పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం టీమిండియా తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఇప్పటికే 12 రోజుల ముందే ఆసీస్ గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే నెట్స్‌లో ఎక్కువ సమయం గడిపేందుకు ఇండియా 'ఎ'తో తమ సన్నాహక మ్యాచ్‌ను టీమిండియా రద్దు చేసుకుంది.
అందుకు బదులుగా ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ గేమ్‌లో భారత ప్లేయర్లు పాల్గోన్నారు. ఈ ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ గేమ్ మూడు రోజుల పాటు వెస్ట్రన్ ఆస్ట్రేలియా గ్రౌండ్‌లో జరిగింది. అయితే ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్, ప్రాక్టీస్ సెషన్‌లను ప్రజలు వీక్షించేందుకు భారత్ అనుమతించలేదు.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్లేయర్ బసిత్ అలీ టీమిండియాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు భయపడుతుందని,బోర్డర్-గవాస్కర్ సిరీస్ టైటిల్‌ను డిఫెండ్ చేసుకుంటుందన్న నమ్మకం లేదని అలీ అన్నాడు.
"భారత జట్టు ఓటమి భయంతోనే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది. వారికి గెలుస్తామన్న నమ్మకం లేదు. ప్రాక్టీస్‌ను కూడా సీక్రెట్ క్యాంప్‌లో చేస్తున్నారు. సిరీస్‌కు ముందు తగినంత ప్రిపరేషన్ భారత జట్టుకు లేదు. 12 రోజులు లేదా 12 నెలల ముందు ఆస్ట్రేలియాకు వచ్చామాన్నది ముఖ్యం కాదు.
ప్రత్యర్ధి బౌలర్లను ఎదుర్కోవాలంటే కచ్చితంగా ఆస్ట్రేలియాలో కనీసం ఓ ప్రాక్టీస్ మ్యాచ్ అయినా ఆడాలి. ఇక సూపర్ ఫామ్‌లో ఉన్న ధృవ్ జురెల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటువ్వాలి. అతడికి అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. పుల్ షాట్, కట్ షాట్ చక్కగా ఆడగలడు. ధృవ్‌ను మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపించిండి. టాపర్డర్‌లో ఆడే సత్తా అతడికి ఉందని" బసిత్ అలీ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: అతడొక అద్బుతం.. తొలి టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించండి: రవిశాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment