Assembly by-elections
-
ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జోరు
న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు ఆధిక్యాన్ని కనబర్చాయి. విపక్ష ఇండియా కూటమి పారీ్టలైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), డీఎంకే, ఆప్‌లు పది అసెంబ్లీ సీట్లను గెల్చుకున్నాయి. బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. పశ్చిమబెంగాల్లోని నాలుగు, హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, మధ్యప్రదేశ్, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి బుధవారం ఉప ఎన్నికలు జరగ్గా.. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకుగాను 29 చోట్ల నెగ్గి బెంగాల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నాలుగింటికి నాలుగు స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. వీటిలో మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలు కావడం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం వచి్చన చోట్ల కూడా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఎంసీ జయకేతనం ఎగురవేసింది. 294 మంది సభ్యులున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ బలం 215కు చేరింది. అసెంబ్లీలో భార్యాభర్తలు హిమాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేసి.. బీజేపీ టికెట్‌పై పోటీచేశారు. వీరిలో ఇద్దరు ఓటమి పాలుకాగా.. ఒక్కరు గెలుపొందారు. అందరి దృష్టిని ఆకర్షించిన డేహ్రా నియోజకవర్గంలో హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సతీమణి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం పట్టుబట్టి మరీ కమలే‹Ùను రంగంలోకి దింపింది. హిమాచల్ అసెంబ్లీలో ఇకపై భార్యాభర్తలు సుఖ్విందర్, కమలే‹Ùలు కనిపించనున్నారు. తాజాగా ఇద్దరి గెలుపుతో 68 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 40కి చేరింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీకి ఓటేయడంతో కాంగ్రెస్ బలం 34కు పడిపోయింది. సుఖు ప్రభుత్వాన్ని అస్థిరత వెంటాడింది. లోక్‌సభ ఎన్నికలతో పాటే 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు నెగ్గింది. ఇప్పుడు మరో రెండు స్థానాలు గెలవడంతో కాంగ్రెస్ బలం మళ్లీ 40కి చేరింది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇందులో ఒకటి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. -
ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జోరు
న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు ఆధిక్యాన్ని కనబర్చాయి. విపక్ష ఇండియా కూటమి పారీ్టలైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), డీఎంకే, ఆప్‌లు పది అసెంబ్లీ సీట్లను గెల్చుకున్నాయి. బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. పశ్చిమబెంగాల్లోని నాలుగు, హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, మధ్యప్రదేశ్, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి బుధవారం ఉప ఎన్నికలు జరగ్గా.. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకుగాను 29 చోట్ల నెగ్గి బెంగాల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నాలుగింటికి నాలుగు స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. వీటిలో మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలు కావడం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం వచి్చన చోట్ల కూడా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఎంసీ జయకేతనం ఎగురవేసింది. 294 మంది సభ్యులున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ బలం 215కు చేరింది. అసెంబ్లీలో భార్యాభర్తలు హిమాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేసి.. బీజేపీ టికెట్‌పై పోటీచేశారు. వీరిలో ఇద్దరు ఓటమి పాలుకాగా.. ఒక్కరు గెలుపొందారు. అందరి దృష్టిని ఆకర్షించిన డేహ్రా నియోజకవర్గంలో హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సతీమణి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం పట్టుబట్టి మరీ కమలే‹Ùను రంగంలోకి దింపింది. హిమాచల్ అసెంబ్లీలో ఇకపై భార్యాభర్తలు సుఖ్విందర్, కమలే‹Ùలు కనిపించనున్నారు. తాజాగా ఇద్దరి గెలుపుతో 68 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 40కి చేరింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీకి ఓటేయడంతో కాంగ్రెస్ బలం 34కు పడిపోయింది. సుఖు ప్రభుత్వాన్ని అస్థిరత వెంటాడింది. లోక్‌సభ ఎన్నికలతో పాటే 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు నెగ్గింది. ఇప్పుడు మరో రెండు స్థానాలు గెలవడంతో కాంగ్రెస్ బలం మళ్లీ 40కి చేరింది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇందులో ఒకటి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. -
13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. జూలై 10న పోలింగ్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశంలోని పలు అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10న ఉప ఎన్నికలు నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. వీటిలో పశ్చిమ బెంగాల్లో నాలుగు, హిమాచల్ ప్రదేశ్‌లో మూడు, ఉత్తరాఖండ్‌లో రెండు, బిహార్‌లో, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కొ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేల మరణం, వివిధ పార్టీలకు నేతలు రాజీనామాలు చేయడంతో ఖాళీ అయిన నేపథ్యంలో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక ఈ ఎన్నికల్లోనూ కేంద్రలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.ఈ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జూన్ 14న విడుదలైంది. నామినేషన్‌కు చివరి తేదీ జూన్ 21తో ముగిసింది. జూన్ 24న పరిశీలన కూడా జరిగింది. జూన్ 26న నామినేషన్ల ఉప సంహరణ పూర్తయింది. అన్ని ప్రక్రియలు ముగియడంతో జులై 10న ఓటింగ్ జరగనుంది. జూలై 13న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.కాగా పశ్చిమ బెంగాల్‌లోని మూడు అసెంబ్లీ స్థానాలైన, రాయ్‌గంజ్, రణఘాట్ సౌత్, బాగ్దాలో బీజేపీ కి చెందిన ఎమ్మెల్యేలు అధికార టీఎంసీలోకి చేరి.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక మానిక్తలా టీఎంసీ ఎమ్మెల్యే మరణంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది.ఉప ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాలుబిహార్- రూపాలీపశ్చిమ బెంగాల్- రాయ్‌గంజ్, రణఘాట్ సౌత్, బాగ్దా, మానిక్తలాహిమాచల్ ప్రదేశ్- డెహ్రా, హమీర్పూర్, నలాగర్తమిళనాడు- విక్రవాండి మధ్యప్రదేశ్- అమర్వారాఉత్తరాఖండ్- బద్రీనాథ్, మంగ్లార్ పంజాబ్- జలంధర్ వెస్ట్ -
నల్లత్రాచు నుంచి ‘అప్సరస’ వరకు..
సిమ్లా: ఎన్నికలన్నాక పరస్పర విమర్శలు సహజమే. కానీ హిమాచల్‌ప్రదేశ్ ప్రచారంలో అభ్యర్థులు విమర్శలు దాటి.. వ్యక్తిగత తిట్ల వరకూ వచ్చేశారు. ఈ దండకంలో కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకూ అందరూ ఆ తాను ముక్కలే. ఒకరు ‘కాలే నాగ్’ అంటే.. మరొకరు ‘బిగ్డా షెహజాదా’ అంటూ ప్రచార పదజాలంలో కొత్త తిట్లను చేరుస్తున్నారు.ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేసిన విషయం తెలిసింది. వారిపై అనర్హత వేటు పడి ఆ ఆరుస్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు.. పార్టీ తిరుగుబాటుదారులను ‘కాలే నాగ్’(నల్లత్రాచు)లు, బికావు (అమ్ముడుపోయినవాళ్లు) అంటూ విమర్శించారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి దేవేందర్ కుమార్ భుట్టో నియోజకవర్గమైన కుట్లేహార్లో సీఎం మాట్లాడుతూ.. ‘భుట్టో కో కూటో’ (భుట్టోను కొట్టండి) అంటూ పిలుపునిచ్చారు. సుఖూ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయంటూ బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. ఇక ‘మండీ మే భావ్ క్యా చల్ రహా హై’ అంటూ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. నేను రెండాకులు ఎక్కువే చదివానంటూ రనౌత్ చెలరేగిపోయారు. రాహుల్‌గాం«దీ, విక్రమాదిత్య పేర్లు చెప్పకుండా.. ‘బడా పప్పు’, ‘ఛోటా పప్పు’ అని పదేపదే వాడారు. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పారీ్ట.. ఈ దేశానికి బ్రిటిష్ వాళ్లు వదిలి వెళ్లిన ‘రోగం’ అంటూ వ్యాఖ్యానించారు. 2014 వరకు చెద పురుగుల్లా దేశాన్ని తినేశారన్నారు. విక్రమాదిత్యను.. ‘బిగ్డా షెహజాదా’ (చెడిపోయిన యువరాజు) అంటూ సంబోధించారు. ఇక కంగనాను ‘ఆమె హుస్న్ కి పరి’ (అప్సరస) అని, ప్రజలు ఆమెను చూడటానికి మాత్రమే వస్తారు.. ఓట్లేయరని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ వ్యాఖ్యానించారు. దీనిపై కంగనా తల్లి ఆశా రనౌత్ స్పందించారు. తన కూతురును ‘అప్సరస’, ‘క్యా చీజ్ హై’ అంటున్నవాళ్లు తమ ఇళ్లలో ఆడపిల్లలున్నారన్న విషయం మరుస్తున్నారని మండిపడ్డారు. -
7 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల కౌంటింగ్
-
Bypoll Results 2022: ముగిసిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ
-
ఉప ఎన్నికల పోలింగ్: ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు..
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో భాగంగా గురువారం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ► అసెంబ్లీ ఉప ఎన్నికలు.. 11 గంటల వరకు పోలింగ్ శాతం.. - ఆత్మకూరు(ఏపీ)-- 24.92 శాతం - అగర్తలా(త్రిపుర)-- 34.26 శాతం - టౌన్ బార్డోవాలి(త్రిపుర)-- 35.43 శాతం - సుర్మా(త్రిపుర)-- 33.50 శాతం - జుబరాజ్‌నగర్(త్రిపుర)-- 29.14 శాతం - మందార్(జార్ఖండ్)-- 29.13 శాతం - రాజింద్ర నగర్(ఢిల్లీ)-- 14.85 శాతం #AssemblyByPolls | Till 11 am, 24.92% voter turnout recorded in Atmakur (Andhra Pradesh) 34.26% in Agartala (Tripura) 35.43% in Town Bardowali (Tripura) 33.50% in Surma (Tripura) 29.14% in Jubarajnagar (Tripura) 29.13% in Mandar (Jharkhand) 14.85% in Rajinder Nagar (Delhi) pic.twitter.com/m5y8A43NHb — ANI (@ANI) June 23, 2022 ► దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం.. అసెంబ్లీ స్థానాలు.. - ఆత్మకూరు(ఏపీ)-- 11.56 శాతం - అగర్తలా(త్రిపుర)-- 15.29 శాతం - టౌన్ బార్డోవాలి(త్రిపుర)-- 16.25 శాతం - సుర్మా(త్రిపుర)-- 13 శాతం - జుబరాజ్‌నగర్(త్రిపుర)-- 14 శాతం - మందార్(జార్ఖండ్)-- 13.49 శాతం - రాజింద్ర నగర్(ఢిల్లీ)-- 5.20 శాతం లోక్‌సభ స్థానాలు.. - సంగ్రూర్(పంజాబ్)-- 4.07 శాతం - రాంపూర్(యూపీ)-- 7.86 శాతం - ఆజాంఘర్(యూపీ)-- 9.21 శాతం. Andhra Pradesh | Voting for Atmakur assembly by-polls underway. The seat fell vacant due to the demise of sitting legislator and then industries minister Mekapati Goutham Reddy in February. pic.twitter.com/VjNKRsurzx — ANI (@ANI) June 23, 2022 ► ఢిల్లీలోని రాజీంద్రనగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Delhi | AAP Rajya Sabha MP Raghav Chadha casts his vote for Rajinder Nagar assembly by-poll. The seat fell vacant after Chadha was elected as an MP. He says, "People will vote to get corruption-free governance and everyone's right to lead a life of dignity." pic.twitter.com/qDsCPgLzbR — ANI (@ANI) June 23, 2022 ► త్రిపురలోని బోర్డోవాలీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సీఎం మాణిక్ సాహా ఓటు హక్కు వినియోగించుకున్నారు. #TripuraByPolls | CM Manik Saha casts his vote at a polling station in Town Bordowali assembly constituency. By-poll is being held on Agartala, Town Bardowali, Surma and Jubarajnagar assembly seats today. pic.twitter.com/xEvlmQZAKI — ANI (@ANI) June 23, 2022 ► ఈశాన్య రాష్ట్రం త్రిపురలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. People cast their vote for #TripuraByPoll. Visuals from National Forensic Sciences University in Agartala. Polling is being held on Agartala, Town Bardowali, Surma and Jubarajnagar assembly seats today. pic.twitter.com/Vgrzsf8Nje — ANI (@ANI) June 23, 2022 ► పంజాబ్‌లో సాంగ్రూర్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కేవల్ సింగ్ థిల్లాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. Punjab | BJP candidate for Sangrur Lok Sabha seat Kewal Singh Dhillon casts his vote as polling is underway in the constituency. The seat fell vacant after AAP's Bhagwant Mann became Punjab CM Voting for bypolls to 3 LS seats & 7 assembly seats is being held today pic.twitter.com/uyenXQbKGi — ANI (@ANI) June 23, 2022 ► ఢిల్లీలోని రాజింద్రానగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆప్ నేత రాఘవ్ చద్దా రాజ్యసభకు వెళ్లడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజేశ్ భాటీయా, ఆప్ నుంచి దుర్గేష్ పాథక్, కాంగ్రెస్ నుంచి ప్రేమ్‌లత బరిలో ఉన్నారు. Polling underway for bypoll on Delhi’s Rajinder Nagar seat, vacated after AAP’s Raghav Chadha was elected to RS. AAP has fielded Durgesh Pathak against BJP former councillor Rajesh Bhatia and Congress’s Prem Lata. Voting for bypolls to 3 LS seats & 7 assembly seats is underway pic.twitter.com/ISZ0o1DzjQ — ANI (@ANI) June 23, 2022 ► జార్ఖండ్‌లోని మందార్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు. Polling underway for byelection in Jharkhand's Mandar Assembly Constituency. Voting for bypolls to 3 Lok Sabha seats and 7 assembly seats is being held today pic.twitter.com/Gv257RRzXA — ANI (@ANI) June 23, 2022 ► దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. లోక్‌సభ స్థానాలు.. - ఉత్తర ప్రదేశ్‌లో 2 లోక్‌సభ స్థానాలు.. ఆజామ్ఘర్, రాంపూర్, - పంజాబ్‌లో లోక్‌సభ స్థానం సంగ్రూర్. అసెంబ్లీ స్థానాలు.. - త్రిపురలో 4 అసెంబ్లీ స్థానాలు.. అగర్తలా, టౌన్ బార్డౌవాలీ, సుర్మా, జబ్రాజ్‌నగర్, - ఢిల్లీలో అసెంబ్లీ స్థానం రాజీంద్ర నగర్, - జార్ఖండ్‌లో మందార్, - ఏపీలో ఆత్మకూర్. -
ఆ పార్టీ కోసం పని చేయను: పీకే
భోపాల్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికి సుపరిచితుడే. పీకేతో ఒప్పందం కుదుర్చుకుంటే ఎన్నికల్లో విజయం సాధిస్తామని రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే మధ్యప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్‌ను కోరింది. కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. జ్యోతిరాదిత్య సింథియా తన వర్గం ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు ప్రచార బాధ్యతలను అప్పగించాలని కమల్ నాథ్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా భావించారు. వారు నన్ను సంప్రదించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని కోరారు. కాని నేను దానికి అంగీకరించలేదు. ముక్కలు ముక్కలుగా జరిగే ఎన్నికల్లో నేను కాంగ్రెస్ కోసం పనిచేయలేనని స్పష్టంగా చెప్పాను’ అన్నారు. 2014 ఎన్నికల్లో తొలిసారి ప్రశాంత్ కిషోర్ నరేంద్ర మోదీ కోసం పని చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే తరువాత అమిత్ షాతో వచ్చిన విభేదాల కారణంగా ఆయన బీజేపీకి దూరమయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రశాంత్ కిషోర్.. అరవింద్ కేజ్రీవాల్ కోసం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కోసం.. తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్ కోసం పని చేస్తున్నారు.(ప్రశాంత్ కిషోర్‌కు అత్యవసర పిలుపు..) -
బెంగాల్ ఉప ఎన్నికల్లో తృణమూల్ హవా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతదీదీకి మళ్లీ జోష్ వచ్చింది. రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇన్నాళ్లూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రాతినిధ్యం వహించిన ఖరగ్‌పూర్ సదార్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అన్ని నియోజకవర్గాల్లోనూ రెండో స్థానానికే పరిమితమైంది. కళాయిగంజ్, ఖరగ్‌పూర్ సదార్, కరీంపూర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థులు వరసగా తపన్ దేబ్ సిన్హా, ప్రదీప్ సర్కార్, బిమలేందుసిన్హా రాయ్‌లు విజయం సాధించినట్టు గురువారం ఎన్నికల సంఘం ఫలితాలు విడుదల చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న బీజేపీ అహంకారానికి ఈ ఫలితాలు చెంపపెట్టు వంటివని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. జాతీయ పౌర రిజిస్టర్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలే బెంగాల్లో బీజేపీ ఓటమికి కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ అంగీకరించింది. -
