Mohammed Azharuddin
-
అజారుద్దీన్‌పై మరో కేసు నమోదు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్‌పై మరో కేసు నమోదైంది. అజహార్ నేతృత్వంలోని గత హెచ్‌సీఏ పాలకవర్గం అవినీతికి పాల్పడిందని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) సీఈఓ సునీల్ కాంతే ఇవాళ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అజహార్ అండ్ టీమ్.. 2020-2023 మధ్యలో జిమ్ వస్తువుల కొనుగోలు, క్రికెట్ బాల్స్ కొనుగోలు, అగ్ని ప్రమాద సామాగ్రి కొనుగోలు, బకెట్ చైర్స్ కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడిందని సునీల్ కాంతే ఫిర్యాదులో పేర్కొన్నారు. టెండర్ల కేటాయింపులో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో నిర్ధారణ అయినట్లు ప్రస్తావించారు. ఫిర్యాదును పరిశీలించిన ఉప్పల్ పోలీసులు అజార్ అండ్ టీమ్‌పై కేసు నమోదు చేశారు. కాగా, కొద్ది రోజుల కిందట జస్టిస్ లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్‌పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు అజారుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. దీంతో అజహార్ రానున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్ పేరును హెచ్‌సీఏ ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగించింది. -
అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ! ఇక మర్చిపోవాల్సిందే!
HCA Elections- Setback for Azhar: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగలింది. హెచ్‌సీఏ ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలంటూ అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాంశు ధులియాలతో కూడిన బెంచ్ ఈ వ్యవహారంపై విచారణను అక్టోబరు 31కి వాయిదా వేసింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి హెచ్‌సీఏలో చక్రం తిప్పాలనుకున్న అజారుద్దీన్ ఆశలకు గండిపడింది. కాగా అక్టోబరు 20న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటరు జాబితా నుంచి తన పేరు తొలగించడంపై అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అతడికి భంగపాటు ఎదురైంది. సుప్రీంకు చేరిన పంచాయితీ 2019లో అజారుద్దీన్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే, అజారుద్దీన్, ఇతర కార్యవర్గ సభ్యుల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా విషయం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. రిటైర్డ్ జడ్జి లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ క్రమంలో సెప్టెంబరు 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రిటైర్డ్ ఐఏఎస్ విఎస్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ జరుగనుంది. అందుకే అనర్హత వేటు ఇదిలా ఉంటే.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే.. డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్‌గా ఉన్నందున(కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) అజారుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. జస్టిస్ లావు నాగేశ్వర రావుతో కూడిన ఏకసభ్య కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో హెచ్‌సీఏ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో వెంటనే జోక్యం చేసుకోవాలని సుప్రీంను ఆశ్రయించగా అతడికి నిరాశే ఎదురైంది. ఈసారికి మర్చిపోవాల్సిందే ఈ విషయంపై స్పందించిన అజారుద్దీన్ సన్నిహిత వర్గాలు.. ‘‘ఒకవేళ అక్టోబరు 31 తర్వాత ఓటర్ల లిస్టులో అజర్ పేరును చేర్చాలని న్యాయస్థానం ఆదేశించినా ఉపయోగం ఉండదు. అయితే, అతడికి వ్యతిరేకంగా కొందరు పన్నిన కుట్రను బయటపెట్టేందుకు... అజారుద్దీన్ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు అవకాశం దొరుకుతుంది. అతడికి ఎలాంటి అన్యాయం జరిగిందనే విషయం బయటకు వస్తుంది’’ అని పేర్కొన్నాయి. చదవండి: #Shubman Gill: టీమిండియాకు భారీ షాక్! వాళ్లలో ఒకరికి గోల్డెన్ ఛాన్స్.. వరల్డ్‌కప్ జట్టులో! -
Asia Cup 2023 IND VS NEP: అరుదైన ఘనత సాధించిన విరాట్ కోహ్లి
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. ఆసియా కప్ 2023లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (సెప్టెంబర్ 4) జరుగుతున్న మ్యాచ్‌లో ఆసిఫ్ షేక్ క్యాచ్ పట్టడం ద్వారా కోహ్లి మల్టీ నేషనల్ వన్డే టోర్నమెంట్లలో 100 క్యాచ్‌లను పూర్తి చేశాడు. భారత మాజీ సారధి మొహమ్మద్ అజహారుద్దీన్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో నాన్ వికెట్‌కీపర్‌గా కోహ్లి రికార్డుల్లోకెక్కాడు. What a catch by Virat Kohli ♥️#ViratKohli𓃵 #IndvsNep pic.twitter.com/Ak5MqYKNOP — ViIRAT FAN (@ViiratF18775) September 4, 2023 నేపాల్ ఇన్నింగ్స్ 30వ ఓవర్లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో విరాట్ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. అంతకుముందు కోహ్లి ఓసారి ఆసిఫ్ షేక్ అందించిన సునాయాస క్యాచ్‌ను జారవిడిచాడు. హాఫ్ సెంచరీ సాధించి క్రీజ్‌లో పాతుకుపోయిన ఆసిఫ్ (58; 8 ఫోర్లు) వికెట్ దక్కడంతో టీమిండియాకు బ్రేక్ లభించినట్లైంది. Ravindra Jadeja on fire - 3 wickets for him! What a catch at slips by captain Rohit Sharma. pic.twitter.com/qhn0bC5qnI — Mufaddal Vohra (@mufaddal_vohra) September 4, 2023 ఇదిలా ఉంటే, వరుణుడి ఆటంకాల నడుమ సాగుతున్న భారత్-నేపాల్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కుషాల్ భుర్టెల్ (38), ఆసిఫ్ షేక్‌లు నేపాల్‌కు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించారు. అనంతరం రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించి నేపాల్‌ను దెబ్బకొట్టాడు. జడ్డూ స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి టీమిండియాను మ్యాచ్‌లోకి తెచ్చాడు. 39 ఓవర్ల తర్వాత నేపాల్ స్కోర్ 183/6గా ఉంది. దీపేంద్ర సింగ్ (28), సోంపాల్ కామీ (15) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 3, సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. -
