Cricket
-
క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి
సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను టి20ల్లో చిత్తు చేసిన తర్వాత వన్డే సిరీస్ కూడా గెలుచుకొని భారత జట్టు ఒక లాంఛనం ముగించింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఒకే ఒక వన్డే అందుబాటులో ఉంది. ఇప్పటికే సిరీస్ గెలుచుకుంది కాబట్టి బెంచీపై ఉన్న ఆటగాళ్లకు మేనేజ్మెంట్ ఒక అవకాశం ఇస్తుందా లేక విజయాల బాటలో ఉన్న జట్టును కొనసాగించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుందా అనేది చూడాలి. మరోవైపు ఇంగ్లండ్ కోణంలో ఇది కాస్త పరువు దక్కించుకునే ప్రయత్నం. ఇక్కడ ఆడిన 7 మ్యాచ్‌లలో 6 ఓడి నిరాశలో మునిగిన టీమ్ కనీసం చివరి పోరులోనైనా గెలిచి పర్యటనను ముగించాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతి పెద్ద స్టేడియం ఆఖరి పోరుకు వేదిక కానుంది. అహ్మదాబాద్: భారత గడ్డపై ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల పర్యటన చివరి అంకానికి చేరింది. సిరీస్ ఫలితం తేలిపోయిన తర్వాత నేడు మొతేరా లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే నామమాత్రపు చివరి వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. తాజా ప్రదర్శనను బట్టి చూస్తే అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియాకు మరో విజయం కూడా కష్టం కాకపోవచ్చు. ఇక్కడా గెలిచి సిరీస్‌ను 3–0తో సాధించాలని రోహిత్ శర్మ బృందం భావిస్తోంది. మరోవైపు కొంత కాలం క్రితం వరకు అభేద్యమైన టీమ్‌గా కనిపించిన ఇంగ్లండ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో పూర్తిగా విఫలమై చేతులెత్తేసింది. ఈ పోరు తర్వాత ఇరు జట్లు చాంపియన్స్ ట్రోఫీ బాట పడతాయి. కోహ్లి కొడతాడా! చాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ భారత్ బెంగ తీర్చాడు. చక్కటి సెంచరీతో సత్తా చాటుతూ అతను ఫామ్‌లోకి వచ్చాడు. శుబ్‌మన్ గిల్ వరుసగా రెండు అర్ధసెంచరీలతో ఆకట్టుకోగా, శ్రేయస్ అయ్యర్ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తమ విలువను చూపించారు. పదే పదే బ్యాటింగ్ ఆర్డర్ స్థానం మారడం వల్ల ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. పంత్‌కు కాకుండా రాహుల్‌కే మరో అవకాశం దక్కవచ్చు. అయితే అన్నింటికి మించి ప్రధాన బ్యాటర్లలో విరాట్ కోహ్లి ప్రదర్శన కోసమే అంతా ఎదురు చూస్తున్నారు. ఆసీస్ గడ్డపై తొలి టెస్టు తర్వాత మొదలైన వైఫల్యం రంజీ మ్యాచ్ మీదుగా ఇక్కడ రెండో వన్డే వరకు సాగింది. అతని స్థాయిని బట్టి చూస్తే ఎప్పుడైనా చెలరేగిపోగలడు. కానీ అలాంటి ఇన్నింగ్సే ఇంకా రావడం లేదు. 14 వేల మైలురాయికి మరో 89 పరుగుల దూరంలో ఉన్న కోహ్లి ఈ మ్యాచ్‌లోనే దానిని పూర్తి చేసుకుంటాడా చూడాలి. బౌలింగ్ విభాగంలో షమీ ఇంకా పూర్తిగా తన లయను అందుకోలేదని గత మ్యాచ్‌లో అర్థమైంది. యువ బౌలర్ హర్షిత్ రాణా కూడా తడబడుతున్నాడు. అతని స్థానంలో అర్‡్షదీప్‌ను ఆడించే విషయంపై మేనేజ్మెంట్ చర్చిస్తోంది. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబర్చడం మరో సానుకూలాంశం. ఓవరాల్‌గా అన్ని రంగాల్లో జట్టు పటిష్టంగా ఉంది. బాంటన్‌కు చాన్స్... ప్రత్యర్థితో పోలిస్తే ఇంగ్లండ్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఒక్క ఆటగాడు కూడా తనదైన స్థాయి ప్రదర్శనను కనబర్చి జట్టును గెలిపించేలా కనిపించడం లేదు. రెండు వన్డేల్లో ప్రధాన బ్యాటర్లంతా తలా ఓ చేయి వేసినా విజయానికి అది సరిపోలేదు. గతంలో చూపించి విధ్వంసకర బ్యాటింగ్ ఇంగ్లండ్ నుంచి రావడం లేదు. ఓపెనర్లు సాల్ట్, డకెట్ శుభారంభాలు ఇస్తున్నారు కానీ ఆ తర్వాత దానిని ఇతర బ్యాటర్లు కొనసాగించలేకపోతున్నారు. కెపె్టన్ బట్లర్, జో రూట్ మాత్రమే నమ్మకమైన ఆటగాళ్లుగా కనిపిస్తుండగా, రెండో వన్డేలో హ్యారీ బ్రూక్ మరీ నెమ్మదిగా ఆడాడు. ఒవర్టన్ స్థానంలో బాంటన్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. మరోవైపు బౌలింగ్ పూర్తిగా బలహీనంగా కనిపిస్తోంది. భారత బ్యాటర్ల ముందు ఈ బౌలర్లంతా అనామకుల్లా కనిపిస్తున్నారు. ఏ ఒక్కరిలో కూడా ప్రత్యర్థిని నిలువరించే సత్తా కనిపించడం లేదు. సాఖిబ్ స్థానంలో ఆర్చర్ బరిలోకి దిగవచ్చు. అట్కిన్సన్, వుడ్, రషీద్ ఏమాత్రం రాణిస్తారో చూడాలి. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, అక్షర్, జడేజా, రాణా, షమీ, వరుణ్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ), సాల్ట్, డకెట్, బాంటన్, రూట్, బ్రూక్, లివింగ్‌స్టోన్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్.పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ పిచ్. చక్కగా పరుగులు సాధించవచ్చు. వర్షసూచన ఏమాత్రం లేదు. వేడి వాతావరణం. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.13 మరో 13 పరుగులు చేస్తే రోహిత్ వన్డేల్లో 11 వేల మైలురాయిని అందుకుంటాడు. -
చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం... జట్టులోకి హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. టాప్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ ఐసీసీ ఈవెంట్‌కు దూరమయ్యాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న అతను పూర్తిగా కోలుకోలేదు. జాతీయ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్ అనంతరం అతని ఫిట్‌నెస్‌పై వైద్యులు బీసీసీఐకి నివేదిక అందించారు. ఇందులో గాయం తీవ్రతపై వివరాలు లేకున్నా... ఇప్పుడు బౌలింగ్ చేసే స్థితిలో లేడని మాత్రం స్పష్టమైంది. బుమ్రా ఆడటంపై చాలా రోజులుగా సందేహాలు ఉన్నా... ఇప్పుడు మాత్రమే బోర్డు దీనిని అధికారికంగా ధ్రువీకరించింది. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను సెలక్టర్లు ఎంపిక చేశారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కూడా 15 మంది సభ్యుల చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోకి తీసుకున్నారు. వరుణ్ కోసం యశస్వి జైస్వాల్‌ను టీమ్ నుంచి తప్పించారు. స్థిరమైన ఓపెనర్లుగా రోహిత్, గిల్ ఉండటంతో జైస్వాల్‌పై వేటు వేయాల్సి వచి్చంది. అయితే నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్లుగా జైస్వాల్, సిరాజ్, శివమ్ దూబేలను ఎంపిక చేశారు. వీరు అవసరమైతేనే దుబాయ్‌కు ప్రయాణిస్తారు. -
కరుణ్ నాయర్ సెంచరీ, దూబే మెరుపులు.. సెమీ ఫైనల్లో విదర్భ
రంజీ ట్రోఫీ 2024-25(Ranji Trophy)లో విదర్భ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. క్వార్టర్ ఫైనల్-2లో తమిళనాడుతో తలపడ్డ విదర్భ భారీ విజయం సాధించింది. నాగ్‌పూర్‌లో మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో ఏకంగా 198 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.కరుణ్ నాయర్ శతకంకాగా సొంత మైదానం విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో శనివారం టాస్ గెలిచిన అక్షయ్ వాడ్కర్ బృందం తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు అథర్వ టైడే(0), ధ్రువ్ షోరే(26)లతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఆదిత్య ఠాక్రే(5) ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో మిడిలార్డర్లో డానిశ్ మాలేవర్(75) అర్ధ శతకంతో రాణించగా.. కరుణ్ నాయర్(Karun Nair) శతక్కొట్టాడు.హర్ష్ దూబే హాఫ్ సెంచరీమొత్తంగా 243 బంతులు ఎదుర్కొన్న కరుణ్ 122 పరుగులు సాధించాడు. వీరిద్దరికి తోడుగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే(Harsh Dube) హాఫ్ సెంచరీ(69)తో మెరిశాడు. ఈ క్రమంలో విదర్భ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌట్ అయింది. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్, విజయ్ శంకర్ మూడేసి వికెట్లు దక్కించుకోగా.. మొహమ్మద్ రెండు, అజిత్ రామ్, మొహమద్ అలీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.తమిళనాడు బ్యాటర్లు విఫలంఅనంతరం బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు మొహమద్ అలీ(4), నారాయణ్ జగదీశన్(22)తో పాటు.. సాయి సుదర్శన్(7), బూపతి కుమార్(0) విఫలమయ్యారు. ఈ క్రమంలో ఆండ్రీ సిద్దార్థ్(65) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. హర్ష్ దూబే అతడిని పెవిలియన్‌కు పంపాడు.మిగతావాళ్లలో ప్రదోష్ పాల్(48), సోనూ యాదవ్(32) మాత్రం ఫర్వాలేదనిపించగా.. తమిళనాడు 225 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. విదర్భ బౌలర్లలో ఆదిత్య ఠాక్రే ఐదు వికెట్లతో చెలరేగగా.. యశ్ ఠాకూర్, నచికేత్ భూటే రెండేసి వికెట్లు, హర్ష్ దూబే ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కెప్టెన్ రాణించినా..ఈ క్రమంలో 128 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విదర్భ 272 పరుగులకు ఆలౌట్ అయింది. ఈసారి యశ్ రాథోడ్(112) శతకంతో చెలరేగగా.. హర్ష్ దూబే మరోసారి హాఫ్ సెంచరీ(64) సాధించాడు. ఇక తమిళనాడు బౌలర్లలో కెప్టెన్ సాయి కిషోర్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం 401 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు.. మంగళవారం నాటి ఆటలో భాగంగా 202 పరుగులకే కుప్పకూలింది. ప్రదోష్ పాల్(53), సోనూ యాదవ్(57) అర్ధ శతకాలతో రాణించగా.. మిగతా వాళ్లంతా కనీసం ఇరవై పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబే, నచికేత్ భూటే మూడేసి వికెట్లతో చెలరేగి తమిళనాడు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశారు. మరోవైపు ఆదిత్య ఠాక్రే, అక్షయ్ వాఖరే చెరో వికెట్ తీశారు.సెమీస్ పోరులో ముంబైతోఈ నేపథ్యంలో 198 పరుగులతో తమిళనాడును చిత్తుచేసిన విదర్భ సెమీస్ చేరుకుంది. శతక వీరుడు కరుణ్ నాయర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ సీజన్లో విదర్భ ఇప్పటికి ఎనిమిదింట ఏడు విజయాలు సాధించడం విశేషం. ఇక విదర్భ ఫైనల్ బెర్తు కోసం ముంబైతో తలపడుతుంది. మరోవైపు.. సౌరాష్ట్రపై గెలుపొందిన గుజరాత్ కూడా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. జమ్మూ కశ్మీర్- కేరళ జట్ల మధ్య మ్యాచ్‌లో విజేతతో గుజరాత్ అమీతుమీ తేల్చుకుంటుంది.చదవండి: శతక్కొట్టిన రహానే, చెలరేగిన శార్దూల్.. సెమీస్‌లో ముంబై119 ఏళ్ల రికార్డు బద్దలు: ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఐర్లాండ్ ఘనత -
వరల్డ్‌క్లాస్ ప్లేయర్.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ వారికే: క్రిస్ గేల్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో విజేతగా ఎవరన్న అంశంపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(Chris Gayle) తన అంచనా తెలియజేశాడు. ఈసారి టీమిండియానే టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. కాగా 2013లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. 2017లో ఫైనల్ చేరింది.తటస్థ వేదికపై రోహిత్ సేనఅయితే, నాటి టైటిల్ పోరులో దాయాది పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మరోసారి ఈ వన్డే ఫార్మాట్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు నిరాకరించింది.ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)తో ఈ విషయం గురించి చర్చించగా.. తటస్థ వేదికపై రోహిత్ సేన మ్యాచ్‌లు ఆడేలా హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలుత ఈ ప్రతిపాదనకు అంగీకరించకపోయినా.. ఐసీసీ చర్యలకు ఉపక్రమించడంతో దిగివచ్చింది. దీంతో దుబాయ్ వేదికగా టీమిండియా తమ మ్యాచ్‌లు ఆడేందుకు మార్గం సుగమమైంది.రెండు గ్రూపులుమరోవైపు.. పాకిస్తాన్‌లోని రావల్పిండి, కరాచి, లాహోర్ నగరాలను వేదికలుగా ఎంపిక చేశారు. ఇక ఈ టోర్నీకి ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ అర్హత సాధించగా.. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉండగా.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి.ఇక ఫిబ్రవరి 19న పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా మ్యాచ్‌తో చాంపియన్స్ ట్రోఫీ-2025కి తెరలేవనుంది. మరోవైపు.. టీమిండియా ఫిబ్రవరి 20న ఈ ఐసీసీ ఈవెంట్లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. లీగ్ దశలో తొలుత బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్ సేన.. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతంర మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడుతుంది.ఐసీసీ టోర్నీలలో అద్భుతంగాకాగా సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై తడబడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాదాపు లక్ష మందికి పైగా ప్రేక్షకుల నడుమ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై.. టైటిల్‌ను చేజార్చుకుంది. అయితే, అనంతరం టీ20 ప్రపంచకప్-2024లో ఆఖరి వరకు జైత్రయాత్ర కొనసాగించి చాంపియన్‌గా అవతరించింది.ఇదే జోరులో చాంపియన్స్ ట్రోఫీలోనూ అడుగుపెట్టనున్న రోహిత్ సేనకు.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ మంచి సన్నాహకంగా ఉపయోగపడుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలుత నాగ్‌పూర్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. కటక్‌లో జరిగిన రెండో వన్డేలోనూ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఇక రెండో వన్డే సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చి.. విధ్వంసకర శతకం(90 బంతుల్లో 119 రన్స్) బాదడం టీమిండియాకు అతిపెద్ద సానుకూలాంశంగా పరిణమించింది.అతడొక వరల్డ్‌క్లాస్ ప్లేయర్ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడిన విండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియానే ఫేవరెట్. టైటిల్ గెలిచే జట్టు ఇదే’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ.. ‘‘అతడొక వరల్డ్‌క్లాస్ ప్లేయర్. వన్డేల్లో డబుల్ సెంచరీలు చేసిన ఘనత అతడిది. హిట్‌మ్యాన్ అతడు. వన్డేల్లో నా సిక్సర్ల రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో విఫలమైనా మెగా టోర్నీలో మాత్రం తప్పక రాణిస్తాడు’’ అని క్రిస్ గేల్ విశ్వాసం వ్యక్తం చేశాడు.చదవండి: IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్ టైటాన్స్! -
భారత అత్యుత్తమ తుదిజట్టుకు ఆఖరి కసరత్తు.. వారిద్దరికి ఛాన్స్!
ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి భారత్ తన తుది జట్టును ప్రకటించడానికి సమయం దగ్గర పడుతోంది. జట్టులోని ఆటగాళ్ల ఫామ్ గురించి అంచనా వేయడానికి అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్(India vs England)తో బుధవారం జరిగే మూడో వన్డే మ్యాచ్ టీమిండియాకు చివరి అవకాశం. భారత్ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నందున.. ఈ మూడో వన్డేలో కొంతమంది ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ప్రయత్నించేందుకు వెసులుబాటు దొరుకుతుంది. ఫిబ్రవరి 19న పాకిస్తాన్(Pakistan)- దుబాయ్ వేదికగా ప్రారంభమయ్యే -2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను నిర్ణయించడానికి భారత్ కి ఇదే చివరి అవకాశం.పంత్‌కు అవకాశంకర్ణాటక వికెట్ కీపర్-బ్యాటర్ కెఎల్ రాహుల్ ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ వికెట్ కీపర్‌గా రాణించాడు. కానీ ఈ మూడో వన్డే లో రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ కు అవకాశం కల్పించడం తప్పనిసరి గా కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ భారత జట్టులో ప్రధాన వికెట్ కీపర్ అని కెప్టెన్ రోహిత్ శర్మ ఇంతకూ ముందే ప్రకటించినప్పటికీ పంత్ దూకుడుగా ఆడే స్వభావం వల్ల మిడిల్ ఆర్డర్లో అతనికి అవకాశం కల్పించే అవకాశం లేకపోలేదు.పైగా జట్టులో రెండో వికెట్ కీపర్ గా అతని ఎంపిక తప్పనిసరిగా కనిపిస్తోంది. పంత్కి వన్డేల్లో మెరుగైన రికార్డు (27 ఇన్నింగ్స్‌లలో 871 పరుగులు) ఉంది. అంతేగాక తన అసాధారణ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని క్షణాల్లో మార్చగల సత్తా పంత్‌కు ఉంది. మరోవైపు, ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వన్డేల్లో రాహుల్ వికెట్ కీపర్ గా రాణించినా తన బ్యాటింగ్‌తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. నాగ్‌పూర్ లో కేవలం రెండు పరుగులు చేయగా కటక్ లో పది పరుగులు చేశాడు. అయితే, ఎడమ చేతి వాటం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఇప్పటికే జట్టులో ఉండటంతో పంత్కి అది ప్రతికూలంగా మారవచ్చు.రాణా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్భారత్ ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ గురించి ఇంకా స్పష్టత లేక పోవడంతో.. అర్ష్‌దీప్ సింగ్ కి అవకాశం కల్పించే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ ఇంకా తన పూర్తి స్థాయి ఫామ్ కనిపించలేకపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వందేళ్లలో షమీ ప్రదర్శన అతని స్థాయికి తగ్గట్టుగా లేదు.ఫలితంగా తన పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ చేయలేక పోయాడు. ఈ కారణంగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేకు పేస్ బౌలర్ హర్షిత్ రాణా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకోవడం ఖాయం గా కనిపిస్తోంది. హర్షిత్ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు వన్డేల నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేలో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఆడే అవకాశం ఉంది.రేసులో వరుణ్ చక్రవర్తి ఇక కుల్దీప్ అవకాశం కల్పించిన ప్రతీ సారి తన వైవిధ్యమైన బౌలింగ్ తో రాణిస్తున్నాడు. ఈ కారణంగా అతనికి ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం తప్పనిసరిగా కనిపిస్తోంది. అయితే కుల్దీప్‌నకు వరుణ్ చక్రవర్తి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్లో వరుణ్ చక్రవర్తి తన అద్భుతమైన ప్రదర్శనతో నిలకడగా రాణిస్తూ భారత్ విజయానికి బాటలు వేస్తున్నాడు. ఈ కారణంగా భారత్ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ఆల్ రౌండర్లయిన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లను కూడా జట్టులో తీసుకోనే అవకాశం ఉంది. చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
శతక్కొట్టిన రహానే, చెలరేగిన శార్దూల్.. సెమీస్‌లో ముంబై
రంజీ ట్రోఫీ(Ranji Trophy) 2024-25 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై(Mumbai) సెమీస్‌కు దూసుకువెళ్లింది. క్వార్టర్ ఫైనల్-3 మ్యాచ్‌లో హర్యానా జట్టును మట్టికరిపించి టాప్-4కు అర్హత సాధించింది. కాగా రంజీ తాజా ఎడిషన్‌లో భాగంగా శనివారం క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు మొదలయ్యాయి.తొలి ఇన్నింగ్స్‌లో రహానే విఫలంఈ క్రమంలో కోల్‌కతా వేదికగా ముంబై హర్యానాతో తలపడింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే(0), ఆకాశ్ ఆనంద్(10)తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన సిద్ధేశ్ లాడ్(4) కూడా విఫలమయ్యాడు. కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane) సైతం 31 పరుగులకే వెనుదిరగగా.. టీమిండియా టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్(9), ఆల్‌రౌండర్ శివం దూబే(28) కూడా నిరాశపరిచారు.ఇలాంటి తరుణంలో ఆల్‌రౌండర్ షామ్స్ ములానీ 91 పరుగులతో రాణించగా.. మరో ఆల్‌రౌండర్ తనుశ్ కొటియాన్ 97 పరుగులతో చెలరేగాడు. ఫలితంగా ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులు చేసింది.అంకిత్ కుమార్ శతకం కారణంగాఅనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన హర్యానా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ అంకిత్ కుమార్ శతకం(136)తో మెరవగా.. మిగతా వాళ్ల నుంచి అతడికి ఎక్కువగా సహకారం లభించలేదు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ దెబ్బకు హర్యానా బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. అతడు 18.5 ఓవర్ల బౌలింగ్‌లో 58 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. మిగతా వాళ్లలో షామ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఈ నేపథ్యంలో పద్నాలుగు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై.. 339 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అజింక్య రహానే శతక్కొట్టగా(108).. సూర్యకుమార్ యాదవ్(70) చాన్నాళ్ల తర్వాత అర్ధ శతకం బాదాడు. మిగిలిన వాళ్లలో సిద్దేశ్ లాడ్ 43, శివం దూబే 48 పరుగులతో రాణించారు.అప్పుడు శార్దూల్.. ఇప్పుడు రాయ్స్టన్ఇక ముంబై విధించిన 353 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హర్యానా తడబడింది. ఓపెనర్ లక్ష్య దలాల్(64), సుమిత్ కుమార్(62) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. దీంతో 201 పరుగులకే హర్యానా కుప్పకూలింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు సాధించగా.. రాయ్స్టన్ డయాస్ ఐదు వికెట్లతో చెలరేగాడు. తనుశ్ కొటియాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇక హర్యానాపై ముంబై 152 పరుగుల తేడాతో గెలుపొందిన ముంబై వరుసగా రెండోసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. శార్దూల్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ముంబై వర్సెస్ హర్యానా(క్వార్టర్ ఫైనల్-3) సంక్షిప్త స్కోర్లు👉ముంబై స్కోర్లు: 315 & 339👉హర్యానా స్కోర్లు: 301 & 201👉ఫలితం: 152 పరుగుల తేడాతో హర్యానాను ఓడించిన ముంబై👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శార్దూల్ ఠాకూర్(ముంబై)- మొత్తం తొమ్మిది వికెట్లు.చదవండి: IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్ టైటాన్స్! -
ఐర్లాండ్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఘనత
ఐర్లాండ్ క్రికెట్ జట్టు(Ireland Cricket Team) సరికొత్త చరిత్ర లిఖించింది. టెస్టు(Test Format)ల్లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించింది. ‘హ్యాట్రిక్’ విజయాలతో 119 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. జింబాబ్వే(Zimbabwe)తో జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేసింది.రాణించిన ఆండీ మెక్‌బ్రిన్ కాగా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడే నిమిత్తం ఐర్లాండ్ జట్టు.. జింబాబ్వే పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో బులవాయో వేదికగా ఇరుజట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐరిష్ టీమ్ తొలుత బ్యాటింగ్ చేసింది.అయితే, జింబాబ్వే బౌలర్ల ధాటికి ఐర్లాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆండీ మెక్‌బ్రిన్ 90 పరుగులు(నాటౌట్), టెయిలెండర్ మార్క్ అడెర్ 78 పరుగులతో రాణించారు. ఫలితంగా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 260 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని ఏకంగా ఏడు వికెట్లతో చెలరేగగా.. ఎంగరవ రెండు, ట్రెవర్ గ్వాండు ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక జింబాబ్వే తమ మొదటి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌట్ అయి.. ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. నిక్ వెల్చ్ 90, ముజర్బాని 47 పరుగులతో రాణించారు.292 పరుగుల లక్ష్యం.. జింబాబ్వే బ్యాటర్ల వైఫ ల్యంఅనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఐర్లాండ్ 298 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా జింబాబ్వే ముందు 292 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఐరిష్ స్పిన్నర్ మాథ్యూ హంప్రెస్ ఆరు వికెట్లతో చెలరేగి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మరోవైపు బ్యారీ మెకార్తీ రెండు, మార్క్ అడెర్, ఆండీ మెక్‌బ్రిన్ ఒక్కో వికెట్ తీశారు.జింబాబ్వే బ్యాటర్లలో వెస్లీ మధెవెరె (195 బంతుల్లో 84; 8 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్రియాన్ బెనెట్ (72 బంతుల్లో 45; 3 ఫోర్లు), జొనాథన్ క్యాంప్‌బెల్ (62 బంతుల్లో 33; 3 ఫోర్లు) రాణించినా ఫలితం లేకపోయింది. 228 పరుగులకే జింబాబ్వే కుప్పకూలగా.. ఐర్లాండ్ 63 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. వరుసగా మూడో టెస్టు విజయంతద్వారా టెస్టుల్లో వరుసగా మూడో విజయాన్ని(‘హ్యాట్రిక్’) నమోదు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఐర్లాండ్ ప్లేయర్ ఆండీ మెక్‌బ్రిన్ (90 పరుగులు; 4 వికెట్లు)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.కాగా ఎనిమిదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి టెస్టు హోదా పొందిన ఐర్లాండ్ జట్టు ఆడిన తొలి ఏడు టెస్టుల్లోనూ ఓడిపోయింది. అయితే, గత ఏడాది మార్చిలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఎనిమిదో టెస్టులో గెలిచి ఈ ఫార్మాట్లో తొలి విజయం నమోదు చేసుకుంది. అనంతరం జింబాబ్వేతో గత ఏడాది జూలైలో జరిగిన తొమ్మిదో టెస్టులో నెగ్గి వరుసగా రెండో గెలుపు రుచి చూసింది.తాజాగా జింబాబ్వేతోనే జరిగిన టెస్టులో ఐర్లాండ్ 63 పరుగుల తేడాతో నెగ్గి ఈ ఫార్మాట్లో ఈ మేర ‘హ్యాట్రిక్’ సాధించింది. ఇప్పటి వరకు కేవలం పది టెస్టులే ఆడిన ఐర్లాండ్.. వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలుపొందడం ద్వారా.. అత్యంత తక్కువ టెస్టుల్లో ‘హ్యాట్రిక్’ విజయాలు అందుకున్న తొలి జట్టుగా చరిత్ర లిఖించింది. అంతకు ముందు సౌతాఫ్రికా 1906లో పద్నాలుగు మ్యాచ్‌ల తర్వాత హ్యాట్రిక్ కొట్టింది.తక్కువ మ్యాచ్‌ల వ్యవధిలోనే టెస్టుల్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన జట్లు👉ఐర్లాండ్- 10 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 2025👉సౌతాఫ్రికా- 14 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1906👉ఇంగ్లండ్- 23 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1886👉పాకిస్తాన్- 25 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1959👉వెస్టిండీస్- 35 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1950👉ఆస్ట్రేలియా- 50 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1898👉శ్రీలంక- 87 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1998👉బంగ్లాదేశ్- 88 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 2014👉ఇండియా- 109 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1969👉న్యూజిలాండ్- 260 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1998.చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్ టైటాన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) యాజమాన్యంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత్‌కు చెందిన టొరంట్ గ్రూపు(Torrent Group) ఈ ఫ్రాంఛైజీలో అరవై ఏడు శాతం వాటా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. కాగా అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ (ఐరిలియా కంపెనీ లిమిటెడ్) 2021లో ఐపీఎల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.నాడు రూ. 5,625 కోట్లతోభారీ స్థాయిలో ఏకంగా రూ. 5,625 కోట్లతో గుజరాత్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. అయితే, తమ వాటలో మెజారిటీ మొత్తాన్ని అమ్మేందుకు సీవీసీ క్యాపిటల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ విషయం గురించి సంస్థ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.‘‘టొరంట్ గ్రూపుతో చర్చలు కొలిక్కివచ్చినట్లే. మూడింట రెండు వంతుల వాటాను అమ్మేందుకు నిర్ణయం జరిగింది. యజమానులుగా సీవీసీ గ్రూప్ లాక్- ఇన్ పీరియడ్ ఫిబ్రవరి 2025తో ముగుస్తుంది. కాబట్టి అప్పుడు వారు తమ వాటాలను అమ్ముకునేందుకు స్వేచ్ఛ లభిస్తుంది.బీసీసీఐ అనుమతి తప్పనిసరిటొరంట్ గ్రూపు భారత ఫార్మాసుటికల్ రంగంలో కీలకమైనది. బీసీసీఐ 2021లో రెండు కొత్త ఫ్రాంఛైజీల నిర్వహణకు బిడ్లను ఆహ్వానించినపుడు ఈ గ్రూపు ఆసక్తి కనబరిచింది. ఈసారి తన ఆకాంక్షను నెరవేర్చుకోనుంది. అయితే, ఐపీఎల్ ఫ్రాంఛైజీ యాజమాన్య మార్పు జరగాలంటే బీసీసీఐ నుంచి అనుమతి తప్పనిసరి. త్వరలోనే ఇది జరుగుతుంది’’ అని పేర్కొన్నాయి.కాగా ఐపీఎల్ పాలక మండలి నుంచి అనుమతి లభించిన తర్వాత గుజరాత్ టైటాన్స్ పగ్గాలు చేతులు మారనున్నాయి. ఐపీఎల్-2025 సీజన్ నుంచే యాజమాన్యంలో మార్పులు అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక 2021లో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. తమ అరంగేట్ర ఎడిషన్‌లోనే చాంపియన్‌గా నిలిచింది.హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో చాంపియన్గాటీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టైటిల్ గెలిచింది. ఆ మరుసటి ఏడాది పాండ్యా సారథ్యంలోనే ఫైనల్‌కు చేరింది. అయితే, ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వీడి.. తన సొంతగూటికి చేరాడు. అతడు ముంబై ఇండియన్స్ సారథిగా బాధ్యతలు చేపట్టగా.. మరో టీమిండియా స్టార్, భవిష్య కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టైటాన్స్ పగ్గాలు చేపట్టాడు. గిల్ సారథ్యంలో ఇలాఅయితే, గిల్ సారథ్యంలో గతేడాది టైటాన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. టొరంట్ గ్రూపు విలువ దాదాపుగా 41 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇక టొరంట్ స్పోర్ట్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 2021లో అహ్మదాబాద్ కోసం రూ. 4653 కోట్లు, లక్నో ఫ్రాంఛైజీ కోసం రూ. 4356 కోట్లతో బిడ్ వేసింది. ఆ తర్వాత వుమెన్స్ ప్రీమియర్ లీగ్ బరిలోకి వచ్చిన టొరంట్ గ్రూప్ ఫ్రాంఛైజీ కొనుగోలు విషయంలో సఫలం కాలేకపోయింది. ఇప్పుడు ఏకంగా ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా మార్కులు కొట్టేసిన టైటాన్స్‌కు యజమానిగా మారనుంది.కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ పేరిట మొత్తం పదిజట్లు ఉన్నాయి.చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
వరుణ్ చక్రవర్తికి భంగపాటు
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)కి నిరాశే మిగిలింది. ప్రతిష్టాత్మక ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు తొలిసారిగా నామినేట్ అయిన అతడికి భంగపాటు తప్పలేదు. వరుణ్ మాదిరే ఇటీవల అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వెస్టిండీస్ స్పిన్నర్ జొమెల్ వారికన్(Jomel Warrican) అవార్డును ఎగురేసుకుపోయాడు.ఇదొక చిన్న మైలురాయివరుణ్ చక్రవర్తి, పాకిస్తాన్ స్పిన్నర్ నొమన్ అలీ(Noman Ali)లను వెనక్కినెట్టి జనవరి నెలకు గానూ వారికన్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డు గెలవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఈ ఏడాది టెస్టుల్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడమే నా లక్ష్యంగా ఉండేది. అయితే, ఇంత గొప్పగా దానిని సాధిస్తానని అనుకోలేదు.నా క్రికెట్ ప్రయాణంలో ఇదొక చిన్న మైలురాయి. ఇలాంటివి మరెన్నో సాధించాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్‌తో సిరీస్‌లో తప్పక రాణిస్తానని మా కెప్టెన్‌కు మాటిచ్చాను. మా నాన్న కళ్లెదుటే నా నుంచి ఇలాంటి గొప్ప ప్రదర్శన రావడం చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని వారికన్ హర్షం వ్యక్తం చేశాడు.పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్లోకాగా ఇటీల పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జొమెల్ వారికన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పాక్ గడ్డపై రెండు టెస్టుల్లో కలిపి మొత్తంగా పందొమ్మిది వికెట్లు తీశాడు. ముల్తాన్ వేదికగా తొలి టెస్టు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన ఈ 32 ఏళ్ల స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు కూల్చాడు.అయితే, ఈ మ్యాచ్‌లో విండీస్ బ్యాటర్ల వైఫల్యం కారణంగా పాకిస్తాన్ చేతిలో 127 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ముల్తాన్‌లోనే జరిగిన రెండో టెస్టులో వారికన్ వరుసగా నాలుగు, ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ పాకిస్తాన్‌ను 120 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో 2ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ సిరీస్’ అవార్డునూ వారికన్ సొంతం చేసుకున్నాడు.వరుణ్ మాయాజాలంమరోవైపు.. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 14 వికెట్లు కూల్చిన అతడి ఖాతాలో ఓ ఫైవ్ వికెట్ హాల్ కూడా ఉండటం విశేషం. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలిచిన వరుణ్.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అయితే, వారికన్తో పోటీలో వెనుకబడి విజేతగా నిలవలేకపోయాడు. విజేతగా బెత్ మూనీఇక మహిళా క్రికెటర్ల విభాగంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ జనవరి నెలకు గానూ ‘’ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో భాగంగా తన టెస్టు కెరీర్లో తొలి శతకం బాదిన ఆమె.. అంతకు ముందు టీ20 సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మూనీ ప్రదర్శనకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక అవార్డు వరించడం విశేషం.వెస్టిండీస్ స్పిన్నర్ కరిష్మా రామ్హరాక్, అండర్-19 ప్రపంచకప్-2025లో అదరగొట్టిన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ తెలుగమ్మాయి గొంగడి త్రిషలను వెనక్కి నెట్టి మూనీ అవార్డును సొంతం చేసుకుంది. కాగా అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు అవార్డులు ఇచ్చే క్రమంలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెలా నామినేట్ అయిన ఆటగాళ్లకు వచ్చిన ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయించి.. అవార్డును ప్రదానం చేస్తారు.చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం!
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) తీరుపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ విషయంలో గౌతీ అనుసరిస్తున్న వ్యూహాలు సరికావని విమర్శించాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel)ను ప్రమోట్ చేయడం బాగానే ఉన్నా.. అందుకోసం కేఎల్ రాహుల్(KL Rahul)ను బలి చేయడం సరికాదని హితవు పలికాడు.వరుసగా రెండింట గెలిచి.. సిరీస్ సొంతంకాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డేలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌లలో ఇప్పటికే రెండు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది రోహిత్ సేన. అయితే, ఈ సిరీస్‌లో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌ను కాదని సీనియర్ కేఎల్ రాహుల్‌కు పెద్దపీట వేసిన యాజమాన్యం.. బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం అతడిని డిమోట్ చేసింది.అతడికి ప్రమోషన్.. రాహుల్‌కు అన్యాయం?స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ఐదో స్థానంలో ఆడిస్తూ.. కేఎల్ రాహుల్‌ను ఆరో నంబర్ బ్యాటర్‌గా పంపింది. ఈ క్రమంలో నాగ్‌పూర్, కటక్ వన్డేల్లో అక్షర్ వరుసగా 52, 41 నాటౌట్ పరుగులు చేయగా... రాహుల్ మాత్రం విఫలమయ్యాడు. తొలి వన్డేలో రెండు, రెండో వన్డేలో పది పరుగులకే పరిమితమయ్యాడు.ఇది చాలా దురదృష్టకరంఈ పరిణామాలపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. అయితే, కేఎల్ రాహుల్ పరిస్థితి చూసి నాకు బాధ కలుగుతోంది.ఇది చాలా దురదృష్టకరం. అక్షర్ పటేల్ 30, 40 పరుగులు చేస్తున్నాడు. మంచిదే.. కానీ కేఎల్ రాహుల్ పట్ల మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు అన్యాయం. ఐదో స్థానంలో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అందుకు అతడి గణాంకాలే నిదర్శనం.ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదుకాబట్టి.. హేయ్.. గంభీర్ నువ్వు చేస్తున్నది తప్పు. పరిస్థితులకు అనుగుణంగా అక్షర్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపవచ్చు. కానీ ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదు. ఇలాంటి వాటి వల్ల దీర్ఘకాలం ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకూ తెలుసు. కీలకమైన మ్యాచ్‌లో ఇలాంటి వ్యూహాలు బెడిసికొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.రిషభ్ పంత్ విషయంలోనూ ఇలాగే చేస్తారా?అక్షర్ పటేల్‌తో నాకు ఎలాంటి సమస్యా లేదు. అతడికి ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు ఇస్తున్నారు. కానీ అందుకోసం రాహుల్‌ను ఆరో నంబర్లో ఆడిస్తారా? అలాగే చేయాలని అనుకుంటే రిషభ్ పంత్‌ను కూడా ఆరోస్థానంలోనే పంపండి. రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? వరల్డ్‌క్లాస్ ప్లేయర్‌గా పేరొందిన అద్భుతమైన ఆటగాడి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్ విధానాన్ని ఎండగట్టాడు. చదవండి: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన -
రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన పుజారా.. రంజీ క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర ఓటమి
రంజీ ట్రోఫీ నాలుగో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్రపై గుజరాత్ ఇన్నింగ్స్ 98 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర ప్లేయర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో చిరాగ్ జానీ (69), రెండో ఇన్నింగ్స్‌లో హార్విక్ దేశాయ్ (54) మాత్రమే అర్ద సెంచరీలతో పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో 2 పరుగులకే ఔటయ్యాడు.కలిసికట్టుగా రాణించిన గుజరాత్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 216 పరుగులకే ఆలౌటైంది. చింతన్ గజా 4, జయ్‌మీత్ పటేల్, సిద్దార్థ్ దేశాయ్ తలో 2, నగస్వల్లా, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. సౌరాష్ట్ర బ్యాటర్లలో చిరాగ్ జానీ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించగా.. హార్విక్ దేశాయ్ (22), పుజారా, షెల్డన్ జాక్సన్ (14), వసవద (39 నాటౌట్), ధర్మేంద్ర జడేజా (22), ఉనద్కత్ (14) రెండంకెల స్కోర్లు చేశారు.జయ్‌మీత్, ఉర్విల్ సెంచరీలుఅనంతరం బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. జయ్‌మీత్ పటేల్ (103), ఉర్విల్ పటేల్ (140) సెంచరీలతో కదంతొక్కగా.. మనన్ హింగ్రజియా (81) భారీ అర్ద సెంచరీతో రాణించాడు. వీరికి తోడు రవి బిష్ణోయ్ (45), చింతన్ గజా (39), విశాల్ జేస్వాల్ (28), ప్రియాంక్ పంచల్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోర్ చేసింది. సౌరాష్ట్ర బౌలర్లలో ధర్మేంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా.. చిరాగ్ జానీ 4, జయదేశ్ ఉనద్కత్ ఓ వికెట్ పడగొట్టారు.295 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. ఈ ఇన్నింగ్స్‌లో ఇంకా దారుణమైన ప్రదర్శన చేసింది. గుజరాత్ బౌలర్లు పి జడేజా (4 వికెట్లు), నగస్వల్లా (3), బిష్ణోయ్ (2), చింతన్ గజా (1) ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా గుజరాత్ ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. సౌరాష్ట్ర సెకెండ్ ఇన్నింగ్స్‌లో హార్విక్ దేశాయ్ (54) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చిరాగ్ జానీ (26), షెల్డన్ జాక్సన్ (27), వసవద (11), డి జడేజా (19), ఉనద్కత్ (29) రెండంకెల స్కోర్లు చేశారు.మిగతా మూడు క్వార్టర్ ఫైనల్స్‌లో ముంబై, హర్యానా.. విదర్భ, తమిళనాడు.. జమ్మూ అండ్ కశ్మీర్, కేరళ జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతం నాలుగో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌ల్లో రేపు ఫలితం తేలే అవకాశం ఉంది. -
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన
అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ట్రై సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (ఫిబ్రవరి 10) జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్లు లేక సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్ కోచ్‌ను బరిలోకి దించింది. మెజార్టీ శాతం ఆటగాళ్లు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇరుక్కుపోవడంతో ఈ టోర్నీలో సౌతాఫ్రికాకు ఆటగాళ్ల కొరత ఏర్పడింది. ఈ టోర్నీ కోసం సౌతాఫ్రికా సెలెక్టర్లు కేవలం 12 మంది సభ్యుల జట్టును మాత్రమే ఎంపిక చేశారు. ఈ 12లోనూ ఇద్దరు ఆటగాళ్లు ఎమర్జెన్సీ మీద మైదానాన్ని వీడటంతో ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ వాండిలే గ్వావు తప్పనిసరి పరిస్థితుల్లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా బరిలోకి దిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. అయితే ఇలాంటి ఘటన సౌతాఫ్రికాకు మాత్రం కొత్తేమీ కాదు. గత సీజన్లో అబుదాబీలో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు అస్వస్థతకు గురికావడంతో బ్యాటింగ్ కోచ్ జేమీ డుమినీ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా బరిలోకి దిగాడు.We don’t see that happening too often! 😅South Africa’s fielding coach Wandile Gwavu came on as a substitute fielder during the New Zealand innings! 👀#TriNationSeriesonFanCode pic.twitter.com/ilU5Zj2Xxn— FanCode (@FanCode) February 10, 2025ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో ఓడించి, ఫైనల్‌కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. అరంగట్రేం ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కీ (150) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఈ సెంచరీతో బ్రీట్జ్కీ వన్డే అరంగేట్రంలో 150 పరుగుల మార్కును తాకిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో వియాన్ ముల్దర్ (64) అర్ద సెంచరీతో.. జే స్మిత్ (41) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. కెప్టెన్ బవుమా (20), కైల్ వెర్రిన్ (1), ముత్తుసామి (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్‌కు ఓ వికెట్ దక్కింది.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. కేన్ విలియమ్సన్ (133) అజేయ శతకంతో విరుచుకుపడటంతో మరో 8 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. డెవాన్ కాన్వే (97) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ.. న్యూజిలాండ్ గెలుపుకు గట్టి పునాది వేశాడు. విలియమ్సన్.. గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి (28 నాటౌట్) న్యూజిలాండ్‌ను గెలుపు తీరాలు దాటించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 19, డారిల్ మిచెల్ 10, టామ్ లాథమ్ డకౌటయ్యారు.సౌతాఫ్రికా బౌలర్లలో ముత్తుసామి 2, ఈథన్ బాష్, జూనియర్ డాలా తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన విలియమ్సన్ వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీలో రేపు (ఫిబ్రవరి 12) జరుగబోయే మ్యాచ్‌లో (పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా) విజేత ఫిబ్రవరి 14న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్లో జరుగుతున్న టోర్నీ కావడంతో ఈ టోర్నీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
మరో క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మరో క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఐదు క్రికెట్ ఫ్రాంచైజీలు కలిగిన RIL.. తాజాగా ద హండ్రెడ్ లీగ్‌లోని ఓవల్ ఇన్విన్సిబుల్స్ (లండన్ బేస్డ్) ఫ్రాంచైజీలో 49 శాతం వాటాను సొంతం చేసుకుంది. మిగిలిన 51 శాతం వాటాను ఇన్విన్సిబుల్స్ మాతృ సంస్థ అయిన సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ (SCC) నిలబెట్టుకుంది.RIL, దాని అనుబంధ సంస్థ అయిన RISE వరల్డ్‌వైడ్ ద్వారా సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్విన్సిబుల్స్లో తమ వాటా కోసం RIL దాదాపు 644 కోట్ల రూపాయలు (60 మిలియన్ GBP) చెల్లించినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) విక్రయించిన మొట్టమొదటి ఫ్రాంచైజీ ఓవల్ ఇన్విన్సిబుల్స్. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ విలువ 1320 కోట్ల రూపాయలుగా (123 మిలియన్ GBP) ఉంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్‌ను ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ తమ కుటుంబంలోకి స్వాగతించారు.ఈ భాగస్వామ్యంతో ముంబై ఇండియన్స్ అభిమానుల స్థావరాన్ని భారత్‌తో పాటు న్యూయార్క్, UAE, దక్షిణాఫ్రికా, ఇప్పుడు ఇంగ్లండ్‌కు విస్తరిస్తున్నామని ఆమె అన్నారు. మా ప్రపంచ క్రికెట్ ప్రయాణంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామని నీతా అంబాని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.హండ్రెడ్ లీగ్‌లో ఫ్రాంచైజీని కొన్న మూడో ఐపీఎల్ జట్టు..కాగా, ద హండ్రెడ్ లీగ్‌లో ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీలైన లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పెట్టుబడులు పెట్టాయి. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీను సన్‌రైజర్స్ యాజమాన్యం సన్ గ్రూప్ హస్తగతం చేసుకుంది. ఈ ఫ్రాంచైజీలో మొత్తం వంద శాతాన్ని సన్ గ్రూప్ కొనుగోలు చేసింది.అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం RPSG గ్రూప్.. మాంచెస్టర్ ఒరిజినల్స్ (ఇంగ్లండ్) ఫ్రాంచైజీని కళ్లు చెదిరే ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఒరిజినల్స్ మొత్తం విలువలో 49 శాతాన్ని RPSG గ్రూప్ దక్కించుకుంది. భారత కరెన్సీలో ఈ వాటా విలువ రూ. 1251 కోట్లు.హండ్రెడ్ లీగ్‌లో ఇన్విన్సిబుల్స్ హవాఓవల్ ఇన్విన్సిబుల్స్ మహిళల జట్టు 2021, 2022 ఎడిషన్లలో ద హండ్రెడ్ విజేతగా నిలిచింది. పురుషుల జట్టు 2023, 2024 ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచింది.ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుముంబై ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉంది. ఈ ఫ్రాంచైజీ 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్ రెండు సందర్భాలలో ఛాంపియన్స్ లీగ్‌ను కూడా గెలుచుకుంది. ఇటీవల, MI కేప్ టౌన్ SA20 2025 టైటిల్‌ను కూడా గెలుచుకుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంఐ ఫ్రాంచైజీలు ఇవే..!ముంబై ఇండియన్స్ (ఐపీఎల్), ముంబై ఇండియన్స్ (డబ్ల్యూపీఎల్), ఎంఐ న్యూయార్క్ (మేజర్ లీగ్ క్రికెట్), ఎంఐ కేప్‌టౌన్ (సౌతాఫ్రికా టీ20 లీగ్), ఎంఐ ఎమిరేట్స్ (ఇంటర్నేషనల్ లీగ్ టీ20), తాజాగా ఓవల్ ఇన్విన్సిబుల్స్ (ద హండ్రెడ్ లీగ్) -
41వ శతకంతో మెరిసిన రహానే
హర్యానాతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ (Ranji Trophy Quarter Final) మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 200వ మ్యాచ్ ఆడుతున్న రహానేకు ఇది 41వ సెంచరీ. రహానే ఈ సెంచరీని 160 బంతుల్లో పూర్తి చేశాడు. ఇందులో 12 ఫోర్లు ఉన్నాయి. సెంచరీ తర్వాత కొద్ది సేపే క్రీజ్‌లో ఉన్న రహానే 108 పరుగుల వద్ద ఔటయ్యాడు. రహానే సూపర్ సెంచరీ కారణంగా ముంబై హర్యానా ముందు 354 పరుగుల భారీ లక్ష్యాన్ని (తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 14 పరుగుల లీడ్ కలుపుకుని) ఉంచింది. ముంబై సెకెండ్ ఇన్నింగ్స్‌లో 339 పరుగులకు ఆలౌటైంది. రహానే.. సూర్యకుమార్ యాదవ్‌తో (70) కలిసి నాలుగో వికెట్‌కు 129 పరుగులు.. శివమ్ దూబేతో (48) కలిసి ఐదో వికెట్‌కు 85 పరుగులు జోడించాడు. ముంబై ఇన్నింగ్స్‌లో ఆయుశ్ మాత్రే (31), సిద్దేశ్ లాడ్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హర్యానా బౌలర్లలో అనూజ్ థక్రాల్ 4, సుమిత్ కుమార్, అన్షుల్ కంబోజ్, జయంత్ యాదవ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.ఆరేసిన శార్దూల్అంతకుముందు హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అంకిత్ కుమార్ (136) సెంచరీ చేసి హర్యానాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అంకిత్ మినహా హర్యానా ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ 6 వికెట్లు తీసి హర్యానా పతనాన్ని శాశించాడు. షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు తీశారు.సెంచరీలు చేజార్చుకున్న ములానీ, కోటియన్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 315 పరుగులకు ఆలౌటైంది. రహానే (310 మినహా ముంబై టాపార్డర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆయుశ్ మాత్రే 0, ఆకాశ్ ఆనంద్ 10, సిద్దేశ్ లాడ్ 4, సూర్యకుమార్ యాదవ్ 9, శివమ్ దూబే 28, శార్దూల్ ఠాకూర్ 15 పరుగులకు ఔటయ్యారు. ఏడు, తొమ్మిది స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన షమ్స్ ములానీ (91), తనుశ్ కోటియన్ (97) భారీ అర్ద సెంచరీలు సాధించి ముంబైకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరిద్దరూ లేకపోయుంటే ముంబై 200 పరుగలలోపే ఆలౌటయ్యేది. హర్యానా బౌలరల్లో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్ చెరో 3 వికెట్లు.. అనూజ్ థాక్రాల్, అజిత్ చహల్, జయంత్ యాదవ్, నిషాంత్ సంధు తలో వికెట్ పడగొట్టారు. -
కటక్ వన్డేలో ఫ్లడ్ లైట్ల సమస్య.. బీసీసీఐపై ఎదురుదాడికి దిగిన పాక్ అభిమానులు
భారత్, ఇంగ్లండ్ మధ్య కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఫ్లడ్ లైట్లు మొరాయించిన విషయం తెలిసిందే. ఛేదనలో భారత ఇన్నింగ్స్ ఏడో ఓవర్ సందర్భంగా అకస్మాత్తుగా కొన్ని ఫ్లడ్ లైట్ ఆగిపోయాయి. ఊహించని ఈ పరిణామంతో ఇరు జట్ల ఆటగాళ్లు విస్మయానికి గురయ్యారు. ఫీల్డ్ అంపైర్లు ఆటగాళ్లను మైదానాన్ని వీడాల్సిందిగా కోరారు. ఫ్లడ్ లైట్లు ఆగిపోవడంతో కొద్ది సేపు ఆటకు అంతరాయం కలిగింది. మైదాన సిబ్బంది వెంటనే స్పందించడంతో ఫ్లడ్ లైట్లు మళ్లీ ఆన్ అయ్యాయి. తదనంతరం మ్యాచ్ యధావిధిగా కొనసాగింది.కాగా, ఈ ఉదంతం జరగడానికి ఒక్క రోజు ముందు ఇదే ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. ట్రై సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 38వ ఓవర్ మూడో బంతిని కుష్దిల్ షా.. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా స్వీప్ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచింది. ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న రచిన్ రవీంద్ర క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు. అయితే రచిన్ బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా అతని నుదిటిపై తాకింది. బంతి బలంగా తాకడంతో రచిన్‌కు తీవ్ర రక్తస్రావమైంది. ఫ్లడ్ లైట్ల వెలుతురు సరిగ్గా లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన రచిన్‌ను వెంటనే అస్పత్రికి తరలించారు.ఫ్లడ్ లైట్ల కారణంగా రచిన్‌కు తీవ్రమైన గాయమైన నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు పాక్ క్రికెట్ బోర్డును ఏకి పారేశారు. చెత్త లైటింగ్ కారణంగా ఈ ఘోరం జరిగిందని దుయ్యబట్టారు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేది పెట్టుకుని ఇంత నాసిరకమైన ఏర్పాట్లు ఏంటని మండిపడ్డారు. ఇలాంటి మైదానానికి ఓకే చెప్పినందుకు ముందుగా ఐసీసీని నిందించాలని అంన్నారు. తక్షణమే గడాఫీ స్టేడియానికి మరమ్మత్తులు చేయాలని సూచించారు. లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను పాక్ నుంచి దుబాయ్‌కు మార్చాలని కోరారు.భారత అభిమానుల ఘాటైన విమర్శల అనంతరం కటక్ ఉదంతాన్ని బూచిగా చూపెడుతూ పాక్ అభిమానులు బీసీసీఐపై విమర్శలు ఎక్కు పెట్టారు. బీసీసీఐకు ఫ్లడ్ లైట్లు అవసరమైతే పాక్ క్రికెట్ బోర్డు సరఫరా చేస్తుందని సెటైర్లు వేస్తున్నారు. మమ్మల్ని నిందించే ముందు మీ విషయాన్ని సరి చూసుకోండని హితవు పలుకుతున్నారు. రచిన్ ఉదంతంపై భారత అభిమానులు స్పందించినందుకు బీసీసీఐపై ఎదురుదాడికి దిగుతున్నారు. -
బుమ్రాపై నేడు తుది నిర్ణయం.. చాంపియన్స్ ట్రోఫీ తుది జట్ల ఖరారుకు నేడు ఆఖరి రోజు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy) భారత స్టార్ పేసర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Burah) ఆడతాడా లేదా అనేది నేడు తేలిపోతుంది. అతని ఫిట్నెస్ నివేదికను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ సెలక్టర్లు మంగళవారం నిర్ణయం తీసుకుంటారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రాకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఇటీవలే స్కానింగ్ జరిగింది. దీనిపై డాక్టర్లు ఇచ్చే నివేదికను పరిశీలించిన అనంతరం సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. జనవరిలో ఆ్రస్టేలియాతో సిడ్నీతో జరిగిన చివరి టెస్టు తర్వాత బుమ్రా మళ్లీ బరిలోకి దిగలేదు. ఆ మ్యాచ్‌లోనూ నొప్పి కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయనే లేదు. అతను కనీసం ఐదు వారాల పాటు బౌలింగ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో బుమ్రా కూడా ఉన్నాడు. అయితే స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే చివరి వన్డేలో (బుధవారం) ఆడి అతను తన ఫిట్నెస్ నిరూపించుకుంటాడని భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే బుమ్రా ఈ మ్యాచ్ కూడా ఆడటం సందేహమే. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకునేందుకు 11వ తేదీ వరకు అవకాశం ఉంది. బుమ్రా సిద్దంగా లేకపోతే ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణాకు (Harshit Rana) టీమ్‌లో స్థానం లభించవచ్చు. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణా తొలి రెండు వన్డేల్లో బరిలోకి దిగాడు. -
దివ్యాంగుల క్రికెట్ టోర్నీని ప్రారంభించిన తిలక్ వర్మ
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల ఇంటర్ జోనల్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌ను (Physically Diabled Cricket Tourney) భారత జట్టు సభ్యుడు తిలక్ వర్మతో (Tilak Varma) కలిసి హైదరాబాద్ క్రికెట్ సంఘం (Hyderabad Cricket Association) (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ప్రారంభించారు. సోమవారం ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైన ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ... హెచ్‌సీఏ తరఫున దివ్యాంగ క్రికెటర్లను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. తాము మిగిలిన వారిలానే క్రికెట్ ఆడగలమని నిరూపించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క దివ్యాంగ క్రికెటర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. దివ్యాంగ క్రికెటర్ల కోసం కూడా ఐపీఎల్ తరహాలో ఒక లీగ్‌ను నిర్వహించే ఆలోచనను చేయాలని డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఏసీహెచ్ అధ్యక్షుడు సురేందర్ అగర్వాల్, హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి జాన్ మనోజ్, మాజీ ఉపాధ్యక్షుడు మొయిజ్ పాల్గొన్నారు. -
రోహిత్‌లాగే కోహ్లి కూడా ఫామ్‌లోకి వస్తాడు.. చాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే..!
ముంబై: భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) రాణిస్తే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) భారత్ వశమవుతుందని శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) అన్నాడు. రిలయన్స్ శీతల పానియాల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన అతను మీడియాతో ముచ్చటించాడు. ‘ఇద్దరు అసాధారణ ఆటగాళ్లు. ప్రపంచ శ్రేణి బ్యాటర్లు. ఎప్పుడైనా సరే క్లాస్ శాశ్వతం. ఫామ్ లేకపోవడం తాత్కాలికం. తప్పకుండా రోహిత్‌లాగే కోహ్లి కూడా ఫామ్‌లోకి వస్తాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగితే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంటుంది’ అని మురళీ వివరించాడు. రోహిత్ బృందం ఆల్‌రౌండ్ వనరులతో పటిష్టంగా కనబడుతోందన్నాడు. భారత్ సహా పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో నాణ్యమైన స్పిన్ బౌలర్లు ఉన్నారని, పాకిస్తాన్‌లోని పిచ్‌లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయని చెప్పాడు. -
విలియమ్సన్ వీరోచితం
లాహోర్: ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో రెండు వరుస విజయాలతో న్యూజిలాండ్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి పోరులో ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌ను చిత్తు చేసిన కివీస్ రెండో లీగ్ మ్యాచ్‌లో సఫారీలను ఓడించింది. సోమవారం జరిగిన ఈ పోరులో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తోనే వన్డేల్లో అరంగేట్రం చేసిన మాథ్యూ బ్రీజ్కీ (148 బంతుల్లో 150; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకంతో చెలరేగాడు. కెరీర్ తొలి వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా బ్రీజ్కీ ఘనత సాధించాడు. వియాన్ ముల్డర్ (60 బంతుల్లో 64; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, జేసన్ స్మిత్ (51 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 4 వికెట్లకు 308 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేన్ విలియమ్సన్ (113 బంతుల్లో 133 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు సెంచరీ సాధించగా... ఓపెనర్ డెవాన్ కాన్వే (107 బంతుల్లో 97; 9 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో చేజార్చుకున్నాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 187 పరుగులు జోడించారు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత విలియమ్సన్కు ఇదే మొదటి శతకం కావడం విశేషం. దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు వన్డేల్లో ఇది వరుసగా ఐదో ఓటమి. బ్రీజ్కీతో పాటు మరో ముగ్గురు బౌలర్లు ఈథన్ బాష్, సెనురాన్ ముత్తుసామి, మిహ్లాలి ఎంపొంగ్వానా ఇదే వన్డేతో అరంగేట్రం చేశారు. దాంతో జట్టు బౌలింగ్ బలహీనంగా మారిపోయింది. బుధవారం పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ ఫలితం తర్వాత న్యూజిలాండ్‌తో ఫైనల్లో తలపడే జట్టేదో తేలుతుంది. 150: దక్షిణాఫ్రికా క్రికెటర్ మాథ్యూ బ్రీజ్కీ అరంగేట్రం వన్డేలో చేసిన స్కోరు. ఆడిన తొలి వన్డేలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా బ్రీజ్కీ నిలిచాడు. 47 ఏళ్లుగా వెస్టిండీస్ ప్లేయర్ డెస్మండ్ హేన్స్ పేరిట ఉన్న రికార్డును బ్రీజ్కీ బద్దలు కొట్టాడు. 1978లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో హేన్స్ 148 పరుగులు సాధించాడు. 4: బరిలో దిగిన తొలి వన్డేలోనే సెంచరీ చేసిన నాలుగో దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా బ్రీజ్కీ గుర్తింపు పొందాడు. గతంలో కొలిన్ ఇంగ్రామ్ (124; జింబాబ్వేపై 2010లో), తెంబా బవూమా (113; ఐర్లాండ్‌పై 2016లో), రీజా హెన్డ్రిక్స్ (102; శ్రీలంకపై 2018లో) ఈ ఘనత సాధించారు. 2: దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన క్రమంలో న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ వన్డేల్లో 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తక్కువ ఇన్నింగ్స్‌లలో 7 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా విలియమ్సన్ (159 ఇన్నింగ్స్) నిలిచాడు. ఈ జాబితాలో హాషిమ్ ఆమ్లా (150 ఇన్నింగ్స్) తొలి స్థానంలో ఉన్నాడు. -
కోహ్లి ఫామ్‌లోకి వస్తే భారత్‌కు తిరుగులేదు..
ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్ట్ నుండి పేలవమైన ఫామ్ కారణంగా వైదొలిగిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాత జరిగిన రంజీ ట్రోఫీ టోర్నమెంట్ లో కూడా ఆశించిన విధంగా రాణించలేక పోయాడు. ఈ నేపధ్యం లో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ముందు రోహిత్ మళ్ళీ ఫామ్ లోకి రావడం చాల ముఖ్యమైన విషయం.వరుసగా పది ఇన్నింగ్స్‌ల లో ( తొమ్మిది టెస్టులు, ఒక వన్డే) విఫలమైన రోహిత్ చివరికి ఆదివారం కటక్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో తన మునుపటి ఫామ్ ని ప్రదర్శించి సిక్సర్ల మోత మోగించాడు. రోహిత్ కటక్ ప్రేక్షకులను నిజంగా అలరించాడు, 12 ఫోర్లు మరియు 7 సిక్సర్లు తో వన్డేల్లో తన 32వ సెంచరీ సాధించి, భారత్ ఈ మూడు మ్యాచ్ ల సిరీస్ చేజిక్కించుకునేందుకు తన వంతు పాత్ర పోషించాడు. జట్టు రధ సారధి లాగా ముందుండి నడిపించాడు.ఈ సెంచరీతో, రోహిత్ 30 ఏళ్లు నిండిన క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన భారత క్రికెటర్ గా రికార్డ్ నమోదు చేసాడు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ గతంలో 35 సెంచరీలు తో చేసిన రికార్డును రోహిత్ అధిగమించాడు. భారత్ తరపున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన వారి లో రోహిత్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ అన్ని ఫార్మాట్లలో ఓపెనర్‌గా 15,404 పరుగులు సాధించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ 15,335 పరుగులతో సాధించిన మరో రికార్డును కూడా రోహిత్ ఈ మ్యాచ్ తో అధిగమించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 15,758 పరుగులతో ఈ జాబితా లో అగ్ర స్థానం లో ఉన్నాడు. "చాలా సంవత్సరాలుగా నేను క్రికెట్ ఆడుతున్నాను. నేను ఏమి చేయాలో నాకు తెల్సు. నా నుండి ఏమి అవసరమో నాకు అర్థమైంది. పిచ్ లోకి వెళ్లి నేను చేసింది అదే" అని రోహిత్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.రోహిత్ మళ్ళీ ఫామ్ లోకి రావడంతో భారత్ జట్టు మానేజిమెంట్ కి పెద్ద తలనొప్పి తగ్గింది. ఇక మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సెంచరి సాధించినట్టయితే ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు భారత్ బ్యాటింగ్ గాడి లో పడినట్టే. బ్యాటింగ్ స్థానం లో మార్పులుఅయితే భారత్ బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు పై పలువురు మాజీ ఆటగాళ్లు జట్టు మేనేజిమెంట్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ కంటే ముందుగా పంపడం పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన రాహుల్ జట్టు అవసరాల అనుగుణంగా బ్యాటింగ్ స్థానాన్ని మార్చడం పై జట్టు మేనేజిమెంట్ పలు విమర్శలు ఎదుర్కొంటోంది."అక్షర్ పటేల్ మళ్ళీ కెఎల్ రాహుల్ కంటే ముందుగా బ్యాటింగ్ రావడమేమిటి? నాకు మాటలు కూడా రావడం లేదు. రాహుల్ లాంటి నైపుణ్యమైన బాట్స్మన్ ని ఆరో స్థానానికి నెట్టడం చాల దారుణం. అక్షర్‌ను రాహుల్ కన్నా ముందుగా బ్యాటింగ్ పంపడం. అదీ ఇలాంటి పిచ్ పై సరైన నిర్ణయం కాదు, అని భారత్ మాజీ ఆటగాడు దొడ్డ గణేష్ వ్యాఖ్యానించాడు. -
SA Vs NZ: చరిత్ర సృష్టించిన విలియమ్సన్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్(Kane Williamson) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కివీస్ జట్టు ప్రస్తుతం పాకిస్తాన్ వేదికగా మక్కోణపు సిరీస్‌లో తలపడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన కేన్ మామ.. సోమవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.టీ20 తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విలియమ్సన్ కేవలం 72 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇది విలియమ్సన్కు ఐదేళ్ల తర్వాత వచ్చిన వన్డే సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా 113 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్.. 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు డెవాన్ కాన్వే(97) కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో 305 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.4 ఓవర్లలో చేధించింది.అంతకుమందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు. అతడితో పాటు వియాన్ ముల్డర్ (64), జాసన్ స్మిత్ (41) కూడా రాణించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఓ రూర్క్ తలా రెండు వికెట్లు పడగొట్టగా..బ్రాస్‌వెల్ ఓ వికెట్ సాధించాడు.చరిత్ర సృష్టించిన విలియమ్సన్..ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు అందుకున్న రెండో బ్యాటర్‌గా విలియమ్సన్ రికార్డులకెక్కాడు. 159 ఇన్నింగ్స్‌లలో కేన్ ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విరాట్ కోహ్లి(161 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కోహ్లి రికార్డును విలియమ్సన్ బ్రేక్ చేశాడు. అయితే కివీస్ తరపున ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్ మాత్రం కేన్ మామనే కావడం విశేషం.వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు1. హషీమ్ ఆమ్లా: 150 ఇన్నింగ్స్‌లు2. కేన్ విలియమ్సన్: 159 ఇన్నింగ్స్‌లు3. విరాట్ కోహ్లీ: 161 ఇన్నింగ్స్‌లు4. ఏబీ డివిలియర్స్: 166 ఇన్నింగ్స్‌లు5. సౌరవ్ గంగూలీ: 174 ఇన్నింగ్స్‌లు -
మార్టిన్ గప్టిల్ ఊచకోత.. 42 బంతుల్లో 160 పరుగులు! వీడియో వైరల్
