అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ తొలగింపు
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్కోవాను పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకున్నారు. మేఘాలయ గవర్నర్ షన్ముగనాథన్కు అదనంగా అరుణాచల్ ప్రదేశ్ బాధ్యతలను అప్పగించారు.
ఆరోగ్య కారణాల రిత్యా రాజ్కోవాను రాజీనామా చేయాల్సిందిగా కేంద్రం ఇటీవల కోరిన విషయం తెలిసిందే. అయితే రాజ్కోవా మాత్రం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, విధులను సక్రమంగానే నిర్వర్తిస్తున్నానని రాజీనామా చేయడానికి నిరాకరించారు. అవసరమైతే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగించాలని, అప్పటివరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని రాజ్కోవా ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అతడిని తప్పిస్తూ సోమవారం ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు.