Maruthi Dasari
-
అప్పుడు 'బేబీ'.. ఇప్పుడు 'బ్యూటీ'!
గతేడాది వచ్చిన సూపర్ హిట్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో 'బేబి' కచ్చితంగా ఉంటుంది. అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి, సంచలన విజయం సాధించింది. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌కు మంచి పేరు కూడా వచ్చింది. ఈ సినిమా నిర్మాతల్లో డైరెక్టర్ మారుతి ఒకడు. ఇప్పుడు ఈయన నుంచి మరో సినిమా వస్తోంది. దానికి 'బ్యూటీ' అని పేరు ఖరారు చేశారు. (ఇదీ చదవండి: జబర్దస్త్ కమెడియన్ల బ్రేకప్? గొడవలు నిజమేనన్న నూకరాజు) సుబ్రహ్మణ్యం ఆర్.వీ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్‌తో కలిసి మారుతి టీమ్ నిర్మిస్తోంది. ఏ. విజయ్ పాల్ రెడ్డి నిర్మాత. ఈనెల 22న లాంఛనంగా ప్రారంభిస్తారు. అప్పుడే టైటిల్‌ని కూడా అధికారికంగా ప్రకటిస్తారు. ‘బేబీ’లో సినిమాలో దాదాపు అంతా కొత్తవారే కనిపించారు. అయితే అందులో కల్ట్ పాయింట్ పట్టుకొన్నారు. అది యూత్‌కి బాగా నచ్చింది. ఈ ‘బ్యూటీ’ కూడా అంతేనని సమాచారం. 'బేబీ' ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు. (ఇదీ చదవండి: హీరోగా సీనియర్ నటుడు.. మూవీ టీజర్ రిలీజ్) -
ఎవరినైనా మర్చిపోతామేమో కానీ వాళ్లని కాదు: డైరెక్టర్ మారుతి
'బాల్యం నుంచి ప్రతి దశలోనూ మన జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు. కాలక్రమంలో అందులో కొందరిని మనం మర్చిపోవడం సహజం. కానీ జీవితపు ప్రారంభ దశలో ప్రేమాభిమానాలు కురిపించే బాల్య స్నేహితులను మాత్రం కాదు' అని డైరెక్టర్ మారుతి అన్నాడు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!) అక్టోబర్ 1న మచిలీపట్నం జార్జికారనేషన్ హైస్కూల్‌కు చెందిన ఆయన చిన్నప్పటి ఫ్రెండ్స్.. గెట్ టుగెదర్ కార్యక్రమంతో పాటు, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తమ ఫ్రెండ్ మారుతిని ప్రేమగా సత్కరించారు. ప్రభాస్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మారుతి.. చిన్ననాటి స్నేహితులను పేరుపేరున పలకరించి, వారితో అప్పటి విశేషాలని గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా తన చిన్ననాటి సంఘటనలను, తాను కష్టపడి ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగిన విధానాన్ని వివరించడంతో పాటు, తన స్నేహితులు ఎవరెవరు ఏఏ రంగాల్లో ఉన్నారు. వారు కూడా జీవితంలో ఎదగటానికి ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించి, సన్మానపత్రం కూడా అందజేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) -
నన్నీ స్థాయికి తెచ్చింది చిన్న సినిమానే
‘‘చిన్న సినిమా సూపర్ హిట్టవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకణ్ణి. నన్ను ఈ స్థాయికి తెచ్చింది చిన్న సినిమానే’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. అజయ్, వీర్తి వఘాని జంటగా హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొత్త కొత్తగా’. బీజీ గోవింద రాజు సమర్పణలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమా మధ్యతరగతి కుటుంబం లాంటింది.. మధ్య తరగతి బాగుంటేనే మిగతా తరగతులు బాగుంటాయి’’ అన్నారు. ‘‘అబ్బాయికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడని ఒక అమ్మాయి.. ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించే అబ్బాయి మధ్య జరిగే కథే ఈ సినిమా’’ అన్నారు హనుమాన్ వాసంశెట్టి. ‘‘భోజనం ఎంత పెట్టినా చివర్లో స్వీట్ ఇస్తారు.. మా సినిమా కూడా స్వీట్ లాంటింది’’ అన్నారు గోవింద రాజు. ‘‘మా సినిమాని థియేటర్లో చూసి మంచి విజయం అందించాలి’’ అన్నారు అజయ్, వీర్తి వఘాని. -
నా ముక్కు కోసేశాడు, ప్లేటంతా రక్తం: గోపీచంద్
గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2– యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా జూలై 1న విడుదల కానున్న తరుణంలో ప్రమోషన్స్‌తో బిజీ అయ్యాడు గోపీచంద్. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను ఇండస్ట్రీకి రావడానికి కారణమైన వారిలో నిర్మాత నాగేశ్వరరావు ఒకరు. ఆయన నన్ను హీరోగా పెట్టి తొలి వలపు సినిమా చేశారు. అది ఫస్ట్ మూవీ కావడంతో నేనెలా చేస్తానో అని చాలామందికి అనుమానపడ్డారు. చివరకు ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు. ఆరునెలల వరకు ఏ సినిమా రాలేదు. ఆ తర్వాత పరిస్థితుల వల్ల విలన్‌గా చేశాను. నేను చేసినవాటిలో కొన్ని ఆడవని ముందే అనిపించాయి. ఎందుకు ఒప్పుకున్నాన్రా బాబు అని మనసులో అనుకున్నాను. చిన్నప్పుడు నా అన్న ప్రేమ్‌చంద్ బ్లేడు తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. ముక్కు కోసి పప్పులో పెడతారా? ఎలా పెడతారు? అంటూ బ్లేడు తీసుకుని నా ముక్కు కోసేశాడు. అప్పుడు నేను పెరుగన్నం తింటున్నా.. రక్తం కారి నా పళ్లెంలో నిండిపోయింది. ఇక నా చిన్నతనంలో అంటే దాదాపు నేను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. చిన్నప్పుడే జీవితం చాలా నేర్పించింది' అని ఎమోషనలయ్యాడు గోపీచంద్. ఆ తర్వాత మారుతి తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. 'ఒకసారి ల్యాబ్‌కు వెళ్లినప్పుడు.. సినిమా ఫస్ట్ కాపీ చూసి తక్కువ నిడివిలో తీయాలి, ఇలా తీయకూడదు అని సూచించాను. దానికాయన నువ్వు డైరెక్టర్ అయి సినిమా తీయు, తెలుస్తుంది. అప్పుడు ఎలా తీయాలో మాకు చెప్పండి, నేర్చుకుంటాం అంటూ నానామాటలు అన్నారు' అని గుర్తు చేసుకున్నాడు. చదవండి: బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె సైరన్, షూటింగ్స్ బంద్! -
అనుష్కకు దర్శకుడు మారుతి సపోర్ట్
అమ్మతనం స్త్రీ జాతికి దక్కిన అపూర్వ గౌరవం. అమ్మ అని పిలిపించుకునేందుకు ప్రతీ మహిళ ఆరాటపడుతుంది. ఆమె సాధారణ మహిళ అయినా, సెలబ్రిటీ అయినా! కాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ కూడా అమ్మ అని పిలిపించుకునే మధుర క్షణాల కోసం ఎదురు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో గర్భాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతున్న ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే దీనిపై మీనా దాస్ నారాయణ్ అనే మహిళా జర్నలిస్టు వ్యంగ్యాస్త్రాలను సంధించారు. (చదవండి: నా జీవితం ఒక్క ఫ్రేములో: విరాట్) "అనుష్కను విరాట్ కేవలం గర్భవతిని మాత్రమే చేశాడు. ఇంగ్లండ్‌కు రాణిని చేయలేదు. అంతలా సంబరపడాల్సిన అవసరం లేదు" అంటూ కామెంట్ చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలపై తెలుగు దర్శకుడు మారుతి సీరియస్‌గా స్పందించారు. "మహిళా జర్నలిస్టు అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవమానకరం. ఓ రాజ్యానికి రాణి అవడం కన్నా బిడ్డకు తల్లిగా మారడమే గొప్ప విషయం. అవును, ప్రతి మహిళ ఒక మహారాణి, సంతోషాలతో తులతూగే ప్రతీ ఇల్లు ఓ రాజ్యమే. అనుష్క సెలబ్రిటీ అవడం కంటే ముందు ఆమె ఓ సాధారణ మహిళ. తల్లి కాబోతున్న మధుర క్షణాలను ఆస్వాదించే హక్కు ఆమెకుంది" అని కామెంట్ చేశారు. (చదవండి: కంగనా మాజీ ప్రియుడి ఇంటర్వ్యూ వైరల్) -
‘వేలు విడవని బంధం.. ప్రతిరోజూ పండగే’
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ప్రతిరోజూ పండగే. చాలా రోజుల తరువాత చిత్రలహరి సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన సాయి, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిరోజూ పండగేతో మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. రేపు రాత్రి 8 గంటలకు ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘వేలు విడువని బంధం’ అనేది ట్యాగ్ లైన్. సాయి ధరమ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. -
శోక సంద్రంలో టాలీవుడ్
విజయ నిర్మల మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా అద్భుత విజయాలు సాధించిన ఆమెను గుర్తు చేసుకుంటూ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ప్రముఖ నటి, దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కృష్ణ గారికి, నరేశ్ గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నటిగా, దర్శకురాలిగా విజయనిర్మల గారి ముద్ర చెరగనిది. మీనా, హేమాహేమీలు, రామ్ రాబర్ట్ రహీమ్ లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి ఈ విభాగంలో మహిళలు ప్రవేశించేందుకు స్ఫూర్తిగా నిలిచారు. విజయనిర్మల గారు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. - పవన్ కల్యాణ్ మనసున్న మనిషి అనడానికి నిలువెత్తు నిదర్శనం విజయనిర్మలగారు. ఎంతోమందికి సహాయం చేశారు. ఆవిడ ఒక లెజెండ్. లెజెండ్ అని అనిపించుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. మహిళలకు పెద్ద స్ఫూర్తి. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఆవిడ సాధించిన విజయాలు అసామాన్యం. ఆవిడతో ఎవరినీ కంపేర్ చేయలేము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఆవిడతో కంపేర్ చేయదగ్గ వాళ్లు ఎవరూ పుట్టలేదేమో. రీసెంట్గా కృష్ణగారి పుట్టినరోజుకి వాళ్లింటికి వెళ్లినప్పుడు ఆవిణ్ణి కలిశాం. అప్పటికి కొన్ని రోజులుగా ఒంట్లో నలతగా ఉండటంతో హాస్పిటల్ లో ఉన్నారామె. అయినా మమ్మల్ని కలవడానికి వచ్చారు. ఆవిణ్ణి ఎప్పుడూ ఒక ఆడపులిలా చూసేవాళ్లం. అటువంటిది ఇబ్బంది పడుతూ నడవటం చూసి చాలా బాధగా అనిపించింది. ఇంత త్వరగా మనందరినీ విడిచి వెళ్లిపోతారని అనుకోలేదు. - జీవితా రాజశేఖర్ ‘11 సంవత్సరాలకే నటిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని తన కుటుంబంగా చేసుకున్న మహానటి, గొప్ప దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల గారి హఠాన్మరణం విని షాక్‌కి గురయ్యాను. తెలుగు సినిమా అంటే మగవారి ఆధిక్యత వుంటుంది అని చెప్పుకునే ఆ రోజుల్లోనే మహిళా దర్శకురాలుగా తన సత్తాచాటిన విజయ నిర్మల గారు చరిత్ర లో ఎప్పటికీ నిలిచిపోతారు’. - మారుతి తెలగు సినిమా చరిత్రలో ఎందరో దర్శకులు వారి వారి సత్తా చాటుకున్నారు. కాని మహిళా దర్శకురాలుగా గిన్నిస్ బుక్ రికార్డుని సాధించిన దర్శకురాలు మాత్రం శ్రీమతి విజయనిర్మల గారు ఒక్కరే. సూపర్‌స్టార్ కృష్ణ గారిని, విజయనిర్మల గారిని చూస్తే కడుపు నిండిపోయేది అంత అందంగా వుండేది వారి జంట. అంత అందమైన నటి, నిర్మాత, దర్శకురాలు తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయారన్న వార్త నమ్మలకపోయాను. - నిర్మాత ఉషా మల్పూరి చిన్న వయసు నుండి మనందరం సినిమాలు చూసేవాళ్ళం కాని శ్రీమతి విజయనిర్మల గారు సినిమాలు చేయటం మొదలు పెట్టారు. విజయనిర్మల గారికి సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు. మహనటిగా, గొప్ప దర్శకురాలుగా, ఉత్తమ నిర్మాతగా తమిళ, తెలుగు, మళయాల భాషల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. - దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఐరా క్రియెషన్స్ ప్రోడక్షన్ నెం 1 గా నిర్మించిన ఛలో చిత్రంలో నరేష్ గారు కీలక పాత్రలో నటించారు. ఆ చిత్ర షూటింగ్లో నరేష్ గారు శ్రీమతి విజయనిర్మల గారి గురించి ఎన్నో తెలియని విషయాలు చెప్పారు. విజయనిర్మల గారు పేద కళాకారులకి చేసే సహాయం.. సినిమా అంటే ఎంతో గౌరవం అని.. ముఖ్యంగా తన ఫ్యామిలీ హీరోల చిత్రాలు విజయాలు సాధిస్తే ఎలా సంతోష పడతారో.. మరో హీరో చిత్రాలు విజయం సాధిస్తే కూడా అంతకి మించి సంతోష పడతారు. తెలుగు సినిమా విజయాల బాట నడవాలని ఎప్పూడూ కొరుకుంటారని ఆయన మాతో చెప్పేవారు. - ఐరా క్రియేషన్స్ ఒక వ్యక్తి గురించి దశాబ్దాలుగా చెప్పుకుంటున్నాము అంటే ఆ వ్యక్తి చేసిన పని మాత్రమే కాదు వారి గుణం, స్వభావం కూడా అందుకు కారణం. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌కి తనవంతు సహాయన్ని ఇప్పటికీ శ్రీమతి విజయనిర్మల గారు అందిస్తున్నారనే వార్త నా హృదయంలో బాగా నాటుకు పోయింది. దర్శకురాలుగా సినిమాలు చేయటమే కాకుండా పేద కళాకారులకి సహయం చేసే గొప్ప లక్షణం ఆమె సొంతం. ఛలో చిత్రంలో నరేష్ గారితో నటించాను. విజయనిర్మల గారి గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాను. సినిమా సినిమా ఇదే ప్రపంచంగా వుండేవారట.. ప్రతి వారం ఏ సినిమా విడుదలయ్యింది. వాటి ఫలితాలు ఎలా వున్నాయనే డిస్కషన్ శ్రీమతి విజయనిర్మల గారితో వుండేదట అంతలా సినిమాని ప్రేమించే వ్యక్తి ఈ రోజు తెలుగు సినిమా అభిమానుల్ని అందర్ని ఇలా వదిలి వెళ్ళి పోవటం చాలా దురదృష్టకరం. - హీరో నాగశౌర్య ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత,మా ఆత్మీయురాలు.. శ్రీమతి విజయనిర్మల గారి ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. విజయనిర్మల గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. - సీనియర్ నటుడు, మాజీ కేంద్రమంత్రి యూవీ కృష్ణంరాజు వీరితో పాటు నటులు అల్లరి నరేష్, నాని, కల్యాణ్ రామ్, రానా దగ్గుబాటి, సుశాంత్, ఆది, కాజల్ అగర్వాల్, ఈషా రెబ్బా, నితిన్, మంచు విష్ణు, మంచు మనోజ్.. దర్శకులు వంశీ పైడిపల్లి, గుణశేఖర్, బీవీయస్ రవి, అనిల్ రావిపూడి.. నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, హారికా హాసిని క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలు సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలియజేశారు. -
ఇంట్రస్టింగ్ టైటిల్‌తో సాయి ధరమ్ తేజ్
ఇటీవల చిత్రలహరి సినిమాతో ఆకట్టుకున్న సాయి ధరమ్ తేజ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన సాయి, త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత చిత్రలహరితో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన ఈ మెగా హీరో నెక్ట్స్ సినిమాతోనూ అదే సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘భోగి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. టైటిల్‌ను బట్టి చూస్తే ఈ సినిమాలో సాయి ధరమ్ ప్లే బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నాడనిపిస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
‘ఇట్లు అంజలి’ ట్రైలర్ లాంచ్
శ్రీకృష్ణ వొట్టూరు సమర్పణలో ఓమా ప్రొడక్షన్స్ పతాకంపై నవీన్ మన్నేల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘ఇట్లు అంజలి’. ఈ సినిమాలో శ్రీ కార్తికేయ, హిమాన్సీ, శుభాంగి పంత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ హీరో శ్రీకాంత్, దర్శకుడు మారుతి చేతుల మీదుగా సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ...‘ ట్రైలర్ , పాటలు చాలా బావున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన శ్రీ కార్తికేయ హీరోగా పరిచయమవుతోన్న ఈ సినిమా, తనతో పాటు టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ...‘ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన శ్రీ కార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ట్రైలర్ లో తన పర్ఫార్మెన్స్ చాలా బావుంది. హీరోగా తనకు ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నా’ అన్నారు. దర్శక నిర్మాత నవీన్ మన్నేల మాట్లాడుతూ... ‘నాకు ఇష్టమైన హీరో శ్రీకాంత్ గారు, దర్శకుడు మారుతిగారు మా ఫంక్షన్ కు వచ్చి వారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదొక ప్రేమలేఖ ఆధారంగా సాగే డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం. ఇప్పటి వరకు వచ్చిన థ్రిల్లర్స్ కన్నా చాలా విభిన్నంగా ఉంటుంది. టీమ్ అంతా కష్టపడి సినిమా చేసాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నాం. ఇందులో చాలా రిస్కీ షాట్స్ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది’ అన్నారు. హీరో శ్రీ కార్తికేయ మాట్లాడుతూ...‘‘ఆ నలుగురు’ సినిమాలో అప్పడాల కుర్రాడిగా నాకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసా. హీరోగా ఇది నా తొలి సినిమా. ప్రొడ్యూసింగ్, డైరక్షన్ రెండూ చాలా టఫ్ జాబ్స్. అయినా మా నవీన్ గారు రెండింటినీ సమర్థవంతంగా నిర్వహించారు. అలాగే కార్తిక్ కొడకండ్ల అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా కుదిరింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆదరించిన నన్ను హీరోగా కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. -
మరో మెగా హీరోతో మారుతి
కెరీర్ స్టార్టింగ్‌లో మంచి ఫాంలో కనిపించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తరువాత తడబడ్డాడు. వరుస ఫ్లాప్‌లతో ఫాంతో పాటు మార్కెట్‌ను కోల్పోయాడు. అందుకే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న చిత్రలహరి సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు సాయి ధరమ్. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట సాయి ధరమ్ తేజ్. భలే భలే మొగాడివోయ్ తరువాత మహానుభావుడుతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న మారుతి చాలా రోజులుగా నాని హీరోగా సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నాడు. అయితే నాని ఇప్పట్లో ఫ్రీ అయ్యే అవకాశం కనిపించకపోవటంతో సాయి ధరమ్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
బన్నీ ఇంకా ఫిక్స్ అవ్వలేదా..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తరువాత ఇంత వరకు మరో సినిమా అంగీకరించలేదు. ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవటంతో తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బన్నీ. ఇప్పటికే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ టీం ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. యువ దర్శకులు మారుతి, పరుశురాంలు కూడా బన్నీ కోసం కథ రెడీ చేస్తున్నారట. అంటే విక్రమ్ కథను ఇంకా బన్నీ ఫైనల్ చేయలేదా..? లేక విక్రమ్ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా బన్నీ లైన్లో పెడుతున్నాడా..? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే మాత్రం బన్నీ క్లారిటీ ఇవ్వాల్సిందే. -
క్రేజీ హీరోతో మారుతి..!
కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ మారుతి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా శైలజా రెడ్డి అల్లుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతోంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు మారుతి శైలజా రెడ్డి అల్లుడు తరువాత చేయబోయే సినిమాను కూడా ఇప్పటికే ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ లో సెన్సేషనల్ స్టార్‌గా ఎదుగుతున్న విజయ్ దేవరకొండ హీరోగా మారుతి ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల గీత గోవిందం సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరిన విజయ్ ప్రస్తుతం టాక్సీవాలా, నోటా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తరువాత డియర్ కామ్రేడ్ సినిమా చేయాల్సి ఉంది. అంటే మారుతి దర్శకత్వంలో సినిమా ప్రారంభం కావాలంటే ఇంకాస్త టైం పట్టే అవకాశం ఉంది. -
మారుతి రిలీజ్ చేసిన ‘వాట్ ఎ అమ్మాయి’
షార్ట్ ఫిలిం నేపథ్యం నుంచి వచ్చిన యువ దర్శకులు ప్రస్తుతం వెండితెర మీద సత్తా చాటుతున్నారు. తరుణ్ భాస్కర్ , వెంకీ అట్లూరి, విరించి వర్మ, శ్రీరామ్ ఆదిత్య, కార్తీక్ ఘట్టమనేని ఇలా షార్ట్ ఫిలింస్‌తో సత్తా చాటిన చాలా మంది వెండితెర మీద కూడా ఆకట్టుకున్నారు. అందుకే లఘు చిత్ర దర్శకులకు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది. తాజాగా దర్శకుడు మారుతి ఓ షార్ట్ ఫిలింను రిలీజ్ చేశారు. వాట్ ఏ అమ్మాయి పేరుతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలింకు ఏలూరు శ్రీను దర్శకుడు. సూర్య భరత్ చంద్ర, పావని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ లఘు చిత్రానికి నరేష్ సంగీతమందిచారు. మనీష్ పట్టిపాటి నిర్మాత. తన సోషల్ మీడియా ద్వారా ‘వాట్ ఎ అమ్మాయి’ షార్ట్ ఫిలిం రిలీజ్ చేసిన మారుతి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. Here is #WhataAmmayi short film directed by My friend & PRO @elurucnu https://t.co/Z7HX3DSnda All the best to the team — Maruthi director (@DirectorMaruthi) 1 September 2018 -
చైతూ సినిమా వాయిదా!
కేరళలో కురుస్తున్న వర్షాలు టాలీవుడ్ ఇండస్ట్రీ మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. తెలుగులో మలయాళ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. అయితే కేరళలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వారు షూటింగ్లలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో పాల్గొన లేకపోవటంతో సినిమాలు ఆలస్యమవుతున్నాయి. యంగ్ నాగచైతన్య నటిస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమాకు కూడా కేరళ వరదల షాక్ తగిలింది. ఆగస్టు 31న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా వేస్తున్న చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతమందిస్తున్నారు. అక్కడి పరిస్థితుల కారణంగా అనుకున్న సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. హీరో నాగచైతన్య ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెళ్లడించారు. Due to the unfortunate situation in Kerala .. team #ShailajaReddyAlludu is not able to finish the re-recording of the film which is happening there and remaining post production on time .. the makers will fix on the next best possible date and announce shortly ..(1/2) — chaitanya akkineni (@chay_akkineni) 20 August 2018 I sincerely apologise for this delay and also urge everyone to do whatever best they can to help the people of Kerala My heart goes out to everyone there and pray for a quick recovery (2/2) — chaitanya akkineni (@chay_akkineni) 20 August 2018 -
బ్రాండ్ బాబు సినిమాపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో 'బ్రాండ్ బాబు' సినిమా పై కేసు నమోదైంది. తన ఫోటోను అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించడంపై ఓ మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేశారు. బ్రాండ్ బాబు సినిమాలో చనిపోయిన సన్నివేశంలో తన ఫోటో చూపారని బాధిత మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ 509 సెక్షన్ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నడ నటుడు సుమంత్ శైలేంద్రను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు బుల్లి తెర స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ దర్శకుడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మారుతి కథను సమకూర్చారు. -
‘బ్రాండ్ బాబు’ స్పెషల్ ప్రీమియర్ షో
-
‘బ్రాండ్ బాబు’ మూవీ రివ్యూ
