Kriti Kharbanda
-
'గర్ల్స్ విల్ బి గర్ల్స్' ప్రీమీయర్ షోలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
పవన్, చరణ్‌తో సినిమాలు కలిసిరాలేదు.. ఇప్పుడేమో పెళ్లి చేసుకుని! (ఫొటోలు)
-
Kriti Kharbanda Marriage Photos: పెళ్లిలో హీరోయిన్ జోష్ మూమూలుగా లేదు (ఫోటోలు)
-
పెళ్లైన వ్యక్తితో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. వేదిక ఫిక్స్!
మరికొద్ది గంటల్లో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి పీటలెక్కనుంది. తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ సినిమాలతో మెప్పించిన కృతి కర్బందా తన ప్రియుడితో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే పెళ్లి తేదీని ప్రకటించిన భామ.. మంగళవారం మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. రెండేళ్లుగా తన ప్రియుడు పుల్కిత్ సామ్రాట్‌తో డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ వాలైంటైన్స్ డే సందర్భంగా పెళ్లి గురించి హింట్ ఇచ్చింది. వీరి గ్రాండ్ వెడ్డింగ్ హర్యానాలోని మానేసర్‌లో జరగనుంది. ఐటీసీ గ్రాండ్ భారత్‌లో వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. వీరి ఇరువురి కుటుంబాలు ఢిల్లీకి చెందినవారు కావడంతో అనువుగా ఉండేందుకు మానేసర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కృతి, పుల్కిత్ జంటగా 'వీరే కి వెడ్డింగ్', 'తైష్', 'పాగల్పంటి' చిత్రాలలో కనిపించారు. కాగా.. పుల్కిత్‌కి గతంలోనే శ్వేతా రోహిరా అనే అమ్మాయితో వివాహమైంది. ఈ జంట 2015లోనే విడిపోయారు. కాగా.. బోణి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి కర్బందా. ఆ తర్వాత అలా మొదలైంది, తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ సినిమాలతో మెప్పించింది. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ముద్దుగుమ్మ చివరిసారిగా 14 ఫేరే చిత్రంలో కనిపించింది. తాజాగా కృతి నటించిన రిస్కీ రోమియో చిత్రం మే నెలలో విడుదల కానుంది. కాగా.. పుల్కిత్ ఇటీవలే ఫుక్రే-3 చిత్రంలో కనిపించారు. View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) -
ప్రియుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్.. వెడ్డింగ్ కార్డ్ లీక్!
బోణి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ కృతి కర్బందా. ఆ తర్వాత అలా మొదలైంది, తీన్మార్ చిఒంగోలు గిత్త, బ్రూస్లీ సినిమాలతో మెప్పించింది. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతంత సినిమాలకు దూరంగా ఉన్న ముద్దుగుమ్మ చివరిసారిగా 14 ఫేరే చిత్రంలో కనిపించింది. అయితే గతనెల లవర్స్ డే రోజున బాయ్‌ఫ్రెండ్ పుల్కిత్ సామ్రాట్‌తో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంది. తామిద్దరం కలిసి మార్చ్ చేయబోతున్నాం అంటూ తన పెళ్లి గురించి అభిమానులకు హింట్ ఇచ్చింది. దీంతో ఈ ఏడాది మార్చిలోనే ఈ జంట ఒక్కటి కాబోతుందని వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరు మార్చి 13న వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీక్ అయిన పెళ్లి పత్రిక నెట్టింట సందడి చేస్తోంది. వెడ్డింగ్ కార్డ్ చూస్తే ప్రముఖ బీచ్ వేదికగా వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే వివాహా వేడుక ఎక్కడ అనేది ఇంకా తెలియరాలేదు. కాగా.. ఇటీవల ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, తన ప్రియుడు జాకీ భగ్నానీని గోవాలో వివాహం చేసుకున్నారు. దీంతో రకుల్ బాటలోనే వీరు కూడా గోవాలోనే ప్లాన్ చేశారా? అని అభిమానులు భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ జంట మార్చి 13న వీరి ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది. కాగా..పుల్కిత్, కృతి వారి 2018 రొమాంటిక్ కామెడీ 'వీరే కి వెడ్డింగ్' సెట్స్‌లో కలుసుకున్నారు. అప్పటి నుంచే వీరిద్దరు డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత పగల్పంటి (2019), తైష్ (2020) సినిమాల్లో స్క్రీన్ కూడా పంచుకున్నారు. ఈ ఏడాది జనవరిలో రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్‌తో ఈ జంట మార్చిలోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. -
ప్రియుడితో సీక్రెట్ ఎంగేజ్మెంట్.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్!
ఈ బ్యూటీ తెలుగు సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. బోణి అనే చిత్రం ద్వారా టాలీవుడ్ బోణి కొట్టిన ముద్దుగుమ్మ కృతి కర్బంద. ఆ తర్వాత అలా మొదలైంది, కెమెరామెన్ గంగతో రాంబాబు, తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ, మిస్టర్ నూకయ్య,ఓం త్రీడీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. చివరసారిగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' మూవీలో రామ్ చరణ్‌కి అక్కగా నటించింది. మోడల్ కెరీర్ ప్రారంభించిన ఢిల్లీ భామ తెలుగుతో పాటు కన్నడలోనూ చాలా సినిమాలు చేసింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది బాలీవుడ్ భామ. అయితే 2019 నుంచి ఓ బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్న కృతి ఇటీవలే రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి రిలేషన్ నిజమేనని తెలిపోయింది. కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే కృతి కర్బందా-పులకిత్ సామ్రాట్ ఎంగేజ్మెంట్ జరిగింది. దీంతో వీరి పెళ్లి ఎప్పుడనే విషయంపై చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా కృతి చేసిన పోస్ట్‌తో పెళ్లిపై హింట్ కూడా ఇచ్చేసింది. వాలైంటైన్స్ డే సందర్భంగా తనకు కాబోయే భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా మార్చి నెలలోనే ఒక్కటి కాబోతున్నామంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో జంట వచ్చే నెలలోనే పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రేమికుల రోజే క్లారిటీ ఇచ్చేసింది ముద్దుగుమ్మ. ఇంకా పెళ్లి తేదీ ఎప్పుడనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. పుల్కిత్ సామ్రాట్, కృతి కర్బందా 2019 నుంచి డేటింగ్ కొనసాగిస్తున్నారు. పాగల్పంటి అనే మూవీ సెట్లో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఈ జంట పాగల్పంటి సినిమాతో పాటు వీరే కి వెడ్డింగ్, తైష్ వంటి చిత్రాలలో కలిసి నటించారు. పుల్కిత్ సామ్రాట్ చివరిసారిగా ఫక్రీ- 3లో కనిపించారు. కృతి కర్బంద నటించిన తాజా చిత్రం రిస్కీ రోమియో విడుదలకు సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Pulkit Samrat (@pulkitsamrat) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) -
Kriti Kharbanda Photos: కనువిందు చేసే అందం కృతి కర్బందా సొంతం (ఫోటోలు)
కనువిందు చేసే అందం కృతి కర్బందా సొంతం (ఫోటోలు) -
2 రోజులు నరకం అనుభవించాం, ప్లీజ్..: హీరోయిన్
సెకండ్ వేవ్‌లో విజృంభిస్తున్న కరోనాకు ఎంతోమంది బలవుతున్నారు. ఆక్సిజన్ కోసం మరెంతో మంది చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో అనవసరంగా ఇల్లు దాటి ఇబ్బందులకు గురి కావొద్దంటూ బాలీవుడ్ హీరోయిన్ కృతి కర్బందా అభిమానులను అభ్యర్థించింది. తను అనుభవించిన బాధ ఎవరికీ రాకూడదంటూ ట్వీట్ చేసింది. 'గత 48 గంటల్లో నేను, నా కుటుంబ సభ్యులు ఎంతో నరకం అనుభవించాం. మీకు అనుభవమయ్యేవరకూ ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదు. కాబట్టి దయచేసి ఇంట్లోనే ఉండండి. మీరు బయటకు వెళ్లాలనుకుప్పుడు మీ ప్రాణాన్ని రిస్క్‌లో పెడుతున్నారని గ్రహించి వెనకడుగు వేయండి. మీ ప్రాణాలను, జీవితాలను లైట్ తీసుకోకండి..' అని కృతి చెప్పుకొచ్చింది. ఇది చూసిన జనాలు ఆమె ఫ్యామిలీ కరోనా బారిన పడినట్లుందని భావిస్తున్నారు. కాగా కృతి తెలుగులో తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ చిత్రాల్లో తళుక్కున మెరిసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాత హిందీలో కాలు మోపిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ అక్కడే సెటిలైంది. Being able to stay indoors today, is a luxury not everyone can afford. Do not take your safety and your life for granted. Count your blessings. Say a prayer. — kriti kharbanda (@kriti_official) May 3, 2021 చదవండి: అందుకే విడాకులు తీసుకున్నా: నటి -
మా పెళ్లి మొదటి పత్రిక మీకే..
బాలీవుడ్ నటులు పులకిత్ సామ్రాట్, కృతి కర్భందాల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ లానే ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటుంది. బాలీవుడ్ హాట్ జోడీల లిస్ట్‌లో వీరి జంట కూడా ఒకటి. ఐతే, గత ఏడాదిన్నరగా వీరి మధ్య ప్రేమాయణం నడుస్తున్న విషయం విధితమే. కాగా వీరు ప్రేమలో ఎంతగా మునిగిపోయారనేది ఈ నటుడు మరోసారి నిరూపించాడు. తన సోదరి ఇంట్లో దీపావళి పండగ జరుపుకోడానికి వెళ్లిన పులకిత్, కృతిని చాలా మిస్ అవుతున్నట్టుగా తెలిపాడు. వీరిరువురు లాక్‌డౌన్‌ని కలిసి గడిపినా, ఇప్పుడు ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. అందుకే ఈ దీపావళికి వారిరువురు కలుసుకోలేకపోతున్నారు. ‘‘ఈ పండుగ సమయంలో తను నాతో లేనందున, చాలా మిస్ అవుతున్నాను. కార్డ్స్ ఆడటమంటే నాకు అంతగా ఇష్టం లేకపోయినా, తనకు మాత్రం చాలా ఇష్టం. ఇప్పుడు మేము అదే ఆట ఆడుతున్నా, తాను మా పక్కన లేదు’’ అని పులకిత్ షేర్ చేశాడు. కాగా, ఓ ఇంటర్వూలో పెళ్లెప్పుడని యాంకర్ ప్రశ్నించగా, ‘‘కృతి, నేను ప్రేమలో ఉన్నాం. మా సోదరుని అనుమతి కోసమే వెయిట్ చేస్తున్నాం. ఐనా, ఇప్పుడు మేము మా కెరీర్‌పై దృష్టి సారించాం. మా మొదటి ప్రాధాన్యత కేవలం మా వృత్తిపైనే ఉంటుంది. ఒకవేళ వివాహానికి తేదీని ఫిక్స్‌చేస్తే ముందుగా మీకే పత్రిక పంపిస్తామని’’ చిరునవ్వు చిందించారు. ఇక పులకిత్ సామ్రాట్, కృతి జంటగా పాగల్ పంతీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ నటి తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు. సుమంత్ హీరోగా తెరకెక్కిన బోణీ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌తో తీన్మార్లో జంటగా కనిపించారు. -
మలేరియా బారిన పడిన నటి
ముంబై: తాను కోలుకుంటున్నానని, తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నటి కృతి కర్బందా తన అభిమానులకు తెలిపారు. తనపై అనంతమైన ప్రేమ కురిపిస్తూ, ఎల్లప్పుడూ అండగా ఉంటున్నందుకు శ్రేయోలాభిషులు, సన్నిహితులకు ధన్యవాదాలు తెలిపారు. 2020 తనకు ఎన్నో విషయాలు నేర్పిందంటూ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ లేఖను పంచుకున్నారు. కాగా కృతి కర్బందా ఇటీవల మలేరియా బారిన పడ్డారు. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ఆమె.. ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తూ తనకు బోర్ కొట్టకుండా చూడాలంటూ ఫాలోవర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు.. ‘‘ ఇది నా మలేరియా వాలా ఫేస్. ఈ ప్రపంచానికి హాయ్ చెబుతోంది. అయితే మరెంతో కాలం దీనిని భరించేందుకు నేను సిద్ధంగా లేను. షూట్‌కి వెళ్లాలి కదా అందుకే త్వరలోనే దీనికి బై చెబుతాను. నా గురించి ఆందోళన చెందిన వారికి కోసం ఈ పోస్టు. నేను బాగున్నా. రేపటి వరకు నా ఆరోగ్యం మరింత కుదుటపడుతుందని భావిస్తున్నా. కాస్త అనారోగ్యంగా అనిపిస్తున్నా.. పర్లేదు. తట్టుకోగలను. ఓపికతో పాటు నన్ను ప్రేమించుకోవడం ఎలాగో ఈ ఏడాది నాకు నేర్పిన పాఠం. నాపై ప్రేమ కురిపిస్తున్నందుకు థాంక్యూ’’అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. కాగా మోడల్‌గా కెరీర్ ఆరంభించిన కృతి... బోణీ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆశించిన మేర విజయం సాధించకపోవడంతో అడపాదడపా తెలుగులో అవకాశాలు వచ్చినా ఆమె కెరీర్‌కు ప్లస్ కాలేదు. దీంతో సాండల్వుడ్పై దృష్టి సారించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బీ-టౌన్లో అడుగుపెట్టి అక్షయ్ కుమార్ హౌజ్‌ఫుల్ 4 సినిమాతో కెరీర్లో తొలిసారి భారీ హిట్ అందుకుంది. అదే జోష్‌లో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. అక్టోబరు 29న 30వ వసంతంలోకి అడుగుపెట్టిన కృతి.. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ ప్రేమలో మునిగితేలుతోంది. వీరే దీ వెడ్డింగ్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ జంట.. తర్వాత పాగల్‌పంతీ మూవీలో హీరోహీరోయిన్లుగా అవకాశం దక్కించుకుంది.(చదవండి: ఆ వార్తలు అవాస్తవం: బాలీవుట్ నటి) -
పోల్ డ్యాన్స్‌ను చాలా మిస్సవుతున్నా..
