3 నెలలుగా ఆహారం ఇవ్వడం లేదు
శరభన్నపాలెం (కొయ్యూరు): మూడు నెలల నుంచి బాల అమృతం ఇవ్వడం లేదని పిల్లల తల్లిదండ్రులు చెప్పారు. ఇక్కడికి ప్యాకెట్లు రాలేదో.. వచ్చిన వాటిని బయట అమ్మేసుకున్నారో.. తెలియడం లేదన్నారు. గు రువారం గ్రామానికి వెళ్లిన విలేకరులతో పిల్లల తల్లులం తా బాల అమృతం ప్యాకెట్లు ఇవ్వడం లేదని చెప్పా రు. ప్యాకెట్లు ఇవ్వాలని అడిగినా రాలేదని చెబుతున్నారన్నాని కె.అచ్చియమ్మ, ఎస్.లక్ష్మి, పి.రాజేశ్వరి, కళ్యాణి, నూకాలమ్మ తదితరులు తెలిపారు. మూడు నెలల నుంచి ఒక్క ప్యాకెట్ కూడా ఇవ్వలేదని, బయట ఎవరికో అమ్మేస్తున్నారన్న అనుమానం వ్యక్తంచేశారు.
దీనిపై అక్కడి లింక్వర్కర్, ఆయా మాట్లాడుతూ వెలగలపాలెం టీచర్ దీనికి ఇన్చార్జిగా పనిచేస్తున్నారన్నారు. ఇక్కడికి వచ్చిన వాటిని వెలగలపాలెం పట్టుకుపోయినట్లు తెలిసిందన్నారు. తమకు పూర్తి విషయం తెలియదన్నారు. దీనిపై విలేకరులు సూపర్వైజర్ను సంప్రదించగా కొద్ది రోజులు కిందట ఇక్కడికి బాలఅమృతం ప్యాకెట్లు తీసుకువచ్చి ఇచ్చామని, దీనిపై ఆరా తీస్తామన్నారు .ఏడాది కాలంగా ఏమీ లేవు: ఈ పంచాయతీలో శరమండ వద్ద మిని అంగన్వాడీ ఉంది. ఇక్కడ నుంచి దానికి సరకులు తీసుకెళ్తారు. అయితే ఏడాది కాలంగా అక్కడికి బాల అమృతం ప్యాకెట్లు రావడం లేదని ఆ గ్రామానికి చెందని నాగబాబు, కె.శివ, వర్కర్ భారతి తెలిపారు.
2013 వరకు పాలు వచ్చాయని, తరువాత నుంచి అవి రావడం లేదని, గుడ్లు కూడా పూర్తిగా ఇవ్వడం లేదని చెప్పారు. పప్పులు నూనె కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు .శరభన్నపాలెంలో మరో 300 బస్తాలు: శరభన్నపాలెంలో మరో 300 వరకు బాల అమృతం బస్తాలు ఉన్నట్టు తెలిసింది. ‘సాక్షి’లో వార్త రాగానే కొందరు ప్యాకెట్లను వేరే బస్తాల్లోకి మార్చి అసలు బస్తాలను కాల్చివేశారని కొందరు స్థానికులు చెప్పారు. ఇక్కడకు వందల సంఖ్యలో బస్తాలు రావడం ఇదే ప్రథమం కాదు. ఇలా అనేక సార్లు వచ్చాయని వారు తెలిపారు.