Arulnidhi
-
అరుళ్‌నిధికి జంటగా మోనాల్
చిన్న గ్యాప్ తరువాత మరోసారి కోలీవుడ్‌లో మెరవనుంది నటి మోనాల్. ఆ మధ్య వానవరాయనుమ్ వల్లవరాయనుమ్ చిత్రంలో కృష్ణ సరసన నటించిన ఈ మలయాళ బ్యూటీ తాజాగా నటుడు అరుళ్‌నిధితో రొమాన్స్ చేస్తోంది. ఇంతకుముందు డిమాంటి కాలనీ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన తేనాండాళ్ ఫిలింస్ సంస్థ అదే చిత్ర హీరో అరుళ్‌నిధితో ఈ తాజా చిత్రాన్ని రూపొందనుంది. ఇది మలయాళ చిత్రం మెమొరీస్ చిత్రానికి రీమేక్. నటుడు పృథ్వీరాజ్ మరో ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి అరివళగన్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నటించే హీరోయిన్ కోసం ఒరిజినల్ చిత్రంలో నటించిన మియాజార్జ్ సహా పలువురు నటీమణులు పేర్లను పరిశీలించారు. చివరికి నటి మోనాల్ గజ్జర్‌కు ఈ అవకాశం వరించింది. దీని గురించి ఈ కేరళ కుట్టి తెలుపుతూ అరుల్‌నిధి సరసన తాను నటించనున్నట్లు చెప్పింది. చిత్ర షూటింగ్ సెప్టెంబర్ 25 ప్రారంభం కానుందని అదే రోజు ఫొటోషూట్‌లో తాను పాల్గొననున్నానని తెలిపింది. ఈ చిత్రం ఒరిజినల్లో ఇద్దరు హీరోయిన్లు నటించారు. తమిళంలో మరో హీరోయిన్ కోసం నటి నిక్కి గల్రాణిని చిత్ర యూనిట్ అప్రోచ్ అయినట్లు తెలిసింది. అయితే ఆమె ఇంకా ఒప్పంద పత్రాలపై సంతకం చేయలేదని సమాచారం. -
అరుళ్‌నిధికి పెళ్లి కుదిరింది
యువ నటుడు డీఎంకే నేత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఎం.కె.తమిళరసన్ కొడుకు అయిన అరుళ్నిధికిపెళ్లి కుదిరింది. చెన్నైకి చెందిన మాజీ న్యాయమూర్తి కుమార్తె కీర్తనను వివాహమాడనున్నారు. వంశం చిత్రంతో కథా నాయకుడిగా పరిచయం అయిన అరుళ్‌నిధి. ఆ తరువాత మౌన గురు, ఒరు కన్నియుం మూడు కళవానిగళుం తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం నాలు పోలీసుం నల్లా ఇరుంద ఊరుం చిత్రంలో నటిస్తున్నారు. చెన్నైకి చెందిన పూర్వపు న్యాయమూర్తి కూతురు కీర్తనతో అరుళ్‌నిధి వివాహం నిశ్చయించారు. వీరి నిశ్చితార్థం సోమవారం రాత్రి నగరంలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. దీనికి కరుణానిధితోపాటు ఆయన భార్య రాజాత్తి అమ్మాళ్, కొడుకు స్టాలిన్, కూతురు కనిమొళి, అళగిరితోపాటు బంధుమిత్రులు పాల్గొన్నారు. అయితే వివాహమెప్పుడన్నది ప్రకటించలేదు.