4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ ఆదివారం విడుదలైంది. ఛత్తీస్‌గఢ్, కేరళ, త్రిపుర, ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 23న నాలుగురాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. దంతెవాడ (ఛత్తీస్‌గఢ్), పాల (కేరళ), బాదర్‌ఘాట్ (త్రిపుర), హమీర్పూర్ (ఉత్తరప్రదేశ్) అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. అయితే తెలంగాణలోని హుజూర్నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడలేదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్నగర్ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. -
హడావుడిగా ‘విద్యుత్ భారం’ వద్దు
చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈఆర్సీకి ‘సెంటర్ ఫర్ పవర్ స్టడీస్’ విజ్ఞప్తి అభ్యంతరాలు, బహిరంగ విచారణకు గడువు పెంచండి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ. 1,958 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచాలన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ప్రతిపాదనలపై హడావుడి నిర్ణయాలు తీసుకోవద్దని ‘సెంటర్ ఫర్ పవర్ స్టడీస్’ కన్వీనర్, సినియర్ జర్నలిస్టు ఎం.వేణుగోపాలరావు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశారు. చార్జీల పెంపు ప్రతిపాదనల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈఆర్సీకి లేఖ సమర్పించారు. డిస్కంలు గతేడాది నవంబర్‌లోగా చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాల్సి ఉండగా వరంగల్ లోక్‌సభ, నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపాలిటీల ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజావ్యతిరేకత ఎదురుకావద్దనే ఉద్దేశంతోనే చార్జీల పెంపు ప్రతిపాదనలపై పదేపదే వాయిదా కోరాయని వేణుగోపాల్‌రావు ఆరోపించారు. డిస్కంలు ఈ నెల 8న సమర్పించిన ప్రతిపాదనలపై ఈ నెల 30లోగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఆహ్వానించి ఏప్రిల్ 6న హైదరాబాద్‌లో బహిరంగ విచారణ తలపెట్టడం సరికాదని ఈఆర్సీకి సూచించారు. అభ్యంతరాల గురించి డిస్కంలిచ్చే సమాధానాలపై అధ్యయనం చేసి బహిరంగ విచారణకు సిద్ధమయ్యేందుకు ఆ వ్యవధి చాలదని, అందువల్ల గడువు పెంచాలని కోరారు. వినియోగదారులకు రూ. 317.13 కోట్లు తిరిగి చెల్లించండి.. 2009-13 కాలంలో ఉమ్మడి రాష్ట్ర డిస్కంలు రూ. 588.47 కోట్ల ఆదాయాన్ని అదనంగా ఆర్జించినట్లు తేల్చిన ఏపీఈఆర్సీ ఆ మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి చెల్లించాల్సిందిగా గతేడాది నవంబర్ 11న ‘ట్రూ అప్’ ఉత్తర్వులు జారీ చేసిందని వేణుగోపాలరావు గుర్తుచేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర డిస్కంలకు రూ. 317.13 కోట్ల అదనపు అర్జన వాటాలు లభించాయని...ఈ మొత్తాన్ని రాష్ట్ర డిస్కంలు తిరిగి వినియోగదారులకు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఉద్యోగులపై అడ్వైజరీని వెనక్కి తీసుకోవాలి... యాజమాన్యాల అనుమతి లేకుండా విద్యుత్ ఉద్యోగులెవరూ తమ ముందు హాజరు కాకుండా చూడాలని విద్యుత్ సంస్థలకు అడ్వైజరీ జారీ చేయడం ద్వారా ఈఆర్సీ పరిధి దాటిందని వేణుగోపాలరావు అభిప్రాయపడ్డారు. ఉద్యోగులపై ఆంక్షలు విధించే అధికారం ఈఆర్సీకి లేదని...సాధారణ వినియోగదారులుగా ప్రజాప్రయోజనాల కోసం కృషి చేసే సంఘాల ప్రతినిధులుగా విద్యుత్ ఉద్యోగులు ఈఆర్సీ ముందు హాజరై అభిప్రాయాలను వ్యక్తం చేయడం సంప్రదాయంగా వస్తోందన్నారు. ఈ అడ్వైజరీని ఉపసంహరించుకోవాలన్నారు. -
ఓటరు జోరు..
