థ్రిల్లింగ్‌గా ‘1000 వాలా’ టీజర్
అమిత్, షారుఖ్, నవిత, కీర్తి, సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘1000 వాలా’. అఫ్జల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. "మా 1000 వాలా చిత్రం టీజర్ సోషల్ మీడియా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. లైక్స్ మరియు కామెంట్స్ చూసి మా సినిమా తప్పక విజయం సాధిస్తుంది అనే నమ్మకం కలిగింది. త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం" అని తెలిపారు.