ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి మొదలు కానున్న తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడం దాదాపు ఖాయమైంది. తన భార్య రితికా సజ్దే రెండువ బిడ్డకు జన్మనివ్వడంతో మరింత ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడపాలని హిట్‌మ్యాన్ నిర్ణయించుకున్నాడంట. ఈ విషయాన్ని రోహిత్ ఇప్పటికే బీసీసీఐకు తెలియజేసినట్లు సమాచారం.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టుకు ముందు రోహిత్ జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండనున్నట్లు రోహిత్ ముందే సెలెక్టర్లు, బీసీసీఐకి తెలియజేశాడు. అయితే అతడి సతీమణి రితికా కాస్త ముందుగానే డెలివరీ కావడంతో రోహిత్ తొలి టెస్టుకు ముందు జట్టుతో చేరుతాడని అంతా భావించారు. కానీ రోహిత్ తన ముందు అనుకున్న విధంగానే రెండు టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు.
"తొలి టెస్టుకు ముందే రోహిత్ ఆస్ట్రేలియాకు చేరుకుంటాడని ఆశించాము. కానీ అతడు తనకు మరికొంత సమయం కావాలని, ఇప్పుడు ఆసీస్‌కు వెళ్లలేనని బీసీసీఐకి తెలియజేశాడు. బోర్డు అతడి నిర్ణయాన్ని గౌరవించింది. రోహిత్ అడిలైడ్‌లో జరిగే పింక్ బాల్ టెస్టు(రెండో టెస్టు)కు ముందు జట్టుతో కలవనున్నాడు. మొదటి టెస్టుకు, రెండో టెస్టుకు మధ్య తొమ్మిది రోజుల గ్యాప్ ఉంది. కాబట్టి ఆ సమయానికి రోహిత్ ఆస్ట్రేలియాకు చేరుకుంటాడని" బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు.
కెప్టెన్‌గా బుమ్రా..
ఇక రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత జట్టు కెప్టెన్‌గా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బాధ్యతలు చేపట్టనున్నాడు. పెర్త్ టెస్టులో బుమ్రా ముందుండి జట్టును నడిపించనున్నాడు. అదేవిధంగా రోహిత్ స్ధానంలో కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్‌ను జైశ్వాల్‌తో కలిసి ప్రారంభించే అవకాశముంది.
ప్రాక్టీస్‌లో గాయపడ్డ కేఎల్ రాహుల్ తిరిగి మైదానంలో వచ్చాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మరోవైపు యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తెలుగోడి అరంగేట్రం ఫిక్స్!?
Comments
Please login to add a commentAdd a comment