అనంత మాజీ మున్సిపల్ చైర్మన్ కన్నుమూత
అనంతపురం: మాజీపురపాలక సంఘం చైర్మన్ అంబటి నారాయణరెడ్డి(84) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతిపట్ల పలువురు జిల్లా నేతలు సంతాపం తెలిపారు.
అనంతలో 1987 నుంచి ప్రత్యక్ష పద్ధతిలో చైర్మన్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో నారాయణరెడ్డి గెలుపొందారు. 1987 మార్చి 30 నుంచి 1992 మార్చి 31 వరకు ఆ పదవిలో కొనసాగారు.