భవిష్యత్తు ఉండనుంది. -
ఐపీఎల్-2025 వేలంలో పాల్గొనని ఇద్దరు స్టార్లు..!
ఐపీఎల్ 2025 మెగా వేలం సెప్టెంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు వేలం ప్రారంభంకానుంది. ఈసారి వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇందులో 366 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు. ఈసారి వేలం మొత్తం 204 స్లాట్లకు జరుగనుండగా.. 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.ఈసారి మెగా వేలంలో ఇద్దరు స్టార్ ప్లేయర్ల పేర్లు కనిపించలేదు. ఇంగ్లండ్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్, ఆస్ట్రేలియాకు చెందిన కెమరూన్ గ్రీన్ వేలంలో తమ పేర్లు నమోదు చేసుకోలేదు. ఆర్చర్ జాతీయ జట్టుకు సేవలందించేందుకు వేలానికి దూరంగా ఉండగా.. గ్రీన్ సర్జరీ కారణంగా వేలంలో పాల్గొనడం లేదు. ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ 2023 మెగా వేలంలో రూ. 8 కోట్లకు సొంతం చేసుకోగా.. గ్రీన్‌ను ఆర్సీబీ 2024 వేలంలో రూ. 17.5 కోట్లకు దక్కించుకుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈసారి వేలంలో పాల్గొని ఉంటే మరోసారి భారీ మొత్తం దక్కేది.మెగా వేలంలో పాల్గొనని మరో ముగ్గురు స్లార్లు..బెన్ స్టోక్స్జేసన్ రాయ్శిఖర్ ధవన్అత్యంత పిన్నవయస్కుడు..ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్లలో అత్యంత పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీ. 13 ఏళ్ల ఈ బీహార్ చిన్నోడు జూనియర్ క్రికెట్లో సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్శించాడు. ఇక వేలంలో పాల్గొనబోయే అత్యంత పెద్ద వయస్కుడిగా జిమ్మీ ఆండర్సన్ ఉన్నాడు. ఆండర్సన్ 41 ఏళ్ల వయసులో వేలంలో పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.వేలంలో పాల్గొనబోయే ఆసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు..ఉన్ముక్త్ చంద్ (యూఎస్ఏ)అలీ ఖాన్ (యూఎస్ఏ)బ్రాండన్ మెక్‌ముల్లెన్ (స్కాట్లాండ్)ఈ ముగ్గురు 30 లక్షల బేస్‌ప్రైజ్ విభాగంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.క్యాప్డ్, అన్క్యాప్డ్ ప్లేయర్ల వివరాలు..భారతీయ క్యాప్డ్ ప్లేయర్లు- 48విదేశీ క్యాప్డ్ ప్లేయర్లు- 193అసోసియేట్ దేశాలకు చెందిన ప్లేయర్లు- 3భారతీయ అన్క్యాప్డ్ ప్లేయర్లు- 318విదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు- 12మొత్తం- 574వివిధ బేస్ ధర విభాగాల్లో పాల్గొననున్న ఆటగాళ్లు..రూ. 2 కోట్లు- 81 మంది ఆటగాళ్లురూ. 1.5 కోట్లు- 27రూ. 1.25 కోట్లు- 18రూ. కోటి- 23రూ. 75 లక్షలు- 92రూ. 50 లక్షలు- 8రూ. 40 లక్షలు- 5రూ. 30 లక్షలు- 320మొత్తం- 574 -
7 వికెట్లతో సత్తా చాటిన షమీ.. రీఎంట్రీ అదుర్స్..!