ముంబై : తనకు ఎంతో ఇష్టమైన పోల్ డ్యాన్స్‌ను చాలా మిస్సవుతున్నానంటూ బాలీవుడ్ నటి కృతి కర్భందా విచారం వ్యక్తం చేసింది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో తన ప్రియుడైన పుల్కిత్ సామ్రాట్‌తో డేటింగ్ చేస్తున్న కృతి ముంబైలో ఉంటుంది. తాజాగా కృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోల్ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి షేర్ చేసింది. ఈ వీడియో పాతదే అయినా పోల్ డ్యాన్స్‌పై ఆమెకున్న ఇష్టాన్ని మరోసారి చెప్పుకొచ్చింది. ' లాక్డౌన్ కారణంగా నాకు ఇష్టమైన పోల్ డ్యాన్స్‌ను మిస్సవుతున్నా. ఈ సమయంలో మా ఇంట్లో పోల్ ఉంటే బాగుండేది..రోజు నాకు నచ్చినంత సేపు పోల్ డ్యాన్స్ చేసుకునేదాన్ని. లాక్డౌన్ తర్వాత పోల్ డ్యాన్స్‌ను చేయాలని అనుకుంటున్నా. నాలాగే మీరు ఏదైనా ఫేవరెట్ ఆటను మిస్సవుతే షేర్ చేసుకోండి' అంటూ కృతి పేర్కొంది. కృతి కర్భందా తెలుగులో భోణి, తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఓం త్రీడి, బ్రూస్లీ, ఒంగోలు గిత్త చిత్రాల్లో నటించింది. (అమెరికాలోని ఒక వీధికి చైనా డాక్టర్ పేరు !) -
బుల్ బుల్ మ్యారేజ్ హాల్
హీరోయిన్ కృతీ కర్భందా రీల్ మ్యారేజ్ లాక్డౌన్ వల్ల వాయిదా పడింది. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నిర్మాతగా ‘బుల్ బుల్ మ్యారేజ్ హాల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందనుంది. రోహిత్ నాయర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఇందులో పుల్కిత్ సామ్రాట్, కృతీ కర్భందా, సునీల్ గ్రోవర్, దేశీ షా ముఖ్యతారలు. లక్నో బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రం భారతీయ వివాహ వ్యవస్థలోని అంశాల ఆధారంగా తెరకెక్కనుంది. ఏప్రిల్‌లో మొదలుకావాల్సిన ఈ సినిమా షూటింగ్ లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. ఇలా కృతీ రీల్ మ్యారేజ్ వాయిదా పడింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా ‘డ్రీమ్‌గర్ల్’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజ్ ఈ సినిమాకు డైలాగ్స్ అందించనుండటం విశేషం. -
తీన్మార్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందా..
ముంబై: పులకిత్ సామ్రాట్, కృతి కర్బందా ప్రేమ జంట బాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. పులకిత్ సామ్రాట్‌తో కృతి ప్రేమలో ఉందంటూ మీడియాలో పలు మార్లు వీరి ప్రేమ వార్త చక్కర్లు కొట్టింది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట తమ ప్రేమను అంగీకరించింది. పులకిత్ సామ్రాట్, కృతి కర్బందా జంటగా పాగల్‌పంతీ సినిమాలో నటించారు. పులకిత్ పూల కుర్తా తెలుపు పైజామాతో.. కృతి పింక్ లెహంగాతో సాంప్రదాయకబద్దంగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ జంట చూడముచ్చటగా ఉందంటూ పలువురు నెటిజన్లు అభినందించారు. పులకిత్, కృతి జంటకు ముగ్దులైన నెటిజన్లు పెళ్లి చేసుకుంటున్నారా లేక స్నేహితుడి వివాహానికి హాజరవుతున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. పాగల్ పంతీ సినిమా డైరెక్టర్ అన్నీస్ అజ్మీ మాట్లాడుతూ.. పులకిత్, కృతి ప్రేమించుకోవడం తనకు కలిసొచ్చిందన్నారు. వీరు ప్రేమికులు కనుక నటించాల్సిన అవసరం రాలేదని.. జీవించారని దర్శకుడు తెలిపాడు. మోడల్‌గా కెరీర్ ఆరంభించిన కృతి... బోణీ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్కినేని మనుమడు సుమంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కృతికి సక్సెస్ ఇవ్వకపోయినా... కన్నడ, తమిళ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక పవన్ కల్యాణ్‌తో కలిసి తీన్మార్ మూవీలో నటించిన కృతికి.. ఆ సినిమా కూడా నిరాశపరచడంతో పూర్తిగా సాండల్‌వుడ్‌కే పరిమతమైపోయింది. పాగల్‌పంతీ సినిమా ప్రమోషన్లో భాగంగా గత నెలలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను సామ్రాట్‌తో డేటింగ్లో ఉన్న విషయాన్ని కన్ఫాం చేసింది. మేమిద్దరం జంటగా బాగుంటాం గనుక మా గురించి ఎన్నో వార్తలు ప్రచారమయ్యాయి. మీరు అనుకుంటున్నట్లుగా అవి రూమర్లు కాదు. నిజమే నేను సామ్రాట్‌తో ప్రేమలో ఉన్నాను. ఒక వ్యక్తి నచ్చడానికి ఐదేళ్లు పట్టొచ్చు లేదా పదేళ్లు పట్టొచ్చు. కానీ పులకిత్ ఐదు నెలల్లోనే నాకు పూర్తిగా అర్థమయ్యాడు. తనతో మాట్లాడటం నాకెంతో సౌకర్యవంతంగా ఉంటుందని కృతి తెలిపారు. -
అవును.. ప్రేమలో ఉన్నాం: కృతి కర్బందా
ముంబై : తాను ప్రేమలో ఉన్నాననే విషయాన్ని హీరోయిన్ కృతి కర్బందా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో దాయాల్సిందేమీ లేదని.. తన తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలుసునని పేర్కొన్నారు. మోడల్‌గా కెరీర్ ఆరంభించిన కృతి... బోణీ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్కినేని మనుమడు సుమంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కృతికి సక్సెస్ ఇవ్వకపోయినా... కన్నడ, తమిళ సినిమాల్లో నటించే అవకాశం మాత్రం కల్పించింది. ఇక పవన్ కల్యాణ్‌తో కలిసి తీన్మార్ మూవీలో నటించే అవకాశం వచ్చినా.. ఆ సినిమా కూడా నిరాశపరచడంతో కృతి పూర్తిగా సాండల్‌వుడ్‌కే పరిమతమైపోయింది. ఇక రామ్‌చరణ్ బ్రూస్లీ సినిమాలో అతడికి సోదరిగా నటించిన తర్వాత కృతి.. తెలుగు తెరకు దాదాపు దూరమైపోయింది. ఈ క్రమంలో బాలీవుడ్‌పై దృష్టి సారించిన ఈ ముద్దుగుమ్మ.. అక్షయ్ కుమార్ హౌజ్‌ఫుల్ 4 సినిమాతో కెరీర్లో తొలిసారి భారీ హిట్ అందుకుంది. అదే జోష్‌లో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే పాగల్‌పంతీ సినిమాకు సైన్ చేసింది. ఇందులో హీరోగా నటిస్తున్న పులకిత్ సామ్రాట్‌తో కృతి ప్రేమలో ఉందంటూ బీ-టౌన్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అతడితో కలిసి పార్టీలకు హాజరవుతూ.. పాపరాజీలకు పనికల్పించిన కృతి.. ఇంతవరకు ఈ విషయంపై నోరు మాత్రం మెదపలేదు. అయితే తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను సామ్రాట్‌తో డేటింగ్లో ఉన్న విషయాన్ని కన్ఫాం చేసింది. ‘ మేమిద్దరం జంటగా బాగుంటాం గనుక మా గురించి ఎన్నో వార్తలు ప్రచారమయ్యాయి. మీరు అనుకుంటున్నట్లుగా అవి రూమర్లు కాదు. నిజమే నేను సామ్రాట్‌తో ప్రేమలో ఉన్నాను. ఒక వ్యక్తి నచ్చడానికి ఐదేళ్లు పట్టొచ్చు లేదా పదేళ్లు పట్టొచ్చు. కానీ అంకిత్ ఐదు నెలల్లోనే నాకు పూర్తిగా అర్థమయ్యాడు. తనతో మాట్లాడటం నాకెంతో సౌకర్యవంతంగా ఉంటుంది. తన మీద ఉన్న నమ్మకంతోనే మీతో నా ప్రేమ విషయాన్ని పంచుకుంటున్నాను. ఇప్పుడు నాకెంతో మనశ్శాంతిగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. కాగా వీరిద్దరు గతంలో వీరే దీ వెడ్డింగ్ సినిమాలోనూ కలిసి నటించారు. ఇక పులకిత్ సామ్రాట్‌కు గతంలోనే పెళ్లైంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రాఖీ సిస్టర్ శ్వేతా రోహిరాను అతడు పెళ్లి చేసుకున్నాడు. అనంతరం మనస్పర్థలతో వాళ్లిద్దరూ విడిపోయారు. -
అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’ ట్రైలర్ లాంచ్
-
గేమ్స్ ఆడొద్దు
షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు ‘హౌస్‌ఫుల్ 4’ టీమ్. దర్శక ద్వయం ఫర్హాద్ సామ్జీ తెరకెక్కించిన చిత్రమిది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, కృతీసనన్, కృతీ కర్భందా, బాబీ డియోల్, రానా, పూజా హెగ్డే కీలక పాత్రలు చేశారు. ‘‘హౌస్‌ఫుల్ 4 షూటింగ్ పూర్తయింది. ఇంత పెద్ద మల్టీస్టారర్‌లో నటిస్తానని ఊహించలేదు. మంచి క్వాలిటీస్ ఉన్న అక్షయ్ సార్‌తో కలిసి నటించడం ఫుల్ హ్యాపీ. ఆయనతో గేమ్స్ ఆడకండి. ఎందుకుంటే ఎక్కువ శాతం గెలుపు ఆయనదే అవుతుంది’’ అని పేర్కొన్నారు పూజా. ‘‘షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది థియేటర్స్‌లో కలుద్దాం’’ అన్నారు అక్షయ్. ఈ సినిమాకు తొలుత సాజిద్ ఖాన్ దర్శకుడిగా వ్యవహరించారు. కానీ ‘మీటూ’ ఆరోపణల వల్ల ఆయన తప్పుకున్నారు. అలాగే నానా పటేకర్ ప్లేస్‌లో రానా నటించారు. -
లండన్‌లో ఫన్
ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లు కృతీ సనన్, పూజా హెగ్డే, కృతీ కర్భందా లండన్‌లో కలిశారు. హాలీడే సందర్భంగా కలవలేదు. అనుకోకుండా కలవలేదు. థియేటర్స్‌ను ఆడియన్స్‌తో హౌస్‌ఫుల్ చేసేందుకు ‘హౌస్‌ఫుల్ 4’ కోసం కలిశారు. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో వస్తోన్న ఫోర్త్ ఫార్ట్ ‘హౌస్‌ఫుల్ 4’. ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్‌కు దర్శకత్వం వహించిన సాజిద్ ఖాన్నే ‘హౌస్‌ఫుల్ 4’ను తెరకెక్కిస్తున్నారు. థర్డ్ పార్ట్‌కు సాజిద్– ఫర్హాద్ ద్వయం దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అక్షయ్‌కుమార్, బాబీ డియోల్, రితేష్ దేశ్‌ముఖ్, పూజా హెగ్డే, కృతీసనన్, కృతీ కర్భందా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ జరుగుతోంది. తొలుత సాంగ్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఫర్హా ఖాన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ బార్బర్ పాత్రలో కనిపించనున్నారు. సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
కి.. పోయి కృ.. వచ్చె
ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు హీరోయిన్ కృతీ కర్భందా. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో రానున్న ఫోర్త్ పార్ట్ ‘హౌస్‌పుల్ 4’లో ఆమె ఒక కథానాయికగా నటించనుండటమే ఇందుకు కారణం. ఫస్ట్ అండ్ సెకండ్ హౌస్ఫుల్స్కు దర్శకత్వం వహించిన సాజిద్ ఖాన్నే ‘హౌస్‌ఫుల్ 4’ను డైరెక్ట్ చేయనున్నారు. థర్డ్ పార్ట్‌కు సాజిద్ సామ్జీ అండ్ ఫర్హాద్ సామ్జీ కలిసి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, పూజా హెగ్డే, చుంకీ పాండే ముఖ్య తారలుగా నటించనున్న ‘హౌస్‌ఫుల్ 4’ టీమ్‌లోకి తాజాగా కృతీ కర్భందా ఎంపికయ్యారు. అక్షయ్‌కుమార్ సరసన ఈమె కనిపించనున్నారట. ‘‘బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కామెడీ ఫ్రాంచైజీస్‌లో హౌస్‌ఫుల్ ఒకటి. ఇంతమంది స్టార్స్ ఉన్న సినిమాలో నేనింత వరకు నటించలేదు. అలాగే ఇలాంటి డిఫరెంట్ స్టోరీ కూడా నేను వినలేదు. ఈ సినిమాలో భాగమైనందుకు హ్యాపీ’’ అని పేర్కొన్నారు కృతీ. నిజానికి కియారా అద్వానీని అనుకున్న ప్లేస్‌లో ఫైనల్‌గా కృతీ భాగమయ్యారని బీటౌన్ టాక్. కి పోయి కృ వచ్చె అన్నమాట. ఇదివరకు ‘బోణి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ నెక్ట్స్ ‘తీన్మార్, బ్రూస్ లీ’ లాంటి సినిమాలతో తెలుగు తెరపై మెరిశారు. -
ఎలాంటి పాత్రకైనా రెడీ!
తమిళ సినిమా : ఎలాంటి పాత్రకైనా రెడీ అంటోంది నటి కృతి కర్బంద. ఈ ఢిల్లీ భామ మోడలింగ్ రంగం నుంచి సినీరంగానికి పరిచయమైంది. చాలా మంది ఉత్తరాది తారల మాదిరిగానే తొలుత తెలుగులో ‘బోణి’ కొట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత కన్నడం, హిందీ, తమిళం భాషాల్లో వరుసగా ఎంట్రీ ఇచ్చేసింది. అయితే తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనే ఎక్కువగా నటిస్తున్న కృతి కర్బంధ తమిళంలో జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో బ్రూస్లీ అనే ఒక్క చిత్రంలోనే రొమాన్స్ చేసింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అందుకేనేమో ఆ తరువాత ఇక్కడ మళ్లీ కనిపించలేదు. తాజాగా మళ్లీ కోలీవుడ్‌లో ఎలాగైనా అవకాశాలందుకోవాలని ఆరాట పడుతోంది. తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకునేందుకు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నాకు వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించే అవకాశాలే వస్తుండడం సంతోషంగా ఉంది. ఎలాంటి పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నారు అని అడుగుతుంటారు. నటనకు అవకాశం ఉన్న ఎలాంటి పాత్రల్లో నటించడానికైనా నేను రెడీ. పాత్రలను బట్టి లంగా ఓణి, చీరలు, మోడ్రన్ ఇలా అన్ని రకాల దుస్తులైనా ధరించాల్సి ఉంటుంది. అలా ఆయా పాత్రలకు తగ్గట్టుగా నన్ను నేను తయారు చేసుకుంటాను. అయితే ఢిల్లీ అమ్మాయిని కదా స్వతహాగా నాకు మోడ్రన్ దుస్తులు ధరించడమంటేనే ఇష్టం. అలాంటి పాత్రలైతే మరింత ఆసక్తి. ఇకపోతే తమిళంలో మంచి పాత్రల్లో నటించాలనుంది. అలాంటి అవకాశాలు ఆశిస్తున్నాను’ అన్నారు. -
ఐ యామ్ అవినాష్
అవినాష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐదంకెల జీతం. వీకెండ్ పార్టీలు, పబ్‌లు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో అవుటింగ్‌లు. పుల్ బిందాస్ లైఫ్. ఎప్పుడూ ఒకేలా ఉంటే అది లైఫ్ ఎందుకవుతుంది? సడన్‌గా లైఫ్‌లో బిగ్ టర్న్. అంతే ఆల్ చేంజ్. జాబ్‌లోనే కాదు అతని లైఫ్‌లో కూడా. హిందీ చిత్రం ‘కర్వాన్’ స్టోరీ లైన్ ఇదేనట. దుల్కర్ సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, కృతి కర్భందా, మిథిలా పాల్కర్, రోనీ స్క్రూవాలా ముఖ్య తారలుగా ఆకాశ్ ఖురానా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతోనే మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ‘‘ఇర్ఫాన్ ఖాన్, రోనీ స్క్రూవాలాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ. ఈ సినిమా జర్నీలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. స్టార్టింగ్ డే నుంచి షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇంత మంచి టీమ్, ఇలాంటి మంచి సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు దుల్కర్ సల్మాన్. రోడ్ జర్నీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుందట. అది సరే.. ఇంతకీ అవినాష్ ఎవరో చెప్పలేదు కదూ. తెలుగులో అయితే.. అఖిల్ గుర్తుకు రావొచ్చు. ‘హలో’లో తను చేసిన పాత్ర పేరది. బట్... ‘కర్వాన్’లో మై నేమ్ ఈజ్ అవినాష్ అంటున్నారు దుల్కర్ సల్మాన్. -
మంచి ‘గుజ్జూ’ గర్ల్
కృతీ కర్బందా కన్నడ అమ్మాయి. మంచి యాక్టర్. పెర్ఫార్మెన్స్ అదరగొడుతుంది. తెలుగు సినిమాలో కూడా ఆట ఆడించింది. నటన నడిపించింది. ఫ్యాన్స్ హృదయాలపై ఆటోగ్రాఫ్‌లు కొట్టింది. అలా.. అలా.. గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు హిందీ సినిమాల్లో.. ‘శిల్పాశెట్టి కంటే నేనేమైనా తక్కువా? ఆమె మంగళూరు మగువైతే, నేను బెంగళూరు భామ’ అని బాలీవుడ్ గుండెల మీద డ్యాన్స్ చేస్తోంది. ‘ఎర్లా పగ్లా దివానా ఫిర్ సే’ అనే హిందీ సినిమాలో మంచి పాత్ర కొట్టేసింది. తెలుగు సినిమాలు మీకు తెలిసే ఉంటాయి. బోణీ, తీన్మార్, అలా మొదలైంది, బ్రూస్లీ లో కర్బందా కర్ర తిప్పడం చూసే ఉంటారు. ఇప్పుడా హిందీ సినిమాలో బాడీ తిప్పాలట! గుజ్జూ అనే పాటకు తిప్పాలట. మన నవరాత్రుల్లో చేస్తారు చూడండి.. గర్భ, దాండియా.. అదే పాటకు గంతులేయాలట. ‘చిన్నప్పుడు నవరాత్రి ఉత్సవాల్లో భలే డ్యాన్స్ చేసేవాళ్లం మేము. ఈ గుజ్జూ దాండియా ఇప్పుడు చేస్తే బాడీ మీద ఉన్న గుజ్జు కాస్తయినా కరుగుతుంది’ అని సంతోషపడిపోతోంది కర్బందా. -
ఆ క్యారెక్టర్‌కి సూట్ అవుతుందా..?
సౌత్ ఇండస్ట్రీలో పక్కింటి అమ్మాయిలా అలరిస్తున్న కృతి కర్బంద, బాలీవుడ్లో మాత్రం హద్దు మీరుతున్నట్టుగా కనిపిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో సాంప్రదాయబద్ధంగా కనిపించే పాత్రల్లో మాత్రమే చేసిన ఈ భామ, రాజ్ సీరీస్లోనటించడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్ 'సీరియల్ కిస్సర్' ఇమ్రాన్ హష్మీతో కలిసి రాజ్ 4లో నటించడానికి అంగీకరించింది ఈ బ్యూటి. ఇమ్రాన్ హష్మీ సినిమాకు బాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ హీరో సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఘాటు ముద్దు సీన్లు, హాట్ బెడ్రూం సీన్లు తప్పకుండా ఉండేలా చూస్తారు దర్శకనిర్మాతలు. అయితే ఇప్పటి వరకు బాలీవుడ్ భామలే, ఈ హీరోతో నటించారు కనుక సౌత్ జనాలు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. అయితే కృతి లాంటి హోమ్లీ హీరోయిన్ ఇమ్రాన్ హష్మీతో నటిస్తుండటంతో ఇప్పుడు ఈ వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. -
హాట్ హీరోతో కృతి
సౌత్ ఇండస్ట్రీలో పక్కింటి అమ్మాయిలా అలరిస్తున్న కృతి కర్బంద, బాలీవుడ్లో మాత్రం హద్దు మీరుతున్నట్టుగా కనిపిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో సాంప్రదాయబద్ధంగా కనిపించే పాత్రల్లో మాత్రమే చేసిన ఈ భామ, రాజ్ సీరీస్లోనటించడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీతో కలిసి రాజ్ 4లో నటించడానికి అంగీకరించింది ఈ బ్యూటి. ఇమ్రాన్ హష్మీ సినిమాకు బాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ హీరో సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఘాటు ముద్దు సీన్లు, హాట్ బెడ్రూం సీన్లు తప్పకుండా ఉండేలా చూస్తారు దర్శకనిర్మాతలు. అయితే ఇప్పటి వరకు బాలీవుడ్ భామలే, ఈ హీరోతో నటించారు కనుక సౌత్ జనాలు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. అయితే కృతి లాంటి హోమ్లీ హీరోయిన్ ఇమ్రాన్ హష్మీతో నటిస్తుండటంతో ఇప్పుడు ఈ వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. -
రోజూ పూలు పంపిస్తే ప్రేమిస్తా..!