టైటిల్ : బ్రాండ్ బాబు జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ, మురళీ శర్మ, పూజిత పొన్నాడ సంగీతం : జెబి రచన : మారుతి దర్శకత్వం : ప్రభాకర్ పి నిర్మాత : శైలేంద్ర బాబు దర్శకుడిగా వరుస విజయాలు సాధిస్తున్న మారుతి, కథ రచయితగానూ అదే జోరు చూపిస్తున్నాడు. తాను స్వయంగా దర్శకత్వం వహించకపోయినా కథ అందిస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు. అలా మారుతి మార్క్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బ్రాండ్ బాబు.. కన్నడ నటుడు సుమంత్ శైలేంద్రను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రభాకర్ దర్శకుడు. బుల్లి తెర స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ దర్శకుడిగా తొలి ప్రయత్నం ‘నెక్ట్స్ నువ్వే’తో నిరాశపరిచాడు. రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన బ్రాండ్ బాబుతో ఆకట్టుకున్నారా..? డిఫరెంట్ క్యారెక్టర్లో తెలుగు తెరకు పరిచయం అయిన సుమంత్ శైలేంద్ర మెప్పించాడా..? కథ: డబ్బున్న వాళ్లు తప్ప పేదవాళ్లు, మధ్యతరగతి వాళ్లు మనుషులే కాదన్న మనస్తత్వం ఉన్న రత్నం (మురళీ శర్మ) తన కొడుకును కూడా తన ఆలోచనలకు తగ్గట్టుగానే పెంచుతాడు. వస్తువుల దగ్గరనుంచి అలవాట్ల వరకు ప్రతీది బ్రాండ్‌దే అయ్యుండాలన్న పిచ్చిలో పెరిగిన డైమండ్(సుమంత్ శైలేంద్ర), తన బ్రాండ్ వ్యాల్యూ పెంచే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదే ప్రయత్నాల్లో భాగంగా హోం మినిస్టర్ కూతురు అనుకొని ఆ ఇంట్లో పనిచేసే రాధ(ఈషా రెబ్బ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. (సాక్షి రివ్యూస్) తరువాత తను పేదింటి అమ్మాయి అని తెలియడంతో ఆమెకు దూరమవుతాడు. తరువాత వారిద్దరు తిరిగి ఎలా ఒక్కటయ్యారు..? బ్రాండ్ పిచ్చి నుంచి డైమండ్ బాబు అతని తండ్రి రత్నం ఎలా బయట పడ్డారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : బ్రాండ్ బాబుగా తెలుగు తెరకు పరిచయం అయిన సుమంత్ శైలేంద్ర మంచి నటన కనబరిచాడు. రిచ్ ఫ్యామిలీ వారసుడిగా పొగరు, యాటిట్యూడ్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్‌లో సన్నివేశాల్లో ఎమోషన్స్ కూడా బాగానే పండించాడు. పేదింటి అమ్మాయి పాత్రలో ఈషా రెబ్బ సరిగ్గా సరిపోయింది. అందం అభినయం రెండింటిలోనూ మంచి మార్కులు సాధించింది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మురళీ శర్మ సూపర్బ్ అనిపించారు.(సాక్షి రివ్యూస్) చాలా రోజులుగా రొటీన్ పాత్రల్లో కనిపిస్తున్న మురళీ శర్మకు బ్రాండ్ బాబులో కాస్త కొత్తగా నటించే అవకాశం దక్కింది. అక్కడక్కడా కాస్త అతి చేసినట్టుగా అనిపించినా.. ఓవరాల్‌గా మరోసారి కీలక పాత్రలో మురళీ శర్మ సినిమాకు ప్లస్ అయ్యారు. ఇతర పాత్రల్లో పూజిత పొన్నాడా, రాజా రవీంద్ర, వేణు తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ : దర్శకుడిగా ఫుల్ ఫాంలో ఉన్న మారుతి రచయితగానూ సత్తా చాటాడు. తన మార్క్ కథా కథనాలతో సినిమాను వినోదాత్మకంగా మలిచాడు. బుల్లితెర మీద స్టార్ ఇమేజ్ అందుకున్న ప్రభాకర్ నెక్ట్స్ నువ్వే సినిమాతో దర్శకుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. రెండో ప్రయత్నంగా మారుతి బ్రాండ్‌తో బ్రాండ్ బాబు సినిమాను తెరకెక్కించారు. ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కినా సినిమాలో ఎక్కువగా మారుతి మార్క్ సీన్సే కనిపిస్తాయి. దర్శకుడిగా ప్రభాకర్ తన మార్క్ చూపించలేకపోయాడు. కామెడీ పరంగా సినిమా బాగానే అలరిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. సంపన్న కుటుంబాల్లోని వ్యక్తులు తమ ఎమోషన్స్‌ను దాచుకొని బయటికి ఎలా నటిస్తోరో, ఎలా ప్రవర్తిస్తారో చూపించిన సీన్స్ ఆకట్టుకుంటాయి. కొన్నిసీన్స్ అంత కన్విన్సింగ్‌గా అనిపించవు. (సాక్షి రివ్యూస్)హీరోకు హీరోయిన్ మీద ప్రేమ కలగడానికి, అతనిలో మార్పు రావడానికి బలమైన కారణం ఏమీ కనిపించదు. జెబీ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. హీరో సొంత బ్యానర్ కావటంతో ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు. సుమంత్ శైలేంద్రను టాలీవుడ్ కు పరిచయం చేసేందుకు భారీగానే ఖర్చు పెట్టారు. ప్లస్ పాయింట్స్ : కామెడీ మురళీ శర్మ నటన ప్రొడక్షన్ వ్యాల్యూస్ మైనస్ పాయింట్స్ : పాటలు ఎడిటింగ్ సెకండ్ హాఫ్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఆగస్టు 31న ‘శైలజా రెడ్డి అల్లుడు’
యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అత్త పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్రావటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకంటించారు. ఆగస్టు 31న శైలజా రెడ్డి అల్లుడు సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని హీరో నాగచైతన్య తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. చైతూ సరసన అనూ ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తుండగా గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. And yes #SailajaReddyAlludu will be releasing on august 31st .. An emotional journey of love packaged with @DirectorMaruthi entertainment in its peak ! pic.twitter.com/65k9tFrBxB — chaitanya akkineni (@chay_akkineni) 30 July 2018 -