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ రీఎంట్రీలో అదరగొట్టాడు. 360 రోజుల తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లోకి అడుగుపెట్టిన షమీ.. వచ్చీ రాగానే రంజీ మ్యాచ్‌లో తన ప్రతాపం చూపించాడు. రంజీల్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించే షమీ మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తంగా ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన షమీ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో షమీ బ్యాట్‌తోనూ రాణించాడు. 36 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో షమీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించడంతో మధ్యప్రదేశ్‌పై బెంగాల్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది.MOHAMMAD SHAMI PICKED 7 WICKETS IN HIS FIRST COMPETITIVE MATCH IN 360 DAYS. ❤️pic.twitter.com/e231mVfTDM— Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ 228 పరుగులకు ఆలౌటైంది. షాబాజ్ అహ్మద్ (92), అనుస్తుప్ మజుందార్ (44) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆర్మన్ పాండే, కుల్వంత్ కేజ్రోలియా తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ 167 పరుగులకే కుప్పకూలింది. షమీ (4/54) మధ్యప్రదేశ్ పతనాన్ని శాశించాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సేనాపతి (47), రజత్ పాటిదార్ (41) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.61 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ 276 పరుగులకు ఆలౌటైంది. విృత్తిక్ ఛటర్జీ (52) అర్ద సెంచరీతో రాణించగా.. సుదీప్ ఘరామీ (40), సుదీప్ ఛటర్జీ (40), వృద్దిమాన్ సాహా (44), షమీ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు.338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్.. షమీ (3/102), షాబాజ్ అహ్మద్ (4/48), రోహిత్ కుమార్ (2/47), మొహమ్మద్ కైఫ్ (షమీ తమ్ముడు) (1/50) ధాటికి 326 పరుగులకు ఆలౌటైంది. సేనాపతి (50), శుభమ్ శర్మ (61), వెంకటేశ్ అయ్యర్ (53) మధ్యప్రదేశ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. -
చరిత్రపుటల్లోకెక్కిన మ్యాక్స్‌వెల్.. అత్యంత వేగంగా..!
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ చరిత్రపుటల్లకెక్కాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన మ్యాక్సీ.. టీ20ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 10000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మ్యాక్సీకి ముందు ఈ రికార్డు కీరన్ పోలార్డ్ పేరిట ఉండేది. పోలీ 6640 బంతుల్లో 10000 పరుగుల మార్కును క్రాస్ చేయగా.. మ్యాక్సీ కేవలం 6505 బంతుల్లోనే ఈ అరుదైన మైలురాయిని అధిగమించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 10000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో మ్యాక్సీ, పోలీ తర్వాత క్రిస్ గేల్ (6705), అలెక్స్ హేల్స్ (6774), జోస్ బట్లర్ (6928) ఉన్నారు.పొట్టి ఫార్మాట్లో పది వేల పరుగులు పూర్తి చేసుకున్న మ్యాక్సీ.. పురుషుల క్రికెట్లో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదహారో బ్యాటర్‌గా.. అదే విధంగా మూడో ఆసీస్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. మాక్సీ (10031) కంటే ముందు డేవిడ్ వార్నర్(12411), ఆరోన్ ఫించ్(11458) ఆస్ట్రేలియా తరఫున పదివేల పరుగుల క్లబ్లో ఉన్నారు. పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు దక్కుతుంది. గేల్ ఈ ఫార్మాట్లో 10060 బంతులు ఎదుర్కొని 14562 పరుగులు చేశాడు.కాగా, ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య ఇవాళ (నవంబర్ 16) రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 13 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.సిడ్నీ వేదికగా జరిగిన ఇవాల్టి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హరీస్ రౌఫ్ (4/22), అబ్బాస్ అఫ్రిది (3/17), సూఫియాన్ ముఖీమ్ (2/21) ఆసీస్ పతనాన్ని శాశించారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 19.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ ఐదు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. ఆడమ్ జంపా రెండు, జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖాన్ (52) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఐదేసిన స్పెన్సర్ జాన్సన్.. పాక్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన ఆసీస్.. ఇవాళ (నవంబర్ 16) జరిగిన రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేక్ ఫ్రేజర్ (20), మ్యాక్స్‌వెల్ (21), స్టోయినిస్ (14), టిమ్ డేవిడ్ (18), ఆరోన్ హార్డీ (28) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ (4/22), అబ్బాస్ అఫ్రిది (3/17), సూఫియాన్ ముఖీమ్ (2/21) ఆసీస్ పతనాన్ని శాశించారు.SPENSER JOHNSON FIVE WICKET HAUL.