‘కర్ణాటక’ స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. గురువారంతో నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు మొత్తం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ బుధవారం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇందులో ఇద్దరు తెలంగాణ నాయకులకు అవకాశం లభించింది. పీసీసీ అధ్యక్షుడితో పాటు మాజీ క్రికెటర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్‌ను కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది. ఇప్పటికే ఎనిమిది మంది రాష్ట్ర నాయకులను కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పరిశీలకులుగా నియమించింది. చదవండి: బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆమెకు చోటు! కాగా, బుధవారం బెంగళూరులోని రాడిసన్ హోటల్లో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశానికి వీరంతా హాజరయ్యారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్లుగా నియమించిన వారితో పాటు కర్ణాటక సరిహద్దు జిల్లాలకు చెందిన తెలంగాణ జిల్లాల నాయకత్వాన్ని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వినియోగించుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. చదవండి: TSRTC: వినూత్న ప్రయోగం.. సర్ అనండి.. సర్రున అల్లుకుపొండి -
కథ కంచికి.. హెచ్‌సీఏకు తగిన శాస్తి
వెంకటపతిరాజు, మహ్మద్ అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్.. ఇలా ఆణిముత్యం లాంటి క్రికెటర్లను దేశానికి అందించిన ఘనత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ది(హెచ్‌సీఏ). అలాంటి హెచ్‌సీఏ ఇవాళ అంతర్గత కుమ్ములాటలు, చెత్త రాజకీయాలతో భ్రష్టు పట్టిపోయింది. ఇంత జరుగుతున్నా బీసీసీఐ ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. హెచ్‌సీఏ వ్యవహార కమిటీని రద్దు చేస్తూ సుప్రీం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జస్టిస్ లావు నాగేశ్వరరావు ఏకసభ్య కమిటీ హెచ్‌సీఏ వ్యవహరాలను చూసుకుంటుందని తెలిపింది. ఇన్నాళ్లుగా ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన హెచ్‌సీఏ కథ చివరికి ఇలా ముగిసింది. టాలెంటెడ్ ఆటగాళ్లను పట్టించుకోకుండా ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వారినే ఆడించడం హెచ్‌సీఏలో కామన్‌గా మారిపోయింది. ఇటీవలే ముగిసిన రంజీ ట్రోఫీలోనూ హైదరాబాద్ జట్టు దారుణ ప్రదర్శనను కనబరిచింది. నాలుగు రోజుల మ్యాచ్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి నిండా ఒక్కరోజు కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయలేక.. సరిగా బౌలింగ్ చేయలేక చేతులెత్తేస్తున్నారు. టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో పరాజయం.. ఒక మ్యాచ్ డ్రాతో ఒక్క పాయింటుతో గ్రూప్-బి పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. రంజీలో పాల్గొన్న మిగతా రాష్ట్రాల జట్లు ఆటలో ముందుకు వెళుతుంటే.. హెచ్‌సీఏ మాత్రం మరింత వెనక్కి వెళుతుంది. పాలకుల అవినీతి పరాకాష్టకు చేరడమే హైదరాబాద్ క్రికెట్ దుస్థితికి ప్రధాన కారణమన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక టీమిండియా, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టి20 మ్యాచ్‌కు టికెట్ల అమ్మకంపై జరిగిన రగడ హెచ్‌సీఏలోని అంతర్గత విబేధాలను మరోసారి బహిర్గతం చేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ సహా మిగతా కార్యవర్గ సభ్యులు మధ్య తలెత్తిన విబేధాలతో ఆటను సరిగా పట్టించుకోవడం లేదని భావించిన సుప్రీం కోర్టు పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. హెచ్‌సీఏ వ్యవహారాల పర్యవేక్షణకు జిస్టిస్ కక్రూ, డీజీపీ అంజనీ కుమార్, వెంకటపతిరాజు, వంకా ప్రతాప్‌లతో తాత్కాలిక కమిటీని నియమించింది. అయినప్పటికి ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా హెచ్‌సీఏ పరిస్థితి ఉంది. పైగా వంకా ప్రతాప్ కమిటీ బాధ్యతల్లోనే గాకుండా జట్టు సెలక్షన్ కమిటీలోనూ వేలు పెడుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. హెచ్‌సీఏ అకాడమీ డైరెక్టర్‌గా వంకా ప్రతాప్ నెలకు రూ. 3 లక్షలు జీతం తీసుకుంటున్నప్పటికి.. పర్యవేక్షక కమిటీకి హాజరైనందున తనకు రూ. 5.25 లక్షలు ఇవ్వాలని హెచ్‌సీఏకు విజ్ఞప్తి చేశాడు. తన స్వప్రయోజనాల కోసం హెచ్‌సీఏను వంకా ప్రతాప్ భ్రష్టు పట్టిస్తున్నారని కొంతమంది పేర్కొన్నారు. మాజీ ఆటగాళ్లు పరిపాలకులుగా ఉంటే హెచ్‌సీఏ కాస్త గాడిన పడుతుందని భావించారు. కానీ తాజా రాజకీయ పరిణామాలు సగటు క్రికెట్ అభిమానులను ఆవేదన కలిగించాయి. ఇంత జరుగుతున్నా బీసీసీఐ నిమ్మకు నీరెత్తనట్టుగా ఉండడం సగటు అభిమానిని ఆశ్చర్యానికి గురి చేసింది. త్వరలో హెచ్‌సీఏ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా జరగాలని కొంతమంది హెచ్‌సీఏ ప్రతివాదులు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) కథ కంచికి చేరింది. సుప్రీంకోర్టు హెచ్‌సీఏ వ్యవహార కమిటీని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇకపై ఏకసభ్య కమిటీ హెచ్‌సీఏ వ్యవహారలన్నీ చూసుకుంటుందని సుప్రీం పేర్కొంది. చదవండి: అజారుద్దీన్‌కు చుక్కెదురు.. హెచ్‌సీఏ కమిటీని రద్దు చేసిన సుప్రీం కోర్టు -
అజారుద్దీన్‌కు చుక్కెదురు.. హెచ్‌సీఏ కమిటీని రద్దు చేసిన సుప్రీం కోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అజర్ నేతృత్వం వహిస్తున్న హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. ప్రస్తుత కమిటీ స్థానంలో మాజీ జడ్జ్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను ఏకసభ్య కమిటీ చూసుకుంటందని తెలిపింది. త్వరలోనే హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. హెచ్‌సీఏలో ఎన్నికల ప్రతిష్టంభన తొలగించి.. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్‌గా జస్టిస్ దీపక్ వర్మ నియామకాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించడంపై ప్రతివాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ లావు నాగేశ్వరరావుకు హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణ బాధ్యతల అప్పజెప్పాలని ప్రతివాదుల తరపు సీనియర్ న్యాయవాది దవే సుప్రీంకు పేర్కొన్నారు. దవే సూచనలను అంగీకరించిన సుప్రీంకోర్టు హెచ్‌సీఏ కమిటీ రద్దుకే మొగ్గుచూపింది. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావుకు అన్ని విధాలా సహకరించాలని హెచ్‌సీఏకు సుప్రీం ఆదేశించింది. -