ఓట్ల పండగే.. ఖేడ్ చరిత్రలోనే భారీ పోలింగ్ 81.79 శాతం ఓటింగ్ నమోదు ఫలించిన అభివృద్ధి మంత్రం ఏకపక్షంగా సాగిన ఓటింగ్ సరళి ఆకట్టుకున్న మోడల్ పోలింగ్ కేంద్రాలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదయింది. గతంలో ఎన్నడూ లేనంతగా 81.79 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు ఉండటంతో ఎన్నికల్లో ఘర్షణలు జరగవచ్చని అధికారులు అనుమానించారు. కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. సాధారణ ఎన్నికల్లో సెంటిమెంట్ మంత్రంతో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ.. నారాయణఖేడ్‌కు వచ్చే సరికి అభివృద్ధి తంత్రంతో సెంటుమెంటును పక్కకు నెట్టేసింది. ఓటింగ్ సరళిని చూసిన రాజకీయ పరిశీలకులు టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. 168 రెవెన్యూ గ్రామాల్లోని 286 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. 198 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో దాని స్థానంలో కొత్త దానిని ఏర్పాటు చేశారు. మనూరు మండలంలో ఔదత్పూర్లో కొంత ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమయింది. పెద్దశంకరంపేట మండలంలో అత్యధికంగా 85.85 శాతం, నారాయణఖేడ్ 75, మనూరు మండలంలో 81, కల్హేర్ మండలంలో 84, కంగ్టి మండలంలో 80.76 శాతం పోలింగ్ నమోదు అయింది. 143 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్.. సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో ఉన్న 143 కేంద్రాల్లో ఎన్నికల అధికారులు లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రోనాల్డ్‌రాస్ లైవ్ వెబ్కాస్టింగ్తోనే ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. ఒక గ్రామంలో కాంట్రాక్టు పీఈటీ ఉద్యోగి ఎన్నికల ఏజెంటుగా కూర్చున్నారని ఫిర్యాదు రావడంతో వెబ్కాస్ట్లోనే అతని పరిశీలించి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. జూకల్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ప్రత్యేక వెబ్ వీక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు, కలెక్టర్ వద్ద ఉన్న ట్యాబ్‌ద్వారా ఎన్నికల సరళి సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా.. వేగం గా జరుగుతుండతో రోనాల్డ్‌రోస్ ఉత్సాహంగా కనిపించారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఆయన స్వీకరించారు. వారికి పరిష్కారం కూడా చూపెట్టి అన్ని పార్టీ అభ్యర్థుల మన్ననలు అందుకున్నారు. దానికే ఓటు వేసిన.. ‘రెండు పూటల సుశీల తింటున్నా.. సెడగొట్టుకుంటమా బిడ్డా... దానికే ఓటు వేసిన.. ’అని ఓ వృద్దురాలు సమాధానం. ఎన్నికల సర్వే చేస్తున్న వారికి ఇలాంటి సమాధానాలే వినిపించాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కలిపి 1.53 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 75 శాతంపైగా ఓటర్లు ఒకే పార్టీ గుర్తుకు ఓటేసినట్లు సర్వేలు చెప్తున్నాయి. నిజానికి శతాబ్దకాలంగా నారాయణఖేడ్ ప్రజలకు అభివృద్ధి, ప్రభుత్వ సహకారం అంటే ఏమిటో తెలియదు. దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణం తరువాత అధికార టీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్లింది. ముఖ్యంగా రోడ్లు, మంచినీటి మీద దృష్టి పెట్టి ప్రగతిని చూపించింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దాదాపు ఐదు నెలలుగా నియోజకవర్గంలోనే తిరుగుతూ ప్రజల కష్టాలసుఖాలను నేరుగా విని తెలుసుకున్నారు. చిన్నచిన్న పనులను తక్షణమే పరిష్కరించడంతో వారికి స్వాంతన చేకూరింది. దీంతో ఓటర్లు అధికారపార్టీ వైపునకు మొగ్గు చూపారని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఆకట్టుకున్న మోడల్ పోలింగ్ కేంద్రాలు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 20 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మామిడి తోరణాలు కట్టి, టెంట్లు వేసి పెళ్లి మందిరిలా ముస్తాబు చేశారు. ఈ కేంద్రాల్లో ఓటర్‌కు రెడ్ కార్పెట్ పరిచి, పువ్వులతో ఆహ్వానం పలికారు. ఎండ తీవ్రత పెరిగిన మధ్యాహ్నం సమయంలో ఓటర్లకు మజ్జిగ, మంచినీళ్లు అందించారు. కల్హేర్ మండలం మాసాన్‌పల్లి మోడల్ కేంద్రం అధికారులను సైతం ఆకర్షించింది. ఇక్కడ పోలీసులు ఓటర్లతో అత్యంత మర్యాదగా మెలిగారు