బాల్యం నుంచే హింసా ప్రవృత్తి
గొడవలు, సెక్స్, హింస గురించి మతీన్ మాట్లాడేవాడు: టీచర్లు
మయామీ: ఆర్లెండో గే క్లబ్లో కాల్పులు జరిపి 49 మందిని చంపిన ఒమర్ మతీన్ చిన్నతనం నుంచే అల్లరిచిల్లరగా ఉండేవాడని, తోటి విద్యార్థులతో గొడవలు పడేవాడని తేలింది. మూడో తరగతిలో ఉండగానే సెక్స్, హింస గురించి మాట్లాడేవాడని, హైస్కూలు విద్య పూర్తయ్యేసరికి స్కూలు నుంచి మొత్తం 48 రోజుల సస్పెండ్ అయ్యాడని స్కూలు రికార్డుల ద్వారా వెల్లడైంది.తోటి విద్యార్థులను గాయపరిచే వాడని అనేక ఫిర్యాదులున్నాయి.
తిట్టేవాడని, ఆవేశంగా ప్రవర్తించేవాడని మూడో తరగతి టీచర్ అప్పట్లో ఫిర్యాదు చేసింది. మతీన్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫోర్ట్ పియర్సీ బార్లో పనిచేసే ఒక మహిళ తాజాగా ఫిర్యాదు చేసింది. ఆర్లెండో కాల్పుల మృతుల అంత్యక్రియలు శుక్రవారం పూర్తయ్యాయి.