- A terrific spell against Pakistan! 👌pic.twitter.com/W8J1lMp4Xl— Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2024అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 19.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ ఐదు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. జాన్సన్‌కు టీ20 కెరీర్లో ఇది తొలి ఐదు వికెట్ల ఘనత. మరో ఎండ్‌లో ఆడమ్ జంపా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. జంపా నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మరో పేసర్ జేవియర్ బార్ట్లెట్ కూడా పొదుపుగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేశాడు. బార్ట్లెట్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు.పాక్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖాన్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఇర్ఫాన్ ఖాన్ (37 నాటౌట్), మొహమ్మద్ రిజ్వాన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బాబర్ ఆజమ్ 3, ఫర్హాన్ 5, అఘా సల్మాన్ 0, అబ్బాస్ అఫ్రిది 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 0, సూఫియాన్ ముఖీమ్ 0, హరీస్ రౌఫ్ 2 పరుగులకు ఔటయ్యారు. ఈ గెలుపుతో ఆసీస్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 హోబర్ట్ వేదికగా నవంబర్ 18న జరుగుతుంది. -
చరిత్ర సృష్టించిన హరీస్ రౌఫ్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో పాక్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా షాదాబ్ ఖాన్ సరసన నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (నవంబర్ 16) జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన రౌఫ్ ఈ ఘనత సాధించాడు. రౌఫ్ తన 72 ఇన్నింగ్స్‌ల టీ20 కెరీర్లో 107 వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్ 96 ఇన్నింగ్స్‌ల్లో 107 వికెట్లు పడగొట్టాడు. పాక్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో హరీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ తర్వాత షాహిద్ అఫ్రిది (97 వికెట్లు), షాహీన్ అఫ్రిది (96) ఉన్నారు. 2020లో టీ20 అరంగేట్రం చేసిన రౌఫ్ కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే పాక్ తరఫున లీడింగ్ వికెట్‌టేకర్‌గా అవతరించాడు.ఆసీస్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన రౌఫ్ మరో ఘనత కూడా సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అత్యుత్తమ గణాంకాలు (4-0-22-4) నమోదు చేసిన విదేశీ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు శ్రీలంకకు చెందిన నువాన్ కులశేఖర పేరిట ఉండేది. కులశేఖర 2017లో నాలుగు వికెట్లు తీసి 31 పరుగులిచ్చాడు. ఈ జాబితాలో రౌఫ్, కులశేఖర తర్వాత కృనాల్ పాండ్యా (4/36), క్రిస్ వోక్స్ (3/4), టిమ్ సౌథీ (3/6) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ (4/22), అబ్బాస్ అఫ్రిది (3/17), సూఫియాన్ ముఖీమ్ (2/21) ఆసీస్ పతనాన్ని శాశించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేక్ ఫ్రేజర్ (20), మ్యాక్స్‌వెల్ (21), స్టోయినిస్ (14), టిమ్ డేవిడ్ (18), ఆరోన్ హార్డీ (28) రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 18 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలవాలంటే 12 బంతుల్లో 24 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందిన విషయం తెలిసిందే. -
ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్
ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇండియా-ఏతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. గిల్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ చేతి వేలిని గాయపర్చుకున్నాడు. గాయం తీవ్రతపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. మెడికల్ టీమ్ గిల్‌కు తగిలిన గాయాన్ని దగ్గరి నుంచి పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తుంది. గిల్ గాయం నేపథ్యంలో అతను తొలి టెస్ట్ ఆడేది లేదన్నది సందిగ్దంలో పడింది.కాగా, గిల్ గాయానికి ముందు టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ కూడా ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డారు. ఈ ముగ్గురిలో రాహుల్ గాయం కాస్త తీవ్రమైందిగా తెలుస్తుంది. విరాట్ తనకు తగిలిన స్వల్ప గాయం నుంచి పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్ మ్యాచ్‌లో చురుకుగా పాల్గొన్నాడు. సర్ఫరాజ్ సైతం మోచేతి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని తెలుస్తుంది. శుభ్‌మన్ గిల్ గాయమే ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్కు ఆందోళన కలిగిస్తుంది.ఇదిలా ఉంటే, తొలి టెస్ట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్‌ను (యశస్వి జైస్వాల్‌తో కలిసి) ప్రారంభిస్తాడని తెలుస్తుంది. శుభ్‌మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే వన్‌డౌన్‌లో వస్తాడు. ఆతర్వాత విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు దిగుతారు. ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరో ఒకరికి తుది జట్టులో చోటు దక్కవచ్చు. ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా బరిలో ఉంటాడు. అశ్విన్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి టెస్ట్ అరంగేట్రం చేయడం ఖాయమని తెలుస్తుంది. స్పెషలిస్ట్ పేసర్లుగా బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ బరిలోకి దిగడం దాదాపుగా ఖయమైపోయింది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
నిప్పులు చెరిగిన హరీస్ రౌఫ్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన ఆస్ట్రేలియా
సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. హరీస్ రౌఫ్ నాలుగు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. రౌఫ్ వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగా బౌలింగ్ చేశాడు. మరో బౌలర్ అబ్బాస్ అఫ్రిది మూడు వికెట్లు తీశాడు. అబ్బాస్ కీలకమైన మాథ్యూ షార్ట్ వికెట్‌తో పాటు టెయిలెండర్ల వికెట్లు తీశాడు. స్పిన్నర్ సూఫియాన్ ముఖీమ్ నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 20, జోస్ ఇంగ్లిస్ 0, మ్యాక్స్‌వెల్ 21, స్టోయినిస్ 14, టిమ్ డేవిడ్ 18, ఆరోన్ హార్డీ 28, జేవియర్ బార్ట్లెట్ 5, స్పెన్సర్ జాన్సన్ 0 పరుగులకు ఔటయ్యారు. నాథన్ ఇల్లిస్ 1, ఆడమ్ జంపా 0 పరుగులతో అజేయంగా నిలిచారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. 7 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేయగా.. పాక్ 7 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 64 పరుగులు మాత్రమే చేయగలిగింది. 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
సిక్సర్ల వర్షం కురిపించిన రుతురాజ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్, భారత్-ఏ మధ్య వాకా వేదికగా ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏకు ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రెండు.. మానవ్ సుతార్, హర్షిత్ రాణా బౌలింగ్‌లో తలో సిక్సర్ బాదాడు. ఈ మ్యాచ్‌లో గంటకు పైగా బ్యాటింగ్ చేసిన రుతురాజ్ ఆతర్వాత సర్ఫరాజ్ ఖాన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. రుతురాజ్ ఇటీవలే ఆస్ట్రేలియా-ఏతో జరిగిన రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్-ఏ జట్టుకు సారథ్యం వహించాడు. ఈ సిరీస్‌లో రుతురాజ్ ఆశించిన మేరకు రాణించకపోయినప్పటికీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో మాత్రం ఇరగదీశాడు. తాజా ఇన్నింగ్స్‌తో రుతురాజ్ టీమిండియా మేనేజ్మెంట్ను మెప్పించి తుది జట్టులో (ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు) చోటు దక్కించుకుంటాడేమో వేచి చూడాలి.🚨 Updates from Perth 4 Sixes from Ruturaj Gaikwad - 2 Vs Ashwin 1 Vs Sutar and one vs Rana - After playing for more than an hour made his way to Sarfaraz Khan.#AUSvsIND pic.twitter.com/yGMIjk4Wzp— RevSportz Global (@RevSportzGlobal) November 16, 2024చెమటోడ్చిన విరాట్, యశస్వి, గిల్రుతురాజ్ విషయాన్ని పక్కన పెడితే, టీమిండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌లో చెమటోడ్చారు. ఈ ముగ్గురు ఈ మ్యాచ్‌లో తలో రెండుసార్లు బ్యాటింగ్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన విరాట్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆశాజనకమైన ప్రదర్శన చేశాడు. యశస్వి జైస్వాల్ షార్ట్ బాల్స్‌ను మంచి టెక్నిక్‌తో ఎదుర్కొన్నాడు. శుభ్‌మన్ గిల్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో తడబడినప్పటికీ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్థాయి మేరకు రాణించాడు. బౌలర్లలో ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముకేశ్ ఆస్ట్రేలియా-ఏతో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటాడు. అయితే అతను భారత మెయిన్ జట్టులో లేని విషయం తెలిసిందే. భారత సెలెక్టర్లు ముకేశ్‌ను ట్రావెలింగ్ రిజర్వగా ఎంపిక చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.