హెచ్‌సీఏలో మరోసారి బయటపడ్డ విభేదాలు.. అజహర్‌పై తీవ్రస్థాయి ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో (హెచ్‌సీఏ) విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్‌పై జనరల్ సెక్రెటరీ విజయ్ ఆనంద్ సంచలన ఆరోపణలు చేశాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు (జనవరి 18) వన్డే మ్యాచ్ జరుగనుండగా.. జనరల్ సెక్రెటరీని అయిన నన్ను సంప్రదించకుండా అజహర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆనంద్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. జనరల్ సెక్రెటరీగా తన విధులు అధ్యక్షుడితో సమానంగా ఉంటాయని, అయినా అజహర్ తనను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించాడు. దళితుడినని అజహర్ తనను చిన్న చూపు చూస్తున్నాడని, బెదిరించి చెక్కులపై సైన్ చేయించుకుంటున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హెచ్‌సీఏలో నియంతలా వ్యవహరిస్తున్న అజహర్.. రేపు జరిగే వన్డే మ్యాచ్ టికెట్లను పక్కదారి పట్టించాడని, ఆన్లైన్ టికెట్ల అమ్మకాల్లో గోల్మాల్ చేశాడని ఆరోపించాడు. తనతో పాటు తన ప్యానెల్ మొత్తాన్ని అజహర్ పక్కకు పెట్టాడని, ఎవరి ప్రమేయం లేకుండా అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని అన్నాడు. -
అజహారుద్దీన్‌పై సీపీకి ఫిర్యాదు.. ‘తప్పుడు ధ్రువపత్రాలతో..’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఉప్పల్ వేదికగా సెప్టెంబర్ 25న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరిగిన నాటి నుంచి హెచ్‌సీఏపై వివిధ అంశాలకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహారుద్దీన్ పదవీకాలానికి సంబంధించి మరో కేసు నమోదైంది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజహారుద్దీన్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 26తోనే ముగిసినప్పటికీ.. అతను తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించి చేసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని మాజీ అధ్యక్షుడు జి.వినోద్, సెక్రటరీ శేషు నారాయణ్, మెంబర్ చిట్టి శ్రీధర్ బాబు బృందం రాచకొండ సీపీ మహేష్ భగవత్‌కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు లిఖితపూర్వరంగా సీపీకి కంప్లైంట్‌ను అందజేశారు. పదవీకాలంపై ఎవరిని సంప్రదించకుండా ఆయనకు ఆయనే గడువు పొడిగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసుకున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 18న జరిగే బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్‌కు హాజరు అయ్యేందుకు అజహారుద్దీన్ తన పదవీకాలాన్ని పొడిగించుకున్నాడని ఆరోపించారు. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని సీపీకి కంప్లైంట్ చేశారు. -
అంతా పారదర్శకమే.. టికెట్ల విక్రయాలపై అజహర్ స్పష్టీకరణ
ఉప్పల్/సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో అన్ని రకాలుగా పారదర్శకత పాటించామని, తమ వైపునుంచి టికెట్లు బ్లాక్ అయ్యే అవకాశమే లేదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌లో ఆదివారం జరిగే మూడో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో నెలకొన్న గందరగోళంపై ఆయన ఈ మేరకు స్పందించారు. జింఖానా మైదానంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, మ్యాచ్ రోజున ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘టికెట్ల విక్రయం బాధ్యతను పేటీఎంకు అప్పగించాం. ఇందులో నేరుగా హెచ్‌సీఏ ప్రమేయం లేదు. ఆన్లైన్ టికెట్లను బ్లాక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు’ అని చెప్పారు. ఆన్లైన్లో 11,450, 3,000 చొప్పున రెండుసార్లు, ఆఫ్‌లైన్‌లో 2,100 టికెట్లు విక్రయించామని చెప్పారు. తప్పనిసరిగా ఇవ్వాల్సిన స్పాన్సర్లు తదితరులకు 6 వేల టికెట్లు ఇచ్చినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారమే తమ క్లబ్ కార్యదర్శులకూ కాంప్లిమెంటరీలు ఇచ్చామని అజహర్ పేర్కొన్నారు. సజావుగా నిర్వహించేందుకు... హెచ్‌సీఏలో కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఆన్లైన్లో సమీక్ష నిర్వహించింది. ఇందులో హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ, ఏసీబీ డైరెక్టర్ అంజనీకుమార్, మాజీ క్రికెటర్లు వెంకటపతిరాజు, వంకా ప్రతాప్ పాల్గొన్నారు. మ్యాచ్‌ను సజావుగా నిర్వహించడమే ప్రధాన ఉద్దేశమని జస్టిస్ కక్రూ తెలిపారు. మ్యాచ్‌ను సక్రమంగా నిర్వహించేందుకు కమిటీ హెచ్‌సీఏకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్నారు. టి–20 టికెట్లలో భారీ కుంభకోణం: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హఫీజ్‌పేట్: హైదరాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగబోయే టి–20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో భారీ కుంభకోణం జరిగిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ ఆదేశాలతో క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రంగంలోకి దిగి, హెచ్‌సీఏతో కుమ్మక్కై టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారన్నారు. మియాపూర్ మదీనాగూడలోని కిన్నెర గ్రాండ్ హోటల్లో శుక్రవారం జరిగిన ప్రవాస్ యోజన సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టికెట్ల విక్రయం ఓ ఆన్లైన్ సంస్థకు అప్పజెప్పి, అర్ధరాత్రి 10 గం.కు అమ్మకాలు ఓపెన్ చేసి 20 నిమిషాల్లో 39 వేల టికెట్లు అమ్ముడుపోయాయనడం విడ్డూరమన్నారు. రూ.800 టికెట్‌ను బ్లాక్‌లో రూ.8,000 నుంచి రూ.30 వేల వరకు అమ్ముతున్నారని ఆరోపించారు. -
Noel David: దయనీయ స్థితిలో టీమిండియా మాజీ క్రికెటర్.. భరోసా కల్పించిన హెచ్‌సీఏ
గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ ఆల్‌రౌండర్ నోయెల్ డేవిడ్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్ సోమవారం కలిశాడు. ఈ సందర్భంగా నోయెల్ ఆరోగ్యం గురించి వైద్యుల వద్ద ఆరా తీసిన అజహార్.. నోయెల్ కిడ్నీ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చునంతా హెచ్‌సీఏనే భరిస్తుందని భరోసా ఇచ్చాడు. Team India player was suffering in hospital for years, now Mohammad Azharuddin came forward to help, career was over after 4 matches! https://t.co/zucux7ioUR — News NCR (@NewsNCR2) February 28, 2022 అలాగే నోయెల్‌కు వ్యక్తిగత ఆర్ధిక సాయాన్ని కూడా చేస్తామని అజహార్ హామీ ఇచ్చాడు. ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ అయిన 51 ఏళ్ల నోయెల్.. 1997లో వెస్టిండీస్‌లో పర్యటించిన భారత జట్టులో సభ్యుడు. టీమిండియా తరఫున 1997లో నాలుగు వన్డేలు ఆడిన నోయెల్.. బ్యాటింగ్‌లో తన సామర్ధ్యానికి తగ్గ ప్రదర్శన చేయనప్పటికీ, బౌలంగ్‌లో పర్వాలేదనిపించి నాలుగు వికెట్లు పడగొట్టాడు. చదవండి: సచిన్ సహచరుడు, టీమిండియా మాజీ ప్లేయర్ అరెస్ట్ -
అందరూ ఉన్నారు.. ఒక్కడు మాత్రం మిస్సయ్యాడు.. ఎవరది?
టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. మరి అంతలా షేక్ చేస్తున్న ఆ ఫోటోలో ఏముందనేది ఇప్పుడు తెలుసుకుందాం. 1992 వరల్డ్‌కప్‌కు సంబంధించి ప్రతిష్టాత్మక సిడ్నీ హార్బర్లో దిగిన రెండు ఫోటోలను అజారుద్దీన్ తన ట్విటర్లో షేర్ చేశాడు. తొలి ఫోటోలో ఆ వరల్డ్‌కప్‌లో పాల్గొన్న తొమ్మిది దేశాల కెప్టెన్లు.. ఇక రెండో ఫోటోలో టీమ్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. ఈ సందర్భంగా అజారుద్దీన్.. ''1992 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియా. సిడ్నీ హార్బర్ వేదికగా జట్లతో పాటు కెప్టెన్ల ఫోటోషూట్ జరిగింది. అయితే ఈ ఫోటోలో ఒక గ్రేట్ ఆల్‌రౌండర్ మిస్ అయ్యాడు.. ఎవరో కనుక్కోండి'' అని క్యాప్షన్ జత చేశాడు. అజారుద్దీన్ ఎవరి గురించి చెబుతున్నాడో క్రికెట్ ఫ్యాన్స్ పసిగట్టేశారు. మిస్ అయింది ఎవరో కాదు.. టీమిండియా గ్రేట్‌స్ట్ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్. ఎమర్జెన్సీ పని ఉండడంతో కపిల్ దేవ్ స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో కపిల్ జీ ఈ ఫోటోషూట్‌కు మిస్సయ్యాడు. అజారుద్దీన్ షేర్ చేసిన ఫోటోను 12,500 మంది వీక్షించారు. వేలాది మంది కపిల్ దేవ్ అంటూ ట్వీట్ చేశారు. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 1992 ప్రపంచకప్‌ను పాకిస్తాన్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో ఇంగ్లండ్‌ను 22 పరుగుల తేడాతో ఓడించి పాక్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మెగాటోర్నీలో టీమిండియా అంతగా ఆకట్టుకోలేకపోయింది. రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో జరిగిన టోర్నీలో టీమిండియా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. లీగ్ దశలో పాకిస్తాన్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించడం ఒక్కటే గొప్పగా చెప్పుకోవచ్చు. చదవండి: సంజూలో మంచి టాలెంట్ ఉంది.. సరైన రీతిలో వాడుకుంటాం: రోహిత్ శర్మ కోహ్లి నా సాయం కోరాడు.. సమయం వెచ్చించమని రిక్వెస్ట్ చేశాడు 1992 World Cup in Australia. At Sydney Harbour with the teams and their captains. The greatest all rounder is missing in the picture. Can you guess who? pic.twitter.com/JU0dPAyR2q — Mohammed Azharuddin (@azharflicks) February 23, 2022 -
బ్రేక్ తీసుకోవచ్చు.. కానీ.. ! రోహిత్, కోహ్లిలపై విరుచుకుపడ్డ భారత మాజీ కెప్టెన్
Mohammad Azharuddin Slams Virat And Rohit: టీమిండియా కెప్టెన్లు విరాట్ కోహ్లి(టెస్ట్), రోహిత్ శర్మ(పరిమిత ఓవర్ల ఫార్మాట్)లు వివిధ కారణాల చేత దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తప్పుకోవడంపై టీమిండియా మాజీ సారధి మహ్మద్ అజహారుద్దీన్ స్పంచించాడు. ట్విటర్ వేదికగా కోహ్లి, రోహిత్‌లపై విరుచుకుపడ్డాడు. జాతీయ జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారిద్దరికి హితవు పలికాడు. Virat Kohli has informed that he's not available for the ODI series & Rohit Sharma is unavailable fr d upcoming test. There is no harm in takin a break but d timing has to be better. This just substantiates speculation abt d rift. Neither wil be giving up d other form of cricket. — Mohammed Azharuddin (@azharflicks) December 14, 2021 ఈగోలకు పోయి, ఒకరి సారధ్యంలో మరొకరు ఆడేందుకు సుముఖంగా లేరన్న విషయం స్పష్టంగా తెలుస్తుందని, కీలక సిరీస్‌లకు ముందు ఇలా ప్రవర్తించడం ఏ మాత్రం సరికాదని అజహర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతమున్న బిజీ షెడ్యూల్ నేపథ్యంలో బ్రేక్ తీసుకోవడం తప్పేమీ కాదని, పంతాలకు పోయి జట్టు పరువును బజారుకీడ్చడమే సరికాదని అసహనం వ్యక్తం చేశాడు. కాగా, టీమిండియా కెప్టెన్సీ వివాదంపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో గాయం కారణంగా రోహిత్, కూతురు పుట్టినరోజును కారణంగా చూపి కోహ్లి దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తప్పుకోవడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై కోహ్లి, రోహిత్ అభిమానుల మధ్య సోషల్‌మీడియా వేదికగా చిన్న సైజ్ యుద్ధమే నడుస్తుంది. చదవండి: యాషెస్ సిరీస్‌లో తెలంగాణ బిడ్డ.. -
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌కు రాణించే సత్తా ఉంది: అజారుద్దీన్
Mohammed Azharuddin Reacts To Rohit Sharma Replacing Virat Kohli As ODI Captain: విరాట్ కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా నియమించడంపై భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ స్పందించాడు. టీమిండియా వన్డే నూతన సారథిగా బాధ్యతలు చేపట్టినందుకు రోహిత్ శర్మకు సోషల్ మీడియా వేదికగా అతడు కృతజ్ఞతలు తెలిపాడు. కెప్టెన్‌గా రాణించే సత్తా రోహిత్‌కు ఉందని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. "విరాట్ కోహ్లి తర్వాత భారత కొత్త వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మపై నాకు చాలా ఆశలు ఉన్నాయి. అతడికి జట్టును నడిపించే సామర్థ్యం ఉంది. కొత్త కెప్టెన్‌కు నా అభినందనలు" అని అజారుద్దీన్ తన "కూ" ఖాతాలో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లి నుంచి టీ20 కెప్టెన్సీని రోహిత్ స్వీకరించాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ క్రమంలో భారత తదుపరి వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేసింది. అంతే కాకుండా అజింక్య రహానె స్థానంలో భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా రోహిత్ ఎంపికయ్యాడు. టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని తొలగించి రోహిత్ శర్మని నియమించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్-17న భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ స్టాండ్‌బై ప్లేయర్లు: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్వాల్లా చదవండి: virat kohli: కోహ్లిని ఔట్ చేయడం నా కల: వరల్డ్ టీ20 నెం1 బౌలర్ -
సుప్రీంకోర్టు: హెచ్‌సీఏ రోజువారీ కార్యకలాపాలకు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో కొనసాగుతున్న ఆధిపత్య పోరు కారణంగా రోజూవారీ క్రికెట్ వ్యవహారాలకు అంతరాయం కలిగించవద్దని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే ఇకపై ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి చెక్‌లపై అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్, కార్యదర్శి విజయానంద్ సంయుక్తంగా సంతకాలు చేయాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన బెంచ్ చెక్‌ల విషయంలో ఈ తాత్కాలిక ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను దీపావళి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. -
స్పోర్ట్స్మెన్గా అజహార్‌కు మర్యాదిస్తాం.. అతనికి అడ్మినిస్ట్రేషన్ తెలీదు
సాక్షి, హైదరాబాద్: అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తూ అంబుడ్స్‌మెన్ జస్టిస్ దీపక్‌వర్మ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో కౌన్సిల్ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్ ఇతర కౌన్సిల్ సభ్యులు బుధవారం ఉప్పల్ స్టేడియంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను తిరిగి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షునిగా నియమించిన అంబుడ్స్‌మన్‌కు అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారం లేదని కౌన్సిల్ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ పేర్కొన్నారు. అంబుడ్స్‌మెన్ ఇచ్చిన నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించామని, దానిపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చిందని ఆయన వెల్లడించారు. స్పోర్ట్స్మెన్గా అజహార్‌కు రెస్పెక్ట్ ఇస్తాం.. కానీ, అతనికి అడ్మినిస్ట్రేషన్ తెలీదని చురకలంటించారు. రేపటి నుండి జరిగే క్రికెట్ లీగ్స్‌కు అజహార్‌కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. అసోసియేషన్ కోసం అందరం కలిసికట్టుగా పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు, అంబుడ్స్‌మెన్‌గా దీపక్‌వర్మ నియామకం చెల్లదని అపెక్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ విజయానంద్ అన్నారు. అతన్ని అంబుడ్స్‌మెన్‌గా తాము ఎన్నికొలేదని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో జరిగిన ఏజీఎమ్ సమావేశంలో మెజార్టీ సభ్యులు జస్టిస్ నిస్సార్ అహ్మద్ ఖక్రూను అంబుడ్స్‌మన్‌గా ఎన్నుకున్నారని తెలిపారు. ఈ నెల 18న అజహార్ నియమించిన జిల్లాల అఫిలియేషన్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. తమ స్పోర్ట్స్ రూంను లాక్ చేశారని, రికార్డులు స్వాధీనం చేసుకున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ విషయమై రేపు లీగ్స్ ప్రారంభించడానికి వచ్చే స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్‌గౌడ్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కేసు విషయమై తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా పడిందని తెలిపారు. -
'వాళ్ల అవినీతి బయటపడుతుందనే నన్ను తొలగించారు'
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్ష పదవి నుంచి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను నాటకీయ పరిణామాల మధ్య తొలిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ నోటీసులపై అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అజారుద్దీన్ మాట్లాడుతూ.. 'ఉద్దేశపూర్వకంగానే నాకు నోటీసులు ఇచ్చారు. హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా నేనెప్పుడూ పనిచేయలేదు. అపెక్స్ కౌన్సిల్లో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడ్డారు. వాళ్ల నిర్ణయమే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంగా చెబితే ఎలా?. అవినీతిని అరికట్టడానికి అంబుడ్స్‌మన్‌ను నియమిస్తే అడ్డుకున్నారు... వాళ్ల అవినీతి బయటపడుతుందనే నాపై కుట్రలు పన్నారు' అంటూ చెప్పుకొచ్చారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అజహర్‌పైనే హెచ్‌సీఏ చర్య తీసుకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఆయన హెచ్‌సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అజహర్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10న అతనికి షోకాజ్ నోటీసు జారీ చేయగా...అందుకు అజహర్ స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. చదవండి: అజహరుద్దీన్‌పై వేటు! -
విరుష్క జంటతో అజహరుద్దీన్..
ముంబై: ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐపీఎల్ వేళంలో కేరళ కుర్రాడు మహ్మద్ అజహారుద్దీన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కనీస ధర 20 లక్షలకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత దేశవాళీ టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ బాది వెలుగులోకి వచ్చిన అజహార్.. గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లి దంపతులతో కలిసి తీయించుకున్న ఫోటోను ట్విటర్లో షేర్ చేశాడు. గొప్ప మనసున్న వ్యక్తులను కలసుకోవటం చాలా సంతోషాన్ని కలిగించింది, విరుష్క జోడీ ఏమాత్రం దర్పం చూపించకుండా నాతో ఫోటో దిగడం నిజంగా నా అదృష్టం అంటూ కోహ్లి దంపతులను ట్యాగ్ చేస్తూ క్యాప్షన్ జోడించాడు. అజహర్ షేర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. So happy to be amongst such humble, down to earth people @AnushkaSharma @imVkohli 💫 pic.twitter.com/MmDPKbiaLw — Mohammed Azharuddeen (@Azhar_Junior_14) April 22, 2021 అనామక ఆటగాడితో కలిసి కోహ్లి దంపతులు చనువుగా ఫోటోలు దిగడం వారి గొప్ప మనసుకు నిదర్శనమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుత సీజన్లో కోహ్లి నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి మాంచి జోరుమీదుండగా, అజహార్ అరంగేట్రానికి మాత్రం ఇంకా అవకాశం లభించలేదు. ఆర్సీబీ తుది జట్టులో దేశీయ ఆటగాళ్లందరూ రాణిస్తుండటంతో అతను మరికొంత కాలం వేచి చూడల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, గత సీజన్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 137 పరుగులు చేసిన ఈ 26 ఏళ్ల కుర్రాడు.. 37 బంతుల్లోనే శతకం సాధించి, టోర్నీ చరిత్రలో రెండో వేగవంతమైన శతకం సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ 32 బంతుల్లో చేసిన శతకం ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీగా రికార్డుల్లో కొనసాగుతుంది. చదవండి: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన మహేంద్రుడు.. -
హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌కు మేం రెడీ: అజహర్
న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్రధాన వేదికల్లో ఒకటైన ముంబైలో కరోనా ఉధృతి పెరగడంతో అక్కడి నుంచి తరలించే మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమని అంటున్నారు టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్. ఈ మేరకు ఆయన ఆదివారం బీసీసీఐకి లేఖ రాసినట్లు ట్విటర్లో పేర్కొన్నారు. ముంబై వాంఖడే స్టేడియంకు చెందిన 10 మంది సిబ్బంది, కొందరు ఈవెంట్ మేనేజర్లకు కోవిడ్ నిర్ధారణ కావడంతో అక్కడ మ్యాచ్‌లు నిర్వహించే విషయమై సందిగ్ధత నెలకొంది. దీంతో వాంఖడేలో నిర్వహించే మ్యాచ్‌లను ఇతర ప్రాంతాల్లో నిర్వహించేందుకు స్టాండ్ బై గ్రౌండ్లను సిద్ధం చేయాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అజ్జూ భాయ్ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకాబోయే 14వ సీజన్ ఐపీఎల్ కోసం ఇండోర్, హైదరాబాద్‌లను స్టాండ్-బై వేదికలుగా బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ముంబైలో పరిస్థితులు ఎంతగా దిగజారినా క్రికెట్ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం ఉండదని బీసీసీఐ ఆఫీసు బేరర్ ప్రకటించడం కొసమెరుపు. కాగా, షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10న వాంఖడే స్టేడియంలో జరగాల్సిన తొలి మ్యాచ్‌లో గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్, త్రీ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. చదవండి: కోహ్లితో ఓపెనర్‌గా అతనైతే బాగుంటుంది, కానీ.. -
అతను టీమిండియా కెప్టెనైనా ఆశ్చర్యపోనక్కర్లేదు: అజహర్
హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా నియమితుడైన భారత యువ బ్యాటింగ్ కెరటం రిషబ్ పంత్, సమీప భవిష్యత్తులో టీమిండియా కెప్టెనైనా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నాడు భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో పంత్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు పూర్తిస్థాయి ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పంత్‌కు ఢిల్లీ కెప్టెన్సీ దక్కడంపై పలువురు మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ కోవలో భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ కూడా చేరాడు. గతేడాది మంచి ఫామ్‌ను కనబర్చి ఫైనల్ దాకా వెళ్లిన ఢిల్లీ లాంటి యువ జట్టుకు పంత్‌ను కెప్టెన్‌గా నియమించడం సరైన నిర్ణయమేనని, ఆ బాధ్యతలను పంత్ సమర్ధవంతంగా నిర్వర్తిస్తాడని ఆయన కితాబునిచ్చాడు. Rishabh Pant has had such fabulous few months,establishing himself in all formats. It won’t come as a surprise if the selectors see him as a front-runner fr Indian captaincy in near future.His attacking cricket will stand India in good stead in times to come.@RishabhPant17 @BCCI — Mohammed Azharuddin (@azharflicks) March 31, 2021 పంత్.. గత కొద్ది మాసాలుగా ఫార్మాట్లకతీతంగా రాణిస్తున్నాడని, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలలో అతని బ్యాటింగ్ విశ్వరూపం చూపించి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడని అజహర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సమీప భవిష్యత్తులో పంత్.. టీమిండియా కెప్టెన్ రేసులో అందరికన్నా ముందుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అతడి దూకుడైన ఆటతీరు భవిష్యత్‌లో భారత్‌ను మరింత పటిష్ట స్థితికి చేరుస్తుందని అజ్జూ భాయ్ ట్వీట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌కు దూరమవ్వడం దురదృష్టకరమని, పంత్ తనకొచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకోగల సమర్ధుడని ఆయన కొనియాడాడు. కాగా, పంత్.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరుగులేని ఫామ్‌లో కొనసాగుతున్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో 97, నాలుగో టెస్టులో 89 నాటౌట్ పరుగులతో అదరగొట్టాడు. తాజాగా ముగిసిన ఇంగ్లండ్ సిరీస్‌లోనూ అదే జోరును కనబరిచాడు. ఆఖరి రెండు వన్డేల్లో వరుస అర్ధశతకాలతో అలరించాడు. ఇదిలా ఉండగా, పంత్.. ఇదే ఫామ్‌ను ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఆశిస్తోంది. ఏప్రిల్ 9న ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభంకానుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ముంబై వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. చదవండి: సచిన్ నీకు ప్రత్యర్థి ఏంటి.. అక్తర్ ట్వీట్‌పై నెటిజన్ల ఆగ్రహం -
ఐపీఎల్ మ్యాచ్: నా చేతుల్లో మంత్రదండం లేదు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–2021 మ్యాచ్‌లను హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం రాకపోవడం పట్ల తనపై వస్తున్న విమర్శలకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ వివరణ ఇచ్చారు. హెచ్‌సీఏ సీనియర్ సభ్యులు ఈ విషయంపై తనను తప్పుపట్టడంలో అర్థం లేదన్న అజహర్... చివరి వరకు తాను ప్రయత్నించానని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి లీగ్‌ను ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో మాత్రమే నిర్వహించనున్నారు. ‘అజహర్ వల్ల కాలేదని కొందరంటున్నారు. నా చేతుల్లో మంత్రదండం లేదు. పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బోర్డు, గవర్నింగ్ కౌన్సిల్ వేదికలను ఖరారు చేశాయి. ఉప్పల్ స్టేడియానికి అవకాశం లభించడం లేదని వార్తలు వచ్చిన వెంటనే నేను మళ్లీ బోర్డు పెద్దలతో మాట్లాడాను కూడా. హైదరాబాద్‌ను తప్పించిన విషయంలో బోర్డు కూడా అధికారికంగా ఎలాంటి కారణం చూపించలేదు కాబట్టి నాకూ తెలీదు. అయితే ఇప్పటికే ప్రకటించిన వేదికల్లో ఏదైనా కారణం చేత మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యం కాకపోతే మన నగరం అందుకు సిద్ధంగా ఉందని నేను చెప్పగలను. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ విషయంలో హామీ ఇచ్చింది’ అని అజహర్ వ్యాఖ్యానించారు. కొందరు మాజీ క్రికెటర్లు తాజా ఐపీఎల్ వ్యవహారంలో తనను విమర్శిస్తున్నారని, నిజానికి వారి హయాంలో చేసిన తప్పులను ప్రస్తుత కమిటీ దిద్దుకుంటూ వస్తోందని మాజీ కెప్టెన్ అన్నారు. ‘ఆర్థికపరమైన బకాయిలు, జరిమానాలు... ఇలా చాలావాటిని మేం సరి చేస్తున్నాం. లేదంటే ఈపాటికి హెచ్‌సీఏ మూత పడేది. ఇన్ని మాటలు చెబుతున్నవారు తాము పదవిలో ఉన్నప్పుడు 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ అయినా తీసుకొచ్చారా’ అని ఆయన ప్రశ్నించారు. -
'పిచ్‌ను నిందించడం కాదు.. ఫుట్‌వర్క్‌పై దృష్టి పెట్టండి'
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ ఆ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ ఔటైన తీరు పట్ల టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పిచ్‌పై నింద వేయడం కన్నా.. షాట్ సెలక్షన్, ఫుట్‌వర్క్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. పింక్ బాల్ టెస్టులో టీమిండియా విజయం అనంతరం అజారుద్దీన్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ''అహ్మదాబాద్ టెస్టులో స్పిన్నర్ల దాటికి బ్యాట్స్‌మెన్ కుప్పకూలడం నిరుత్సాహాపరిచింది. అలాంటి డ్రై ట్రాక్‌లపై బ్యాటింగ్ చేయాలంటే.. షాట్ల ఎంపికతో పాటు ఫుట్‌వర్క్ కీలకపాత్ర పోషిస్తుంది.బ్యాటింగ్ సమయంలో స్పైక్ షూ ధరించడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు. ఇలాంటి పిచ్‌లపై రబ్బర్ సోల్ ఉన్న షూలను ధరించడం వల్ల బ్యాట్స్‌మెన్ సామర్థ్యం తగ్గదు. బ్యాటింగ్‌కు అనుకూలించని ఇలాంటి నిర్జీవమైన మైదానాల్లో ఉత్తమ టెస్ట్ ఇన్నింగ్స్‌లను ఎన్నో చూశాను. గతంలో ఇలాంటి పిచ్‌లపై బ్యాట్స్‌మెన్ కేవలం రబ్బర్ సోల్స్ ధరించి రాణించారు. రబ్బర్ షూ ధరించిన ఆటగాళ్లు పిచ్‌పై జారిపడుతారన్న వాదన తప్పు. వింబుల్డన్ లాంటి టెన్నిస్ టోర్నీల్లో ప్లేయర్లు రబ్బర్ షూలతోనూ ఆడుతున్నారు. గతంలో టీమిండియా దిగ్గజాలు సునీల్ గవాస్కర్, మోహిందర్ అమర్నాథ్, దిలీప్ వెంగ్‌సర్కార్‌తో పాటు విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్, మైక్ గ్యాటింగ్, అలెన్ బోర్డర్ లాంటి వాళ్లు రబ్బర్ సోల్ ఉన్న షూతోనే ఆడేవారు. డ్రై పిచ్‌లపై రబ్బర్ సోల్ ఉన్న షూస్‌ను ప్రిఫర్ చేయడం మంచిదని నా అభిప్రాయం'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: 'కోహ్లి మాటలు నాకు కోపం తెప్పించాయి' టెస్టు క్రికెట్‌కు మంచిది కాదు; అశ్విన్ సీరియస్ ట్వీట్! It was disappointing to watch the batsmen come a cropper in the Ahmedabad Test.The key to batting on such dry tracks and rank turners is shot-selection and assured footwork. It makes little sense to wear spikes when batting.Rubber soles dont hamper ability of batsmen (1/3) — Mohammed Azharuddin (@azharflicks) February 26, 2021 -
అజహరుద్దీన్‌పై ఎఫ్ఐఆర్..
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్‌పై ఔరంగాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అజహరుద్దీన్‌తో పాటు మరో ఇద్దరిపై కూడా కేసు నమోదయినట్లు తెలుస్తోంది. అజహరుద్దీన్‌తో పాటు మరో ఇద్దరు కలిసి తనను రూ. 20 లక్షల మేర మోసం చేశారని ఔరంగాబాద్‌కు చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక తనపై వస్తున్న ఆరోపణలు, ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై అజహరుద్దీన్ స్పందించారు. ఔరంగాబాద్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అర్థం లేనిదని ఖండించారు. తప్పుడు ఆరోపణలపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తన లీగల్ టీమ్‌తో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని అజహరుద్దీన్ పేర్కొన్నారు. -
అంబటి రాయుడి అంశం తర్వాతే..!
హైదరాబాద్: హెచ్‌సీఏలో అవినీతి రాజ్యమేలుతోందని ఇటీవల టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలను అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ పెద్దగా సీరియస్‌గా తీసుకున్నట్లు కనుబడటం లేదు. తాజాగా అంబటి రాయుడి చేసిన అవినీతి వ్యాఖ్యలపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అన్న ప్రశ్నకు అజహర్ దాటవేత ధోరణి అవలంభించాడు. ఆ విషయాన్ని తర్వాత చూద్దామంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు. ‘ నేను ప్రస్తుతం డిసెంబర్ 6వ తేదీన వెస్టిండీస్-భారత్ జట్ల మధ్య హైదరాబాద్‌లో జరుగనున్న టీ20 మ్యాచ్‌పైనే దృష్టి పెట్టా. దానికి సంబంధించి నివేదిక మాత్రమే ఇప్పుడు పరిశీలిస్తున్నా. (ఇక్కడ చదవండి: ‘అజహర్ స్టాండ్’) హెచ్‌సీఏలో కరప్షన్ అంశంపై ఏమైనా మాట్లాడాలని అనుకుంటే డిసెంబర్ 6 తర్వాతే చూద్దాం. నేను మ్యాచ్‌కు సంబంధించి మాత్రమే ఆలోచిస్తున్నా. దీని కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి. ఒకవేళ వేరే అంశం ఏదైనా ఉంటే అది తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడదాం. మ్యాచ్‌ను సజావుగా జరపడం కష్టంతో కూడుకున్న పని. అందులోనూ అధ్యక్ష హోదాలో ఇది నా తొలి మ్యాచ్. నేను క్రికెట్ ఆడేటప్పుడు ఆడటం, హోటల్‌కు వెళ్లడం మాత్రమే ఉండేది. కానీ అధ్యక్ష హోదా అనేది భిన్నమైన బాధ్యతతో కూడుకున్నది’ అని అజహర్ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో అజహర్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. -
కేటీఆర్‌ను కలిసిన అజహరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: టీమిండియా మాజీ సారథి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) తాజా అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ శనివారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్‌ను బుద్ధ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అజహర్‌తో పాటు తాజాగా ఎన్నికైన హెచ్‌సీఏ ప్యానల్ సభ్యులు కూడా కేటీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ కొత్త ప్యానల్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్ అభివృద్దికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని, హెచ్‌సీఏ కూడా తగిన కృషి చేయాలని సభ్యులకు సూచించారు. అయితే ఈ భేటీపై అనేక రాజకీయ ఊహాగానాలకు తెరదీస్తోంది. అజహరుద్దీన్ శుక్రవారం హెచ్‌సీఏ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ రాష్ట్రానికి బాస్ అంటూ పేర్కొనడంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇన్నాళ్లూ హెచ్‌సీఏ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ జి.