ఖర్జూర మెుక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు
గీసుకొండ : మండలంలోని మచ్చాపూర్, శా యంపేట హవేలి, కొమ్మాల, ఊకల్æహవేలి గ్రా మాల్లో ఎక్సైజ్ శాఖ రాష్ట్ర, జిల్లా అధికారులు హరితహారంలో భాగంగా కింద శనివారం ఖర్జూర మొక్కలు నాటారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పాటు స్థానిక గౌడ సంఘాలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
వరంగల్ రూరల్ ఎక్సైజ్ స్టేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన అడిషనల్ కమిషనర్ అజయ్రావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్రెడ్డి, వరంగల్ yీ సీ జి.నర్సారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, రూరల్, అర్బన్ సీఐలు ఎం.మాధవీలత, బ్రహ్మానందరెడ్డి, ఎంపీపీ ముంత కళావతి, జెడ్పీటీసీ సభ్యురాలు ఆంగోతు కవిత, సర్పంచ్లు మాన య్య, చంద్రమౌళి, సంధ్య పాల్గొన్నారు. శాయంపేటహవేలిలో 700 ఖర్జూర, మచ్చాపూర్లో 500, కొమ్మాలలో 500, ఊకల్లో 1000 ఖర్జూరు, ఈత మొక్కలు నాటినట్లు సీఐ మాధవీలత తెలిపారు.