‘‘నా జీవితంలో ఇప్పటికీ, ఎప్పటికీ మంచి ఫ్రెండ్ మా అమ్మే. ఆమెతో అన్ని విషయాలూ పంచుకుంటాను. అవి ఏవైనా సరే. అందుకే షూటింగ్స్‌లో నాతో పాటు మా అమ్మ కంపల్సరీగా ఉండాల్సిందే. ఇప్పటి దాకా నేను ఎవరినీ ప్రేమించలేదు. కానీ ఒక్క సారి ప్రేమిస్తే ప్రాణమిస్తా. అంత బాగా చూసుకుంటా. నాకు నచ్చే పనులు చేస్తూ, నా కోసం రోజూ పూలు పంపించేవాణ్ణే నేను ప్రేమిస్తా. కానీ అలాంటి వాళ్లు ఇప్పటిదాకా నాకు తారసపడలేదు. జీవితంలో చాలా హడావిడిగా నిర్ణయం తీసుకునేవాళ్లంటే నాకు నచ్చరు. నేనెప్పుడూ సంప్రదాయ పద్ధతిలో ఉండటానికే ఇష్టపడతా. అందుకేనేమో నాకూ అబ్బాయిల్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నా నా పద్ధతి తెలిసి... వాళ్లల్లో నన్నె వరూ ప్రపోజ్ చేయలేదనుకుంటా. నేను గాళ్‌ఫ్రెండ్ మెటీరియల్ కాదని, నా ఫ్రెండ్ ఎప్పుడో చెప్పింది.’’ - కృతీ కర్బందా -
రామ్‌చరణ్‌కు సోదరిగా...
ఢిల్లీలో పుట్టి, బెంగళూరులో పెరిగి, మోడల్‌గా మొదలై, సినిమాల్లో పేరు తెచ్చుకున్న పంజాబీ అమ్మాయి - కృతీ కర్బందా. తెలుగు చిత్రం ‘బోణీ’ (2009)తో సినీ రంగంలోకి వచ్చినా, తెలుగులో కన్నా కన్నడంలోనే ఆమె ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. గతంలో పవన్‌కల్యాణ్ ‘తీన్మార్’, రామ్ ‘ఒంగోలు గిత్త’, కల్యాణ్‌రామ్ ‘ఓం - 3డి’లో నటించిన ఈ బెంగళూరు యువతి కొంత విరామం తరువాత ఇప్పుడు మళ్ళీ ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో, హీరోకు సోదరి పాత్రను ఆమె పోషిస్తున్నారు. హీరోయిన్గా చేస్తూ, సోదరి పాత్ర ఒప్పుకోవడం కెరీర్‌కు దెబ్బ కాదా? ‘‘నిజం చెప్పాలంటే, ఈ పాత్ర నా కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆలోచించలేదు. నా కన్నా నా చుట్టూ ఉన్నవాళ్ళే ఎక్కువ ఆలోచిస్తున్నట్లున్నారు’’ అని కృతి నవ్వేశారు. ‘‘ఆ పాత్ర స్వరూప స్వభావాలు నచ్చడంతో ఒప్పుకున్నా’’ అని పేర్కొన్నారామె. ‘‘ఈ ఆఫర్ గురించి కన్నడంలో పెద్ద స్టార్ అయిన ఉపేంద్ర గారికి చెప్పాను. ఈ మధ్యే ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో క్యారెక్టర్ రోల్‌కు ఒప్పుకున్న ఆయన ఏమని చెబుతారా అని చూశాను. ‘నీ మీద నీకు నమ్మకం ఉంచుకో. పాత్ర నచ్చితే చేసేయ్!’ అన్నారు. అంత పెద్ద నటుడే మరో భాషా చిత్రంలో నటిస్తుంటే, నేనెందుకు వెనక్కి తగ్గాలని ఈ పాత్ర చేస్తున్నా’’ అని కృతీ కర్బందా వివరించారు. ఆ మధ్య ‘గూగ్లీ’ చిత్రంతో కన్నడంలో ఒక ఊపు ఊపేసిన కృతి ప్రస్తుతం అయిదు భారీ కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘‘రామ్‌చరణ్ - శ్రీను వైట్ల సినిమాలో బోలెడంత బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఉంది. సినిమాలోని ఈ ప్రధాన ఉపకథ ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నా. నిజజీవితంలో నేనున్నట్లే, పక్కింటి అమ్మాయిలా, వాగుడుకాయలా ఉండే పాత్ర నాది. ప్రస్తుతానికి అంతకు మించి వివరాలు వెల్లడించలేను’’ అన్నారీ అమ్మాయి. మునుపటి తెలుగు సినిమా ఆశించినంతగా ఆడకపోవడంతో, నాలుగు నెలల పాటు ఏ సినిమానూ ఒప్పుకోని కృతి మొత్తానికి ఇప్పుడు ఆచితూచి చక్కటి సినిమా, పాత్ర ఎంచుకున్నట్లున్నారు. ఇంకేం! శుభం!!