మహాత్మా గాంధీ మనవడు కన్నుమూత
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ(89) మంగళవారం తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో మరణించినట్లు ఆయన కుటుంబికులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న కొల్హాపూర్‌కు వచ్చిన అరుణ్ గాంధీ.. అక్కడే పదిరోజుల పాటు బస చేయాలని అనుకున్నారు. కానీ అక్కడి నుంచి బయలుదేరే ముందే అరుణ్ గాంధీ అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు.
ఆ తదుపరి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి ప్రయాణాలు చేయవద్దని వైద్యులు సూచించడంతో అరుణ్ గాంధీ అక్కడ ఉండిపోయారని, ఈరోజు ఉదయమే తుదిశ్వాస విడిచినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమేరకు ఈ విషయాన్ని అరుణ్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
కాగా, మహాత్మా గాంధీ కొడుకు మణిలాల్ గాంధీ, సుశీ మష్రువాలా దంపతులకు అరుణ్ గాంధీ ఏప్రిల్ 14, 1934న డర్బన్‌లో జన్మించారు. అరుణ్ గాంధీ సామాజిక కార్యకర్తగా తన తాత అడుగుజాడల్లోనే నడిచారు. ఈమేరకు ఈ విషయాన్ని అరుణ్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
Bereaved. Lost my father this morning🙏🏽
— Tushar बेदखल (@TusharG) May 2, 2023
(చదవండి: "న్యాయం మీ అంగీకారం కోసం వేచి ఉంది!": ప్రియాంక గాంధీ)