ఆగస్టులో ‘బ్రాండ్ బాబు’
మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రభాకర్.పి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు నిర్మిస్తోన్న చిత్రం బ్రాండ్ బాబు. డైరెక్టర్ మారుతి కథ అందించిన ఈ మూవీలో సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ హీరో హీరోయిన్లుగా నటించారు. మురళీశర్మ మరో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా విడుదల చేసిన బ్రాండ్ బాబు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఆడియోను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ మొదటివారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ మారుతి స్టైల్లో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. -
మారుతి కథతో ‘బ్రాండ్ బాబు’
యూత్ ఫుల్ ఎంటర్టైనర్లతో ఆకట్టుకుంటున్న యువ దర్శకుడు మారుతి మార్క్‌తో రిలీజ్ అవుతున్న మరో మూవీ బ్రాండ్ బాబు. మారుతి స్వయంగా కథ అందిస్తూ సమర్పిస్తున్న ఈ సినిమాతో కన్నడ నటుడు సుమంత్ శైలేంద్ర తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. బుల్లితెర స్టార్ యాంకర్ పీ ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈషా రెబ్బా హీరోయిన్గా నటిస్తుండగా మురళీశర్మ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. జెబీ సంగీతమందిస్తున్నారు. మారుతి మార్క్కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శైలేంద్ర బాబు నిర్మిస్తున్నారు. -
సెట్స్ మీదకు 'శైలజా రెడ్డి అల్లుడు'
పెళ్లి పనులతో కొద్ది రోజులు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య తిరిగి షూటింగ్ లతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే చందూమొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈసినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను ప్రారంభించాడు. మహానుభావుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మారుతి దర్శకత్వంలో నాగచైతన్య తదుపరి చిత్రం తెరకెక్కనుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ రోజు(శనివారం) లాంచనంగా ప్రారంభమైంది. నాగచైతన్య సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కీలకమైన అత్త పాత్రలో రమ్యకృష్ణ నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెలాఖరున ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'మహానుభావుడు' మూవీ రివ్యూ
టైటిల్ : మహానుభావుడు జానర్ : రొమాంటిక్ ఎంటర్ టైనర్ తారాగణం : శర్వానంద్, మెహరీన్, వెన్నెల కిశోర్, నాజర్ సంగీతం : తమన్ దర్శకత్వం : మారుతి నిర్మాత : వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ పండుగ సీజన్ లో స్టార్ హీరోల సినిమాలకు పోటిగా బరిలో దిగి ఘనవిజయాలు సాధించిన రికార్డ్ శర్వానంద్ సొంతం. అదే ధైర్యంతో మరోసారి జై లవ కుశ, స్పైడర్ లాంటి సినిమాలు పోటి పడుతున్న దసరా సీజన్ లో మహానుభావుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వా. భలే భలే మొగాడివోయ్, బాబు బంగారం లాంటి సినిమాలతో ఆకట్టుకున్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు శర్వానంద్ ట్రాక్ రికార్డ్ ను కాపాడిందా..? మారుతి ఖాతాలో మరో సక్సెస్ ను అందించిందా..? కథ : ఆనంద్ (శర్వానంద్) ఓసీడీ ( అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) అనే వ్యాధితో ఇబ్బంది పడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతి శుభ్రత, అతి నీట్ నెస్ ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి కారణంగా తాను ఇబ్బంది పడటంతో పాటు ఇతరులను కూడా ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. ఆనంద్ తల్లి, కజిన్ (వెన్నెల కిశోర్) లు కూడా ఆనంద్ ప్రవర్తనతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆనంద్, మేఘన (మెహరీన్) తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. తన వ్యాధి గురించి చెప్పకుండా తనను ఇంప్రెస్ చేసి ప్రేమలో పడేస్తాడు. అయితే మేఘన మాత్రం తన తండ్రి రామరాజు (నాజర్)కి నచ్చితేనే నిన్ను ప్రేమిస్తానని ఆనంద్ కు కండిషన్స్ పెడుతుంది. పల్లెటూరి నుంచి వచ్చిన మేఘన తండ్రితో ఆనంద్ ఫ్రీగా ఉండలేకపోతాడు. రామరాజు కూడా తన కూతురికి ఆనంద్ కరెక్ట్ కాదని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ పరిస్థితుల్లో ఆనంద్ రామరాజు కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడు...? మేఘన ప్రేమను ఎలా గెలుచుకోగలిగాడు..? ఆనంద్ వ్యాధిని అతడి ప్రేమ ఎలా జయించింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఓసీడీ అనే ఇబ్బందికర వ్యాధితో బాధపడే పాత్రలో శర్వానంద్ మంచి నటన కనబరిచాడు. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మెహరీన్ రీ ఎంట్రీలో ఆకట్టుకుంది. గ్లామర్ షోతో పాటు నటిగానూ మంచి మార్కులు సాధించింది. వెన్నెలకిశోర్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్ తో అలరించాడు. సినిమా అంతా హీరో వెంటే ఉండే పాత్రలో నవ్వులు పూయించాడు. హీరోయిన్ తండ్రిగా నాజర్ హుందాగా కనిపించారు. కూతురి ప్రేమను గెలిపించేందుకు తపన పడే తండ్రిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవటం, ఆ పాత్రలో నటించిన నటీనటులు పెద్దగా గుర్తింపు ఉన్నవారు కాకపొవటంతో పెద్దగా మాట్లాడుకోవాల్సిందేమీ లేదు.(సాక్షి రివ్యూస్) సాంకేతిక నిపుణులు : భలే భలే మొగాడివోయ్ సినిమాతో ట్రాక్ మార్చి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మారుతి, ఈ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. హీరో కు ఓ వ్యాధి, ఓ ప్రేమకథ, ఓ సమస్య ఇలా దాదాపు భలే భలే మొగాడివోయ్ కాన్సెప్ట్ తోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే శర్వానంద్ ను ఓసీడీతో ఇబ్బంది పడే వ్యక్తిగా చూపించిన దర్శకుడు కావాల్సినంత వినోదం పంచాడు. కొన్ని సందర్భాలలో అతిగా అనిపించినా.. మంచి కామెడీతో అలరించాడు. కథాపరంగా కొత్తదనం లేకపోయినా.. టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. తమన్ అందించిన సంగీతం పరవాలేదు. సినిమా రిలీజ్ కు ముందే సూపర్ హిట్ అయిన మహానుభావుడవేరా సాంగ్ విజువల్ గా మరింతగా అలరిస్తుంది. (సాక్షి రివ్యూస్) నిజర్ షఫీ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్, ప్రతీ సన్నివేశం, రిచ్ గా కలర్ ఫుల్ గా కంటికింపుగా కనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాలు స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : శర్వానంద్ నటన కామెడీ మైనస్ పాయింట్స్ : కొత్తదనం లేకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
లైఫ్ కథా చిత్రమ్
ఈ రోజుల్లో.. చిత్రంతో ఎంట్రీ ఇచ్చి.. బస్‌స్టాప్ మూవీతో ట్రెండ్ సెట్ చేసిన ఈ డెరైక్టర్.. నిర్మాతగా ప్రేమ కథాచిత్రమ్తో హిట్ కొట్టి ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు. దర్శకుడిగా కొత్తజంట సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మారుతీ దాసరి.. తనకు పాఠాలు నేర్పింది ఈ హైదరాబాదే అంటున్నారు. రూ.15 వేలతో సిటీలో అడుగుపెట్టిన తనను ఇప్పుడు కార్లలో తిరిగే స్థాయికి చేర్చింది భాగ్యనగరమే అని చెబుతారు. భాగ్యనగరితో ముడిపడిన తన జీవనచిత్రాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. మాది మచిలీపట్నం. పేదరికంలో పెరిగాను. నాన్న బండ్ల మీద అరటిపళ్లు అమ్మేవాడు. అమ్మ టైలరింగ్ చేసేది. వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేసేవాడిని. కష్టాల మధ్యే డిగ్రీ పూర్తి చేశాను. టూడీ యానిమేషన్ నేర్చుకోవాలన్న సంకల్పంతో 1998లో సిటీ రైలు ఎక్కేశాను. నిజాంపేటలోని మా అక్క వాళ్లింటో దిగాను. లాంగ్ జర్నీ అప్పట్లో నిజాంపేటకు బస్సులు తక్కువ. ఇక ఆటోలు రావడం కూడా గగనమే. జేఎన్టీయూ నుంచి నిజాంపేట వరకూ నడిచేవాణ్ని. జూబ్లీహిల్స్‌లోని హార్ట్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో టూడీ యానిమేషన్ కోర్స్‌లో చేరాను. ఉదయం పదింటికే నిజాంపేట నుంచి సైకిల్ మీద జేఎన్టీయూ బస్టాప్ చేరుకునేవాణ్ని. తెలిసిన వాళ్ల షాప్ దగ్గర సైకిల్ పార్క్ చేసి బస్సులు మారి రెండింటికి ఇన్స్టిట్యూట్కు వెళ్లేవాణ్ని. ఐదింటికి క్లాస్ అయిపోయాక బయల్దేరితే.. ఇంటికి చేరుకునే సరికి రాత్రి తొమ్మిది దాటేది. ఇలా చదువు కన్నా జర్నీకే ఎక్కువ టైం పట్టేది. బొమ్మలేయడం సరదా నాకు బొమ్మలేయడం అంటే సరదా. సిటీ రోడ్లపై బాగా చక్కర్లు కొట్టేవాడిని. ఆ టైంలోనే బస్టాప్‌ల దగ్గర వేచి ఉండే ప్రయాణికుల బొమ్మలు గీసేవాడిని. గోల్కొండ, చార్మినార్, జూపార్క్‌లోని జంతువులు, పక్షులు ఇలా ఎన్నో బొమ్మలు వేశాను. టైం దొరికితే చాలు హైదరాబాద్ అందాలను నా స్కెచింగ్‌లో చూపించే ప్రయత్నం చే సేవాడిని. టర్నింగ్ పాయింట్ 2008లో నాకు పెళ్లయింది. తర్వాత యానిమేషన్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ జీవనం కొనసాగించా. ఈ టైంలోనే బన్నీ వాసుతో పరిచయం నా లైఫ్‌ను కొత్త మలుపు తిప్పింది. ఆర్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా అవకాశం వచ్చింది. తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా చేశాను. యాడ్స్ తీశాను. ఇక నా డెరైక్షన్ గురించి మీకు తెలిసిందే. బెస్ట్ లొకేషన్ నేను తొలినాళ్లలో చూసిన నగరానికి.. ఇప్పటి సిటీకి ఎంతో తేడా ఉంది. హైటెక్ సిటీకి వెళ్లి చూడండి.. మరో ప్రపంచం కనిపిస్తుంది. అక్కడ షూట్ చేసిన సీన్లు విదేశాల్లో తీసినంత రిచ్‌గా వస్తున్నాయి.అందుకే నా సినిమాల్లో సిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాను. ..:: వాంకె శ్రీనివాస్