న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటకి.. తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. లెజెండ్స్ 90 లీగ్ టోర్నీలో గప్టిల్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో ఛత్తీస్‌గఢ్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గప్టిల్.. సోమవారం రాయ్‌పూర్ వేదికగా బిగ్ బాయ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన గప్టిల్, ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసంతో రాయ్‌పూర్ స్టేడియం దద్దరిల్లిపోయింది. కేవలం 49 బంతులు మాత్రమే ఎదుర్కొన్న గప్టిల్.. 16 సిక్స్‌లు, 12 ఫోర్లతో 160 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో ఓపెనర్ రిషి ధావన్(42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు.తద్వారా తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌గఢ్ వారియర్స్ నిర్ణీత 90 బంతుల్లో వికెట్ నష్టపోకుండా 240 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బిగ్ బాయ్స్ జట్టు.. నిర్ణీత 90 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. బిగ్ బాయ్స్ బ్యాటర్లలో రాబిన్ బిస్ట్(55) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సౌరబ్ తివారీ(37) పరుగులతో రాణించారు. ఛత్తీస్‌గఢ్ వారియర్స్ బౌలర్లలో మనన్ శర్మ రెండు, అభిమన్యు మిథన్, ఖాలీం ఖాన్ తలా వికెట్ సాధించారు.తిరుగులేని గప్టిల్..కాగా న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో గప్టిల్ తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. 16 ఏళ్ల పాటు కివీస్‌కు ప్రాతనిథ్యం వహించిన గప్టిల్.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. టీ20ల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా గప్టిల్ ఉన్నాడు. 122 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 3531 పరుగులు చేశాడు. వన్డేల్లోనూ న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు (7,346) చేసిన మూడో బ్యాటర్‌గా ఉన్నాడు. అతడి కంటే ముందు రాస్ టేలర్ (8,607), స్టీఫెన్ ప్లెమింగ్ (8,007) ఉన్నారు.చదవండి: ICC Champions Trophy: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అంపైర్లు వీరే! ఐరెన్ లెగ్ లేడు Absolute carnage in Raipur! 🤯 Martin Guptill goes absolutely berserk, smashing 160 runs off just 49 deliveries, including 16 maximums! 😱#Legend90onFanCode pic.twitter.com/6Bpkw4aEA4— FanCode (@FanCode) February 10, 2025 -
విలియమ్సన్ విధ్వంసం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముంగిట పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ అదరగొడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా లహోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.305 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.4 ఓవర్లలో చేధించింది. ఈ భారీ లక్ష్య చేధనలో బ్లాక్ క్యాప్స్ ఆరంభంలోనే ఓపెనర్ విల్ యంగ్(19) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్(Kane Williamson) కాన్వేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.వీరిద్దరూ రెండో వికెట్‌కు 187 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విలియమ్సన్(113 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 నాటౌట్) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. డెవాన్ కాన్వే(97) తృటిలో శతకం సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సేనురన్ ముత్తుసామి రెండు వికెట్లు పడగొట్టగా.. బాష్, ముల్డర్ తలా వికెట్ సాధించారు.మాథ్యూ బ్రీట్జ్కే విధ్వంసకర సెంచరీఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు.తద్వారా అరంగేట్రంలో 150 రన్స్ చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతడితో పాటు వియాన్ ముల్డర్ (64), జాసన్ స్మిత్ (41) కూడా రాణించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఓ రూర్క్ తలా రెండు వికెట్లు పడగొట్టగా..బ్రాస్‌వెల్ ఓ వికెట్ సాధించాడు. కాగా ఈ సిరీస్‌లో కివీస్‌కు ఇదే రెండో విజయం. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 78 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది.చదవండి: ఆసీస్, భారత్, ఇంగ్లండ్ కాదు.. ఆ జట్టు చాలా డేంజరస్: రవి శాస్త్రి -
భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అంపైర్లు వీరే! ఐరెన్ లెగ్ లేడు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మరో తొమ్మిది రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ అభిమానులను ఉర్రూతలూగించింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు కరాచీ వేదికగా తలపడనున్నాయి. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఆయా జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.కాగా ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అంపైర్ల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌కు సంబంధించిన అంపైర్ల వివరాలను ఐసీసీ వెల్లడించింది. న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌కు రిచర్డ్ కెటిల్‌బరో, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్ ఆన్ ఫీల్డ్ అంపైర్లగా వ్యవహరించన్నాడు.టీవీ అంపైర్‌గా జోయెల్ విల్సన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇక ఫిబ్రవరి 23న జరగనున్న భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు పాల్ రీఫిల్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లగా ఎంపికయ్యారు. అదేవిధంగా థర్డ్ అంపైర్‌గా మైఖేల్ గోఫ్, మ్యాచ్ రిఫరీగా డేవిడ్ బూన్ వ్యవహరించనున్నారు.ఐరెన్ లెగ్ అంపైర్ లేడు..అయితే భారత్ ఆడే గ్రూపు స్టేజి మ్యాచ్‌ల అంపైర్ జాబితాలో ఐరెన్ లెగ్ రిచర్డ్ కెటిల్‌బరో లేకపోవడం అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అతడు అంపైర్‌గా టీమిండియా అభిమానులు భావిస్తుంటారు. ముఖ్యంగా ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో చాలా సార్లు అది రుజువైంది. 2014 నుంచి అతడు అంపైర్‌గా ఉన్న ఏ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు.అంపైర్ల పూర్తి జాబితాపాకిస్థాన్ vsన్యూజిలాండ్, ఫిబ్రవరి 19 - కరాచీఆన్-ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ కెటిల్‌బరో, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్టీవీ అంపైర్: జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్: అలెక్స్ వార్ఫ్, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్బంగ్లాదేశ్ vs భారత్, ఫిబ్రవరి 20 - దుబాయ్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: అడ్రియన్ హోల్డ్‌స్టాక్, పాల్ రీఫిల్టీవీ అంపైర్: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, ఫోర్త్ అంపైర్: మైఖేల్ గోఫ్, మ్యాచ్ రిఫరీ: డేవిడ్ బూన్ఆఫ్ఘనిస్తాన్ vs సౌతాఫ్రికా, ఫిబ్రవరి 21 - కరాచీఆన్-ఫీల్డ్ అంపైర్లు: అలెక్స్ వార్ఫ్, రోడ్నీ టక్కర్టీవీ అంపైర్: రిచర్డ్ కెటిల్‌బరో, ఫోర్త్ అంపైర్: షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లెఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, ఫిబ్రవరి 22 - లాహోర్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: జోయెల్ విల్సన్, క్రిస్ గఫానీటీవీ అంపైర్: కుమార్ ధర్మసేన, ఫోర్త్ అంపైర్: అహ్సన్ రజా, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్పాకిస్థాన్ v భారత్, ఫిబ్రవరి 23 - దుబాయ్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: పాల్ రీఫిల్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ టీవీ అంపైర్: మైఖేల్ గోఫ్, ఫోర్త్ అంపైర్: అడ్రియన్ హోల్డ్‌స్టాక్, మ్యాచ్ రిఫరీ: డేవిడ్ బూన్ బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, ఫిబ్రవరి 24 - రావల్పిండిఆన్-ఫీల్డ్ అంపైర్లు: అహ్సన్ రజా, కుమార్ ధర్మసేనటీవీ అంపైర్: రోడ్నీ టక్కర్, ఫోర్త్ అంపైర్: జోయెల్ విల్సన్, మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లెఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, ఫిబ్రవరి 25 – రావల్పిండిఆన్-ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ కెటిల్‌బరో, క్రిస్ గఫానీటీవీ అంపైర్: అలెక్స్ వార్ఫ్, ఫోర్త్ అంపైర్: కుమార్ ధర్మసేన, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, ఫిబ్రవరి 26 - లాహోర్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, జోయెల్ విల్సన్టీవీ అంపైర్: అహ్సన్ రజా, ఫోర్త్ అంపైర్: రోడ్నీ టక్కర్, మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లెపాకిస్థాన్ vs బంగ్లాదేశ్, ఫిబ్రవరి 27 - రావల్పిండిఆన్-ఫీల్డ్ అంపైర్లు: మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్స్టాక్టీవీ అంపైర్: పాల్ రీఫిల్, ఫోర్త్ అంపైర్: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిఫరీ: డేవిడ్ బూన్ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, ఫిబ్రవరి 28 - లాహోర్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: అలెక్స్ వార్ఫ్, కుమార్ ధర్మసేనటీవీ అంపైర్: క్రిస్ గఫానీ, ఫోర్త్ అంపైర్: రిచర్డ్ కెటిల్‌బరో, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్ -
ఆసీస్, భారత్, ఇంగ్లండ్ కాదు.. ఆ జట్టు చాలా డేంజరస్: రవి శాస్త్రి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కరాచీ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మినీ వరల్డ్‌కప్ కోసం ఆయా జట్లు అన్ని విధాల సన్నదమవుతున్నాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు.భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు గ్రూపు-ఎలో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్, సౌతాఫ్రికా గ్రూపు-బిలో ఉన్నాయి. భారత జట్టు విషయానికి వస్తే తమ తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్ మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఆ తర్వాత క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్-పాక్ చిరకాల ప్రత్యర్ధుల పోరు ఫిబ్రవరి 23న జరగనుంది.ఆ జట్టుతో జాగ్రత్త..ఇక ఈ మెగా టోర్నీకి ముందు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖలు చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్‌ను తక్కువగా అంచనా వేయెద్దని ఈ టోర్నీలో పాల్గోనే జట్లకు రవిశాస్త్రి హెచ్చరించాడు. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది.దక్షిణాఫ్రికా, జింబాబ్వే , ఆస్ట్రేలియాపై వరుసగా మూడు వన్డే సిరీస్‌లను గెలుచుకున్న పాకిస్తాన్.. ఛాంపియన్స్ ట్రొఫీలో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ముఖ్యంగా సొంతగడ్డపై పాకిస్తాన్‌కు అద్బుతమైన రికార్డు ఉంది. షాహీన్ షా అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీం షా వంటి పేస్ త్రయం పాక్ జట్టులో ఉంది.గత కొన్ని నెలల నుంచి వైట్ బాల్ క్రికెట్లో పాకిస్తాన్ దుమ్ములేపుతోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాక్ ప్లేయర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. సౌతాఫ్రికా వంటి పరిస్థితుల్లో రాణించడం అంత సులువు కాదు. అయితే దురదృష్టవశాత్తు యువ ఓపెనర్ సైమ్ అయూబ్ సేవలను పాక్ కోల్పోయింది.అతడు అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో అతడు కీలకంగా మారుతాడని పాక్ ఆశలు పెట్టుకుంది. కానీ అయూబ్ గాయం కారణంగా ఈ ఈవెంట్ నుంచి తప్పుకున్నాడు. అయితే అయూబ్ లేనంతమాత్రన పాక్‌ను తేలికగా తీసుకోవద్దు. లోతైన బ్యాటింగ్ లైనప్ వారికి ఉంది. సాధరణంగా ఏ జట్టు అయినా వారి సొంతగడ్డపై డేంజరస్‌గా ఉంటుంది. పాకిస్తాన్ కనుక సెమీస్ చేరుకుంటే, ఆ జట్టు డబుల్ డేంజరస్‌గా మారుతుంది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రర్ షాహమ్, హరీస్ నహ్మద్, హరీస్ నహ్మద్, హరీస్ షాహమ్ రౌఫ్ అఫ్రిది. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్చదవండి: SA vs NZ: సౌతాఫ్రికాతో మ్యాచ్.. కేన్ మామ సూపర్ సెంచరీ! వీడియో వైరల్