వివేక్‌కు చెక్ పెట్టేందుకు అజహర్‌కు టీఆర్ఎస్ పరోక్ష సహకారమందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్లోకి చేరడానికి ఇదే సరైన సమయమని అజహర్ భావిస్తున్నట్లు అతడి సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం కేసీఆర్‌ను కూడా కలుస్తాం.. క్రికెట్‌కు ప్రభుత్వ సహకారాన్ని అందించాలని మాత్రమే మంత్రి కేటీఆర్‌ను కలిశానని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ తెలిపారు. 33 జిల్లాల్లో యువత ప్రతిభనను గుర్తించి క్రికెట్లోకి తీసుకవస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా అందరినీ కలిసి క్రికెట్ అభివృద్దికి పాటుపడేలా కోరుతామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను కూడా కలిసి హెచ్‌సీఏ, క్రికెట్ క్రికెట్ అభివృద్దికి సహకరించాలని కోరతామని అజహరుద్దీన్ వివరించారు. -
‘కెప్టెన్’ అజహరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ తొలిసారి క్రికెట్ పరిపాలనలోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో అజహర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ పోటీల్లో సమీప ప్రత్యర్థి ప్రకాశ్‌చంద్ జైన్‌పై 74 ఓట్ల తేడాతో అజ్జూ విజయం సాధించాడు. పోలైన 223 ఓట్లలో మాజీ కెపె్టన్‌కు 147 ఓట్లు రాగా, ప్రకాశ్‌చంద్‌కు 73 ఓట్లు పడ్డాయి. మూడో అభ్యరి్థగా ఉన్న దిలీప్ కుమార్‌కు 3 ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ ఎన్నికల్లో అజహర్ ప్యానెల్ మొత్తం ఆరు పదవులనూ గెలుచుకొని క్లీన్‌స్వీప్ చేసింది. ఇదే గ్రూప్‌కు చెందిన జాన్ మనోజ్ (ఉపాధ్యక్షుడు), విజయానంద్ (కార్యదర్శి), నరేశ్ శర్మ (సంయుక్త కార్యదర్శి), సురేందర్ అగర్వాల్ (కోశాధికారి), అనురాధ (కౌన్సిలర్) ఎన్నికయ్యారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, లోధా కమిటీ సిఫారసుల అనంతరం తొలిసారి అంతర్జాతీయ క్రికెటర్లకు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కలి్పంచారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల సమయంలోనే అజహర్ అధ్యక్ష పదవికి పోటీ పడే ప్రయత్నం చేశాడు. అయితే ప్రత్యరి్థగా పోటీ చేసిన జి.వివేకానంద్... మాజీ సారథి మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి అజహర్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా చేయగలిగాడు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అర్హత ఉందంటూ బీసీసీఐ లేఖ ఇచి్చందని, తిరస్కరణపై కోర్టుకు వెళతానంటూ అజహర్ పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. రెండేళ్లు ఓపిక పట్టిన అనంతరం అజహర్ మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు బరిలో నిలిచాడు. ఈ సారి అజహర్ నామినేషన్‌కు ఇబ్బంది రాకపోగా...‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ కారణంగా వివేక్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. 2017 ఎన్నికల సమయంలో తన నామినేషన్ తిరస్కరించడంలో హెచ్‌సీఏ అడ్హాక్ కమిటీ చైర్మన్‌గా కీలక పాత్ర పోషించిన ప్రకాశ్‌చంద్ జైన్‌ను ఇప్పుడు అజహర్ చిత్తుగా ఓడించటం విశేషం. సెకండ్ ఇన్నింగ్స్ షురూ ‘నేను 99 టెస్టుల వద్దే ఆగిపోవడంపై చాలా మంది అయ్యో అంటుంటారు. అయితే ఇప్పుడు నేను చేస్తున్న పోరాటం 100వ టెస్టులాంటిదే’... అజహర్‌ను నిర్దోíÙగా చూపుతూ తీసిన సినిమా ‘అజహర్’లో డైలాగ్ ఇది. టెస్టు చరిత్రలో 99 మ్యాచ్‌లతో కెరీర్ ముగించిన ఒకే ఒక్క ఆటగాడు అజహర్. 6215 టెస్టు పరుగులు, 334 వన్డేల్లో 9378 పరుగులు, మూడు ప్రపంచకప్‌లలో భారత్‌కు నాయకత్వం వహించిన ఘనతతో పాటు పలు రికార్డులు ఆటగాడిగా అజహర్ ఖాతాలో ఉన్నాయి. అయితే 2000లో బయటపడిన మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం అజ్జూ కెరీర్‌ను అనూహ్యంగా ముగించింది. ఇందులో అజహర్ పాత్రను నిర్ధారిస్తూ బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించింది. ఆ తర్వాత దశాబ్దం అజహర్ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. పరిస్థితి మారుతూ... మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం గురించి అభిమానులు మెల్లగా మరచిపోతూ వస్తున్న సమయంలో అజహర్ చురుగ్గా బయట కనిపించడం మొదలు పెట్టాడు. వెటరన్ క్రికెట్ టోరీ్నలలో ఆడటంతో పాటు భార్య సంగీతాతో కలిసి సినిమా ఫంక్షన్లలో తరచూ పాల్గొనేవాడు. టీవీ చానల్స్ తమ చర్చా కార్యక్రమాలకు అజ్జూను విశ్లేషకుడిగా భాగం చేశాయి. 2009లో కాంగ్రెస్ పారీ్టలో చేరి మొరాదాబాద్నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కావడం అతని జీవితంలో కీలక మలుపు కాగా... 2011లో రోడ్డు ప్రమాదంలో చిన్న కుమారుడు అయాజుద్దీన్ మరణం పెను విషాదం. తర్వాతి ఏడాదే అజహర్‌పై నిషేధం చెల్లదంటూ ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మాజీ కెపె్టన్‌కు ఊరట లభించింది. విమర్శలు వచ్చినా... ఫిక్సింగ్ అధ్యాయం ముగిసిందని అజహర్ భావిస్తూ వచి్చనా కొన్ని సార్లు అదే అంశంపై విమర్శలు తప్పలేదు. ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో అతడిని ఢిల్లీ ఆటగాళ్లు కలవడంపై వివాదం రేగింది. గత ఏడాది ఈడెన్‌గార్డెన్స్‌లో అజహర్ గంట మోగించినప్పుడు గౌతం గంభీర్ తీవ్ర విమర్శలు చేశాడు. అయితే హైదరాబాదీ వాటిని ఎప్పుడూ పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోయాడు. బీసీసీఐ వైపునుంచి కూడా అజహర్‌పై సానుకూల ధోరణే కనిపించింది. అధికారికంగా తనపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఎప్పుడూ ప్రకటించకపోయినా... కోర్టు ఇచి్చన తీర్పును బోర్డు సవాల్ చేయలేదు కాబట్టి నిషేధం తొలగినట్లేనని అజహర్ వివరణ ఇస్తూ వచ్చాడు. అధికారిక కార్యక్రమాల్లో తనను పిలవడం అందుకు నిదర్శనమని అతను చెప్పుకున్నాడు. బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమానికి హాజరైన అజహర్‌కు 2016లో భారత్ 500వ టెస్టు సందర్భంగా అధికారిక సన్మానం జరగడంతో గత వివాదాలు ముగిసినట్లేనని అర్థమైంది. దీని తర్వాత ఈ స్టయిలిష్ బ్యాట్స్‌మన్ పూర్తి స్థాయిలో క్రికెట్ పరిపాలనలో పని చేయాలని నిర్ణయించుకున్నాడు. 2017లో ఆ అవకాశం చేజారినా... ఇప్పుడు హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కీలక పదవిని అందుకున్నాడు.