baby thrown
-
ముళ్లపొదల్లో ఆడ శిశువు
సాక్షి, శెట్టూరు: తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఆడశిశువు ముళ్లపొదల పాలైంది. మంగంపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన మహిళలకు ముళ్లపొదల్లో ఆడశిశువు కనిపించింది. వెంటనే ఆ పాపను అక్కున చేర్చుకుని సపర్యలు చేసి అనంతరం ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. అంగన్వాడీ కార్యకర్త సుధారాణి, సూపర్ వైజర్ చంద్రమ్మ, ఏఎన్ఎం జయమ్మలు ఆ శిశువును ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యాధికారి ముషీరాబేగం వైద్య పరీక్షలు నిర్వహించి ఆడ శిశువు ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఎవరైనా దంపతులు తమకు శిశువు కావాలని వస్తే నింబంధనల ప్రకారం అప్పగిస్తామని ఐసీడీఎస్ అధికారులు చెప్పారు. -
బాబును బావిలో పారేసిన మహిళలు
కుటుంబాలు, గ్రామాల మధ్య ఉన్న కక్షతో.. నెల రోజుల వయసున్న బాబును ఇద్దరు మహిళలు బావిలో పారేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రంగారెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. పాడుబడిన మంచినీటి బావిలో ఆ బాబును పారేశారు. రెండు గ్రామాల మధ్య గొడవ ఉండటం వల్లే వాళ్లు ఆ బాబును బావిలో పారేసినట్లు తెలిసింది. అయితే సమయానికి రంగారెడ్డిపల్లి గ్రామస్థులు గమనించి వెంటనే బాబును బావిలోంచి బయటకు తీశారు. అదే సమయంలో మహిళలకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన బాబు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు ఎవరన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు.